జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{in use}}
{{in use}}
[[File:Stamps of Kyrgyzstan, 2009-577.jpg|250px|right]]

'''జమీల్యా''' చింగిజ్ ఐత్ మాతోవ్ రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన [[నవలా సాహిత్యము|నవల]] . సాంప్రదాయిక బంధనాలు నుండి స్త్రీ స్వేచ్చను కాంక్షిస్తూ రాయబడిన ఈ నవలలో స్త్రీ స్వేచ్చకు ప్రతీకగా జమీల్యా అనే అజరామరమైన పాత్ర సృష్టించబడింది.సంప్రదాయ, పురుషాధిక్య ముస్లిం కిర్గిజ్ సమాజంలో పుట్టిన జమీల్యా మరో పురుషుడికోసం, తన భర్తను విడిచి వెళ్లిపోవడం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] రచయిత లూయిస్ అరగోన్ ఈ నవలని "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రేమకథ" గా ప్రశంసించారు. 1958 లో [[రష్యా|రష్యన్ భాష]]లోను, కిర్గిజ్ భాషలోనూ వెలువడిన ఈ నవల ప్రపంచ ప్రఖ్యాతి పొంది, అనేక భాషలలోకి అనువదించబడింది. జమీల్యా నవలా రచనతో చింగిజ్ ఐత్ మాతోవ్ ప్రపంచ సాహితీ జగత్తులో సుస్థిరమైన స్థానం పొందాడు.<ref>Erich Follath and Christian Neef, "[http://www.spiegel.de/international/world/0,1518,druck-720631,00.html Kyrgyzstan Has Become an Ungovernable Country]", ''[[Der Spiegel|SPIEGEL ONLINE International]]'', 8 October 2010.</ref>
'''జమీల్యా''' చింగిజ్ ఐత్ మాతోవ్ రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన [[నవలా సాహిత్యము|నవల]] . సాంప్రదాయిక బంధనాలు నుండి స్త్రీ స్వేచ్చను కాంక్షిస్తూ రాయబడిన ఈ నవలలో స్త్రీ స్వేచ్చకు ప్రతీకగా జమీల్యా అనే అజరామరమైన పాత్ర సృష్టించబడింది.సంప్రదాయ, పురుషాధిక్య ముస్లిం కిర్గిజ్ సమాజంలో పుట్టిన జమీల్యా మరో పురుషుడికోసం, తన భర్తను విడిచి వెళ్లిపోవడం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] రచయిత లూయిస్ అరగోన్ ఈ నవలని "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రేమకథ" గా ప్రశంసించారు. 1958 లో [[రష్యా|రష్యన్ భాష]]లోను, కిర్గిజ్ భాషలోనూ వెలువడిన ఈ నవల ప్రపంచ ప్రఖ్యాతి పొంది, అనేక భాషలలోకి అనువదించబడింది. జమీల్యా నవలా రచనతో చింగిజ్ ఐత్ మాతోవ్ ప్రపంచ సాహితీ జగత్తులో సుస్థిరమైన స్థానం పొందాడు.<ref>Erich Follath and Christian Neef, "[http://www.spiegel.de/international/world/0,1518,druck-720631,00.html Kyrgyzstan Has Become an Ungovernable Country]", ''[[Der Spiegel|SPIEGEL ONLINE International]]'', 8 October 2010.</ref>



04:36, 4 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

జమీల్యా చింగిజ్ ఐత్ మాతోవ్ రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన నవల . సాంప్రదాయిక బంధనాలు నుండి స్త్రీ స్వేచ్చను కాంక్షిస్తూ రాయబడిన ఈ నవలలో స్త్రీ స్వేచ్చకు ప్రతీకగా జమీల్యా అనే అజరామరమైన పాత్ర సృష్టించబడింది.సంప్రదాయ, పురుషాధిక్య ముస్లిం కిర్గిజ్ సమాజంలో పుట్టిన జమీల్యా మరో పురుషుడికోసం, తన భర్తను విడిచి వెళ్లిపోవడం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం. ఫ్రెంచ్ రచయిత లూయిస్ అరగోన్ ఈ నవలని "ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రేమకథ" గా ప్రశంసించారు. 1958 లో రష్యన్ భాషలోను, కిర్గిజ్ భాషలోనూ వెలువడిన ఈ నవల ప్రపంచ ప్రఖ్యాతి పొంది, అనేక భాషలలోకి అనువదించబడింది. జమీల్యా నవలా రచనతో చింగిజ్ ఐత్ మాతోవ్ ప్రపంచ సాహితీ జగత్తులో సుస్థిరమైన స్థానం పొందాడు.[1]

