వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 1,227: పంక్తి 1,227:
గౌరవ వికీపీడియన్లు వికీ డేటాకు లింకు కలపటం తెవికీలో ఇదొక భాగం అని ముందుగా గుర్తించాలి.వ్యాసం ఎడిట్ చేసేటప్పుడు వ్యాసానికి ఎడమ వైపు వికీ డేటా లింకు ఉన్నదో లేదో పరిశీలించాలి. పరిశీలించి నప్పుడు ఆంగ్ల వ్యాసానికి, తెలుగు వ్యాసం లింకు ఉంటే అది 'ఒకెే' అని భావించ వచ్చు.లేకపోతే లింకు కలపాలి.కేవలం తెలుగు పేజీకి మాత్రమే ఉన్నదని గమనిస్తే, అదే పేరుతో ఆంగ్ల శీర్షికతో సమయస్పూర్తిగా, కొద్దిగా వికీడేడేటాలో వెతకాలి.(సెర్చి).ఒకవేళ మరొక వికీ డేటా సంఖ్యతో ఆంగ్ల పేజీ ఉన్నదనుకోండి,ఈ రెండిటిని Merge చేయాలి.చాలా ఈజీగా చేయవచ్చు.మొదటిసారి అడిగి తెలుసుకొని, ఆ తర్వాత ఎవరితో పని లేకుండా చేయవచ్చు.ఇంకొక విషయం.వికీ డేటా లింకులు కలపటం ఎంత ముఖ్యమో, ఒక్కో సందర్బంలో తొలగించుటకూడా అంతే ముఖ్యం.అది ఏ సందర్బంలో జరుగుతుంది అనే దానికి వస్తే. ఇది ఎక్కువుగా తొలగించిన పేజీల సందర్బంలో జరుగుతుంటుంది.ఏదైనా ఒక పేజీని తొలగించిన సంధర్బంలో, దీనికి వికీ డేటా లింకు ఉన్నది.దానికి వెళ్లి సవరించండి అని తెలుపుతుంది.తొలగించిన పేజీకి లింకు అవసరంలేదు కనుక ఇది కూడా అదే సమయంలో సరిచేస్తే తొలగింపు పని పరిపూర్ణమవుతుంది. పైన వివరించిన అన్ని రకాలు సవరణలు వికీడేటాలో ఈరోజువరకు నేను 4969 సవరణలు చేసాను.మనకు తెలియనిదానిలో తెలుసుకోవాలని తపన మనలో ఉన్నప్పుడు, అదే మనల్ని తెలుసుకునేటట్లు అవకాశం కల్పిస్తుందని నాఅనుభవరీత్యా చెపుతున్నానుకానీ, ఇక్కడ నా గొప్పతనం గురించి చెప్పానని భావించవద్దు.కొంత మందికి అయినా అవగాహన కలిగితే సంతోషిష్తాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:22, 18 సెప్టెంబరు 2020 (UTC)
గౌరవ వికీపీడియన్లు వికీ డేటాకు లింకు కలపటం తెవికీలో ఇదొక భాగం అని ముందుగా గుర్తించాలి.వ్యాసం ఎడిట్ చేసేటప్పుడు వ్యాసానికి ఎడమ వైపు వికీ డేటా లింకు ఉన్నదో లేదో పరిశీలించాలి. పరిశీలించి నప్పుడు ఆంగ్ల వ్యాసానికి, తెలుగు వ్యాసం లింకు ఉంటే అది 'ఒకెే' అని భావించ వచ్చు.లేకపోతే లింకు కలపాలి.కేవలం తెలుగు పేజీకి మాత్రమే ఉన్నదని గమనిస్తే, అదే పేరుతో ఆంగ్ల శీర్షికతో సమయస్పూర్తిగా, కొద్దిగా వికీడేడేటాలో వెతకాలి.(సెర్చి).ఒకవేళ మరొక వికీ డేటా సంఖ్యతో ఆంగ్ల పేజీ ఉన్నదనుకోండి,ఈ రెండిటిని Merge చేయాలి.చాలా ఈజీగా చేయవచ్చు.మొదటిసారి అడిగి తెలుసుకొని, ఆ తర్వాత ఎవరితో పని లేకుండా చేయవచ్చు.ఇంకొక విషయం.వికీ డేటా లింకులు కలపటం ఎంత ముఖ్యమో, ఒక్కో సందర్బంలో తొలగించుటకూడా అంతే ముఖ్యం.అది ఏ సందర్బంలో జరుగుతుంది అనే దానికి వస్తే. ఇది ఎక్కువుగా తొలగించిన పేజీల సందర్బంలో జరుగుతుంటుంది.ఏదైనా ఒక పేజీని తొలగించిన సంధర్బంలో, దీనికి వికీ డేటా లింకు ఉన్నది.దానికి వెళ్లి సవరించండి అని తెలుపుతుంది.తొలగించిన పేజీకి లింకు అవసరంలేదు కనుక ఇది కూడా అదే సమయంలో సరిచేస్తే తొలగింపు పని పరిపూర్ణమవుతుంది. పైన వివరించిన అన్ని రకాలు సవరణలు వికీడేటాలో ఈరోజువరకు నేను 4969 సవరణలు చేసాను.మనకు తెలియనిదానిలో తెలుసుకోవాలని తపన మనలో ఉన్నప్పుడు, అదే మనల్ని తెలుసుకునేటట్లు అవకాశం కల్పిస్తుందని నాఅనుభవరీత్యా చెపుతున్నానుకానీ, ఇక్కడ నా గొప్పతనం గురించి చెప్పానని భావించవద్దు.కొంత మందికి అయినా అవగాహన కలిగితే సంతోషిష్తాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 07:22, 18 సెప్టెంబరు 2020 (UTC)
::: నేను ఏదన్న కొత్త వ్యాసం రాసేముందు ఆ వ్యాసం ఇంగ్లీషు వికీపీడియాలో ఉందోలేదో, ఉంటే ఆ వ్యాసంకి తెవికీ వ్యాసం లింకు ఉందోలేదో పరిశీలుస్తూ ఉంటాను. చాలావాటికి లింక్స్ ఇవ్వడంలేదు. అలా ఇవ్వకపోవడం వల్ల ఆ వ్యాసం తెవికీలో లేదనుకుంటాం. వికీ ఛాలెంజ్ లో భాగంగా రెండుమూడుసార్లు వ్యాసాలు రాసి, ఆ వ్యాసాలకు సంబంధించిన పేజీల్లో లింక్స్ ఇచ్చే సమయంలో అక్షర బేధాలతో ఆయా వ్యాసాలు కనిపించాయి. అప్పుడు ఆ పేజీ తొలగించి మళ్ళీ మరో వ్యాసం రాయాల్సివచ్చింది. చాలామంది వ్యాసం రాయగానే పని అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ, వ్యాసం రాయడంతోపాటు వ్యాసానికి సంబంధించిన ఇతర పనులు చేయడం (ఎన్వికీ లింకులు, అంతర్వికి లింకులు, వర్గాలు, మూలాలు, సమాచారపెట్టె, ఫోటో) కూడా చాలా ముఖ్యం.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Comic Sans MS; color:red">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 08:52, 18 సెప్టెంబరు 2020 (UTC)
::: నేను ఏదన్న కొత్త వ్యాసం రాసేముందు ఆ వ్యాసం ఇంగ్లీషు వికీపీడియాలో ఉందోలేదో, ఉంటే ఆ వ్యాసంకి తెవికీ వ్యాసం లింకు ఉందోలేదో పరిశీలుస్తూ ఉంటాను. చాలావాటికి లింక్స్ ఇవ్వడంలేదు. అలా ఇవ్వకపోవడం వల్ల ఆ వ్యాసం తెవికీలో లేదనుకుంటాం. వికీ ఛాలెంజ్ లో భాగంగా రెండుమూడుసార్లు వ్యాసాలు రాసి, ఆ వ్యాసాలకు సంబంధించిన పేజీల్లో లింక్స్ ఇచ్చే సమయంలో అక్షర బేధాలతో ఆయా వ్యాసాలు కనిపించాయి. అప్పుడు ఆ పేజీ తొలగించి మళ్ళీ మరో వ్యాసం రాయాల్సివచ్చింది. చాలామంది వ్యాసం రాయగానే పని అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ, వ్యాసం రాయడంతోపాటు వ్యాసానికి సంబంధించిన ఇతర పనులు చేయడం (ఎన్వికీ లింకులు, అంతర్వికి లింకులు, వర్గాలు, మూలాలు, సమాచారపెట్టె, ఫోటో) కూడా చాలా ముఖ్యం.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Comic Sans MS; color:red">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 08:52, 18 సెప్టెంబరు 2020 (UTC)
తెలుగుకు లేదా మన ప్రాంతాలకు సంబంధించిన ఇంగ్లీష్ వ్యాసాలలో పూర్తి సమాచారం లేకపోవటం, అనవసరం అయిన సమాచారం ఉండటం నేను గమనించాను, ప్రస్తుతానికి అంతర్జాలంలో తెలుగులో ఉన్న వనరులతో లేదా ఆయా వ్యాసము మూలం లో ఇంగ్లీష్ వచనం తెలుగులోని అనువదించి రాస్తున్నాను, భవిషత్తులో యాత్రిక అనువాదాలు జరిగి వ్యాసం విలీనం అయినా మనము ఇక్కడ బిన్నంగా రాసింది ఇతరులకు ఉపయోగ పడుతుందేమో అన్న ఆలోచన , ఆంగ్ల వ్యాసానికి నకలు గా తెలుగులోను వ్యాసం ఉండాలన్న [[:en:Help:Interlanguage_links|నింబంధన]] నా దృష్టికి రాలేదు ఆయితే దీని మీద తెలుగులో కూడా ఒక మార్గదర్శకం ఉంటే బాగుంటుంది అని నా విన్నపము , శీర్షికలకు వికీడేటా లో సవరణలు / బాట్ లు బాగానే చేరుస్తున్నాయి [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 17:52, 18 సెప్టెంబరు 2020 (UTC)

17:52, 18 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

అడ్డదారి:
WP:VP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..



నిర్ణయం కోసం చూస్తున్న చర్చలు

కింది చర్చల సమయాలు ముగిసిపోయాయి. కొన్ని చర్చల్లో వాడుకరులు చురుగ్గా పాల్గొనలేదు గానీ, సమయం ముగిసిపోయి చాన్నాళ్ళైంది కాబట్టి ఇక వాటికి నిర్ణయం ప్రకటించి మూసెయ్యవచ్చు. వాటిలో జోక్యం చేసుకోని, సంబంధిత విషయ పరిజ్ఞానం ఉన్న నిర్వాహకులు/వాడుకరి ఎవరైనా వాటిని ముగించాలని మనవి.

  1. వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా?
  2. వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం
  3. చర్చ:వాసి (ప్రసిద్ధి)
  4. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రాఘవేందర్ అస్కాని

అర్జున గారూ, మీరు ఈ చర్చల్లో పాల్గొనలేదు. కాబట్టి వీటికి నిర్ణయాలు ప్రకటించవచ్చు. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 08:07, 1 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా? కేవలం ఒకరే స్పందించారు. అందువలన ప్రస్తుతానికి మార్గదర్శకంగా పరిగణించడం మంచిది.
వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిరోధ నిర్ణయాల సమీక్షా విధానం నేను ప్రతిపాదన దశలోనే వ్యతిరేకించాను కావున నేను నిర్ణయం ప్రకటించలేను.
మిగతా వాటిపై నా అభిప్రాయం లేక నిర్ణయం తెలియ చేశాను. పాలసీలపై చర్చలు వ్యాస పేజీలో కాకుండా చర్చ పేజీలోనే జరపడం మంచిది. కొత్త విధానాలకు వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి పాటించమని కోరుతున్నాను.-- అర్జున (చర్చ) 06:40, 2 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు. "వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/తెలుగేతర పేర్లను రాయడం ఎలా?" ను ఒక మార్గదర్శకంగా తీసుకొమ్మన్నారు. కానీ అందులో సి. చంద్ర కాంత రావు గారు తన స్పందనలో కొన్ని సూచనలు చేసారు. వాటిని పరిగణన లోకి తీసుకోవాలో లేదో స్పష్టం కాలేదు, చర్చ అక్కడే అసంపూర్ణంగా ఆగిపోయింది. ప్రతిపాదనను ఉన్నదున్నట్టుగా తీసుకోవాలని మీ ఉద్దేశమా? లేక వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం ఓటింగు ప్రకటించడం మంచిదంటారా? మీ నిర్ణయాన్ని అక్కడే ప్రకటిస్తే బాగుంటుందేమో పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 07:56, 2 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మార్గదర్శకంగా తీసుకోమని అన్నదాని గురించి స్పష్టత ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తు చేసినందులకు ధన్యవాదాలు. ప్రస్తుతమున్న పద్ధతి ప్రకారం అది నిర్ణయ స్థాయికి చేరలేదు. కావున మంచి సూచనగా తీసుకోవాలన్నదే నా భావం. అలాగే మార్గదర్శకాలకు ఓటు పద్ధతిని మనం ఇంతవరకు ప్రయోగించి చూడలేదు. కావున మార్గదర్శకాలకు క్లిష్టమైన పద్ధతి అవసరంలేదని నా ప్రస్తుత అభిప్రాయం. ఆ మేరకు పద్ధతి కి సవరణ చేయవలసిన అవసరం వుంది. --అర్జున (చర్చ) 05:02, 3 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Annual contest Wikipedia Pages Wanting Photos

Wikipedia Pages Wanting Photos (WPWP)
Wikipedia Pages Wanting Photos (WPWP)

This is to invite you to join the Wikipedia Pages Wanting Photos (WPWP) campaign to help improve Wikipedia articles with photos and win prizes. The campaign starts today 1st July 2020 and closes 31st August 2020.

The campaign primarily aims at using images from Wikimedia Commons on Wikipedia articles that are lacking images. Participants will choose among Wikipedia pages without photo images, then add a suitable file from among the many thousands of photos in the Wikimedia Commons, especially those uploaded from thematic contests (Wiki Loves Africa, Wiki Loves Earth, Wiki Loves Folklore, etc.) over the years.

Please visit the campaign page to learn more about the WPWP Campaign.

With kind regards,

Thank you,

Deborah Schwartz Jacobs, Communities Liaison, On behalf of the Wikipedia Pages Wanting Photos Organizing Team - 08:24, 1 జూలై 2020 (UTC)

feel free to translate this message to your local language when this helps your community

How does one know what pictures are already available in the Commons? Is there a way to query? Thanks Vemurione (చర్చ) 23:07, 25 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione గారు, పైన ఇచ్చిన లింకులో మూడవ అంకం నకలు క్రింద ఇచ్చాను చూడండి
Find an appropriate image on Commons. Click here to search for the image using the correct title or category. There are several ways to do this. See this simple media reuse guide. Here are additional tips.
తెలుగులో వర్గం:బొమ్మలు కావలసిన వ్యాసాలు చూడండి.--అర్జున (చర్చ) 00:16, 26 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Feedback on movement names

నమస్తే. Apologies if you are not reading this message in your native language. Please help translate to your language if necessary. కృతజ్ఞతలు!

There are a lot of conversations happening about the future of our movement names. We hope that you are part of these discussions and that your community is represented.

Since 16 June, the Foundation Brand Team has been running a survey in 7 languages about 3 naming options. There are also community members sharing concerns about renaming in a Community Open Letter.

Our goal in this call for feedback is to hear from across the community, so we encourage you to participate in the survey, the open letter, or both. The survey will go through 7 July in all timezones. Input from the survey and discussions will be analyzed and published on Meta-Wiki.

Thanks for thinking about the future of the movement, --The Brand Project team, 19:42, 2 జూలై 2020 (UTC)

Note: The survey is conducted via a third-party service, which may subject it to additional terms. For more information on privacy and data-handling, see the survey privacy statement.

చర్చ

ఇది రీబ్రాండింగ్ ఎక్సర్ సైజ్. ఇది గనుక విజయవంతం అయితే, వికీమీడియా ఫౌండేషన్ పేరు, వికీమీడియా మూవ్ మెంట్ అన్న పేరు అసలు వికీమీడియా అన్న పేరు సైతం మారిపోతాయి. చాలా ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం. కాబట్టి, ఈ విషయాన్ని గురించి మనం ఈ విషయాన్ని మనం చర్చించి, మన పక్షాన మనం ఒక నిర్ణయం తీసుకుని, మన స్వరం వినిపించాలని నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 02:06, 3 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కాల దోషం పట్టిన మూలపు మూస వాడుకలలో deadurl పరామితి తొలగింపు

ప్రధానపేరుబరిలోని వ్యాసాలన్నింటిలో మూలపు మూసలలో వాడబడిన deadurl లేక dead-urlకు కాలదోషం పట్టింది. దీనికి బదులుగా url-status వాడాలి. నా బాట్ ద్వారా ఆ మార్పులు చేశాను. అయితే Internetarchivebot మార్చిన మూలాలకు ఇప్పటికే url-status వుండి వుంటే దానిని గమనించి చేయలేదు కావున కొన్ని సార్లు url-status పరామితి రెండు సార్లు వేర్వేరు విలువలతో కూడా చేరివుండవచ్చు. దీనిని వాడుకరులు ఆ మూలాన్ని వీక్షించి తదనుగుణంగా మానవీయ మార్పులు చేయవలసినదిగా కోరుతున్నాను. దీనివలన మూలాల జాబితా లో ఎర్ర సిరా చాలావరకు తగ్గిపోయింది. ఇంకేమైనా ఎర్రసిరా హెచ్చరికలుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 05:24, 7 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ అలా మార్చవలసిన మాదిరి లింకు ఒకటి ఉన్న వ్యాసం గానీ, అలాంటి లింకులు ఉన్న వర్గం గానీ వివరాలు తెలుపగలరా!నాకు అవగాహన కోసం మాత్రమే.--యర్రా రామారావు (చర్చ) 06:21, 7 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, లింకు చూడండి. ఇక్కడ url-status విలువ ఒకే విధంగా వుంది. కావున ఒకటి తొలగించాను.-- అర్జున (చర్చ) 09:35, 7 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సరేనండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:44, 7 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Internetarchivebot పనిచేస్తున్న లింకుని పనిచేయనిదిగా గుర్తించడం

