పెళ్ళి పుస్తకం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: AWB తో {{రావి కొండలరావు నటించిన చిత్రాలు}} చేర్పు |
||
పంక్తి 89: | పంక్తి 89: | ||
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]] |
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]] |
||
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]] |
10:33, 31 జూలై 2020 నాటి కూర్పు
పెళ్ళి పుస్తకం (1991 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, దివ్యవాణి, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ |
గీతరచన | ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి |
కూర్పు | అనిల్ మల్నాడ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సీతారామ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పెళ్ళి పుస్తకం (ఆంగ్లం: Book of Marriage) 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం.
కథా సంగ్రహం
కొత్తగా పెళ్ళి చేసుకున్న కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) ముంబైలోని ఒక సంస్థలో కళా దర్శకుడుగా పనిచేస్తుంటాడు. అతని భార్య సత్యభామ (దివ్యవాణి) కేరళలో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తుంది. వీరిద్దరికీ ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేందుకు ఒక పెద్ద సంస్థలో చేరడాని కోసం అవివాహితులమని గుమ్మడికి అబద్ధం చేబుతారు. అక్కడ చేరిన తర్వాత వారెదుర్కొనే సమస్యలు చిత్రంలోని ప్రధానాంశం.
పాత్రలు-పాత్రధారులు
- రాజేంద్ర ప్రసాద్ - కె.కృష్ణమూర్తి
- దివ్యవాణి - సత్యభామ
- గుమ్మడి వెంకటేశ్వరరావు - కంపెనీ బాస్
- సింధూజ - వసుంధర
- శుభలేఖ సుధాకర్
- ఝాన్సీ - గుమ్మడి భార్య
- రావి కొండలరావు - బాబాయి
- రాధాబాయి
- అనంత్
- సాక్షి రంగారావు
- అశోక్ రావు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది క్రొత్తజీవితం | ఆరుద్ర | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో | వేటూరి | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
కృష్ణం కలయ సఖి సుందరం | నారాయణ తీర్థ | కె.వి.మహదేవన్ | ఎస్.పి.శైలజ, రాజేశ్వరి |
సరికొత్త చీర ఊహించినాను | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
హాయి హాయి శ్రీరంగ సాయి | కె.వి.మహదేవన్ | ఎస్.పి.శైలజ, పి.సుశీల | |
పా ప పప్పు దప్పళం | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
జగదానంద కారక | కె.వి.మహదేవన్ | వాణీ జయరాం |
పురస్కారాలు
- నంది ఉత్తమ చిత్రాలు
- నంది ఉత్తమ సంభాషణల రచయితలు - ముళ్లపూడి వెంకటరమణ
- నంది ఉత్తమ కథా రచయితలు - రావి కొండలరావు
మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.