రచయిత విశేషాలు

చింగిజ్ ఐత్ మాతోవ్ 1928 లో కిర్గిజిస్తాన్ లో ముస్లిం గిరిజన సంచార జాతుల కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఇరువురూ ఉపాధ్యాయులు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు. చింగిజ్ ఐత్ మాతోవ్ కు తొమ్మిదేళ్ల ప్రాయంలో అతని తండ్రి తొరెకూల్ ఐత్ మాతోవ్ ని స్టాలినిస్ట్ ప్రక్షాళనలో భాగంగా అరెస్ట్ చేసి నిర్దాక్షిణ్యంగా చంపివేసారు. ఆ విషాద ఘటన ఒక పీడకలగా ఇతని జీవితమంతా వెంటాడి వేధించింది. ఆ విషాదంలో నుండి వెలువడిన రచయితగా సోవియట్ వాస్తవికతలోని చీకటి కోణాలను నిష్కర్షగానే అయినప్పటికీ ఆలోచనాత్మకంగా ప్రతిబింబించాడు. అయితే లోపాలు రాజకీయ వ్యవస్థకుఆపాదించకుండా వాటిని మానవ నైజంలో భాగంగానే చూసి వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత వ్యవస్థదే అని పేర్కొన్నాడు.

నిజానికి జమీల్యా అతని మొదటి కథా రచన కాదు. ఇతని మునుపటి కథలు స్థానిక కిర్గిజ్ పత్రికలలో ప్రచురితమయ్యాయి. అయితే సోవియట్ లో అతనికి అత్యంత గుర్తింపు తెచ్చిన తొలి రచన జమీల్యా. 1958 లో ప్రచురించబడిన జమీల్యా నవల, రచయితగా చింగిజ్ ఐత్ మాతోవ్ కు ఎనలేని గుర్తింపునూ, అనేక పురస్కారాలను సాధించిపెట్టింది. దీని ఫ్రెంచ్ అనువాదంతో ఐత్ మాతోవ్ ప్రతిభను యావత్ ప్రపంచం గుర్తించింది.

ది ఫస్ట్ టీచర్ (1962), టేల్స్ అఫ్ ది మౌంటైన్స్ అండ్ స్టెప్స్ (1963), ఫేర్ వెల్ (1966), గైలుసారే (1966) మొదలైనవి ఐత్ మాతోవ్ ఇతర ముఖ్య రచనలు. 1963లో లెనిన్ ప్రైజ్, హీరో అఫ్ ది సోషలిస్ట్ లేబర్, యూరోపియన్ సాహిత్యానికి ఆస్ట్రియన్ స్టేట్ ప్రైజ్ వంటి అనేకానేక పురస్కారాలు అందుకొన్నాడు. రాజకీయంగా ఉన్నతశిఖరాలు అధిరోహించాడు. 1989లో కాంగ్రెస్ అఫ్ ది పీపుల్స్ డిప్యూటీస్ లో సభ్యుడిగా, శాశ్వత పార్లమెంటరీ కమిషన్ అధినేతగా, నాటి సోవియట్ అధ్యక్షుడు గోర్బచెవ్ కు సలహాదారునిగా మెలిగాడు. 1991లో కిర్గిజిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక యురోపియన్ దేశాలకు (ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్) మాత్రమే కాక యురోపియన్ యూనియన్, యునెస్కో, నాటో వంటి సంస్థలకు సైతం కిర్గిజ్ రాయబారిగా వ్యవహరించాడు. 2008 లో జర్మనీలోని న్యూరెంబర్గ్ లో మరణించాడు.

నవలా నేపధ్యం

ఈ నవలలోని కథ సుమారుగా 1940-45 మధ్య కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న కాలంలో కిర్గిజిస్థాన్ లో జరిగింది. కథలోని ఆధారాలను బట్టి ఇది వాయువ్య కిర్గిజిస్థాన్ ప్రాంతంలో బహుశా తలాస్ ప్రావిన్స్ లో జరిగివుండవచ్చు. అప్పటి సమిష్టి వ్యవసాయ సంస్కృతి (collective farming culture) నేపథ్యంలో సమకాలీన గిరిజన సంస్కృతి జీవితాలను ప్రతిబింబించే ఒక మనోహరమైన ప్రేమ కథ ఇది.