అర్జున గారూ, పనిచేస్తున్న లింకులను కూడా Internetarchivebot పనిచేయని లింకులుగా చూపిస్తూ, [permanent dead link] అని చేరుస్తోంది. ఒకసారి ఈ లింకు పరిశీలించండి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:19, 8 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Pranayraj Vangari నేను ఆ మార్పు తొలగించి మానవీయంగా బాట్ నడిపి చూశాను. బాట్ మార్పు చేయలేదు. సర్వర్ లో ఏమైనా తాత్కాలిక సమస్య వలన జరిగిందేమో. ఇటువంటివి ఇంకా ఎక్కువగా కనబడితే బాట్ యజమానికి తెలియచేయవచ్చు.--అర్జున (చర్చ) 07:09, 8 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:12, 8 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారు, False positive లను https://iabot.toolforge.org/index.php?page=reportfalsepositive లో నివేదించవచ్చు. నేను నివేదించాను. మరల సమస్య కనబడితే en:User talk:Cyberpower678 లో చర్చించండి.--అర్జున (చర్చ) 06:07, 9 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండి అర్జున గారు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:11, 9 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, ఈ సమస్య పరిష్కారం కాలేదు, పనిచేస్తున్న అనేక లింకులను Internetarchivebot డెడ్ లింక్స్ గా మారుస్తోంది. en:User talk:Cyberpower678లో ఈ చర్చను నివేదించి, తెలుగు వికీపీడియాలో dead link checkingని అచేతనం చేయమంటే మంచిదని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 17:11, 28 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్‌రాజ్ వంగరి గారు, Internetarchivebot పని dead link కనుగొని ఆర్కైవ్.ఆర్గ్ లింకు చేర్చటమే. కావున dead link checking అచేతనం చేయలేము. 2020 లో ఇప్పటిదాక, 36306 మార్పులలో ఏడు మార్పులలోనే సమస్య వచ్చింది. అటువంటి సమస్య False positive నివేదించటం ద్వారా తీరుతుంది. ఆ పేజీలకు నేను నివేదించాను మరల ఇంకొకనెల పరిశీలించి సమస్య తీవ్రత పెరుగుతుంటే బాట్ యజమానిని సంప్రదించటం మంచిది.-- అర్జున (చర్చ) 23:01, 28 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, కె. నాగేశ్వర్, కాసర్ల శ్యామ్, తెలుగు భాషా దినోత్సవం పేజీల్లో Internetarchivebot చేసిన మార్పులు చూస్తే, url-status=dead గా మారుస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 05:12, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణయ్‌రాజ్ వంగరి గారు,మీరు చూపినవి పరిశీలించాను. వీటిలో కొన్ని ఇప్పటికే False positive గా నివేదించారు. మిగిలినవాటిని నేను నివేదించాను. ఆర్కైవ్.ఆర్గ్ లో కూడా భద్రపరచాను. ఇంటర్నెట్ పనితీరువలన కొన్ని సార్లు దోషాలుండవచ్చు.కాని ఒకసారి ఒక జాలచిరునామ నివేదిస్తే కొత్త దోషాలలో ఆ జాలస్థలి ఉండదనుకుంటాను. మీరు దోషాలు గమనిస్తే బాట్ మార్పు రద్దు చేసి URL నివేదించండి. కొన్నాళ్ల తరువాత మరల సమీక్షించవచ్చు. ఒకవేళ పనిచేయనిదిగా మార్పు చేసినా, ఆర్కైవ్.ఆర్గ్ లింకు వుంటే చదువరులకు సమాచారం అందుతుంది కాబట్టి పెద్దగా మనం బాధపడాల్సిన పనిలేదు. --అర్జున (చర్చ) 23:54, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సరేనండి అర్జున గారు. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 03:01, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Editing news 2020 #3

12:55, 9 జూలై 2020 (UTC)

GENTLE REMINDER: Project Tiger 2.0 - Feedback from writing contest editors and Hardware support recipients

tiger face
tiger face

Dear Wikimedians,

We hope this message finds you well.

We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.

We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the Project Tiger 2.0 writing contest feedback.

Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further. The process of the writing contest will be ended on 20 July 2020.

Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.

The Writing Contest Jury Feedback form is going to close on 10 July 2020.

Thank you. Nitesh Gill (talk) 15:57, 10 June 2020 (UTC)

Announcing a new wiki project! Welcome, Abstract Wikipedia

Sent by m:User:Elitre (WMF) 20:10, 9 జూలై 2020 (UTC) - m:Special:MyLanguage/Abstract Wikipedia/July 2020 announcement [ప్రత్యుత్తరం]

ఇండిక్ వికీ ప్రాజెక్టు - online వికీ శిక్షణా తరగతులు ప్రతిపాదన

నమస్కారం ,

తెలుగు వికిపీడియాను ఎప్పుడైనా , ఎక్కడైనా ,వెబ్ ఆధారంగా నేర్చుకోవటం కోసం గూగుల్ సాంకేతిక పరిజ్ఞానం ( classroom , codelabs ) ఆధారంగా కొన్ని ఆన్లైన్ పాఠాలువీడియోలు ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూపొందించదలచాము. ఇవి కొత్తగా వికీలో రాయబోయే ఔత్సాహికులను దృష్టిలో పెట్టుకొని రాసిన ప్రాధమిక జాబితా వీటిని అందరికీ అందుబాటులో ఉంచటం ద్వారా ఎవరైనా వికీలో వ్యాసం రాయగలరని మా ఆలోచన , వీటి ఆధారంగా వికీడేటా, వికీ సోదర ప్రాజెక్టులు వంటి మరిన్నిపాఠ్యాంశాలు చేర్చగలం. ఇందులో ఈ విభాగాలుచేర్చాలని మా ఆలోచన , ఇలా చేసిన మొదటి రెండు విభాగాలు నమూనా ను https://teluguwiki-aa8c2.web.app/ లో మీరు చూడవచ్చు , ఏమైనా సూచనలు , చేర్చదగిన అంశాలు ఉంటే మాకు తెలియచేయగలరు. ఈ ప్రాజెక్టు వివరాల కొరకు ఇక్కడ చూడగలరు.

వికీపీడియా వర్క్ షాప్ లో ఉపయోగించడానికి అభ్యాస కంటెంట్ సృష్టించడం కొరకు అంశాలు

1) వికీపీడియా ఉపోద్ఘాతం , సంక్షిప్తం గా వికీపీడియా పరిచయం , వికీపీడియా - ఐదు మూలస్థంభాలు, వికీపీడియా ఆవశ్యకతలు

2) Google మూలాంశ ఉపకరణాల పొడిగింపు (డెస్క్ టాప్ )

3)వాయిస్ మరియు కీబోర్డ్ లు ఉపయోగించి మొబైల్ పరికరాల్లో తెలుగును టైప్ చేయడం ఎలా Gboard (మొబైల్ అప్లికేషన్)

4)tewiki.iiit.ac.in పరిచయం, తెవికీ ప్రయోగశాల ( Sandbox) లో నమోదు

5)తెలుగు వికీపీడియాలో లాగిన్ ప్రక్రియ, ఒక వాడుకదారుని పేజీని సృష్టించడం , స్వ పరిచయం జోడించడం

6) వికీపీడియా లో అన్వేషణ , వికీపీడియాలో ఉన్న ప్రాథమిక నావిగేషన్

7) వికీపీడియాను ఒక పరిశోధన సాధనంగా ఉపయోగించడం, వికీ పేజీ నుండి PDF గా ఎగుమతి మొదలైనవి

8)వికీ ప్రామాణిక వ్యాసం పరిచయం

9) వాడుకదారుని శాండ్ బాక్స్ లో ప్రయోగాలు చేయడం ద్వారా ఒక వ్యాసం రాయడం

10) ఎడిటింగ్ ప్రాధమిక అంశాలు

శీర్షికలు మరియు ఉపశీర్షికలు, బోల్డ్, ఇటాలిక్, లింక్ లు, రిఫరెన్సింగ్, చర్చించడం (విజువల్ ఎడిటర్)

టేబుల్స్, జాబితా, ఇండెంట్ లు , వచన దస్త్రాలు , ప్రత్యేక క్యారెక్టర్లు మరియు ఫార్ములాలు మొదలైనవి(విజువల్ ఎడిటర్)

శీర్షికలు మరియు ఉపశీర్షికలు, బోల్డ్, పట్టికలు, జాబితాలు, సూచికలు, రివర్ట్, Referencing, చర్చించడం (క్లాసిక్ ఎడిటర్)

టేబుల్, లిస్ట్ లు, ఇండెంట్ లు, టెక్ట్స్ ఫైళ్లు, స్పెషల్ క్యారెక్టర్లు మరియు ఫార్ములాలు మొదలైనవి(క్లాసిక్ ఎడిటర్)

మీడియా - ఇమేజ్ వినియోగం,ఆడియో వినియోగం, ఎంబెడెడ్ వీడియో, వీడియోకు లింక్ చేయడం (విజువల్ ఎడిటర్) సాంకేతిక పరిమితులు

మీడియా - ఇమేజ్ వినియోగం,ఆడియో వినియోగం, ఎంబెడెడ్ వీడియో, వీడియోకు లింక్ చేయడం (క్లాసిక్ ఎడిటర్) టెక్నికల్ పరిమితులు

11) వ్యాసం పేరు మార్చడం మరియు తొలగించటానికి నివేదించటం

12) వికీ కామన్స్ మరియు ఇతర సోదర ప్రాజెక్టులు

13) గూగుల్ డ్రైవ్ మరియు డాక్స్ లను మొబైల్ లో ఇన్ స్టాల్ చేయడం మరియు గూగుల్ డ్రైవ్ మరియు డాక్స్ లను తెలుగులో వ్యాసములు డ్రాఫ్టింగ్ చేయడం కొరకు ఎలా ఉపయోగించాలి.

14)వ్యాస పరిధి ,నాణ్యత మదింపు సరైన మూలలకోసం శోధన

నాణ్యత పరిశోధన - సంబంధిత డాక్యుమెంట్ లు/ఆర్టికల్/పుస్తకాలను కనుగొనడం

వ్యాసమును సుసంపన్నం చేయటం

వ్యాసమును ప్రయోగశాల ( శాండ్ బాక్స్ )నుండి తెవికీ లో ప్రచురించటం

వికీపీడియాలో వ్యాసాల ను సవరించటం/ నవీకరించడం

నా స్వంత వ్యాసాలను అప్ డేట్ చేయడం

ఇతర వ్యాసాలను సంకలనం చేయడం, వ్యాసం చర్చాపేజీ

15)వికీపీడియా లో మంచి వ్యాసం ఎలా ఉండాలి?

16)ఈ ఆన్లైన్ అభ్యాసము యొక్క ఫలితం అంచనా వేయటం

ఈ పాఠ్యాంశాలు తయారు చేయటంలో ఉదాహరణకు : పరిశీలన , నాణ్యత , భాష మీద ఐఐఐటి ఇండిక్ వికీ బృందానికి సహాయపడటానికి ఎవరికైనా ఆసక్తి ఉన్నా కూడా మాకు తెలియచేయగలరు

ఇట్లు

ఇండిక్ వికీ సభ్యులు tewiki @ iiit . ac .in --2020-07-15T11:34:34‎ User:Newwikiwave

విజువల్ ఎడిటర్ వాడుకతో చేరిన నిరర్ధక <nowiki/> తొలగింపు

రెండు సంవత్సరాల క్రింద గుర్తించిన <nowiki/> పరిష్కరించాను. దాదాపు నా బాట్ ఖాతాతో 8000పైబడి పేజీలలో మార్పులు జరిగినందున, ఎక్కడైనా సవరణలలో దోషముంటే తెలపండి. దీని గురించి సాంకేతిక వివరాలుచూడండి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఫౌండేషన్ సాఫ్ట్వేర్ జట్టు వారి ప్రాధాన్యతలో లేనందున, అప్పుడప్పుడు ఈ పని మరల చేయవలసివస్తుంది. సాధారణ ఎడిటర్ వాడేవారికి ఇప్పుడు పేజీలు సవరించేటప్పుడు సౌకర్యంగా వుంటుంది. మీ అభిప్రాయాలు తెలపండి. --అర్జున (చర్చ) 06:15, 16 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సమిష్టికృషికి {{సహాయం కావాలి}} వాడుక ఎక్కువకావాలి

గత ఏడేళ్లుగా {{సహాయం కావాలి}} సంబంధిత మూసల వాడుక విశ్లేషణ పరిశీలిస్తే తెవికీ సమిష్టి కృషి మంచి స్థాయిలో లేదు. ఒక వేళ ఏదైనా వుంటే అది వ్యక్తిగతంగా సభ్యులు కొంత వ్యాసాలు కేటాయించుకొని పనిచేయడం మాత్రమే. అలా కాకుండా, వ్యాసాలనాణ్యత మెరుగవటానికి సమిష్టి కృషి మెరుగవడానికి చర్చలు జరగాలి, ఆ చర్చలు ప్రధానంగా ఆ వ్యాస చర్చాపేజీలో జరగాలి. నేను ఇటీవల గమనించినంతవరకు ఆ వాడుకరి ఒక్కరికే సంబంధించినది కానప్పటికి సభ్యుల వాడుకరి చర్చాపేజీలలో ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి.. చర్చలకు చర్చ పేజీలు దానితో పాటు {{సహాయం కావాలి}} విరివిగా వాడితే చర్చలలో సామరస్యపూర్వక ధోరణి ఎక్కువై, ఇతర చర్చలుకూడా ఫలప్రదంగా సాగుతాయని నా అభిప్రాయం. మీ స్పందనలు తెలపండి. --అర్జున (చర్చ) 07:43, 16 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సంప్రదింపుల లింకులో మార్పు

వికీపీడియా:సంప్రదింపుల కేంద్రం మరింత మెరుగైన పేరుకి వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం ( Reference desk) మార్చబడినిది. సంప్రదింపు పేజీ వికీపీడియా:సంప్రదింపు గా తరలించబడినది. ఇంతకు ముందు ప్రధానపేరుబరిలో వున్న Contact-url తొలగించాను. ఇది నేనే సృష్టించాను కాని అప్పుడు ఎందుకలా చేశానో గుర్తులేదు. వీటి లింకులు ముఖ్యమైన చోట్ల తాజా పరిచాను(గణాంకాలు లాటి వాటిలో తప్పించి). వికీపీడియా:సహాయ కేంద్రం లో మార్పులేదు. చాలాక్రిందట ఈ విషయం గురించి చర్చించినా పెద్ద స్పందనలు లేవు. మరింత మెరుగైన పేరులు ఏవైనా తెలపమని మనవి.-- అర్జున (చర్చ) 06:17, 19 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తుల జనన మరణాల నమోదు ప్రాజెక్టు

వికీపీడియా:వికీప్రాజెక్టు/జనన మరణాల నమోదు అనే ఒక కొత్త ప్రాజెక్టును రూపొందించాను. వ్యక్తుల పేజీల్లో ఉండే జనన అరణ తేదీలను బట్టి చెయ్యాల్సిన వివిధ పనులను ఎయ్యడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కొత్తగా సమాచారాన్ని సేకరించేదేమీ ఉండదు. ఉన్న సమాచారాన్నే వర్గాల రూపంలో పెట్టడం, ఇతర పేజీల్లో ఆ సమాచారాన్ని చేర్చడం ఈ ప్రాజెక్టు పని. పరిశీలించండి. ఈ పనిలో పాలు పంచుకోండి. __చదువరి (చర్చరచనలు) 04:27, 21 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, నా స్పందన చూడండి.--అర్జున (చర్చ) 06:33, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో తెలుగు వెబ్సైట్ మూలాల విశ్లేషణ

ఇటీవల వికీపీడియాలో మూలాల విశ్లేషణ పరిశోధన నా గమనింపుకి వచ్చింది ("Best Sources in Telugu Wikipedia". bestref.net. Retrieved 2020-07-20.). దాని ప్రకారం మూలం తరచుదనం ప్రకారం అత్యధిక 25 మూలాలలో తెలుగు సైట్లు క్రింద ఇచ్చాను.

# Website Score in June 2020 1m changes వెబ్సైటు భాష
8 ourtelugunadu.com 1,877 -2 తెలుగు
13 sakshi.com 1,295 +31 తెలుగు
14 andhrajyothy.com 1,281 +50 తెలుగు
15 eenadu.net 991 +6 తెలుగు

http://ourtelugunadu.com మూలాలు

తెలుగు వెబ్సైట్ల మూలాలు తక్కువగా వున్నాయనిపించింది. తొలిస్థానంలో వున్న http://ourtelugunadu.com చూస్తే User:యర్రా రామారావు గారి పరిచయపత్రంతో కూడిన వెబ్సైట్ కనిపించింది. ఈ మూలాలు కొన్ని యర్రా రామారావు గారే చేర్చినట్లు వికీపీడియా కూర్పులు వెతికితే తెలిసింది. చాలావరకు ప్రభుత్వ రాజపత్ర ఫైళ్లకు స్థావరంగా వాడినట్లున్నది. వికీపీడియా:బయటి_లింకులు#వ్యాపార_ప్రకటనలు,_దృక్పథాల_ఘర్షణ నియమాన్ని ఉల్లఘించిందేమోనన్న అనుమానం వుంది. దీని గురించి స్పష్టత ఇవ్వవలసినదిగా యర్రా రామారావు గారిని కోరుచున్నాను. మరీ ముఖ్యంగా ఈ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.-- అర్జున (చర్చ) 05:11, 21 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.గౌరవిస్తున్నాను.ఇవాలిటి పరిస్థితులలో నేను అదే అభిప్రాయంతో ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే ఆ వెబ్ సైట్ నేను వికీపీడియాలో వచ్చిన తరువాతనే ఏర్పాటు చేయబడింది.అయితే తెలంగాణలో గ్రామాల ప్రాజెక్టు చెసేటప్పుడు నాకు ఇంత పరిజ్ఞానం లేనిమాట వాస్తవం. అప్పుడు ఆ ఉత్తర్వులు వెబ్ సైట్లో పెట్టి అన్నిటికి కాదుగానీ, కొన్ని వ్యాసాలుకు ఇవ్వబడినవి.ఆ వెబ్ సైట్ తగిన విధంగా చేయటానికి కూడా వికీపీడియాలో చేరిన తరువాత ఇందులోనే పూర్తి సమయం వెచ్చించి, దానిని అభివృద్ది చేయలేకపోతున్నాను.అయితే మీరు అనుకున్నట్లు వ్యాపార ప్రకటనలు కోసం ఏర్పాటు చేయబడిందికాదు.దానిలో ఒక్క వ్యాపార ప్రకటన కూడా లేదు.కేవలం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్మించబడింది.అసలు నేనే దానిని రద్దు పరచుకుందామా అనే అభిప్రాయంలో ఉన్నాను.ఆ మూలాలన్నటిని తొలగించినా నాకు అభ్యంతరంలేదు.వికీ నియమాలు ముఖ్యం.అయితే గ్రామ వ్యాసాలుకు, మండల వ్యాసాలుకు మూలాలు కూర్పు కూడా అలోచించండి.వాటిని మీరు యంత్రం/బాటు ద్వారా తొలగించగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:22, 21 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు హుందాగా స్పందించారు కాబట్టి అర్జున గారూ, మీరు నిర్ణయించిన చర్యలు తీసుకోవచ్చను. - రవిచంద్ర (చర్చ) 10:54, 21 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రాజపత్రాల ఫైళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియక రామారావు గారు కేవలం వికీపీడియాలో వాటిని కోట్ చేయడానికే ఆ స్వంత వెబ్‌సైట్‌లో వాణిజ్యపరమైన ఉద్దేశాలు లేకుండా హోస్ట్ చేస్తున్నట్టు వారి వివరణ వల్ల తెలుస్తోంది. 1. ఈ రాజపత్రాలను ఆర్కైవ్ వంటి వెబ్‌సైట్‌లోకి దశలవారీగా ఎక్కించి ఈ లింకులను ఆ లింకులతో మార్చవచ్చు. దీనివల్ల శాశ్వతంగా నిలబడే అవకాశం ఉంటుంది. 2. ఆ ఓపిక మనకు లేకుంటే ఇది వ్యాపార ప్రకటన గానో, స్పామ్‌గానో రాదు కనుక భవిష్యత్తులో ఎవరైనా పై మార్పు చేయడానికి వీలుగా నిర్ణయిస్తూ ప్రస్తుతానికి యధాతథ స్థితి కొనసాగించవచ్చు. మొత్తానికి, స్వంత ఆసక్తి తీసుకుని ఇన్ని పత్రాలను తన లాభాపేక్ష రహిత వెబ్‌సైట్‌లో పెట్టి మరీ వికీపీడియాలో మూలాలను, సమాచారాన్ని అభివృద్ధి చేసినందుకు వాడుకరి:యర్రా రామారావు గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:27, 21 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర, పవన్ సంతోష్ గారు స్పందించినందులకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 06:06, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు స్పష్టత ఇచ్చినందులకు ధన్యవాదాలు.ఈమూలాలు ఏమి చేయాలన్నది, ప్రాజెక్టు చర్చలో చర్చిద్దాము. అయితే ఇలా జరగటం గురించి, ఇకముందు ఇలా జరగకుండా చేయడం గురించి మనం నేర్చుకోవాల్సినది చర్చించాలి. తెవికీ నిర్వహణ సమర్ధవంతంగా చేయలేకపోయామని నాకు అనిపిస్తుంది.-- అర్జున (చర్చ) 05:39, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వెబ్సైట్ మూలాల స్థితి గురించి అభిప్రాయాలు

