క్యాంపస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1: పంక్తి 1:

{{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}}

'''క్యాంపస్''' అంటే సాంప్రదాయకంగా ఒక [[కళాశాల]] లేదా [[విశ్వవిద్యాలయం|విశ్వవిద్యాలయానికి]] సంబంధించిన సంస్థాగత భవనాలు నెలకొన్న ప్రాంతం. క్యాంపస్ అనే ఇంగ్లీషు మాటే తెలుగు లోనూ ప్రాచుర్యంలో ఉంది. అయితే దీనికి ''ప్రాంగణం'' అనే మాట విస్తృతంగా వాడుక లోకి వస్తోంది. కాలేజీ క్యాంపస్ ల లోకి వివిధ సంస్థలు వచి అక్కడే ఇంటర్వ్యూలు జరిపి నియామకాలు చేసే క్యాంపస్ రిక్రూట్‌మెంటు ను ఇప్పుడు ''ప్రాంగణ నియామకాలు'' అని వార్తాపత్రికలు అంటున్నాయి.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/khammam/959753|title=ఎస్‌బీఐటీలో ప్రాంగణ నియామకాలు {{!}} ఖమ్మం {{!}} www.NavaTelangana.com|last=|first=|date=|website=NavaTelangana|url-status=live|archive-url=https://web.archive.org/web/20200815042301/http://www.navatelangana.com/article/khammam/959753|archive-date=2020-08-15|access-date=2020-08-15}}</ref> <ref>{{Cite web|url=https://www.eenadu.net/districts/mainnews/Sangareddy/691/220028428|title=డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు|last=|first=|date=|website=www.eenadu.net|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20200815042447/https://www.eenadu.net/districts/mainnews/Sangareddy/691/220028428|archive-date=2020-08-15|access-date=2020-08-15}}</ref><ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/campus-placements-at-ananthalakshmi-college-2020021701061943|title=అనంతలక్ష్మి కళాశాలలో ప్రాంగణ నియామకాలు|last=|first=|date=|website=www.andhrajyothy.com|url-status=live|archive-url=https://web.archive.org/web/20200815042347/https://www.andhrajyothy.com/telugunews/campus-placements-at-ananthalakshmi-college-2020021701061943|archive-date=2020-08-15|access-date=2020-08-15}}</ref>సాధారణంగా కళాశాల ప్రాంగణంలో [[గ్రంథాలయం|గ్రంథాలయాలు]], [[ఉపన్యాసం|ఉపన్యాస]] మందిరాలు, [[డార్మిటరి|నివాస మందిరాలు]], విద్యార్థి కేంద్రాలు, భోజనశాలలు, పార్కు లాంటి నిర్మాణాలు, ఏర్పాట్లూ ఉంటాయి.

05:40, 16 ఆగస్టు 2020 నాటి కూర్పు

క్యాంపస్ అంటే సాంప్రదాయకంగా ఒక కళాశాల లేదా విశ్వవిద్యాలయానికి సంబంధించిన సంస్థాగత భవనాలు నెలకొన్న ప్రాంతం. క్యాంపస్ అనే ఇంగ్లీషు మాటే తెలుగు లోనూ ప్రాచుర్యంలో ఉంది. అయితే దీనికి ప్రాంగణం అనే మాట విస్తృతంగా వాడుక లోకి వస్తోంది. కాలేజీ క్యాంపస్ ల లోకి వివిధ సంస్థలు వచి అక్కడే ఇంటర్వ్యూలు జరిపి నియామకాలు చేసే క్యాంపస్ రిక్రూట్‌మెంటు ను ఇప్పుడు ప్రాంగణ నియామకాలు అని వార్తాపత్రికలు అంటున్నాయి.[1] [2][3]సాధారణంగా కళాశాల ప్రాంగణంలో గ్రంథాలయాలు, ఉపన్యాస మందిరాలు, నివాస మందిరాలు, విద్యార్థి కేంద్రాలు, భోజనశాలలు, పార్కు లాంటి నిర్మాణాలు, ఏర్పాట్లూ ఉంటాయి.