కిర్గిజిస్థాన్ మధ్యఆసియాలోని ఒక దేశం. ఇక్కడి ప్రజలు కిర్గిజ్ జాతికి చెందిన గిరిజన ముస్లింలు. ఈ సంచార జాతుల సమాజంలో, సనాతన సంప్రదాయాలతో పాటు, పితృస్వామ్య భావజాలాలు ప్రబలంగా ఉండేవి. అయితే 1924 లో కిర్గిజిస్థాన్ ప్రాంతం సోవియట్ యూనియన్ లో ఒక రిపబ్లిక్ గా మారిపోయినపుడు ఆ సమాజంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఏర్పడిన సోవియట్ యూనియన్ ప్రభుత్వం, కిర్గిజ్ ప్రాంతంలో స్త్రీ విద్యను ప్రోత్సహించడమే కాక, ఆ రిపబ్లిక్ లో సమిష్టి వ్యవసాయ క్షేత్రాల అభివృద్ధిని చేపట్టింది. పారిశ్రామికీకరణను వేగంగా అమలుచేసింది. దానితో కిర్గిజ్ ప్రజలు ముఖ్యంగా అప్పటివరకు సనాతన కుటుంబ సంస్కృతులతో పెనవేసుకున్న గిరిజన ప్రజలు, కొత్తగా ప్రవేశపెట్టబడిన సాంఘిక వ్యవస్థలకు అలవాటుపడటమే కాకుండా, ఆధునిక మార్పులకు అనివార్యంగా లోనవడం జరిగింది. కిర్గిజ్ ప్రజలు, దానితో అప్పటివరకు అనుసరించిన సంప్రదాయ విశ్వాసాలకు, సోషలిజం యొక్క కొత్త భావజాలానికి మధ్య వారు మానసిక సంఘర్షణకు గురయ్యారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన స్త్రీ విద్య, సనాతన సంప్రదాయాలలో మగ్గిపోయిన కిర్గిజ్ మహిళలకు సంప్రదాయ సంకెళ్లను ఛేదించుకొని బయటపడటానికి, వారికి నచ్చిన జీవితంలో కొత్త దారులలో పయనించడానికి సహకరించింది. ఇటువంటి నేపథ్యంలో నాటి సనాతన కుటుంబంలోనుండి వచ్చిన నిజాయితీ, ధైర్యంగల జమీల్యా అనే స్త్రీ తనకు దక్కిన వైవాహిక జీవితాన్ని కాదని, నచ్చిన కొత్త జీవితాన్ని అందుకోవడానికి ముందడుగు వేయడం ప్రధానంగా చిత్రించబడింది.

నవల ఇతివృత్తం

ఐత్ మాతోవ్ ఈ నవలలో ఒక చిన్న పిల్లవాడి స్వరం ద్వారా కథను ఆసాంతం నడిపిస్తాడు. అంటే ఈ నవలలో సీట్ అనే కల్పిత చిత్రకళాకారుడు (జమీల్యా మరిది) తన బాల్య స్మృతులను నెమరు వేసుకొంటూ, 15 ఏళ్ల ప్రాయంలో తన ఇంట్లో జరిగిన సంఘటనలను అందమైన ప్రేమ కథగా మలిచి తన తన కోణం నుంచి ఈ కథను చెపుతాడు.

రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా రష్యా-జర్మనీల మధ్య యుద్ధం (ది గ్రేట్ పేట్రియాటిక్ వార్) ముమ్మరంగా కొనసాగుతున్న కాలం అది. దేశ రక్షణకై నిర్బంధంగా సైన్యంలోకి తరలించబడిన రష్యన్ యువకులలో, కిర్గిజ్ ప్రాంతానికి చెందిన సాదిక్ ఒకడు. సైన్యంలో చేరాల్సిందిగా పిలుపు రావడంతో పెళ్ళైన నాలుగు నెలలకే సాదిక్ అనివార్యంగా యుద్ధరంగానికి పోవలిసివస్తుంది. అలా పోతూ తన భార్య జమీల్యాను తన గ్రామంలో వున్న ఉమ్మడికుటుంబంలో వదిలి వెళ్ళిపోతాడు. సనాతన సంప్రదాయాలను కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటించే ఆ గ్రామీణ ఉమ్మడి కుటుంబంలో వున్న సభ్యులందరు అహర్నిశం కష్టపడుతూ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో గోధుమలు పండిస్తుంటారు. ఒకవైపు పంటను పండించడం, అలా పండిన ధాన్యాన్ని సైన్యానికి సరఫరా చేయడం కోసం సమీప పట్టణంలోని రైల్వే స్టేషన్ యార్డ్ కు తోలుకెళుతూ గడపడంలోనే వారికి కాలం గడచిపోతూ ఉంటుంది.