పైన తెలిపినట్లు, ఈ మూలాల విశ్లేషణ లో ప్రముఖ దినపత్రికల మూలాలు 1000 కి అటుఇటుగా వుండడం చూడవచ్చు. 70000వ్యాసాలు గల తెవికీకి ఇవి నాకు చాలా తక్కువగా అనిపించింది. మన సభ్యులలో , ప్రస్తుత స్థితిగతులు, రాజకీయ వ్యవహారాలపై ఆసక్తిగల వారు చాలా తక్కువ. ఇంతకు ముందు కొంత మంది సభ్యులు వార్తల్లో విషయాల గురించి తెవికీలో వ్యాసాలను పెంచడానికి ప్రతిపాదనలు చేసినట్లు గుర్తు. మీరు మీ అనుభవంలో తెలిసినదాన్ని బట్టి మీ అభిప్రాయాలు పంచుకోండి. --అర్జున (చర్చ) 05:43, 22 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ ప్రాజెక్టు చర్చలో తెలిపితే బాగుంటుందని నాఅభిప్రాయం.--యర్రా రామారావు (చర్చ) 06:08, 23 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, మీ సలహాకు ధన్యవాదాలు. అది ప్రాజెక్టు కాదు, ఒక వ్యాసం, ఇంతకు ముందు మూలాలు చేర్చటం గురించి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ప్రాజెక్టు చేశాం అక్కడ మెరుగు. కావున చర్చ వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ లో కొనసాగిద్దాం.-- అర్జున (చర్చ) 06:29, 23 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

The Universal Code of Conduct (UCoC): we want to hear from you.

కొత్త వాడుకరుల సొంతపేజీల సృష్టికి సహాయం

ప్రతి రోజు కొత్త వాడుకరి ఖాతా దారులుగా చేరుతూ ఉంటారు, కాని వారి సొంత పేజీలు సృష్టించుకోవడం చేయరు ఎందుకు కొత్త వారికి వారి పేజీ ని ఎలా సృష్టించాలి అనే విషయం తెలియదు, కావున అందుకు వారిని ప్రోత్సహించడానికి తెలుగు పేరుతో తెలుగు భాష మీద అభిమానంతో తెలుగు పేరుతో చేరిన వికీపీడియనులు ఎంతో కొంత పరిజ్ఞానం, భాష మీద ప్రేమ ఉన్నవారు, అలాంటి వారిని భాను రేఖ ఇలా వారి పేజీని మనమే సృష్టించి, కొంత ప్రారంభించి ఇవ్వడం, వికీపీడియా నియమాలకు అనుకూలమా, వ్యతిరేకమా, వివరించగలరు. నియమాలు తెలియక అడుగుచున్నాను. అందులో కొందరు వ్యాసాలు రాయగలిగేంత జ్ఞానం ఉండి , ప్రవేశం తెలవక దూరమవుతున్నారని నా అభిప్రాయం. ప్రభాకర్ గౌడ్ నోముల 12:59, 26 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, సాధారణంగా ఎవరి వాడుకరి పేజిలో వాళ్ళే దిద్దుబాట్లు చేసుకుంటారు. వేరేవాళ్ల వాడుకరిపేజీల్లో కెళ్ళి దిద్దుబాటు చెయ్యడం సంప్రదాయం కాదు, అమర్యాద అని కూడా వికీలో భావిస్తారు. అయితే ఆ వాడుకరి అనుమతితో మరొకరు ఆ పని చెయ్యవచ్చు. పేజీ ఎలా తయారుచెయ్యాలో తెలీనివారికి, అది నేర్పే పనిలో భాగంగా ఆ వాడుకరి అనుమతితో చెయ్యవచ్చని నా అభిప్రాయం. (అయితే, పేజీ సృష్టించే పనిని నేర్పడానికి వాడుకరి పేజీయే సృష్టించనక్కర్లేదు, ప్రయోగశాల పేజీని సృష్టించవచ్చు.) __చదువరి (చర్చరచనలు) 13:15, 26 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, కొందరు కొత్త వాడుకరుల వారి పేజీ తయారు చేసుకుందామనే తెవికీలో చేరతారు. కొంత కృషి చేసినతరువాత వారికి స్వంత పేజీ చేసుకోవడంలో సహాయం అభ్యర్ధిస్తే అప్పుడు సహాయం చేయడం మంచిది.--అర్జున (చర్చ) 05:57, 27 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరి వాడుకరుల పేజీలను వారినే తయారుచేసుకోమనడమే సబబనిపిస్తున్నది. కొన్ని విషయాలలో సీనియర్ల సహాయం కోరితే మనం అందించడం బాగుంటుంది. కాని వాడుకర్ల పేజీలను సృష్టించడానికి లేదా వాటిలో సమాచారం చేర్చడానికి ఇతరులకు అనుమతించడం మంచి సంప్రదాయం కాదేమో అని నా అభిప్రాయం.--Rajasekhar1961 (చర్చ) 06:40, 27 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, అర్జున గురువుగారు, చేరే వారి సంఖ్య లక్షల్లో, ఖాతాదారుల సంఖ్య 1000 లలోనూ, మార్పులు, చేర్పులు చేసే వారి సంఖ్య వందలో, వ్యాసాలు రాసే వారి సంఖ్య రెండు, మూడు పదుల్లో ఉన్నారు. మీరన్నట్లు మొదట వారు ప్రారంభించాక వారి పేజీలు మనం అభివృద్ధి చేయవచ్చు, అయితే చేరిన వారు ఈ మధ్య ఎక్కువగా చరవాణి లతో చేరుతున్నారు. వారు చేసే మార్పు ముందు ఖాతా సృష్టించు అని, లేకపోతే మీ పేరుకు బదులు ఇంటర్నెట్ ip సంఖ్య మాత్రమే నమోదు అవుతుంది, లాగిన్ కాలేదు ఇంటర్నెట్ తీసుకోమని ఖాతా హెచ్చరించడం వల్ల కొంతమంది వినియోగదారులు ఖాతా సృష్టించుకొని వికీపీడియాలోకి వస్తున్నారు అనేది వాస్తవం, వారికి వాడుకరి పేజీ, చర్చాపేజీ, ప్రయోగశాల ఉంటాయని మొబైల్ వాడుకదారులకు తెలిసే అవకాశం చాలా తక్కువ, కంప్యూటర్ వాడకం దారులకు తెలిసే అవకాశం మెండుగా ఉన్నాయి, మొబైల్ ద్వారా చేరితే చురుకైన వాడుకరులు ఉంటే వారు ఎక్కడో ఒకచోట కంప్యూటర్ తో వికీపీడియా లో వాడుకరులు కాగలరు, దీనికి ఉదాహరణ ఏం. మహేష్ రాజు ఇతను మొబైల్ ద్వారా వ్యాసాలు రాస్తున్నారు, ఇలాంటి వారు కొంత మందిని వదిలేసుకుంటున్నాము మొబైల్, కంప్యూటర్ 2 ఉండే వాళ్లు కూడా ఉంటారు కదా వాడుకరులు దీనికి ఏదైనా తప్పకుండా తరుణోపాయం ఆలోచించాలి నే కోరుతున్నా... ప్రభాకర్ గౌడ్ నోముల 06:59, 27 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, మీ ఆలోచన చర్చించదగ్గదే. గత పదేళ్లు పైగా నేరుగా వికీపీడియా శిక్షణ శిబిరాలు నడిపితేనే ఎక్కువ మంది చేరినా కొనసాగని సభ్యుల అనుభవంతో కేవలం పేజీ వీక్షణల అనుభవంతో వాడుకరులను పెంచడం దానికన్నా సులభమని నేను అనుకోను. ప్రవేశించిన సభ్యులకు స్వాగత సందేశం ద్వారా వికీపీడియా గురించి తెలియచేస్తున్నాము. మొబైల్ మెనూలో వికీపీడియా:సముదాయ పందిరి కనబడుతుంది కాబట్టి, దానిలో కూడా స్వాగతం లింకు చేర్చాను. వారి చర్చాపేజీలో స్వాగతం సందేశం చేర్చనంతవరకు, దీని ద్వారా వికీపీడియా గురించి వారి తెలుసుకొనే అవకాశముంది. ప్రవేశించని వారికి స్వాగతం సందేశం మొబైల్ లో చేర్చాను. దీనివలన ప్రవేశించిన వాడుకరులు మొదటిపేజీ చూసినపుడు స్వాగతం, వాడుకరి పేరు, తరువాత వికిపీడియాకు స్వాగతం అని రెండు సార్లు స్వాగతం కనబడుతుంది. ప్రవేశించిన వాడుకరులకు రెండో స్వాగతం వరుస కనబడకుండా చేయటానికి ఇతర సాంకేతిక సభ్యులు ఆలోచించవలసినది. --అర్జున (చర్చ) 04:39, 28 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు, వికీపీడియాలో ఖాతా తీసుకున్న ప్రతి వారికి వారి ఖాతాపేజీ తయారు చేయాలి అని అనడం కాదండి, తెలుగు పేరుతో ఖాతా తీసుకున్న వారికి మాత్రమే వారిని ఎలాగైనా చురుకైన వాడుకరి, క్రియాశీలక వాడుకరి గా మార్చాలని నా ప్రధాన ఉద్దేశం, ఇంగ్లీష్ సంప్రదాయం ప్రకారం ముఖ్యంగా ఆంగ్ల వికీపీడియన్లు ఖాతా తీసుకొని వాడుకరి పేజీలో వారు ఏదైనా మార్పులు చేర్పులు చేసినప్పుడు మాత్రమే వారికి స్వాగతం పలుకుతారు. మన వారిలాగా ఇతర దేశాల భాష వారికి కూడా స్వాగతం పలికే ఉద్దేశం, మార్పుల, చేర్పుల సంఖ్య పెంచుకునే ఉద్దేశం అది కాదండీ, తెలుగు పేరుతో వికీపీడియాలో ప్రవేశించే వారి కోసమే నేను మాట్లాడుతున్నాను, మీరు గమనించగలరు వారికి ఏం చేయాలి క్రియాశీలక చేయాలి రోజుకు ఒకరు వారానికి ఐదుగురు కూడా తెలుగు పేరుతో ఖాతా చేరడం లేదు, 100 మంది చేరికలో ఒక వాడుకరి వికీపీడియాకు, మనకు ఉపయోగకారిగా మారిన చాలు కదండి...
అర్జున తొలిగురువు గారు, రానున్నది మొత్తం మొబైల్ వాడకాలు ఏ సాఫ్ట్వేర్ చేసినా అది దృష్టిలో పెట్టుకోవాలి, మరో ముఖ్య విషయం ఏమిటంటే తెలుగు వికీపీడియన్లు కొత్తగా చేరే వారు ఈ తరం వారు మాత్రమే, వచ్చే తరానికి ఇంగ్లీష్ మీడియం ప్రభావం కాబట్టి ఇంగ్లీష్ ప్రాధాన్యత ముందు తెలుగు, ప్రాంతీయ భాషలు నిలబడడం కష్టం, రాసే వ్యాసాలు కూడా మరి కొద్ది రోజుల తరువాత..., చదివేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. తెలుగు పేరుతో ఖాతా తీసుకున్న వారికి వారి మొబైల్ కు సూచనలు, హెచ్చరికలు పోయేలాగా పదేపదే, మళ్లీమళ్లీ వెళ్లేలా ఖాతా వచ్చినట్టుగా వారి పేరు మీద వారికి తెలియాలి, సాంకేతిక సభ్యులు ఆలోచించవలసినది. ప్రభాకర్ గౌడ్ నోముల 06:49, 28 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రభాకర్ గౌడ్ నోముల గారు, ఖాతా పేరుభాష తప్పించి మీ సూచనలు బాగున్నాయి. ఖాతాపేరు ఆంగ్లంలో వున్నా వాడేటప్పుడు తెలుగులో కనబడే సౌకర్యమున్నప్పుడు,సాధారణంగా వాడని కంప్యూటర్ వ్యవస్థలలో తెలుగులో టైపు చేయటానికి అడ్డంకులు ఎదురయ్యే అవకాశమున్నందున ఖాతాపేరుగల భాషకి అంత ప్రాముఖ్యమివ్వనవసరంలేదని నా అభిప్రాయం.-- అర్జున (చర్చ) 10:19, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్ర కాంత రావు నిర్వాహక హోదా విరమణ

