దుస్సల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారపెట్టె చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
| alt = దుస్సల
| alt = దుస్సల
| caption =
| caption =
| family = [[ధృతరాష్ట్రుడు]] (తండ్రి), [[గాంధారి (మహాభారతం)|గాంధారి]] (తల్లి), [[కౌరవులు]] (సోదరులు), [[శకుడు]] (మేనమామ)
| family = [[ధృతరాష్ట్రుడు]] (తండ్రి), [[గాంధారి (మహాభారతం)|గాంధారి]] (తల్లి), [[కౌరవులు]] (సోదరులు), [[శుకుడు]] (మేనమామ)
| spouse = [[జయద్రదుడు]]
| spouse = [[జయద్రదుడు]]
| Father in law=
| Father in law=

08:42, 4 జూలై 2020 నాటి కూర్పు

దుస్సల
మహాభారతం పాత్ర
సమాచారం
కుటుంబంధృతరాష్ట్రుడు (తండ్రి), గాంధారి (తల్లి), కౌరవులు (సోదరులు), శుకుడు (మేనమామ)
దాంపత్యభాగస్వామిజయద్రదుడు
పిల్లలుసురధుడు

దుస్సల మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడు, గాంధారిల కుమార్తె, కౌరవుల సోదరి.[1] సింధు దేశ రాజు జయద్రదుడిని వివాహం చేసుకుంది.[2] కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుడిని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు.

జననం

గాంధారి భక్తిని చూసిన వేద వ్యాసుడు 100మంది కుమారులు పుట్టడానికి వరం ఇచ్చాడు. గాంధారి గర్భవతి అవుతుంది, కాని 2 సంవత్సరాలు అయినా కాని ప్రసవం కాదు. ధృతరాష్ట్రుడి తమ్ముడు పాండురాజు భార్య కుంతి పాండవులలో పెద్దవాడికి జన్మనిచ్చిందని విన్న గాంధారి, నిరాశ నిస్సహాయతతో కడుపుపై కొట్టుకుంటుంది. ఫలితంగా బూడిదరంగులో ఒక ముద్ద పుడుతుంది. వేదవ్యాసడు దీనిని 101 భాగాలుగా విభజించి, మట్టికుండలలో నిల్వచేసి మరో 2 సంవత్సరాలు దాచిపెడతాడు. అలా 100మంది సోదరులు, ఒక సోదరి దుశ్శల జన్మించారు.[3]

ఇతర వివరాలు

దుస్సల పాండవులకు కూడా సోదరి అవుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుని అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు సింధు దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. సింధు దేశాన్ని ఆక్రమించకుండా తిరిగి వచ్చేశాడు.

మూలాలు

  1. Ganguli, Kisari Mohan. The Mahabharata of Krishna-Dwaipayana Vyasa Translated into English Prose by Kisari Mohan Ganguli. N.p.: n.p., n.d. Web.
  2. దుస్సల, పురాణనామ చంద్రిక, యెనమండ్రం వెంకటరామయ్య, ప్రాచీ పబ్లికేషన్స్, హైదరాబాదు, 1879 & జూన్ 1994, పుట. 89.
  3. "The Mahabharata, Book : Adi Parva:Sambhava Parva : Section:CXV". Sacred-texts.com.
"https://te.wikipedia.org/w/index.php?title=దుస్సల&oldid=2976008" నుండి వెలికితీశారు