అటువంటి సాంప్రదాయిక ఉమ్మడికుటుంబంలో అడుగుపెట్టిన జమీల్యాకు దుడుకుతనం, మంకుపట్టు ఉన్నప్పటికీ నిజాయితీగా, నిష్కపటంగా వర్తించే స్వభావం కలది. కష్టపడి పనిచేసే మనస్తత్వంతో పాటు అందరితో సరదాగా కలుపుగోలుతనంతో వుండే జమీల్యాకు అత్తింట్లో చిట్టి మరిది సీట్ చేదోడు వాదోడుగా నిలుస్తాడు. కుటుంబ సంప్రదాయాలను అమితంగా గౌరవించే సాదిక్, తన భార్య జమీల్యా పట్ల ప్రేమను వ్యక్టం చేయడంకన్నా ఆమెను తన సొత్తులా భావించే మనస్తత్వం కలిగివుంటాడు. యుద్ధభూమి నుండి భర్త రాసిన ఉత్తరాలలో కూడా కనీసం ప్రేమాస్పదమైన పిలుపు కూడా నోచుకోని వైవాహిక జీవితం ఆమెది. అందుకే అత్తింట ఆదరాభిమానాలతో ఉల్లాసంగా గడిచిపోతున్నప్పటికీ ఆమెకు జీవితం ప్రేమ రాహిత్యంగానే గడిచిపోతుంది.

ఇది ఇలా ఉండగా యుద్ధంలో కాలుకి గాయమవడంతో సైన్యం నుండి తిరిగి వచ్చేసిన ధనియార్ అనాథగా తన స్వగ్రామానికి చేరుకొంటాడు. సహజంగానే అంతర్ముఖుడైన ధనియార్ ఆ గ్రామంలోని ప్రజలతో అంతగా కలివిడిగా వుండలేడు. కానీ పని పట్ల అంకితభావం వున్నవాడు. సమిష్టిక్షేత్రంలో పండించిన గోధుమ ధాన్యాన్ని సమీప పట్టణం లోని రైల్వే స్టేషన్ కు తరలించే పని జమీల్యా, మాజీ సైనికుడు ధనియార్, మరిది సీట్ లకి అప్పగించబడుతుంది. ఈ పనిలో నిమగ్నమైన జమీల్యా-ధనియార్ ల మధ్య చిన్నగా పరిచయం ఏర్పడుతుంది. స్పర్ధతో మొదలైన వీరి పరిచయం, వేళాకోళాలతో ఆటపట్టించడంగా సాగి, క్రమంగా ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఏర్పడి, చివరకు ప్రేమగా మారుతుంది. స్టెప్పీ మైదానాలలో వెన్నెల రాత్రుల్లో దనియార్ పాడిన పాటలు జమీల్యాలో మనస్సును మైమరపిస్తాయి. అతని గానమాధుర్యంతో, ఆ ప్రేమ మహోజ్వలమై చివరకు ఆమె తన సమాజాన్ని, భర్తను విడిచి అతని వెంట పోవడానికి దారితీస్తుంది. అతని ఆత్మీయ సాహచర్యంతో, తనకు కావాలినదేమిటో ఆమెకు విస్పష్టమైన తరువాత ఆమె ఇక వెనక్కి చూడలేదు. భర్త సాదిక్ కూడా త్వరలోనే గ్రామానికి రానున్నాడని తెలిసినప్పటికీ ఆ వైవాహిక జీవితాన్ని కాదనుకొని, అప్పటి సామాజిక ఆచారాలను, కుటుంబ కట్టుబాట్లను, ధిక్కరించి మరీ జమీల్యా తన మనస్సుకి నచ్చిన ధనియార్ తో సహజీవనం కొనసాగించడానికి స్వేచ్ఛగా, ధైర్యంగా అడుగులు వేస్తుంది.