చంద్ర కాంత రావు గారు నిన్న నిర్వాహక హోదానుండి విరమించారు (చూడండి వికీపీడియా:నిర్వాహకుల_జాబితా). 12 ఏళ్లకు పైగా నిర్వాహకహోదాలో తెవికీ కి సేవచేశారు. వారి సేవలకు నా ధన్యవాదాలు. నా వికీ ప్రయాణంలో ఇప్పటివరకు నా పనిపై ప్రముఖంగా ముద్ర వేసిన బహు కొద్ది మందిలో చంద్రకాంత రావు గారు ఒకరు. తెవికీ లో చర్చలలో చురుకుగా పాల్గొని నిర్మొహమాటంగా ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసేవారు. నేను తలపెట్టే పనులకు అవి కొంత అడ్డంకిగా మారి లక్ష్యం చేరటానికి కొంత ఎక్కువకాలంతీసుకున్నా, చేపట్టిన పనులు నాణ్యతగా చేయటానికి అవి సహకరించాయి. వికీ నియమాల గురించి తెలుసుకోవటంలో ఆయన చర్యలు సహాయపడేవి. చాలా కొద్దిమంది చురుకైన వికీపీడియన్లు గల తెవికీలో ఏకరూప సమూహఆలోచన (Groupthink) గా మారకుండా వుండటంలో వారి పాత్ర ప్రముఖమైనది. ఇకముందుకూడా నిర్వాహకహోదానుండి తప్పుకున్నా వారు క్రియాశీలంగా తెవికీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 10:12, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్ర కాంత రావు గారు నిన్న నిర్వాహక హోదానుండి విరమించడం నాకు చాలా బాధనిపించింది. అతను తెవికీలో విశేష సేవలందించారు. నేను తెవికీలో చేరినపుడు తెలియని విషయాలలో, విధానాలలో అవగాహన కల్పించారు. ఒక విధంగా వికీ గురువు లాంటి వారు. ఈ రోజు చురుకుగా పనిచేస్తున్నానంటే అతని ప్రేరణ ఎంతో ఉందని చెప్పవచ్చు. మొదటి పేజీలో శీర్షికల నిర్వహణ నుండి, మూలాలు, లింకులు, కాపీహక్కుల వంటి విషయాలలో నాకు చాలా సందర్భాలలో మార్గనిర్దేశం చేసారు. ఏదో ఒక రోజు వికీలో క్రియాశీలక నిర్వాహకులుగా వస్తారని, వికీని సుసంపన్నం చేస్తారని అనుకున్నాను. స్వచ్ఛందంగా విరమించుకోవడం బాధ కలిగించింది. నిర్వాహకహోదానుండి తప్పుకున్నా సభ్యునిగా వారు క్రియాశీలంగా తెవికీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాను. K.Venkataramana(talk) 15:56, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో చంద్రకాంతరావు గారికి ప్రత్యేక శైలి, నాది వెంకటరమణ గారి అభిప్రాయంతో సరిపోతుంది, వికీపీడియాలో నియమాలు అసలుకే తెలియక నిర్వాహకులను చాలా ఇబ్బందులకు గురి చేసే వాడిని అలాంటి సమయంలో నియమాలు ఇలా ఉంటాయని నన్ను ప్రోత్సహించిన పవన సంతోష్, అర్జున, వైజాసత్య,పాలగిరి, చంద్ర కాంత రావు గారు, వెంకటరమణ గార్లు మార్గనిర్దేశం చేశారు, అందులో చంద్ర కాంత రావు గారు నా గాడ్ ఫాదర్ వికీపీడియాలో తప్పు చేయని వాడుకరి ఎవరూ లేరు ప్రారంభంలో అందరూ చేసేదే అని నా చర్చా పేజీలో ప్రోత్సహించి ఒక్క వాడుకరిల చేసింది, ఆ నాలుగు పదాలు నన్ను ముందుకు నడిపించాయి, వారి మంచి మనసు చంద్ర కాంత రావు గారి బ్లాగులో నా గురించి ఒక వ్యాసం కూడా రాశారు, వికీపీడియాలో నిర్వాహకులుగా 100% న్యాయం చేశారు, వాడుకరిగా మీ నుండి ఇంకా... చాలా వ్యాసాలు నేను ఆశిస్తున్నాను... మంచి వ్యాసాలు రాయగలరు, నేను మీ అభిమాని... నమస్తే... ప్రభాకర్ గౌడ్ నోముల 17:12, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నాపై చూపిన అభిమానానికి అర్జున, వెంకటరమణ, ప్రభాకర్ గౌడ్ నోముల గార్లకు కృతజ్ఞతలు. అలాగే ప్రారంభంలో నా నిర్వాహక హోదాను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రోత్సహించిన వైజాసత్య, కాసుబాబు, దేవా గార్లకు కూడా వందనాలు. గత ఏడాది చేసిన ఒక పాలసీకి నిరసనగా అప్పుడే నేను నిర్వాహకుల నోటీసు బోర్డులో రాజీనామా సమర్పించాను. మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ అధికారం అధికారులకు లేదని మెటాలో అభ్యర్థన చేయమని ఒక సభ్యుడు సెలవియ్యగా, ఎలాగూ ఆ పాలసీకి అనుగుణంగా దిద్దుబాట్లు చేయననీ, తొలగింపు తప్పనిసరి అని వేచిచూశాను. కాని నెలలు గడిచినా, సంవత్సరం పైగా గడిచినా ఆ పాలసీ అటకెక్కింది కాని పట్టించుకొనే వారే లేరు. అమలు చేయనప్పుడు సభ్యుల సమయం వెచ్చించి పాలసీలెందుకు చేస్తున్నారో అర్థం కాదు కాని చివరికి విసిగిపోయి మాట ప్రకారం నేనే మెటాలో అభ్యర్థన చేసి నిర్వాహక హోదాను ఉపసంహరించుకున్నాను. నిర్వాహక హోదాను ఉపసంహరించుకున్నా నేను తెవికీ నుంచి వెళ్ళిపోయే ప్రశక్తి ఏ మాత్రం లేదు కాబట్టి సభ్యులు బాధపడే/సంతోషపడే అవసరం లేదని తెలియజేస్తున్నాను. ఇదివరకటి కంటే మరింత చురుకుగా తెవికీలో సమీక్ష పనులు నిర్వహించి లోటుపాట్లను, నిర్వాహక తప్పిదాలను ఖచ్చితంగా బహిర్గతం చేసి తెవికీ అభివృద్ధికి తోడ్పడగలను. ప్రస్తుత తెవికీ ఘోరదశలో ఉంది. ఊబిలో దిగజారిన తెవికీని పట్టాలపైకెక్కించడానికి తెవికీ ప్రక్షాళన జరగడం కూడా తప్పనిసరి. తెవికీని చక్కదిద్దడానికి అర్జునరావు మరియు వెంకటరమణ గార్లు ముందుండి నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:25, 29 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారు తెవికీకి చేసిన సేవలు నిస్సందేహంగా ప్రశంసనీయమైనవే. కానీ తెవికీ ఘోరదశలో ఉందనడం నేను అంగీకరించను. ఇది కేవలం ఆయన పేర్కొన్న సభ్యులు తప్ప మిగతా వారిని అవమానించడమే. ఆయనకు ఇది కొత్తకాదు. మొదటి నుంచి సూటిగా మాట్లాడటమనే పేరుతో సభ్యులను నొప్పించడమే అలవాటు. చర్చలు సామరస్య పూర్వక ధోరణిలో జరగడం లేదు. అదీ కాక ఆయన ఎప్పుడూ తప్పులు వేలెత్తి చూపడమే తప్ప జరిగిన మంచిపనులు గురించి ఏదీ ప్రస్తావించింది లేదు. దీని వల్ల తెవికీకి మేలు జరగక పోగా కీడు జరుగుతుంది. - రవిచంద్ర (చర్చ) 05:57, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్రగారూ, నా సేవలు గుర్తించినందుకు మీకూ నా కృతజ్ఞతలు. తెవికీ ఘోరదశలో ఉందని అన్నందుకు మీరు బాధపడే అవసరం లేదు. అది మీకుగాని మరికొందరు నిర్వాహకులకు గాని ఈ ఘోరదశకు సంబంధం లేదు. నాకు సందేశమిచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి తప్ప పైన నేనెవరి పేర్లు పేర్కోలేదనే విషయం గ్రహించండి. ఘోరదశ ఎందుకనేది దానికి కారకులెవరన్నదీ నా తదుపరి చర్చలే చెబుతాయి. వ్యక్తులను కాకుండా వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని బాగా ఆలోచించి తెవికీ అభివృద్ధి దృష్ట్యా మీ అభిప్రాయాలు ప్రకటించండి. మీకు మంచి తెవికీ భవిష్యత్తు ఉంటుంది. మిమ్ముల్ని ప్రశంసించే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:06, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు భాషాశాస్త్రవేత్తల వేదిక వారి అంతర్జాల శిక్షణా శిబిర ప్రతిపాదన

నమస్కారం,

తెలుగు భాషాశాస్త్రజ్ఞుల వేదిక వారు కొరోనా లాక్‌డౌన్ సమయంలో అంతర్జాలం-జూమ్ వేదికగా పలు శిక్షణా శిబిరాలు, చర్చా కార్యక్రమాలు చేపట్టారు, అందులో భాగంగా వికీ శిక్షణా శిబిరం నిర్వహించమని నన్ను సంప్రదించారు. నేను వారికి ప్రతిపాదించాలనుకుంటున్న ప్రణాళిక :

  1. మొదటి మూడు రోజులు తెలుగు వికీపీడియా ప్రవేశ స్థాయి శిక్షణ
  2. తరువాతి రెండు రోజులూ వికీసోర్స్ పై అవగాహన
  3. ఆరవ రోజు నకలు హక్కులపై, క్రియేటివ్ కామన్స్, మొదలగు లైసెన్సులపై అవగాహన
  4. ఏడవ రోజు వికీకామన్స్ పై శిక్షణ, ఇప్పటికే చేరిన వివిధ ఫోటోలు, వీడియోల పేర్లు, వివరణలు తెలుగులో చేర్చే విషయమై చర్చ.
  5. ఎనిమిది-తొమ్మిది-పదవ రోజుల్లో వికీడేటా, లెగ్జీంలకు సంబంధించిన అవగాహన, కార్యశాల.

ఇంకా తేదీలు ఖరారు కాలేదు కానీ, ఆగస్టు-సెప్టెంబర్ నెలలలో ఈ శిక్షణ జరగవచ్చు. సభ్యులు సూచనలు అందించి, కుదిరితే శిక్షణా శిబిరంలో శిక్షకులుగా పాల్గొనవలసినదిగా మనవి. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:07, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి పని రహ్మానుద్దీన్ గారు. చాలా పెద్ద కార్యక్రమం ఇది. తక్కువ సమయంలో చాలా సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మనసారా కోరుకుంటున్నాను. __చదువరి (చర్చరచనలు) 08:18, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం రహ్మానుద్దీన్ గారు. నేను కూడా సహకారం అందిస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 09:37, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్గారు ఈరోజు మంచి శుభవార్త గత ఐదు సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నా ఇలాంటి శిక్షణ శిబిరం కోసం నేను ఒక్కటి కూడా పాల్గొన లేదు, అందుకే నాకు మూలాలు ఇవ్వడం రాదు, అందుకే నా వ్యాసాలు అంతగా బాగుండవు. నాకే అంతగా నచ్చవు అందుకే వ్యాసాలు సరిగా రాయడం, చేయడం లేదు, శిక్షణా శిబిరాలు అనంతరం వ్యాసాలు రాయడం ప్రారంభిస్తా, నాకు అవకాశం ఇవ్వండి. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రభాకర్ గౌడ్ నోముల 09:54, 30 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రహ్మానుద్దీన్,చదువరి,ప్రణయ్‌రాజ్ వంగరి గారితో మొదటి మూడు రోజులు తెలుగు వికీపీడియా ప్రవేశ స్థాయి శిక్షణ మీద మాట్లాడాను నేను కూడా ఈ శిక్షణా శిబిరంలో శిక్షకునిగా సహకారం అందిస్తాను, తెలుగు భాషాశాస్త్రజ్ఞుల వేదిక వారికి ధన్యవాదములు Kasyap (చర్చ) 10:49, 6 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

లింకులు లభించడం లేదు

వర్గం:కాలం మొలక వ్యాసాలు లో మరో మూడు మిగిలి ఉన్నాయి వాటికి లింకులు లభించడంలేదు, వాటికి లింకులు ఇతర భాషల్లో లభించడంలేదు. కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృతం అన్ని భాషల్లోనూ వెతికిన తెలుగు చాలా నయం అన్ని భాషల్లోనూ, చాలా వ్యాసాలు మొలకలు గానే ఉన్నాయి. ఈ వ్యాసం గురించి కాదు, చాలా వ్యాసాలు వెతికాను తెలుగులో ఉన్నంత సమాచారం, ఇతర భాషల్లో ఉండదు, తెలుగులో చాలా సమాచారం ఉంటుంది. వర్గం:కాలం మొలక వ్యాసాలు లో మూడు వ్యాసాలు మిగిలి ఉండగా మరెవరైనా వాటిని విస్తరించాలని మనవి. ఇందులో కాలములు వ్యాసమును విస్తరించగా ఋతువులు దారిలో చర్చ:కాలములు వెళ్ళింది... దాన్ని సరి చేయగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 16:13, 4 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ విభాగం వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 చర్చా పేజీలో విభాగంగా చేర్చాను.--యర్రా రామారావు (చర్చ) 17:30, 4 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Technical Wishes: FileExporter and FileImporter become default features on all Wikis

Max Klemm (WMDE) 09:14, 6 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Content translation tool వాడటంలో సమస్య

తెవికీలో Content translation tool లో యాంత్రిక అనువాదం శాతం 70 శాతం కన్నా తక్కువ వుండాలన్న పరిమితి ( పాత చర్చ)ఈ ఉపకరణాన్ని నిరుపయోగంగా మార్చింది. నేనొక వ్యాసంలో కొన్ని భాగాలు ఆంగ్లం నుండి అనువాదం చేసి తెలుగు వ్యాసంలో చేర్చాలనుకున్నాను. ఈ పరిమితి లేకపోతే నా అనువాదాన్ని వాడుకరి పేజీలో ముద్రించుకొని అవసరమైన భాగాలను అసలు వ్యాసంలో చేర్చే వీలుండేది. ఇప్పడు మొత్త వ్యాసం అనువాదం చేసి యాంత్రిక అనువాదం 70 కన్నా తగ్గితే కాని వీలవుటలేదు. Translation debugger ఉపకరణం అనువాదం చిత్తుస్థితి వుంటే వికీటెక్స్ట్ రూపం చూపించడంలేదు. కావున సముదాయం ఈ పరిమితి ని సమీక్షించాలి. నా దృష్టిలో వాడుకరి పేరుబరి ముద్రణకు పరిమితి ఎక్కువగా వుండవచ్చు (90%) లేక వాడుకరి హక్కులను బట్టి అనుమతి వుంటే బాగుంటుంది. దీనిగురించి కృషి చేసిన User:Chaduvari గారు, ఇతర సభ్యులు అనుభవాలు, స్పందనలు తెలపండి. --అర్జున (చర్చ) 12:35, 8 ఆగస్టు 2020 (UTC) [ప్రత్యుత్తరం]

అర్జున గారూ, అనువాద పరికరాన్ని మెరుగుపరచే ఏ చర్యకైనా నేను సై యే. నావి కొన్ని సందేహాలు/ప్రశ్నలు/పరిశీలనలు.. మీరు ఏ పేరుబరిలోకి ప్రచురించదలచుకున్నా అవసరమైన మార్పు చేర్పులు అనువాద పరికరంలోనే చెయ్యాలనేది అభిలషణీయమనే సంగతి ఒక సాఫ్టువేరు నిపుణుడైన మీకు, సాఫ్టువేరు నిరక్షరాస్యుణ్ణైన నేను చెప్పాల్సిన పనిలేదు. అనువాద పరికరం గురించి గతంలో రచ్చబండలో జరిగిన చర్చను చూసే ఉంటారు. ప్రస్తుతమున్న నిబంధనలూ పరిమితులూ ఎందుకు విధించారో మీరు గ్రహించే ఉంటారు. ఇప్పుడు మీరు ఆ నిబంధనలను ఎందుకు సడలించదలచుకున్నారో నాకు అర్థం కాలేదు. వివరంగా, వీలైతే ఒక్కొక్కటే బులెట్ పాయింట్లతో రాయగలరు. ఒకవేళ సడలిస్తే ఆ నిబంధనలను విధించడానికి దారితీసిన పరిస్థితులు తిరిగి తెలెత్తకుండా ఎలా నివారిస్తారో, తలెత్తితే ఎల ఎదుర్కొంటారో కూడా రాయండి. __చదువరి (చర్చరచనలు) 06:27, 10 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ ఉపకరణం గురించి మరింతగా తెలుసుకొని, గణాంకాలు విశ్లేషించి, ఈ ఉపకరణం వాడిన వారిలో కొంత మంది మాట్లాడి, ప్రస్తుత విధానం సమీక్షకు, కొత్త విధానానికి ప్రతిపాదనలుకు చర్చలు ప్రారంభించాను. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు పేజీకూడా కొంతవరకు తయారు చేశాను. మీరు, ఇతర సహ సభ్యులు ఆ చర్చలో పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. --అర్జున (చర్చ) 14:31, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వేమూరి నిఘంటు పేజీలు తరలించి, తొలగించటం పూర్తి

వేమూరి నిఘంటు పేజీలు వికీపీడియాలో వుండదగినవి కావున, చర్చ ప్రకారం వికీబుక్స్ కు తరలించి, వికీపీడియా లో తొలగించాను. ఇప్పటినుండి వికీపీడియా పేజీ వీక్షణల గణాంకాలలో పేజీ ర్యాంకులు (ఉదాహరణకు క్రిందటి రోజు వీక్షణలు) సరిగా కనబడతాయి.. --అర్జున (చర్చ) 09:51, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడిన అనువాదాల కృషికి గుర్తింపు

తెలుగు అనువాదాల కృషి గుర్తింపు పతకం
తెలుగు అనువాదాల కృషి గుర్తింపు పతకం

జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 21 వికీపీడియా సభ్యులు Meena gayathri.s, Chaduvari, Pavan santhosh.s, K.Venkataramana, Subramanyam parinam, IM3847, Viggu, Apbook, యర్రా రామారావు, రహ్మానుద్దీన్, Ajaybanbi, దేవుడు, PhaniYesh99, Arjunaraoc, Rajani Gummalla Translation, Ballankipavan, Bhashyam Tharun Kumar, Ch Maheswara Raju, Krupa Vara Prasad, Somepalli Manikumar, Sumanth699 గార్లకు అభివందనాలు. వారి కృషికి వికీ గుర్తింపు పతకం వారి చర్చాపేజీలద్వారా అందచేశాను. --అర్జున (చర్చ) 10:34, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఉపకరణం వాడి అనువాదాల కృషికి గుర్తింపు పతకం పొందిన అందరికీ అభివందనాలు, ఇందులో మరో ముగ్గురికి ఈ నెల చివరన మరో పతకం రానుంది, వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 పతకం. ప్రభాకర్ గౌడ్ నోముల 14:08, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు చెప్పిన ఐదేళ్ళ కాలంలో పై 80% అనువాదాలు చేసిన వాడుకరుల అనువాద గణాంకాలు కింది పట్టికలో ఉన్నాయి. ఈ ఐదేళ్ళ కాలంలో అనువాద పరికరాన్ని ఎలా వాడామో ఈ గణాంకాలు చూడకపోతే తెలియదు. అయితే ఈ గణాంకాలు పరికరం నుండి నేరుగా "ప్రచురించిన" వాటిని మాత్రమే చూపిస్తాయి. అక్కడ కాపీ చేసి వికీ పేజీలో పేస్టు చేసిన వాటిని చూపించవు (ఈ సరికే వికీలో ఉన్న పేజీలను విస్తరించాలంటే, నేరుగా ప్రచురించ కూడదు.). అందుచేత ఆ సంఖ్యలు కింది పట్టికలో చూపిన సంఖ్యలకు కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుందని నా అనుకోలు. __చదువరి (చర్చరచనలు) 16:15, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరిపేరు వాడుకరి చేసిన

