అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 83: పంక్తి 83:


అనంతపురం నుంచి తిరుపతి, అయోధ్య, శిరిడి, మైసూర్, శ్రీరంగం, కన్యాకుమారి, ఉజ్జయిని,విజయవాడ, అన్నవరం, ఎక్స్ప్రెస్ రైళ్ళు కలవు.
అనంతపురం నుంచి తిరుపతి, అయోధ్య, శిరిడి, మైసూర్, శ్రీరంగం, కన్యాకుమారి, ఉజ్జయిని,విజయవాడ, అన్నవరం, ఎక్స్ప్రెస్ రైళ్ళు కలవు.


==అనంతపురం నగరపాలక సంస్థ==
==అనంతపురం నగరపాలక సంస్థ==
{{main|అనంతపురం నగరపాలక సంస్థ}}
{{main|అనంతపురం నగరపాలక సంస్థ}}

12:25, 17 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

అనంతపురం
అనంతపురం గడియారపు స్తంబం
అనంతపురం గడియారపు స్తంబం
దేశంభారత దేశము
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅనంతపురం
Area
 • Total15.98 km2 (6.17 sq mi)
Elevation
335 మీ (1,099 అ.)
Population
 (2011)[1]
 • Total2,61,004
 • Density16,000/km2 (42,000/sq mi)
భాష
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
PIN
515001
ప్రాంతీయ కోడ్08554
Vehicle registrationAP-02

అనంతపురము, ఆంధ్రప్రదేశ్ లోని నగరాల్లో ఒకటి. ఇది అనంతపురం జిల్లాకు ముఖ్య పట్టణం.

విజయవాడకు నైఋతి దిశలో 485 కి.మీ దూరంలో, జాతీయ రహదారి 7 పై ఉంది. అనంతపురానికి అతి దగ్గరలోని మహానగరం బెంగళూరు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అనంతపురము దాదాపు ౧౯౦ (190) కిలో మీటర్లు. మరో మహా నగరం హైదరాబాదు నుంచి అనంతపురం దాదాపుగా ౩౬౦ (360) కిలోమీటర్లు. బెంగళూరు-హైదరాబాదులను కలిపే జాతీయ రహదారి అనంతపురము మీదుగానే వెళ్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నేరుగా అనంతపురానికి రైలు సౌకర్యం కూడా కలదు. ఇది 1799లో దత్త మండలానికి (రాయలసీమతో కూడిన బళ్ళారి) కేంద్రంగా ఉండేది. అనంతపురానికి సర్ థామస్ మన్రో మొదటి కలెక్టరు.రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీషు భారత సైన్యానికి అనంతపురం వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది.ఇప్పటి జె ఎన్ టి యు ప్రాంగణం అప్పట్లో ఆయుధ బంకరుగా వాడేవారు.వాటి అవశేషాలను ఈ ప్రాంగణంలో ఇప్పటికీ చూడవచ్చును.

భౌగోళికం

అనంతపురం 14°41′N 77°36′E / 14.68°N 77.6°E / 14.68; 77.6 న ఉంది. దీని సరాసరి ఎత్తు 335 మీ (1099 అడుగులు)

గ్రామ నామ వివరణ

అనంతపురం అన్న గ్రామనామాలు వ్యక్తి నామసూచిగా పరిశోధకులు వర్గీకరిస్తున్నారు.[2]

రవాణా

అనంతపురం నుండి హైదరాబాదు, కర్నూల్, కదిరి, బెంగుళూరు, బొంబాయి, ఢిల్లీ, జైపూర్, భువనేశ్వర్, పూణే, అహ్మదాబాదు, హిందూపురం, ఆదోని, విశాఖపట్టణం లకి రవాణా సౌకర్యం ఉంది.

అనంతపురం రైల్వే స్టేషన్

దక్షిణ తీర రైల్వేే జోన్ గుంతకల్ డివిజన్లోో అనంతపురం రైల్వే స్టేషన్ ముఖ్యమైనది. రెండు ప్లాట్ ఫామ్ లు కలవు. ఇక్కడ నుంచి ఢిల్లీీ ముంబై జైపూర్ ఇండోర్ మైసూర్ త్రివేండ్రం బెంగళూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ నాగపూర్ ఇంకా ఎన్నోో ప్రరధాన నగరాల రవాణాా సౌకర్యం కలదు. ఇక్కడ నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్ళు కలవు.

అనంతపురం నుంచి తిరుపతి, అయోధ్య, శిరిడి, మైసూర్, శ్రీరంగం, కన్యాకుమారి, ఉజ్జయిని,విజయవాడ, అన్నవరం, ఎక్స్ప్రెస్ రైళ్ళు కలవు.

అనంతపురం నగరపాలక సంస్థ

అనంతపురం నగరపాలక సంస్థ అనంతపురం జిల్లా లోని ఏకైక నగరపాలక సంస్థ.రాయలసీమ ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న 'అనంతపురం' అంచెలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 'స్థానిక' పాలన హోదాను దక్కించుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనాటి నుంచి 145 ఏళ్లు 'స్థానిక' పాలన సాగింది. 2014 దాకా 38 మంది ఛైర్మన్లు, ప్రత్యేక అధికారులు పాలించారు. వీరిలో 15 మంది ఛైర్మన్లు, 23 మంది ప్రత్యేక అధికారులు ఉన్నారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం అనంతపురానికి మున్సిపాల్టీ హోదా కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో ఛైర్మన్ల వ్యవస్థ ఆరంభమైంది. 'ఎన్నిక' విధానం అమల్లోకి వచ్చింది

వాతావరణం

అనంతపురం శుష్క వాతావరణం కలిగిన ప్రదేశం. ఏడాదిలో అధికభాగం పొడిగా, వేడిమితో కూడి ఉంటుంది. ఫిబ్రవరి ద్వితీయార్థం నుండి వేసవి మొదలయి మేలో అత్యధిక ఉష్ణోగ్రత 40-42 డిగ్రీల సెంటీగ్రేడు (104 - 107.6 డిగ్రీల ఫారెన్ హీట్) సరాసరిగా నమోదవుతుంది. నైఋతి రుతుపవనాల వలన మార్చి లోనే తొలకరి జల్లులు పడతాయి. ఋతుపవనాలు సెప్టెంబరులో మొదలయి నవంబరులో ముగుస్తుంది. వీటివలన 250 ఎం. ఎం. (9.8 ఇంచి) ల వర్షం నమోదవుతుంది. పొడిగా ఉండే తేలికపాటి శీతాకాలం నవంబరు ద్వితీయార్థంలో మొదలయి ఫిబ్రవరి ప్రథమార్థం వరకూ కొనసాగుతుంది. ఈ వాతావరణంలో ఉష్టోగ్రత యొక్క సరాసరి 30 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడు (86 నుండి 89.6 డిగ్రీల ఫారెన్ హీట్) గా నమోదవుతుంది. సాలీన వర్షపాతం 22 అంగుళాలు (560 ఎం ఎం).

ప్రముఖులు

చిత్రమాలిక

మూలాలు

  1. 1.0 1.1 "Municipalities, Municipal Corporations and UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 8 ఆగస్టు 2016. Retrieved 23 June 2016.
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. Retrieved 10 March 2015.

మూసలు, వర్గాలు


"https://te.wikipedia.org/w/index.php?title=అనంతపురం&oldid=3034183" నుండి వెలికితీశారు