వదినగా ఆమెను మూగగా ఆరాధించే ఆమె చిట్టి మరిది సీట్, ఆమె వెన్నంటి తిరుగుతూ, వీరిరువురి పరిచయం ఒక ఉత్తేజకరమైన ప్రేమగా మారడాన్ని మొదటి నుంచీ ఆశ్చర్యంతో గమనిస్తుంటాడు. ఒకరికోసమే ఒకరు అన్నట్లు అపూర్వానందంతో ఓలాడుతున్న వారి స్వచ్ఛమైన ప్రేమను, వారి ఆనందాన్ని అర్ధం చేసుకొన్న సీట్ ఖండించలేడు సరికదా వారి జీవన మార్గాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తాడు. పైగా దాని నుండి కళాత్మకమైన స్ఫూర్తిని పొందడమే కాకుండా తన జీవితంలో కూడా ఒక స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకొని తదనంతర కాలంలో చిత్రకళాకారుడిగా ఎదుగుతాడు. ఇదీ స్థూలంగా కథ. ఈ ప్రేమ కథలో సంగీతం యొక్క ప్రభావం ఎంత మహత్తరంగా ఉందంటే నవలకు తొలి పేరుగా 'ఓబోన్' (కిర్గిజ్ లో ఓబోన్ అంటే శ్రావ్యత) అని సూచించబడినప్పటికీ చివరకు రష్యన్ అనువాదకుని కారణంగా జమీల్యా అనే పేరు స్థిరపడింది.

ప్రధాన పాత్రలు

జమీల్యా : కథా నాయకి పాత్ర. స్వేచ్ఛాయుత జీవి. సాంప్రదాయిక బంధనాలు నుండి స్వేచ్ఛను కోరుకొంటూ తనకు నచ్చిన కొత్త జీవితంలోకి ధనియార్ వెంట నడిచిన పాత్ర.
ధనియార్: కథానాయకుడు. కుంటికాలితో సైన్యం నుండి తిరిగి వచ్చి గ్రామంలో స్థిరపడిన అనాథ. ఆత్మికంగా సంపన్నుడు. మధుర గాయకుడు. చివరకి జమీల్యా ప్రేమను చూరగొంటాడు.
సీట్: జమీల్యా మరిది. సాదిక్ తమ్ముడు. అన్నలు యుద్దభూమికి వెళ్ళినపుడు, వదిన జమీల్యాకు కు చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె పట్ల అంతులేని అభిమానంతో వుండే పాత్ర. కథ యావత్తూ ఇతని కోణం నుంచి చెప్పబడుతుంది.
సాదిక్: జమీల్యా భర్త. యుద్ధరంగంలో ఉంటాడు. సాంప్రదాయిక సమాజానికి, పితృస్వామిక భావజాలానికి ప్రతినిధి.
ఒస్మాన్: ఉమ్మడి కుటుంబానికి దూరపు బంధువు. పోకిరీ. జమీల్యాను అల్లరి చేష్టలతో విసిగిస్తుంటాడు.
ఒరోజ్మాత్: సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి దళ నాయకుడు.

అనువాదాలు

చలన చిత్రీకరణలు

1968 లో ఇరినా పోప్లావాస్కయా, సెర్గీ యుట్కెవిచ్ దర్శకత్వంలో ఈ నవల రష్యన్ భాషలో జమీల్యా (రష్యన్ Джамиля) సినిమాగా విడుదలైంది. కథానాయకి జమీల్యా పాత్రలో నటల్యా అరిన్‌బసరోవా, ధనియార్ పాత్రలో సుయ్మెన్కుల్ చోక్మరోవ్ నటించారు.[2] ఈ క్లాసిక్ చిత్రానికి రచయిత 'చింగిజ్ ఐత్ మాతోవ్' స్వయంగా కథ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

1994 లో మోనికా టిబెర్ దర్శకత్వంలో ఈ నవలను ఇంగ్లీష్ లో జమీలా (Jamila )పేరుతొ సినిమాగా తీశారు. [3]

సాహిత్యంలో నవల స్థానం–అంచనా

రిఫెరెన్సులు

  • జమీల్యా - చింగిజ్ ఐత్ మాతోవ్ (తెలుగు అనువాదం ఉప్పల లక్ష్మణరావు) హైదరాబాద్ బుక్ ట్రస్టు (2015)

మూలాలు

  1. Erich Follath and Christian Neef, "Kyrgyzstan Has Become an Ungovernable Country", SPIEGEL ONLINE International, 8 October 2010.
  2. "Jamilya (1969)". IMOB. Retrieved 2 September 2020.
  3. "Jamila (1994)". www.imdb.com. IMDB. Retrieved 4 September 2020.

బయట లింకులు