అనువాదాల సంఖ్య

మొత్తం అనువాదాల్లో ఈ

వాడుకరి అనువాదాల శాతం

Meena gayathri.s 273 22.05%
Chaduvari 208 16.80%
Pavan santhosh.s 103 8.32%
K.Venkataramana 71 5.74%
Subramanyam parinam 59 4.77%
IM3847 51 4.12%
Viggu 47 3.80%
Apbook 22 1.78%
యర్రా రామారావు 22 1.78%
రహ్మానుద్దీన్ 17 1.37%
Ajaybanbi 15 1.21%
దేవుడు 15 1.21%
PhaniYesh99 12 0.97%
Arjunaraoc 11 0.89%
Rajani Gummalla Translation 11 0.89%
Ballankipavan 10 0.81%
Bhashyam Tharun Kumar 10 0.81%
Ch Maheswara Raju 8 0.65%
Krupa Vara Prasad 8 0.65%
Somepalli Manikumar 8 0.65%
Sumanth699 8 0.65%
Praveen Illa 7 0.57%
అనువాద పరికరం వాడి వికీ నాణ్యతను పెంచిన సభ్యులందరికీ అభినందనలు. చదువరి గారు చెప్పినట్లు ఇంకా చాలామంది వ్యాసం ప్రచురించకపోయినా ఉపకరణాన్ని వాడి ఉండవచ్చు. ఉదాహరణకు నేనే :-) నేను ఎప్పుడూ తెలుగు వికీలో లేని కొత్త వ్యాసాన్ని పూర్తిగా ఈ ఉపకరణం వాడి అనువాదం చేసి పూర్తి వ్యాసాన్ని ప్రచురించలేదు. ఇది వరకే ఉన్న చిన్న వ్యాసాలను విస్తరించడానికి ఉపకరణాన్ని వాడి కొన్ని విభాగాలు అనువదించి కాపీ పేస్టు చేశాను. అందుకనే నాకు పతకం రాలేదు. :-) - రవిచంద్ర (చర్చ) 17:09, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందించిన వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల,చదువరి,రవిచంద్ర గార్లకు ధన్యవాదాలు. మొదటిగా ఒక సవరణ. 80 శాతం అనువాదాలకు కృషి చేసినవారు 23 మంది. వారిలో ఇంతకముందు తెలిపిన వారే కాక, Praveen Illa, Vin09 చేరుతారు. వారికి కూడా అభివందనలు. వారికి కూడా పతకం అందజేయడం జరిగింది. మొదటి జాబితాలో వారి పేర్లు చేర్చనందుకు క్షమాపణలు. మామూలుగా అత్యధిక 20 లేక 100 లాగా గణాంకాలు విశ్లేషించడానికి బదులు ఈసారి పర్సైంటైల్ ఆధారంగా గణాంకాలు విశ్లేషించడం అప్పుడు చివరి వారిలోసాంకేతికంగా ఇద్దరు ఒకే సంఖ్య అనువాద వ్యాసాలు చేయటంతో సందేహం వలన జరిగిన పొరపాటు.
ఇక గణాంకాల గురించి కొంత స్పష్టత. ప్రధాన పేరుబరిలో కొత్తగా సృష్టించి, తొలగింపుకు గురికాని వ్యాసాలు మాత్రమే పరిగణించడం జరిగింది. వాడుకరిపేజీలలో ముద్రితమైనా, వాడుకరిపేజీలకు తరలించిన వ్యాసాలు పరిగణించలేదు. కొద్దిగా కొద్దిగా అనువదించి అనువదించిన ప్రతిసారి ముద్రణ చేసినా కూడా ఒకే వ్యాసంగా పరిగణించడం జరిగింది. నాకు తెలిసిన ప్రకారం వికీటెక్స్ట్ రూపం కావాలంటే ఒకసారైన ముద్రితమవ్వాలి. చిత్తుప్రతిగానే వుంచి అనువాద పాఠాన్ని (మూలాలు రావు) మానవీయంగా చేర్చిన వారిని పరిగణించలేదు. ఇక Special:ContentTranslationStats ప్రకారం 2020 అగష్టు 02 వరకు చిత్తుస్థితిలోనున్న అనువాదాలు 281, తొలగించిన అనువాదాలు 382. ముద్రించిన అనువాదాలు 1570. అంటే తొలగించిన వాటితో కలుపుకొని ముద్రితమైన అనువాదాలు 1952. ఇక API వాడి లెక్కించినా 2020 జులై అంతానికి ముద్రితమైనవి తొలగించినవాటితో కలుపుకొని 1563 గా వున్నాయి. అంటే ఉపకరణం వాడినవి చిత్తు స్థితిలోవున్నవాటిని కలుపుకొని ఇప్పటికి 2203 దాటవు. పై లెక్కలో దోషాలు వుంటే తెలపండి. మరికొంత విశ్లేషణ త్వరలో కొత్త ప్రాజెక్టు చర్చాపేజీలో చేరుస్తాను.--అర్జున (చర్చ) 05:57, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పై గణాంకాలలో కొత్తగా సృష్టించిన వ్యాసాలను మాత్రమే పరిగణించడం జరిగింది. ఇప్పటికే వున్న వ్యాసంపై తిరగరాస్తే పరిగణించ లేదు. నేను 13 వ్యాసాలు ముద్రించగా, 11 కొత్తవి, రెండు తిరగ రాసినవి. ఆసక్తిగల సభ్యులు వారి గణాంకాలను contenttranslation ట్యాగ్ తో పరిశీలించి (ఉదా:అర్జున అనువాదాలు) ప్రధానపేరుబరిలో ఏడు కంటే వ్యాసాలు 2020 జులై లోపు ప్రచురించి వుంటే తెలియచేయండి. వారికి పతకం అందజేస్తాను. ఇప్పటికే వున్న నా క్వెరీని మార్పులు చేయటానికి కొంత సమయం పట్టవచ్చు.--అర్జున (చర్చ) 10:42, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తరువాతి రెండు స్థాయిలు 6, 5 కొత్త వ్యాసాలు చేర్చిన వారివి పరిశీలించగా, వారు కొత్తవి కానితోటి కూడా 7 కు చేరలేదు. కావున పతకాలకు అర్హులలో మార్పులు లేవు. --అర్జున (చర్చ) 12:49, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
User:K.Venkataramana గారు చర్చలో తన వ్యక్తిగత అనుభవం తెలిపిన తర్వాత, విజువల్ ఎడిటర్ లో అనువాదం చిత్తు ప్రతిలో నున్నా వికీటెక్స్ట్ రూపం నకలు చేసి అతికించవీలవుతుందని తెలిసింది. అనువాద ఉపకరణం రెండవ విడుదల విజువల్ ఎడిటర్ కు తగినట్లుగా రూపొందించారు కావున అలా జరుగుతున్నట్లున్నది. పై సమాచారం పరిగణించినను, అనువాద వ్యాసాల గణాంకాలలో తేడా వుండదు. --అర్జున (చర్చ) 10:50, 17 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఐఐఐటి, హైదరాబాదు ప్రాజెక్టు సభ్యుల వ్యాసాల నాణ్యత

వాడుకరి:Kasyap గారు, ఇటీవల ప్రాజెక్టు సభ్యులు వ్యాసాలు చేర్చటం లేక ఉన్న వ్యాసాలు సవరించటం గమనించాను.(ఉదా:క్వాల్కమ్, వై ఫై వ్యాసంలో సభ్యుని ప్రారంభపు మార్పు) వాటి నాణ్యత గురించి సహ సభ్యులు తగు మూసలు చేర్చటం, చర్చించటం మొదలు పెట్టారు. అనువాదాల నాణ్యత నియంత్రణ గురించి ప్రస్తుతం తెలుగు వికీలో పెద్ద చర్చ జరుగుతున్నది. IITH ప్రాజెక్టు వ్యాసాల నాణ్యతను ఏ విధంగా నియంత్రిస్తున్నారో సముదాయానికి తెలియచేయండి. ఇప్పటికి ఒక్క ప్రతిపాదన పేజీయే వుంది. వేరేగా ప్రాజెక్టు పేజీ సృష్టించి వివరాలు తెలియచేస్తే, సముదాయం మీ ప్రాజెక్టుకు తగిన స్పందనలు, సహకారం ఇవ్వటానికి అవకాశం వుంది.--అర్జున (చర్చ) 00:15, 22 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు సభ్యులను గుర్తించటానికి వర్గం:IIITH Indic Wiki Project సభ్యులు చూడండి.--అర్జున (చర్చ) 06:00, 23 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు వర్గం చేర్చినందులు ధన్యవాదములు అర్జున గారు, అయితే ఇందులో ఐఐఐటీ హైదరాబాదు కు చెందిన అందరూ వికీపీడియా:ఐఐఐటి హైదరాబాదు వారి వికీపీడియా ప్రాజెక్టు ప్రతిపాదన సభ్యులు కారు. కొంత మంది విద్యార్థులు కొన్ని వారాల పాటు ఈ ప్రాజెక్టులో పనిచేశారు. అలాంటివారిని మీరు తెలిపిన వర్గంలో చేరుస్తాము. ఈ ప్రాజెక్టులో పనిచేసే యంత్ర అనువాదాలు ఎక్కువగా వేరొక సాండ్ బాక్స్ (https://tewiki.iiit.ac.in) లో ప్రస్తుతానికి ప్రముఖ బాట్ లను తెలుగు భాషమీద అభివృద్ధి కోసం తెలుగు వికీపీడియాలో కాకుండా లోకల్ గా టెస్ట్ వికీమీడియా సర్వర్ మీద పరీక్ష చేస్తున్నాము. ఇందువలన తెలుగు వికీపీడియాలో ఎలాంటి కృతమైన వ్యాసాలు, నాణ్యతకు చేటు తెచ్చే వ్యాసాలూ చేరవు. ఈ ఏర్పాటు వలన నాణ్యత కోసం స్వచ్ఛందముగా పాటుపడుతున్న నిర్వాహకుల శ్రమ తగ్గుతుంది, అనేక పద్దతుల ద్వారా (https://tewiki.iiit.ac.in) లో చేర్చిన వ్యాసాలు ఒక సంతృప్త స్థాయికి చేరుకొన్న తరువాత ఆ వ్యాసాలను తెవికీ సముదాయంతో చర్చించి వాటికి తెలుగు వికీపీడియాలో చేర్చే సాద్యాసాధ్యాలు నిర్వాహకుల , వాడుకరులు సూచనలు పరిగణలోకి తీసికొని, వికీపీడియా పాలసీలు అనుగుణంగా తెలుగు వికీపీడియాలో చేర్చాలని మా ఆలోచన. అయితే తెలుగు వికీపీడియా సముదాయం తో కలసి పనిచేసేందుకు ,ఇప్పటికే యంత్రిక అనువాదం అర్ధం చేసుకునేందుకు , యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ మీద ఒక నిర్ణయానికి రావటానికి కొన్ని అనువాదాలు , అల్గారిధం లు పరీక్ష చేస్తున్నాం. అందులో భాగంగా కొంత మంది విద్యార్థులను తెవికీ లో రాయవలసినదిగా సూచించాము. వారిలో కొంతమంది కొత్తగా తెలుగులో రాస్తున్నవారు కాబట్టి నాణ్యంగా రాయలేక పోయారు. అందులో కొన్ని తొలగింపునకు గురయినాయి కూడా. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అలా రాసిన వ్యాసాల నాణ్యత, అభివృద్ధి ఈ ప్రాజెక్టు లో భాగంగా ఉన్న నావంటి కొంతమంది 'సభ్యులం' భాద్యత తీసుకొంటున్నాము. అలా చేసున్న వారిని ఒక ప్రత్యేక వర్గంలో చేరుస్తాము.
ఇక యాంత్రికానువాదాల నాణ్యతా విషయానికి వస్తే మన తెలుగులో కూడా 42% వరకు బాట్ ల ద్వారా సృష్టించినవే. గత కొన్ని సంవత్సరాలనుండి ఉపకరణాల ద్వారా అనువాదం మెరుగు పడుతోంది. గత రెండు సంవత్సరాలుగా వికీపీడియాలో బాట్ లు ఎక్కువ సంఖ్యలో పేజీలు, కంటెంటు సృష్టిస్తున్నాయి. అయితే వీటి నాణ్యత , భాష మెరుగు పరచవలసిన అవసరం ఆయా సమూహం మీద కూడా ఉన్నది. అలా చేయటాన్ని ఎక్కువ మంది సహకారం అవసరం! మీకు తెలుసు ప్రపంచంలో రెండవ అతిపెద్ద వికీపీడియా దాదాపు పూర్తిగా ఒక బాట్ ద్వారా వ్రాయబడింది (Cebuano Wikipedia). ఇందులో 5.37 మిలియన్ ల ఆర్టికల్స్ ఉన్నప్పటికీ, కేవలం 6 మంది అడ్మినిస్ట్రేటర్ లు మరియు 14 మంది యాక్టివ్ యూజర్ లు ఉన్నారు. అయితే మేము తెలుగు వికీపీడియా మీద సాధ్యమైనంత వరకు మానవనీయంగా వ్వాసాలు రాయమని ప్రాజెక్టు సభ్యులకు సూచించాము, ఇంకా ఏమైనా వివరాలు ప్రాజెక్టు పేజీలో పంచుకోగలము. -- Kasyap (చర్చ) 13:41, 24 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Kasyap గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. తెవికీలో క్రియాశీల సభ్యులు, నిర్వాహకులు తక్కువగా వున్నారు. మీ ప్రాజెక్టు, శిక్షణ కార్యక్రమాలలో కృషి వలన వారిపై మోయలేని నిర్వహణ భారం పడకుండా చూసుకొనే బాధ్యత ప్రాజెక్టు నిర్వాహకులు తీసుకోవాలి. మీ ప్రాజెక్టు సభ్యులకు, శిక్షణ ఇచ్చినవారికి తొలి 500 మార్పులు ఇప్పటికే వున్న వ్యాసాలను అభివృద్ధి చేయమని చెప్పటం,ఆ తరువాత సాంకేతిక అంశాలపై కాకుండా ఇతర అంశాలను అనువాదానికి ఎంపిక చేసుకోమని చెప్పటం మంచిది. కొన్ని అనువాదాలు అలా చేసిన తరువాత, సాంకేతికాంశాల అనువాదాలు చేయవచ్చు. ఇటీవల అనువాద వ్యాసాలు చేర్చిన సభ్యుల చర్చాపేజీలలో చేసిన వ్యాఖ్యలకు కూడా స్పందనలు లేవు. చర్చలకు స్పందన ప్రాముఖ్యాన్ని కూడా మీరు వారికి తెలియచేయాలి. లేకపోతే గతంలోని గూగుల్ అనువాదాల ప్రాజెక్టు వలన వచ్చిన సమస్యలే పునరావృతమవుతాయి.
యాంత్రికానువాదాలు, బాట్ల కృషి ఒకటి కాదు. తెవికీలో బాటు వాడి మూసరూపంలో ఒకటి రెండు వాక్యాలతో చేర్చిన గ్రామవ్యాసాలే 42% సంఖ్యకి మూలం. వేరే భాషలో యాంత్రిక అనువాదాలు ఎక్కువ చేర్చివుండవచ్చు. మీ ప్రాజెక్టు లక్ష్యం తెలుగులో వ్యాసాల సంఖ్యని పెంచడం లాగా నేను అర్ధంచేసుకున్నాను. అయితే కనీస నాణ్యత లేని వ్యాసాల సంఖ్య పెరిగితే అది తెలుగు వికీకి మంచిది కాదని నా అభిప్రాయం. దాదాపు 9 నెలల క్రిందట చేర్చిన ప్రతిపాదన తరువాత ఇంతవరకు ప్రాజెక్టు రూపం తెలియచేయకపోవటం, ప్రాజెక్టు నిర్వహణ సామర్ధ్యంపై అనుమానాలకు ఆస్కారం కలిపిస్తున్నది. మీ శాండ్ బాక్స్ పరిశీలించినా దానిలో ఏమంత కృషి జరిగినట్లు కనబడలేదు. కావున త్వరలో వివరమైన ప్రాజెక్టు పేజీ తయారుచేయమని కోరుతున్నాను.
మీ అనుభవాలు, మీ ప్రాజెక్టు సభ్యుల అనుభవాలు, ప్రస్తుత యాంత్రిక అనువాద విధానం సమీక్షకు, కొత్త మెరుగైన విధాన నిర్ణయాలకు ఉపయోగపడతాయి. మీరందరూ ఆ చర్చలో పాల్గొనమని నా విజ్ఞప్తి.--అర్జున (చర్చ) 00:26, 27 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Important: maintenance operation on September 1st

Trizek (WMF) (talk) 13:49, 26 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సారాంశం

సెప్టెంబర్ 1 ,2020, మంగళవారం నాడు సాయత్రం (19:30 IST )నుండి గంట వరకు వికీలో ఎడిట్ చేయలేరు

ఒక గమనిక : బెనాయిట్ ఎవెల్లిన్ - కమ్యూనిటీ రిలేషన్స్ స్పెషలిస్ట్ వికీమీడియా ఫౌండేషన్ నుండి ఒక మైయిల్ చూశాను దీని ప్రకారం వికీమీడియా ఫౌండేషన్ తన సెకండరీ డేటా సెంటర్ ను పరీక్షిస్తుంది ఇది వికీపీడియా , ఇతర వికీమీడియా వికీలు ఏదైనా విపత్తు తర్వాత కూడా ఆన్‌లైన్‌లోనే ఉండేందుకు దోహదం చేస్తుంది. ప్రతిదీ పనిచేస్తుందని నిర్ధారించుకోవడానికి, వికీమీడియా టెక్నాలజీ విభాగం ప్రణాళికాబద్ధమైన పరీక్ష చేయవలసి ఉంది. అయితే మీడియావికీలో కొన్ని పరిమితుల వల్ల, స్విచ్ తయారు చేసేటప్పుడు అన్ని ఎడిటింగ్ లు విధిగా నిలిపివేయాలి అంతేకాక దీర్ఘకాలం గా నడుస్తున్న స్క్రిప్టులను నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ సమయములో అనగా మంగళవారం, సెప్టెంబర్ 1, 2020 నాడు సెకండరీ డేటా సెంటర్ కు అన్ని ట్రాఫిక్ ని మారుస్తారు 2020 సెప్టెంబర్ 1వ వారం కోడ్ ఫ్రీజ్ లు ఉంటాయి కావున గమనించగలరు.-- 2020-08-26T19:59:01‎ Kasyap

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. వారికి నా ధన్యవాదాలు. చర్చపై ఆసక్తిగలవారు, ఇంతవరకు ఉపకరణం వాడనట్లైతే వాడుటకు ప్రయత్నించి, అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో ఎవరైనా పాల్గొనవచ్చు, కాని కేవలం ఓటు మాత్రమే ఇతర నియమాలకు లోబడి పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 00:38, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్తు అనువాదాల పెరుగుదల

గణాంకాలు పరిశీలిస్తే గత రెండువారాల్లో 356 అనువాద వ్యాసాలు సభ్యులు చిత్తురూపంలో ప్రయత్నించారు. అంతకు ముందు రెండువారాలలో అవి 64 మాత్రమే. అనువాద ఉపకరణం పరీక్షించిన సభ్యులకు ధన్యవాదాలు. గత రెండువారాలలో 29 అనువాద వ్యాసాలు మాత్రమే ప్రచురితమయ్యాయి. అనువాదం ప్రయత్నించిన సభ్యులందరు మీ అభిప్రాయాలు చర్చలో చేర్చి, మెరుగైన విధానం చేయటానికి తోడ్పడవలసింది.-- అర్జున (చర్చ) 00:09, 31 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి లో ఒకటికంటే ఎక్కువ ప్రతిపాదనలకు ఫలితం నిర్ణయం

వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి లో స్పష్టత అవసరమైంది. సంబంధిత చర్చ లో స్పందించండి.--అర్జున (చర్చ) 23:45, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టు ముగిసింది

మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టు ఆగస్టు 31 తో ముగిసింది. 2020 జూన్ 1 న మొదలై మూణ్ణెల్ల పాటు ఈ ప్రాజెక్టు సాగింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ప్రాజెక్టు తుది నివేదికను వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/ప్రాజెక్టు తుది నివేదిక పేజీలో ఉంచాను. పరిశీలించి తమ అభిప్రాయాలు తెలుపవలసినదిగా సముదాయానికి వినతి. __చదువరి (చర్చరచనలు) 08:08, 1 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగేనండి చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చరచనలు) 08:34, 1 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
2000 పైగా మొలకలను విస్తరించిన కార్యక్రమంలో పాల్గొన్న వాడుకరులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి చర్యలు మన ఐకమత్యతకు, నాణ్యతకు మనం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలను నడిపించడం భాషాభివృద్ధిలో భాగంగా తెలుగువారందరికీ ఎంతైనా ఉపయోగం.--Rajasekhar1961 (చర్చ) 07:06, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నిరోధ నిర్ణయాల సమీక్షా విధానంపై నిర్ణయం

తెవికీలో నిర్వాహకులు చేసే నిరోధ నిర్ణయాలపై ఒక సమీక్షా సంఘం ఉండాలని ప్రతిపాదించగా 9-1 మెజారిటీతో (ఇద్దరు తటస్థులు) సముదాయం ఆమోదించింది. ఆ చర్చను ఇక్కడ చూడవచ్చు. సమీక్షా సంఘం ఉండాలి అనేది నిశ్చయమైపోయింది కాబట్టి ఇక విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంది. అందుకోసం విధి విధానాలతో ఒక ప్రతిపాదన మూణ్ణెల్ల క్రితం సముదాయం ముందుకు వచ్చింది. దానిపై కొందరు స్పందించారు. అక్కడ వచ్చిన సూచనలకు అనుగుణంగా గడువులో మార్పులు చేసాను. నిర్వాహకులెవరైనా దాన్ని పరిశీలించి విధానానికి తుది రూపం ఇచ్చేలా ఒక నిర్ణయం తిసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 04:11, 2 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikipedia Library Collections Now Available (September 2020)

Hello Wikimedians!

