బేతా సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 81: పంక్తి 81:
* [[ఎంత బావుందో!]]
* [[ఎంత బావుందో!]]
* [[గోకులంలో సీత]]
* [[గోకులంలో సీత]]
* [[గోల్మాల్ గోవింద]]
* [[చిన్నా]] (2001)
* [[చిన్నా]] (2001)
* [[దోషి (2008 సినిమా)|దోషి]]
* [[దోషి (2008 సినిమా)|దోషి]]

13:30, 8 ఆగస్టు 2020 నాటి కూర్పు

ఇది తెలుగు సినిమా నటుడు, నిర్మాతగా పేరుగాంచిన బేతా సుధాకర్ వ్యాసం, ఇతర వ్యాసాల కొరకు సుధాకర్ చూడండి.

సుధాకర్ బేతా

సుధాకర్
(బుసాని పృథ్వీరాజ్ రేఖాచిత్రం)
జన్మ నామంసుధాకర్ బేతా
జననం (1956-02-01) 1956 ఫిబ్రవరి 1 (వయసు 68)
ప్రముఖ పాత్రలు యముడికి మొగుడు
శుభాకాంక్షలు
స్నేహితులు

సుధాకర్ చలనచిత్ర నటుడు, నిర్మాత. ఇతడు నటుడిగాను, హాస్య నటుడి గాను కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించాడు.

జీవిత విశేషాలు

సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, తండ్రి గంగమాల రత్నం డిప్యూటీ కలెక్టర్. తల్లి కటాక్షమ్మ. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ చివరివాడు. తండ్రి ఉద్యోగ విధుల వలన రాష్ట్రమంతటా పనిచేశాడు. సుధాకర్ కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో పుట్టాడు. బాల్యం కోయిలకుంట్ల, కోడుమూరు, ఆదోని, కర్నూలు, బోధన్ నుండి కాకినాడ వరకు వివిధ ఉళ్లలో గడిచింది. ఏలూరు లో, గుంటూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసాడు.

నట ప్రస్థానం

ఆయన నటుడు చిరంజీవి, హరిప్రసాద్, నారాయణరావులతో కలసి ఒకే గదిలో ఉన్నారు.[1] ఆయన ఒకసారి అప్పటికి సహాయ దర్శకుడిగా ఉన్న దర్శకుడు భారతీరాజాను కలవడం ఆయన సుధాకరును కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ సినిమాకి సిఫారసు చేయడం అది విజయవంతం అవడం జరిగింది. దాదాపు నలభై అయిదు తమిళ చిత్రాలలో సుధాకర్ నటించాడు. నటి రాధికతో పద్దెనిమిది సినిమాలలో నటించాడు. తమిళ సినిమాలలో విజయవంతమైన పలు చిత్రాలలో నటించి, పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నా, తమిళ సినీ పరిశ్రమలోని రాజకీయాల వల్ల అక్కడినుండి తెలుగు పరిశ్రమకు వచ్చి సహాయ నటుడిగా, హాస్యనటుడిగా స్థిరపడాల్సి వచ్చింది.

తెలుగులో ఇతడి మొదటి చిత్రము సృష్టి రహస్యాలు. అయితే అతనికి పేరు తెచ్చిన చిత్రాలు ఊరికిచ్చిన మాట, భోగి మంటలు.

అనారోగ్యం

ఆయన 2010 జూన్ 29 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన సుధాకర్ జూలై 4 2010 నుండి కోమాలో చేరినట్లు హైదరాబాద్‌లో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.[2][3] కానీ కొంతకాలానికి వైద్యసహాయం అందిపబడి కోలుకున్నారు.[4] ఆయన 2015 జూన్ 8 న తన జీవిత విశేషాలను, తదుపరి చిత్రాలలో నటన గురించి ఇన్.టి.వికి ఇంటర్వ్యూ యిచ్చారు.[5][6] చికిత్స తరువాత కోమా నుండి బయటకి వచ్చాడు.

పురస్కారాలు

నిర్మాతగా

సుధాకర్ మూడు చిత్రాలు నిర్మించాడు. అవి

ఇతర విశేషాలు

  • సుధాకర్ ప్రముఖ నటుడు చిరంజీవికి మిత్రుడు. చెన్నైలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుంచీ వీరిద్దరికీ పరిచయం.[7]
  • ఇతడు చిరంజీవి కలసి యముడికి మొగుడు చిత్రాన్ని మరొక మిత్రుడు నారాయణరావుతో కలసి నిర్మించారు.

పేరు పడ్డ సంభాషణలు

నటించిన సినిమాలు

సుధాకర్ నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా.[8]

మూలాలు

  1. తాను ఆపదలో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్నాడు: సుధాకర్
  2. Home >> Cinema >> Comedian Sudhakar whereabouts please….!! హన్స్ ఇండియా లో ఆర్టికల్.January 10,2014, 01.03 PM
  3. కోమాలో ప్రముఖ హాస్యనటుడు సుధాకర్ (వెబ్ దునియా 5 జులై 2010), పరిశీలన తేది:13 జనవరి2014
  4. 'Pichakottudu' Sudhakar Set For Second Innings
  5. జూన్ 8, 2015 లో సుధాకర్ ఇంటర్వ్యూ
  6. ఇంటర్వ్యూ -ఎన్.టి.వి లో
  7. Actor Comedian Sudhakar Health Condition?
  8. Celebs Sudhakar Profile & Biography - Latest News,Videos,Galleries,Tweets and More
  9. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
  10. ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020.[permanent dead link]

బయటి లింకులు