ఆధునిక కాలంలో క్యాంపస్ అనేది విద్యా విషయకం మాత్రమే కాక, విద్యేతర విషయికంగా కూడా వాడుతున్నారు. గూగుల్‌ప్లెక్స్ (గూగుల్ సంస్థ కార్యాలయం), యాపిల్ క్యాంపస్ (యాపిల్ సంస్థ) దీనికి ఉదాహరణలు.

చరిత్ర

భారతదేశంలో ప్రాచీన కాలంలోనే క్యాంపస్ భావన ఉండేది. శిష్యులు గురువు వద్దనే ఉంటూ విద్యాబుద్ధులు నేర్చుకునేవారు. దీన్ని గురుకులం అనేవారు. ఆ తరువాత నలందా వంటి గురుకుల విశ్వవిద్యాలయాలు కూడా వచ్చాయి.[4] ఐరోపాలో కాంపస్ సంప్రదాయం మధ్యయుగంలో మొదలైంది. యూరోపియన్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి నివసిస్తూ విద్య నేర్చుకునేవారు.[5] ఈ పద్ధతి తరువాత అమెరికాకు వలస వెళ్ళింది. అమెరికా లోని తొలి వలస విద్యా సంస్థలు స్కాటిష్, ఇంగ్లీష్ కాలేజియేట్ వ్యవస్థపై ఆధారపడి ఉండేవి. [5]

క్యాంపస్ ఐరోపాలోని క్లోయిస్టర్ మోడల్ (చుట్టూ భ్వనాలుండీ మధ్యలో ఖాళీ స్థలం ఉండడం) నుండి అమెరికాలో విభిన్న స్వతంత్ర శైలులకు పరిణమించింది. తొలి వలసరాజ్యాల కళాశాలలన్నీ యాజమాన్య శైలులలో నిర్మించారు. వీటిలో కొన్ని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం లాగా ఒకే భవనంలో ఉండేవి. కొన్ని హార్వర్డ్ లాగా చుట్టూ భవనాలు, మధ్యలో ఖాళీ స్థలంతో ఉండేవి. [6] క్యాంపస్ నమూనాలు, దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల నిర్మాణం రెండూ విస్తృత ప్రపంచంలోని పోకడలకు ప్రతిస్పందనగా అభివృద్ధి చెందాయి.

వాడుకలు

20 వ శతాబ్దంలో క్యాంపస్ అర్థం మారిపోయి, మొత్తం సంస్థాగత ఆస్తి ఉన్న ప్రదేశాన్ని సూచించేలా ఈ అర్థం విస్తరించింది. పాత అర్ధం కొన్ని ప్రదేశాలలో 1950 ల వరకూ కొనసాగింది.

కార్యాలయ భవనాలు

కొన్నిసార్లు కంపెనీ కార్యాలయ భవనాలు ఉన్న భూములను, భవనాలతో పాటు, క్యాంపస్‌లు అంటారు. హైదరాబాదు ‌లోని మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఇలాంటి వాడుకకు మంచి ఉదాహరణ. ఆస్పత్రులు, విమానాశ్రయాలు కూడా కొన్నిసార్లు వారి సంబంధిత సౌకర్యాల భూభాగాన్ని వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తాయి.

విశ్వవిద్యాలయాలు

క్యాంపస్ అనే పదం విశ్వవిద్యాలయాలకు కూడా వర్తింపజేసారు. ఉదాహరణకు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు.

మూలాలు

  1. "ఎస్‌బీఐటీలో ప్రాంగణ నియామకాలు | ఖమ్మం | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2020-08-15. Retrieved 2020-08-15.
  2. "డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు". www.eenadu.net. Archived from the original on 2020-08-15. Retrieved 2020-08-15.
  3. "అనంతలక్ష్మి కళాశాలలో ప్రాంగణ నియామకాలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-08-15. Retrieved 2020-08-15.
  4. "అక్షర నిక్షేపాలు". Sakshi. 2014-11-16. Archived from the original on 2020-08-15. Retrieved 2020-08-15.
  5. 5.0 5.1 Chapman, M. Perry (2006). American Places: In Search of the Twenty-first Century Campus. Greenwood Publishing Group. p. 7.
  6. Turner, Paul Venable (1984). Campus: An American Planning Tradition. Cambridge, Massachusetts: The MIT Press.
"https://te.wikipedia.org/w/index.php?title=క్యాంపస్&oldid=3013930" నుండి వెలికితీశారు