The TWL owl says sign up today!

The Wikipedia Library is announcing new free, full-access, accounts to reliable sources as part of our research access program. You can sign up for new accounts and research materials on the Library Card platform:

Many other partnerships are listed on our partners page, including Adam Matthew, EBSCO, Gale and JSTOR.

A significant portion of our collection now no longer requires individual applications to access! Read more in our recent blog post.

Do better research and help expand the use of high quality references across Wikipedia projects!
--The Wikipedia Library Team 09:49, 3 సెప్టెంబరు 2020 (UTC)

This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

సంప్రదింపు పేజీ లింకు తొలగింపు పేజీకి

సంప్రదింపు పేజీ లింకు తొలగించిన పేజీకి వెలుతుంది.అర్జునరావు గారూ మీరు ఈ పేజీని 2020.07.19 న తొలగించినట్లుగా తెలుస్తుంది.సవరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 05:00, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారు, మీ గమనింపుకి ధన్యవాదాలు. ప్రధానంగా ఆంగ్ల శీర్షిక కావున తొలగించి సవరణలు చేశాను. మరిన్ని వివరాలు చర్చలో తెలిపాను. వికీపీడియా:2012 లక్ష్యాలు లో ఇప్పుడు సవరించాను. దానికి లింకున్న మిగతావి వీక్షణ గణాంకాల జాబితాలు కావున వాటిని సవరించనవసరంలేదు. --అర్జున (చర్చ) 01:43, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీ ఎడమపట్టీలోగల 'సంప్రదింపు పేజీ'కి కూడా లింకు తాజాపరిచాను.--అర్జున (చర్చ) 22:51, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానానికి ఓటు ప్రక్రియ

చర్చల ఫలితంగా కొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానానికి ఓటు ప్రక్రియ ప్రారంభమైంది. 2020-06-30 నాటికి తెవికీలో ఏవైనా 100 మార్పులు చేసినవారు ఓటు చేయటానికి అర్హులు. మరిన్ని వివరాలకు వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2 చూసి మీ ఓటు 2020-09-21 05:29 (IST) లోగా వేయండి. ఎక్కువ మంది పాల్గొనటానికి ఈ పద్ధతి వాడబడుతున్నది కావున అర్హులైన అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. ఏవైనా సందేహాలుంటే తెలపండి. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 01:29, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వోటు ప్రక్రియ పద్ధతిగా లేదు

  • చర్చలో ప్రతిపాదన చేసినదేంటి? "ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి." అని. అక్కడ దాన్ని మాత్రమే చర్చకు పెట్టారు.
  • వోటింగుకు పెట్టిందేంటి? పై అంశంతో పాటు, "కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు." అని కూడా చేర్చారు. ఈ అంశాన్ని చర్చకు పెట్టలేదు. జరుగుతున్న చర్చలో మధ్యలో ఎక్కడో ఇరికించారంతే.

ఇదేం పద్ధతి అసలు? రెండు వేరువేరు అంశాలను వోటింగుకు పెట్టి ఒకే వోటు ఎలా వేస్తారు? చర్చలో దేన్ని ప్రతిపాదించారో దాన్ని మాత్రమే వోటింగుకు పెట్టాలి. చర్చ జరుగుతూండగా మధ్యలో అంశాన్ని చేరిస్తే లేదా మారిస్తే దానిపై మళ్ళీ చర్చకు పెట్టాలి కదా. చర్చ పేజీలో ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేసేస్తూ ఏమీ అర్థం కాకుండా గందరగోళం చేసెయ్యడం, వోటింగులో కొత్త అంశాలను కలిపేసి అసలు ప్రతిపాదనను పలచన చెయ్యడం అంతా ఏదో గందరగోళంగా ఉంది. ఏమాత్రం పారదర్శకంగా లేదు. ఈ వోటింగు వ్యవహారాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. వోటింగుకు పెట్టిన రెండు అంశాల్లో మొదటిదాన్ని మాత్రమే ఉంచాలి. రెండోదాన్ని వోటింగు లోంచి తీసెయ్యాలి. రెండో దాన్ని కూడా వోటింగుకు తోసుకోవాలంటే, దానిపై చర్చ జరగాలి. __చదువరి (చర్చరచనలు) 02:01, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. విధానపేజీలో చేర్చిన పై వ్యాఖ్యను పోలిన వ్యాఖ్యను దాని చర్చాపేజీలోకి మార్చాను గమనించండి. చర్చను దయచేసి అక్కడే కొనసాగనివ్వండి.--అర్జున (చర్చ) 02:34, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఓటింగ్ ప్రక్రియను నిలుపుదల చేసి, ఏకాభిప్రాయాన్ని నిర్ణయంగా వెలువరించాలి

అర్జున రావు గారు ప్రారంభించిన ఓటింగ్ ప్రక్రియ చాలా స్థాయిల్లో తప్పు:

  • చర్చ ఏకాభిప్రాయానికి వచ్చింది: చర్చలో భాగంగా మొత్తంగా పదిమంది సభ్యుల వరకూ తమ తమ అభిప్రాయాలను, అనుభవాలను సవివరంగా వెల్లడించారు. మొక్కుబడిగా జరిగిన చర్చ కాదిది. అంత లోతుగా విశ్లేషించి చేసిన చర్చ ఏకాభిప్రాయానికి కూడా వచ్చింది. పాల్గొన్నవారిలో అత్యధికులు ప్రతిపాదనను తిరస్కరించారు. 70% యాంత్రిక అనువాద విధాన సమీక్షలో సభ్యులు, కొత్త సభ్యుల యాంత్రిక అనువాదాలపై నియంత్రణ వుండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అని అర్జున రావు గారే అంగీకరించాల్సి వచ్చింది.
  • వికీపీడియాలో ఓటింగ్ చిట్టచివరి ఆప్షన్ మాత్రమే: తెలుగు వికీపీడియాలో విధానాలు మార్గదర్శకాలను నిర్ణయించడానికి ఏకాభిప్రాయం ప్రాతిపదిక ముఖ్యమైనది. ఏకాభిప్రాయం అంటే పూర్తి సమ్మతి కాదు. - ఈ ముక్క నా పైత్యం కాదు. స్వయానా అర్జున రావుగారే 2013, 14 ప్రాంతాల్లో రూపొందించిన వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ఇదే చెప్తోంది. ఏకాభిప్రాయం వచ్చిన చర్చను తీసుకుపోయి ఓటింగ్‌కు పెట్టడం బేసబబు
  • ప్రాతిపదిక లేని ప్రతిపాదనలు: ఈ ప్రతిపాదనకు మొదట అర్జున రావు గారు చెప్పిన ప్రాతిపదికల్లో ముఖ్యమైనవి ఆయన మాటల్లోనే చెప్పాలంటే "తెవికీ ఏర్పడ్డ ప్రధాన నియమం , ఎవరైనా పాల్గొనగలిగే వీలున్న నియమాన్ని గౌరవించడం జరుగుతుంది.", "అనువాద వ్యాసాలు సృష్టించే సభ్యులపై ప్రస్తుతం వున్న వివక్ష పోతుంది" - ఎవరైనా పాల్గొనగలిగే వీలున్న నియమాన్ని గౌరవించడం అన్నది ఆయన నొక్కి వక్కాణించారు బోల్డ్ చేసి మరీ. అటువంటిది - ఆయన ప్రస్తుతం అనువాద ఉపకరణంలో ఉన్న నియంత్రణలు తొలగించనక్కరలేదని సభ్యులు అనుభవాలు, అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పగానే ఆగస్టు 30న "కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు." అని ఓ కొత్త సవరణ తెచ్చిపెట్టారు. ఓటింగులో ఇది కూడా పెట్టేశారు. ఈ కొత్త సవరణ వల్ల కొత్త సభ్యుల మీద "వివక్ష", "ఎవరైనా పాల్గొనగలిగే వీలును తిరస్కరించడమూ" నిజంగానే జరుగుతాయి. ఈ యాంత్రికానువాదం సరిగా ఉండదు. నువ్వు కనీసం 70 శాతం మార్చితే తప్ప ప్రచురించనివ్వం అన్నది అందరి మీద సమానంగా వర్తించే నిబంధన. 500 మార్పులు చేయని కొత్త సభ్యుల మీదకి తెచ్చిపెట్టబోయిన ఈ నిబంధనే అసలు, అకారణమైన వివక్ష. ఇది కాక అర్జున గారి వ్యాసాలపై నేను చేసిన పరిశీలనలో అంత అనుభవం ఉన్నవారు కూడా నియంత్రణ లేనప్పుడు కనీసం మార్పులు కూడా చేయకుండా దోషభూయిష్టంగా వ్యాసాలు ప్రచురించేశారని నిరూపించాను. కనుక కొత్తవారు చెడ్డ అనువాదాలు చేస్తారనీ లేదు, అనుభవజ్ఞులు అంతా బాగా చేస్తారనీ చెప్పలేం. చర్చలోనే ఇది వీగిపోయింది.
  • చర్చ చేసినవారి సమయానికి విలువ లేదు: వ్యక్తిగతంగా నేను ప్రతిపాదకులైన అర్జున రావు గారే యాంత్రికానువాదాలపై పరిశీలన చేసి ఈ నిబంధనలు ఎందుకు ఉండాలన్నదానిపై ఓ పరిశీలన సాధికారికంగా ప్రచురించాను. దీనికి నేను చాలా సమయమే వెచ్చించాల్సి వచ్చింది. సభ్యుల్లో చాలామంది సుదీర్ఘంగానూ, తమ అనుభవాలు గుర్తుకుతెచ్చుకుని చక్కటి చర్చ చేశారు. చివరకు ఒక ఏకాభిప్రాయం వచ్చింది. ఆయనకే విషయం అర్థమై నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారన్నారు. అంటే నియంత్రణ తొలగించాలన్న ఆలోచనను తిరస్కరించారన్నమాట. అంత చేసినా చివరకు అర్జున గారు పేజీలో ప్రతిపాదన 1 బరిలో నిలిచిందని ఏ ఆధారంతో రాశారన్నది అంతుచిక్కదు.

చివరకు చూస్తే ఇదంతా ఒక ఆటలా ఉంది. మనల్ని అభిప్రాయాలు, అనుభవాలు చెప్పమంటారు. చెప్పాకా వాటికి విలువ ఉండదు. తనకు తోచిన కంక్లూజన్‌కి తాను వచ్చి అది నిర్ణయం అంటారు. అస్సలు బాగోలేదు. కాబట్టి, నేను ప్రతిపాదించేదేమంటే:

  1. అక్కరలేని, సరిగాని ఈ ఓటింగ్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా నిలుపుదల చేయాలి.
  2. ప్రతిపాదకుడు, చర్చలో పాల్గొన్న వారు కాక వేరెవరైనా నిర్వాహకులు వచ్చి యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణపై అర్జునరావు గారు ప్రవేశ పెట్టిన ప్రతిపాదనలపై చర్చను వికీపీడియా విధానాలకు అనుగుణంగా ముగిస్తూ నిర్ణయం తీసుకోవాలి.

ఈ విషయాలను నేనిప్పటికే వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2లో చెప్పాను. మరో ముగ్గురు నిర్వాహకులు కూడా అలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 04:53, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున రావు గారికి ప్రత్యేక విన్నపం. మీరు చర్చల్లో ఇటీవల సభ్యులు చెప్పిన అభిప్రాయాలను సరైన చోటికి తరలిస్తున్నానంటూ ఉప విభాగాల్లోకి పంపించడం, వివరణ అంటూ ఒకరు సుదీర్ఘ ఖండికగా రాసిన అభిప్రాయాల మధ్యలో ప్రశ్నలు చేర్చడం వంటివి చేస్తున్నారు. దయచేసి నేనిక్కడ రాసింది మాత్రం అలా ఎక్కడికీ పంపవద్దు, సముదాయ సభ్యులు చూసేందుకు వీలుగా ఇక్కడే రచ్చబండలో ఉంచండి. అలానే భవిష్యత్తులో నేను మరెక్కడైనా రాసేవాటిలో మాత్రం అలాంటి మార్పుచేర్పులు చేయడం నాకు ఒప్పుదల కాదని గమనించగలరు. మీకు అంతగా ఉపవిభాగాల్లోకి వెళ్ళాలి అనిపిస్తే సూచనా మాత్రంగా నాకు చెప్పండి, సబబు అనిపిస్తే చేస్తాను. ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 04:56, 7 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈమధ్య కాలంలో అనువాద పరికరం ద్వారా ఎవరెవరు ఏయే అనువాదాలు చేసారు మొదలైన వివరాలు

గత 30 రోజుల్లో అనువాద పరికరం ద్వారా ప్రచురించిన అనువాదాల వివరాలు ఇలా ఉన్నాయి:

సం తేదీ పేజీ పేరు బైట్లు వాడుకరి మానవిక

అనువాద స్థాయి

1 2020 సెప్టెంబరు 10 సెర్గీ బుబ్కా 31,287 Chaduvari 39.39%
2 2020 సెప్టెంబరు 9 మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ‎ 3,226 Pranayraj1985 53.42%
3 2020 సెప్టెంబరు 8 హీరో (2008 సినిమా)‎ 6,696 Pranayraj1985 39.40%
4 2020 సెప్టెంబరు 8 గజలక్ష్మి‎ 6,973 K.Venkataramana 55.98%
5 2020 సెప్టెంబరు 7 కౌసల్య (నటి)‎ 13,037 K.Venkataramana 52.50%
6 2020 సెప్టెంబరు 7 గంగవ్వ‎ 10,707 K.Venkataramana 46.15%
7 2020 సెప్టెంబరు 7 నోయెల్ సీన్‎ 18,162 K.Venkataramana 30.09%
8 2020 సెప్టెంబరు 6 బిగ్ బాస్ తెలుగు 4‎ 4,426 Pranayraj1985 35.80%
9 2020 సెప్టెంబరు 5 సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల‎ 3,454 Pranayraj1985 36.00%
10 2020 సెప్టెంబరు 4 నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల‎ 3,264 Pranayraj1985 30.15%
11 2020 సెప్టెంబరు 1 నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి‎ 5,345 Pranayraj1985 30.00%
12 2020 ఆగస్టు 31 మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల‎ 3,039 Pranayraj1985 32.20%
13 2020 ఆగస్టు 30 అదిరే అభి‎ 4,851 Pranayraj1985 62.30%
14 2020 ఆగస్టు 30 రాజగోపాల కృష్ణ యాచేంద్ర‎ 4,584 Viggu 32.30%
15 2020 ఆగస్టు 29 అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం‎ 6,282 Pranayraj1985 32.20%
16 2020 ఆగస్టు 28 మూలా వెంకటరంగయ్య‎ 2,269 Pranayraj1985 31.99%
17 2020 ఆగస్టు 27 సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ (హైదరాబాదు)‎ 4,131 Pranayraj1985 38.18%
18 2020 ఆగస్టు 26 శాతవాహన విశ్వవిద్యాలయం‎ 8,627 Pranayraj1985 32.19%
19 2020 ఆగస్టు 25 డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)‎ 6,137 Pranayraj1985 32.43%
20 2020 ఆగస్టు 24 తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి‎ 5,129 Pranayraj1985 37.90%
21 2020 ఆగస్టు 23 తెలంగాణ వైద్య విధాన పరిషత్తు‎ 3,060 Pranayraj1985 48.80%
22 2020 ఆగస్టు 22 తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ‎ 4,777 Pranayraj1985 33.33%
23 2020 ఆగస్టు 21 నందిత శ్వేత‎ 13,207 Pranayraj1985 41.30%
24 2020 ఆగస్టు 20 సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్‎ 4,839 Pranayraj1985 31.03%
25 2020 ఆగస్టు 20 మెగాజాపిక్స్ (Megajapyx)‎ 1,077 Dollyrajupslp 66.66%
26 2020 ఆగస్టు 19 ఆటాడుకుందాం రా‎ 1,501 Pranayraj1985 27.47%
27 2020 ఆగస్టు 15 భూటాన్ - భారత దేశ సంబంధాలు‎ 6,612 Pavan santhosh.s 30.66%
మొత్తం బైట్లు 1,86,699 సగటు మానవిక అనువాద స్థాయి 39.25%

వాడుకరుల గణాంకాలు

వాడుకరి వ్యాసాల

సంఖ్య

Pranayraj1985 19
K.Venkataramana 4
Pavan santhosh.s 1
Dollyrajupslp 1
Viggu 1
Chaduvari 1

__చదువరి (చర్చరచనలు) 10:25, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పై జాబితాను గమనిస్తే సరాసరి మానవిక అనువాద స్థాయి 39.25% వచ్చినది. ఇక్కడ గూగుల్ అనువాద పరికరంతో వందల సంఖ్యలో వ్యాసాలను మానవీయ అనువాదాలు చేసి, నాణ్యమైన వ్యాసాలుగా తీర్చిదద్దిన క్రియాశీల వాడుకరులు వారు తమ అనుభవాలను చర్చలలో ఎంత చెప్పినా వినేవాడు లేడు. తమకు అనుకూలంగా ఓటింగ్ ప్రక్రియ చేస్తూ 70% ను తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఓటింగ్ చేసే వారెవరూ ఈ పరికరం ప్రయోగాత్మకంగా ఉపయోగించి వారికి గల అనుభవాలను చర్చించలేదు. ఇపుడు అనువాద స్థాయి తొలగిస్తే శుద్ధి చేయబడని గూగుల్ అనువాద వ్యాసాలు విపరీతంగా వికీలోకి చేరతాయి. వాటిని శుద్ధి చేయడం గానీ, వాడుకరులకు హెచ్చరికలు చేయడం గానీ, సూచనలు చేయడం గానీ ఈ ఓటింగ్ లో పాల్గొనిన వాడుకరులెవరూ చేయరు. ఆ వ్యాసాలకు తొలగింపు మూసలు, చర్చలు, తొలగింపులూ సర్వసాధారణమే. నిర్వాహకులకు మరింత పని కల్పించడానికే ఈ విధానాన్ని తేవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికైనా ఆ గూగుల్ అనువాద పరికరంతో పనిచేసిన అనుభవజ్ఞులైన వాడుకరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వండి. ఇప్పటికి ఉన్న 30% మానవీయ అనువాదాల స్థాయిని అలానే ఉంచండి. తెవికీ వ్యాసాల నాణ్యతను పెంచడానికి కృషిచేయండి.--కె.వెంకటరమణచర్చ 05:15, 12 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అనువాద ఉపకరణం వాడడంలో మెళకువలు నాకు తెలియకపోడవం వల్ల గతంలో ఈ అనువాద ఉపకరణం ఉపయోగించి 3 వ్యాసాలకంటే ఎక్కువ అనువాదాలు చేయలేకపోయాను. గత నెల చదువరి గారు, పవన్ సంతోష్ గారు, యర్రా రామారావు గారు అనువాద ఉపకరణంతో వ్యాసాలను రాయడంవల్ల ఉన్న సౌలభ్యాన్ని నాకు చెప్పారు. దాంతో అప్పటినుండి అనువాద ఉపకరణం ఉపయోగించి 22 కొత్త వ్యాసాలను సృష్టించాను, మరికొన్ని వ్యాసాలలో సమాచారాన్ని చేర్చాను. మరి ఇప్పుడున్న 70% పరిమితి వల్ల నాకెప్పుడు ఇబ్బందులు కలగలేదు సరికదా, వ్యాస నాణ్యతను పెంచేందుకు ఆ పరిమితి ఎంతగానో ఉపయోగపడింది. అనువాద ఉపకరణం అనేది వ్యాస నాణ్యతను పెంచేలా ఉండాలికానీ,నాణ్యతను తగ్గించేలా ఉండకూడదని నా అభిప్రాయం. ఆ విషయం ఎప్పుడో చెప్పేసాం. అయినా దాన్ని కాదని ఓటింగ్ ప్రక్రియకు రావడమేది సమంజసం కాదు. ఇక ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నవారి గురించి కె.వెంకటరమణ గారు చెప్పినదానితో నేను ఏకీభవిస్తున్నాను. తరచి చూస్తే ఎటొచ్చి చురుకైన వికీపీడియన్లకు పనిభారం పెంచేందుకే ఇది జరుగుతోందని అర్థమవుతోంది. ఇలా ఉపయోగంలేని ప్రతిపాదనలు తెచ్చి సమయం వృధా చేసేకంటే, ఆ సమయాన్ని వికీ వ్యాసాల అభివృద్ధికి ఉపయోగిస్తే వికీపీడియాకి, మనందరికి మంచిది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:28, 12 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
  1. అందరికంటే ఎక్కువగా అనువాద ఉపకరణం వాడిన/వాడుతున్న వారు 70% ఉండాలని కోరుతున్నారు
    • ఇప్పటి వరకు కేవలం 11 మాత్రమే అనువాదాలు చేసిన వ్యక్తి మాత్రం, అబ్బే లేదు ఈ పరిమితి తీసెయ్యాలని పట్టుబడుతున్నారు.
  2. అనువాద ఉపకరణం ద్వారా వికీలోకి దొర్లుకొచ్చిన అనేక వ్యాసాల్లోని భాషా దోషాలను శ్రమకోర్చి, సరిదిద్ది, చర్చించి, విమర్శలెన్నొచ్చినా తొలగింపులు ప్రతిపాదిస్తూ తొలగిస్తూ ఉన్నవారు ఈ పరిమితి ఉండాల్సిందేనని అంటున్నారు.
    • అసలు ఈ అనువాద దోషాలను ఓరకంట కూడా చూడని వ్యక్తి, చర్చలో వెల్లడైన అభిప్రాయాలను త్రోసిరాజని వోటింగు తెచ్చారు
  3. అనుభవమున్నంత మాత్రాన అనువాదాలు వచ్చినట్టు కాదు, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని భావిస్తున్న వారు ఈ పరిమితి ఇలాగే ఉండాలని బలంగా కోరుతున్నారు
    • నాకింత అనుభవముంది నన్నే ప్రచురించనివ్వదా అని హుంకరించినవారు, తాను ప్రచురించినన అనువాదం లోని దోషాలను ఎత్తిచూపిన తరువాత కూడా, పరిమితి తగ్గించాల్సిందే అని పట్టుపడుతున్నారు.
నేను తొలిజాబితాలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఆ జాబితా లోనే ఇకముందూ ఉంటాను. __చదువరి (చర్చరచనలు) 05:09, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్సులో ప్రూఫ్‌రీడథాన్

భారతీయ వికీసోర్సులలో అక్టోబరు నెలలో 1-15 తేదీల మధ్య ప్రూఫ్ రీడ్ తాన్ నిర్వహించబడుతున్నది. దీనికోసం మీ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. లింకు చూడండి: https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_2020 విజయవంతంగా చేయడానికి కొన్ని మంచి క్వాలిటీ స్కాన్ చేయబడిన పుస్తకాలు అవసరం మీరెవరైనా దీనికి సహాయం చేయగలరా.--Rajasekhar1961 (చర్చ) 12:18, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961] ఆర్చివ్ నుండి ఎమన్నా తీసుకోగలమా achive.org ఇందులో నాకే తెలిసి కాపీ హక్కులు ముగిసిపోయిన పుస్తకాలు 16,000 పైన వున్నాయి , ఒక వేళ మన దగ్గర అచ్చు పుస్తకం ఉంటే నాకు తెలిసినవారి దగ్గర HP Sheet-feed Desktop ఉన్నది దీని వలన చాలా తక్కువ సమయంలో పుస్తకాన్ని డిజిటలైజ్ చేయవచ్చు కానీ పుస్తకాన్ని పేజీలుగా విడదీసి మళ్ళా బైడు చేసుకోవాలి, అంతేకాక సుందరయ్య విజ్ణాన కేంద్రం వారి వద్ద కూడా కొన్ని పాత పుస్తకాల స్కాన్ లు ఉన్నాయి, నేను ఈ విషయంలో మీకు తోర్పాటును అందించగలను, నన్ను ఏమి చేయమంటారో చెప్పండి Kasyap (చర్చ) 05:06, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Invitation to participate in the conversation

"అనువాద ఉపకరణంతో వ్యాస రచన ఋతువు" ప్రారంభించుకుందాం

తెలుగు వికీపీడియా అభివృద్ధి, కొత్త వ్యాసాల రచన వంటి విషయాల్లో అనువాద ఉపకరణానికి ఉన్న ప్రాధాన్యత కాదనలేనిది. ఇంగ్లీష్ నుంచి అనువదించగల సామర్థ్యం ఉన్నవారికి, అరకోటికి పైగా ఉన్న ఇంగ్లీష్‌ వికీపీడియా వ్యాసాలను అనువదించేందుకు ఇది చేసే సాయం చాలా బావుంటుంది. ఇటీవల తెలుగు సముదాయంలో విజయవంతంగా నడిచి ముగిసిన "మొలకల విస్తరణ ఋతువు" స్ఫూర్తిగా "అనువాద ఉపకరణంతో వ్యాస రచన ఋతువు" చేసుకుందామని ప్రతిపాదిస్తున్నాను.
దీనివల్ల:

  • ఇంగ్లీష్ నుంచి చక్కని వ్యాసాలను తెలుగులోకి అనువదించవచ్చు. కొత్త వ్యాసాలు, ఎక్కువ సమాచారం చేరుతుంది తెవికీలో.
  • అనువాద ఉపకరణం వాడకంలో మన నైపుణ్యం పెరుగుతుంది. అనువాద రచనలోనూ మన సామర్థ్యం పెరుగుతుంది. ఒకరి నైపుణ్యాలు మరొకరితో పంచుకోవచ్చు. ఇప్పటిదాకా అనుభవజ్ఞులైనవారు ఇతరులకు ఉపయోగపడేలా అనువాద రచనలోనూ, ఉపకరణం వాడకంలోనూ మెళకువలు రికార్డు చేసి తోటివారికి అందించవచ్చు.
  • ఇప్పటిదాకా పలు కారణాలతో అనువాద ఉపకరణానికి దూరంగా ఉండి, మంచి అనువాదం చేయగల సభ్యులు కానీ, అనువాదాలు బాగా చేయగల కొత్తవారు కానీ ఈ గాండీవాన్ని చేబూని వ్యాస వర్షం కురిపించే అవకాశమూ లేకపోలేదు.

ఎలా చేద్దామంటే:

  • అక్టోబరు 1 నుంచి డిసెంబరు 10 వరకూ చేసుకుందాం. డిసెంబరులో తెలుగు వికీపీడియా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇది కూడా ఇంకొన్ని మంచి కారణాలు, విజయాలు ఇవ్వాలని ఆశయం.
  • అనువాద ఉపకరణం ఉపయోగించి అందులో మార్పులు చేసి దాన్ని వాడి ప్రచురిస్తేనే ఈ ఋతువులోకి వ్యాసాలు లెక్కకు వచ్చేలా ఖచ్చితమైన నిబంధన పెట్టుకుందాం. అనువాదం ఉపకరణంలో చేసి బయట ప్రచురించాం అంటే చెల్లదు. అలానే కొత్త వ్యాసాలే సృష్టించాలని కూడా కాదు. ఏదైనా వ్యాసం మరీ 5 వేల బైట్ల కన్నా చిన్నదిగా ఉంటే, మనం మరో పది వేల బైట్లు పెంచి రాసేట్టయితే ఈ పరిధిలోకి వచ్చేట్టు పెట్టుకుందాం.
  • వ్యాసాలు ఎన్ని రాశామన్నదాని కన్నా ఎంత బాగా రాశాం, ఎంత గొప్ప నాణ్యతా ప్రమాణాలు సృష్టించాం అన్నదే ముఖ్యం. దీనికోసం ముందు ఆంగ్ల వ్యాసం సరైనది ఎంపిక చేసుకోవడం, ఆపైన వ్యాసం రాశాకా ఒకరిది మరొకరు సమీక్షించడం, సాధ్యమైనంత వరకూ దోషరహితంగా వ్యాసాలను తయారుచేసేందుకు కృషిచేయడం వంటివి చేద్దాం. అంటే - ఒక వ్యక్తి - వ్యాసం అనువదించడం, వేరేవారి వ్యాసం సమీక్షించడం కూడా చేస్తారు. ఆ కారణంగా నెమ్మదిగానే పనిచేస్తే నెమ్మదిగానే సాగుతుంది. అందుకే రెండు నెలలా పది రోజుల సమయం పెట్టుకుంటున్నాం.
  • ఈ పనిలో పోటీ కూడా పెట్టుకుందాం. అంటే- ఇంత నాణ్యతా పాటిస్తూ మంచి నాణ్యతతో కూడిన అనువాదాలు చేసి, తోటి వారివి రివ్యూ చేయడంలో చురుగా పనిచేస్తూ పోటీలో ముందున్నవారిని గుర్తించి చాలా చిరు బహుమానాలు ఇచ్చుకుందాం.
  • ఈ క్రమంలో మనం నేర్చుకునేవాటిని, మరీ ముఖ్యంగా బహుళంగా అనువాద వ్యాసాలు ఆ ఉపకరణంలో రాసినవారు, పంచుకునేందుకు పేజీ పెట్టుకుని అనువాదం చేయడంలో, ఉపకరణాన్ని వాడడంలో చిట్కాలు, సూచనలు పంచుకుందాం. అవసరం అనుకుంటే ఏ నెలకో ఒకసారి చిన్నపాటి ప్రోత్సాహకర/శిక్షణ సమావేశాన్ని ఆన్‌లైన్‌ వీడియో కాల్ ద్వారానో, మరో రూపంలోనో నిర్వహించుకుందాం.

మొత్తానికి
చేయిచేయి కలిపి అనువాద ఉపకరణాన్ని, మన అనువాద నైపుణ్యాలను, తెవికీలో వ్యాసాలను మెరుగుపరుచుకుందాం. తెవికీ పుట్టినరోజు నాటికి మనకు మనమే మంచి నాణ్యమైన వ్యాసాలను, ఇంకొక మంచి ప్రయత్నాన్ని బహుమానం ఇచ్చుకుందాం. ఏమంటారూ? --పవన్ సంతోష్ (చర్చ) 09:09, 12 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆలోచన బాగుంది, నాకు నచ్చింది. నేను ఈ ప్రాజెక్టులో పాల్గొనేందుకు సిద్ధం. ఒక సూచన:
పైన రాజశేఖర్ గారు ప్రూఫ్‌రీడథాన్ ప్రకటించారు. మనకున్న సముదాయం పరిమాణం రీత్యా ఈ రెండూ ఏక కాలంలో నిర్వహించేదాని కంటే వేరువేరు సమాయాల్లో నిర్వహిస్తే బాగుంటుంది. అంచేత అక్టోబరు 15 తరువాత దీన్ని మొదలెట్టవచ్చేమో ఆలోచించండి. రెంటి లోనూ పాల్గొనే వారికి ఇది వీలు కలిగిస్తుంది.
ఇక ప్రాజెక్టు విధివిధానాలను రూపొందించండి, పవన్ సంతోష్ గారూ. __చదువరి (చర్చరచనలు) 04:51, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ఆలోచన.నేనూ పాల్గొంటాను.చదువరి గారూ పైన సూచించిన పై అభిప్రాయం రీత్యా, అక్టోబరు 15 తరువాత మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం .--యర్రా రామారావు (చర్చ) 05:50, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రెండు కార్యక్రమాలనూ ఒకటి తర్వాత మరొకటి నడిపిస్తే రెంటికి సఫలం చేయగలం. ఒకసారి ఆలోచించి; సరైన ప్రణాళిక తో ముందుకుపోదాం. వికీపీడియాకు అనువాద పరికరం ఉన్నది; వికీసోర్సుకు మంచి స్పష్టమైన కాపీలు చాలా అవసరం; వానిలో OCR తర్వాత తప్పులు తక్కువగా వస్తాయి. గురజాడలు, అడివి బాపిరాజు గారి పుస్తకాలు ఇందుకు మంచి ఉదాహరణ. ఎవరికైనా ఇతర ఆలోచనలు వస్తే దయచేసి తెలియజేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 08:33, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా సిద్ధమే. మరీ ఎక్కువరోజులు కాకుండా నవంబరు 1 నుండి డిసెంబరు 10 వరకు పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:03, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలను తొలగించుట కన్నా అనువాదం జరగని విభాగాలను తొలగించడం మంచిది

నేను 2012 లో తీగ వ్యాసం సృష్టించాను. ఆ వ్యాసంలో 3000 బైట్ల వరకు తెలుగులో సమాచారం ఉన్నది. ఆంగ్లంలో ఉన్న ఇతర సమాచారాన్ని తొలగించి ఈ వ్యాసాన్ని రక్షించవచ్చు. కానీ ప్రణయ్‌రాజ్ వంగరి గారు ఈ వ్యాసాన్ని తొలగించాలని తీర్మానం చేశారు. కావున నేను సృష్టించిన మరియు ఇతరులు సృష్టించిన ఇటువంటి వ్యాసాలను రక్షించుటకు

  • ఈ వ్యాసంలో ఎక్కువగా ఆంగ్ల పాఠ్యం ఉంది. వారం రోజులు (సెప్టెబరు 17) లోపు సవరించకుంటే తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి

ప్రస్తుగత 15:11, 18 నవంబర్ 2012‎ YVSREDDY చర్చ రచనలు‎ 20,314 బైట్లు +17,208‎ దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 15:04, 18 నవంబర్ 2012‎ YVSREDDY చర్చ రచనలు‎ 3,106 బైట్లు +224‎ దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 14:52, 18 నవంబర్ 2012‎ YVSREDDY చర్చ రచనలు‎ 2,882 బైట్లు +30‎ దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 14:48, 18 నవంబర్ 2012‎ YVSREDDY చర్చ రచనలు‎ 2,852 బైట్లు +2,045‎ దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 16:21, 17 నవంబర్ 2012‎ YVSREDDY చర్చ రచనలు‎ 807 బైట్లు +807‎ కొత్త పేజీ: తీగను ఆంగ్లంలో వైర్ అంటారు.

ఈ వ్యాసంలో ముఖ్యంగా అవసరమైన తెలుగు వారు సులభంగా అర్థం చేసుకోగల Wire Abbreviation లకు సంబంధించిన సమాచారాన్ని ఆంగ్లంలో ఉన్నది ఉన్నట్టుగా అదనంగా 17 వేల బైట్లు ఈ వ్యాసంలో చేర్చడం జరిగింది. ఒక వ్యాసానికి 2000 బైట్ల సమాచారం ఉండాలని నియమం 2012 లో లేదు. నేను ఎక్కువగా చిన్న వ్యాసాలను సృష్టిస్తున్నానని ఒక వ్యాసానికి కనీసం 2000 బైట్ల సమాచారం ఉండాలనే నియమమును తరువాత కాలంలో తీర్మానించారు. నేను సృష్టించిన ప్రతి వ్యాసంలో 2000 బైట్లకు మించి తెలుగు సమాచారాన్ని చేరుస్తానన్ని తెలియజేయడం జరిగింది. నేను సృష్టించిన వ్యాసాలలో 2000 బైట్ల కంటే తక్కువ సమాచారం ఉన్న వ్యాసాలకు అదనపు సమాచారం చేరుస్తున్నాను. నేను సృష్టించిన వ్యాసాలలో 2000 బైట్ల కంటే తక్కువ సమాచారం ఉన్నవి తొలగించినా, తొలగించిన వ్యాసానికి 2000 బైట్లకు మించి సమాచారం చేర్చి వాటిని తిరిగి సృష్టిస్తున్నాను. 2016లో రోజుకు ఒకటి లేదా అంతకుమించి వ్యాసాలను సృష్టించిన నేను, 2020లో కూడా 2016లో లాగే రోజుకు ఒకటి లేదా అంతకుమించి వ్యాసాలను సృష్టించాలనుకున్నాను, కానీ తక్కువ సమాచారం ఉన్న వ్యాసాల తొలగింపును వ్యతిరేకించడంతో నన్ను 2020లో నిరోధించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల అక్షాంశ రేఖాంశాలు మరియు చిత్రపటంలో ఆ ఊరిని గుర్తించి ఆ లింకు ద్వారా గూగుల్ మ్యాప్ లోకి నేరుగా చేరుకోగలగేలా చేసిన నేను, నేను సృష్టించిన వ్యాసాలు తొలగింపుకు గురికాకుండా చేసుకోగలను. కానీ ప్రణయ్‌రాజ్ వంగరి, కే.వెంకటరమణ గార్లు నేను ప్రారంభించిన వ్యాసాల తొలగింపే లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. అందువలన నేను ప్రారంభించిన వ్యాసాలను ప్రణయ్‌రాజ్ వంగరి, కే.వెంకటరమణ గార్లు తప్ప మరెవరైనా తొలగించేలా చేయవలసిందిగా వైజాసత్య గారిని, చంద్రకాంతరావు గారిని, చదువరి గారిని, అర్జున్ గారిని, సుజాత గారిని, రవిచంద్ర గారిని, రామారావు గారిని మరియు ఇతర నిర్వాహకులను కోరుచున్నాను. YVSREDDY (చర్చ) 09:53, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

YVSREDDY గారూ, వారిద్దరిపై మీ విమర్శ అసంబద్ధం, అసంగతం. వ్యాసాల తొలగింపే లక్ష్యంగానా..!!?? 900 మొలకలు, 250 మొలకలనూ విస్తరించిన వాళ్ళది వ్యాసాల తొలగింపే లక్ష్యమా!!? మీ దురుసు తనాన్ని నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. వాళ్ళు చేసిన విస్తరణలను మీరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలా దురుసుగా మాట్టాడినందుగ్గాను, నిజాన్ని గ్రహించి, పునరాలోచన చేసుకుంటే హుందాగా ఉంటది. ఎంచేతంటే...
మొలకలకు సంబంధించి జరుగుతున్న తొలగింపు చర్చల పట్ల గాని, వాటిపై మీరు పేర్కొన్న ఇద్దరు వాడుకరులు చేసిన, చేస్తున్న పని పట్ల గాని ఏమాత్రం తెలిసినట్టుగా లేదు మీకు. తొలగించిన మొలకలను 2 కెబిల స్థాయిని దాటిస్తూ తిరిగి సృష్టిస్తున్నట్టు మీరే చెప్పుకున్నారు. కానీ తొలగించే ముందే విస్తరించాలనే సంగతిని విస్మరించారు. పునఃసృష్గ్టి చేసిన కొన్ని వ్యాసాలను చూస్తే తొలగించిన వాటిని యథాతథంగా సృష్టించారు. మీరు చేస్తున్న పని పట్ల నేను చాలా నిరుత్సాహపడ్డాను. మొలకలపై పనిచేస్తున్న వాళ్ళంతా నిరుత్సాహపడి ఉంటారు. విశేషించి మీరు తెలుసుకోవాల్సినదీ, ఇప్పటివరకూ బహుశా మీరు గ్రహించనిదీ ఏంటంటే.. ఎవరి పైనైతే మీ వ్యాసాలను తొలగిస్తున్నారంటూ మీరు కత్తిగట్టారో వాళ్ళే మీరు సృష్టించిన అనేక మొలకలను విస్తరించారు. వాళ్లంతా మీతో కలిసి పనిచేసేందుకు చాలా సందర్భాల్లో ముందుకొచ్చారు. అందులో నేనూ ఒకణ్ణి. కానీ మీరే దూరంగా ఉండిపోయారు. వాళ్లకు కొత్త కొత్త పేర్లు పెట్టి నానా మాటలూ అన్నారు. (అనుభవజ్ఞులమని చెప్పుకుంటున్నవాళ్ళు ఆ సందర్భాల్లో నోరు మెదపలేదు. వాళ్ల కంటే మీరు చాలా నయం, అది వేరే విషయం). మీరు గాని, మీరు తిడుతూంటే మౌనంగా ఉండిపోయిన వాళ్ళు గానీ మొలకల విస్తరణ పనిని ఏనాడూ ముట్టుకోలేదు. కానీ ఇప్పుడు పైన మీరు విమర్శించిన ఇద్దరూ ఏం చేసారో తెలుసా..? 2,800 మొలకలను విస్తరించిన ఉద్యమానికి నడుం కట్టారు. స్వయంగా తామే వందల కొద్దీ వ్యాసాలను విస్తరించారు (వెంకటరమణ గారు 900 వ్యాసాలు, ప్రణయ్ రాజ్ గారు 250 వ్యాసాలనూ విస్తరించారు). వాళ్ళేమీ ఈ సంగతిని ఊరంతా చెప్పుకోలేదు, డప్పేసుకోలేదు. (ఈ సంగతి చెప్పమని నన్ను వాళ్ళేమీ అడగలేదండీ... మీరు ఇన్నేసి మాటలన్నాక కూడా నేను ఈ ముక్క చెప్పకపోతే, వాళ్ళ పట్ల తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది, నేనూ అనుభవజ్ఞుల జాబితా లోకి చేరిపోతాను. అందుకే రాస్తున్నాను.)
కింది జాబితా చూడండి.. ఇవన్నీ మీరు సృష్టించిన మొలకలే. ఇవన్నీ ఈ మధ్య జరిగిన మొలకల విస్తరణ ఋతువులో విస్తరించినవే. వీటిలో సింహభాగాన్ని విస్తరించినది మీ చేత ఇప్పుడు విమర్శా సత్కారం పొందిన పై ఇద్దరూ, గతంలో మీ చేత పేర్లు పెట్టించుకుని తిట్టించుకున్న వాళ్ళూను. ఏదో మొక్కుబడిగా 2 కెబిలు దాటిద్దామని మీరు అనుకున్నట్టు వీళ్ళు అనుకోలా. 5 కెబి, 10 కెబి, 13 కెబి, 15 కెబి లు కూడా ఉన్నాయి ఈ పేజీల్లో. వికీపీడియా పట్ల వీళ్ళకున్న నిబద్ధత గురించి కనీసమాత్రపు గ్రహింపు ఉంటే మీరు గాని మరెవరు గానీ "ఇలా" విమర్శించ కూడదు. లేదూ నేను ఇలాగే ఉంటాను అంటారా.. ఇక మీ ఇష్టం.
1 అలకలతోపు 26 స్టీమ్‌బోట్ వేడినీటి బుగ్గ 51 ‎మకర తోరణం
2 నిమ్మకాయల చిన్న రాజప్ప 27 గ్రేట్ మొగల్ డైమండ్ 52 ఎడారి టేకు
3 గంగుల ప్రతాపరెడ్డి 28 ఫర్బిడెన్ సిటీ 53 హరిద్ర
4 పతివాడ నారాయణస్వామి నాయుడు 29 హెర్మన్ స్నెల్లెన్ 54 అలంకార మొక్క
5 వై.యస్.రాజారెడ్డి 30 స్నెల్లెన్ చార్ట్ 55 ఊట మొక్క
6 24 (సంఖ్య) 31 ప్రపంచ జల దినోత్సవం 56 కనప
7 తిరుమల ఆర్జిత వసంతోత్సవం 32 1742 57 రాళ్లమొక్క
8 నరసింహ సరస్వతి 33 కావనల్ కొండ 58 కాకిచెరకు
9 బొల్లినేని వెంకట రామారావు 34 నూరెక్ ఆనకట్ట 59 కణుపు
10 రావి నాగలక్ష్మి 35 తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం 60 ఎర్ర వండ పూలు
11 మత్ ‌గుత్‌మిల్లర్ 36 తిరుమల సహస్ర దీపాలంకరణ 61 పందిరి
12 42 (సంఖ్య) 37 కోచింగ్ 62 ఆవారాగాడు
13 పసుపు కాంచనం 38 క్యాంపస్ 63 మిత్రవింద
14 మెగా 39 జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష 64 ప్రపంచ హృదయ దినోత్సవం
15 తెల్ల బంగారం చెట్టు 40 జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 65 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
16 నవ్యాంధ్ర 41 ప్రభుత్వ విశ్వవిద్యాలయం 66 జాతీయ వృద్ధుల దినోత్సవం
17 మహా సరస్సులు 42 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 67 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
18 తిరుమల శిలాతోరణం 43 లేడీ హార్డింజ్ వైద్య కళాశాల 68 ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం
19 సన్ రైజ్ కంట్రీ 44 డీమ్యాట్ ఖాతా 69 నిరృతి
20 పద్మ నది 45 ద్రవ్యం 70 భద్రాదేవి
21 వోల్గా నది 46 రాండమ్ ఏక్సెస్ మెమరీ 71 తల్లివేరు
22 ఓబ్ నది 47 రీడ్ ఓన్లీ మెమరీ 72 ఆల్టర్నేటర్
23 యెనిసెయి నది 48 చిటిక 73 ఎలక్ట్రిక్ జనరేటర్
24 ఆమ్‌స్టర్‌డ్యామ్ 49 ఎకరం 74 ఇన్‌ఫ్రాసౌండ్
25 మిస్సోరి నది 50 సెంటెనియల్ లైట్ 75 అవుట్పుట్ డివైస్

ఇక, ఇంగ్లీషు భాగాన్ని తీసేసి మిగతా భాగాన్ని ఉంచాలని మీరిచ్చిన సలహా.. మేం ఈసరికే ఆ పని చేస్తున్నాం. మీరూ ఆ పని చెయ్యడం మొదలుపెట్టండి. కనీసం మీరు తయారు చేసిన మొలకలను విస్తరించడం, ఇంగ్లీషు తీసెయ్యడం/అనువదించడం వగైరాలు చెయ్యండి. వికీ అభివృద్ధికి తోడుపడండి. నమస్కారం.__చదువరి (చర్చరచనలు) 11:18, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వై వి ఎస్ రెడ్డి గారు, నమస్తే వికీపీడియాలో మీరు సృష్టించిన వ్యాసాల సంఖ్య చాలా సమయం వెచ్చించారు, అన్ని వ్యాసాలు సృష్టించడం మామూలు విషయం కాదు, అభినందించాలి, గ్రామాల అక్షాంశ రేఖాంశాలు ఆ ఊరిని గూర్చి గుర్తించేలా లింక్ తయారు చేయడం చాలా గొప్ప విషయం నేను మీకు అభిమాని, ఇటీవల మొలకల వ్యాసాలను విస్తరించడం జరిగింది గమనించే ఉంటారు. అలాంటి మొలకలు సృష్టించడం కొత్త వాడుకరులకు తెలియక సమాచారం, లేక అయి ఉంటుంది. కానీ ఎంతో అనుభవం ఉన్న మీలాంటి వాళ్లు కావాలని వదిలేయడం చాలా బాధాకరం, దానికి నిర్వాహకులు ఇతర సభ్యులు నెలల కొద్దీ సమయం వెచ్చించి వాటిని అభివృద్ధి చేయడం అంటే వారి విలువైన సమయానికి మీలాంటివారు బాధ్యులు అవుతారు, అది గుర్తించండి. మొలక వ్యాసాలకు నేను చాలా వ్యతిరేకిని ఎంతో ఆశగా నాలాంటి వారు గూగుల్ లో ఒక వ్యాసం గురించి వెతికితే దానిలో నాలుగు ఐదు లైన్లు వ్యాసం మొలకగా ఉంటే వారు ఎంత నిరుత్సాహ పడతారు నేను నీకు చెప్పకరలేదు, అది సృష్టించిన వారిని మనసులో ఏమనుకుంటారో కూడా మీరే ఊహించండి. మొలకల విస్తీర్ణం లో కూడా నేను వెయ్యి రెండు వేలు బైట్లు ఇస్తే సరిపోతుంది. పైన చెప్పిన ఈ విధంగా సమాచారం లేకపోతే ఆ వ్యాసం మీద తెలుగు వికీపీడియా మీద అందులో ఏమీ కావలసిన సమాచారం లేకపోతే తెలుగు వికీపీడియాపైన తప్పుడు అభిప్రాయం పడుతోంది. కాబట్టి దయచేసి మీ అభిమానిగా నేను కోరుకునేది మీరు రాసిన అన్ని మొలకలు విస్తరించండి. నిర్వాహకులైన వెంకటరమణ గారు, ప్రణయ్ గారు మీకు శత్రువులు కాదు, వారు చేసే పని చేస్తున్నారు గాని మీ మీద వారికి మీకు వారికి ఆస్తి తగాదాలు, భూ తగాదాలు లేవు కదా మరెవరైనా తొలగిస్తే లేని అభ్యంతరం వారు తొలగిస్తే ఎందుకు అనేది నాకు అర్థం కాని విషయం ఒక వాడుకరిగా ఇంతకంటే ఎక్కువ ఎంతో అనుభవం మీకు చెప్పడం బాగోదు. ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్ నోముల 11:44, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వై వి ఎస్ రెడ్డి గారూ, వెంకటరమణ, ప్రణయ్ రాజ్ గారు చేస్తున్న పనిలో నాకు తప్పేమీ కనిపించడంలేదు. మొలకల విస్తరణ ఉద్యమం దృష్ట్యా వారు చిన్న వ్యాసాలన్నింటి మీదా దృష్టి పెడుతున్నారు. అందులో మీ వ్యాసాలు ఎక్కువగా ఉండటం దురదృష్టకరం. అవి మీకు సాధ్యమైనంతమేరకు విస్తరించడం మాని, వారిపైన ఆరోపణలు చేయడం తగదు. - రవిచంద్ర (చర్చ) 13:11, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వై వి ఎస్ రెడ్డి గారూ తోటి గౌరవ వికీపీడియన్లుపై ఇలాంటి ఈ చర్చను పెట్టి మీస్థాయిని మరింతదిగజార్చుకున్నారు.వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తీగ వ్యాసం చర్చాపేజీలో ఎటువంటి స్పందన తెలియజేయలేదు.తొలగింపు చర్చాపేజీలలో స్పందించకుండా, తొలగించిన తరువాత వాటిని తిరిగి అదే పద్దతిలో సృష్టించటంలాంటి అలవాటులో ఎటువంటి మార్పురాలేదు.మీరు ఒకటి ఆలోచించండి.మీవి మాత్రమే తొలగిస్తున్నారనే మాట వాస్తవం కాదు.ఒక వేళ అదే నిజమని మీరు భావిస్తే మీ వ్యాసాలన్నింటిలో ఆలోపాలు ఉన్నందుననే తొలగింపుకు గురౌతున్నాయి.మీ వ్యాసాలు మాత్రమే ఎందుకు తొలగింపుగురౌతున్నాయి అనే దాని మీద దృష్టిసారించి, వాటిని సవరించకుండా, అసందర్బ చర్చలు, లేదా నిర్వాహకుల మీద అనుచిత వాఖ్యలు చేసి కాలయాపన చేస్తున్నారేగానీ, చాలెంజ్ గా తీసుకుని వీళ్లా నా వ్యాసాలు తొలగించేది, వాళ్లకు ఒక్క వ్యాసం కూడా తొలగించటానికి అవకాశం ఇవ్వను అనే ప్రయత్నం గురించి మీరు ఆలోచిస్తున్నట్లు లేదు. ఇటువంటి చర్చలు వికీనియమాలకు విరుద్దంగా ఉన్న వ్యాసాల తొలగింపు చర్యలకు మినహాయింపు కాజాలవు.ఒకప్పుడు చదువరి, వెంకటరమణ, ప్రణయరాజ్ నాతో సహాకలిపి నలుగురిమీద ద్వజం ఎత్తావు.మరలా ఈ రోజు కొత్త పంథా ఎంచుకున్నావు.అవసరాలకు తగ్గట్టుగా ప్రవర్తించటం మంచిదికాదు.ఇంకొకరోజు చదువరి గారు, రామారావు గారు నావ్యాసాలు తొలగించకుండా వెంకటరమణ గారూ, ప్రణయరాజ్ గారు తొలగించేటట్లు చర్యలు తీసుకోండని మరొక చర్చను ప్రవేశపెట్టే కొత్త పంథా ఎన్నుకోవని నమ్మకమేంటి?ఏది ఏమైనా ఇది హర్శించదగ్గ విషయం కాదు.ఇప్పటికైనా తోటి వాడుకరులు, నిర్వాహకులపై నిందలు, అనుచిత వాఖ్యలు మానుకుని, సీనియర్ వాడుకరి అనే పదానికి గౌరవం చేకూరేట్లు మసలుకుంటే బాగుంటుందని మీ శ్రేయస్సు కోరి చెపుతున్నాను.ఇది హెచ్తరిక కాదు.తోటి వాడుకరిగా మంచిమనస్సుతో చెపుతున్నాను.2013 ఏప్రిల్ నుండి మొలకల నియంత్రణ విధానం అమలులోకి వచ్చింది.ఆ విషయం మీకు తెలుసు.మీ వ్యాసాలన్నీ 2012లోనే సృష్టించబడలేదు కదా?మొలకల నియంత్రణ విధానం అమలులోకి వచ్చిన తరువాతకూడా వందల వ్యాసాలు 2000 బైట్లులోపు ఉన్నవి.మీరు ఇది ఒక సాకుగా చెప్పినా సందర్బానికి సరిపోవాలగదా?అలాంటిదేమీ లేదు.పొనీ సృష్టించారు,ఆ తరువాత అయినా మీరు విస్తరించి, మూలాలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అదీ లేదు.ఇంక ముందైనా మీ వ్యాసాలు తొలగింపులకు గురికాకుండా చూసుకుంటారని ఆశిస్తూ....--యర్రా రామారావు (చర్చ) 13:33, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆరోపణలు నిరూపించుకోలేకపోతే వైవిఎస్ రెడ్డి గారిపై చర్యలు

"వ్యాసాలను తొలగించుట కన్నా అనువాదం జరగని విభాగాలను తొలగించడం మంచిది" - అన్నారు, బావుంది. అయితే, ఆ ముక్క చెప్పిన వైవియస్ రెడ్డి గారే చేయడం బావుంటుంది. అదే కాదు, ఆ వ్యాసాన్ని మెరుగుపరచడం ఇంకా మంచిది. వైవియస్ రెడ్డి గారికి 2012 నుంచి ఆ వ్యాసం అలానే ఉండగా, ఈనాడు వేరెవరో గుర్తించి తొలగిస్తూంటే ఈ నీతి గుర్తుకురావడం బావోలేదు. YVSREDDY గారూ! వికీపీడియా నాలుగవ మూలస్తంభమైన "వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి" అన్నది చదువుకుని ఇక నుంచి చర్చలో పాల్గొనవలసిందిగా మీకు సూచన చేస్తున్నాను. దాదాపు దశాబ్ద కాలం వదిలివేసిన వ్యాసాల మీద నిర్వాహకులు చర్య తీసుకోబోతుంటే వారి మీద కారణం లేకుండా దాడి చేయడం వేధింపు కిందికి వస్తుంది. "నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప." అని నాలుగో మూలస్తంభం చెప్తోంది. ఇప్పుడు - ప్రణయ్ రాజ్, వెంకట రమణ గార్లు నిబద్ధతతో లేరని, మీ ఆరోపణలు నిజమని మీరు తిరుగులేని సాక్ష్యంతో నిరూపించనన్నా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి. ఈ రెండిటిలో ఏదీ ఒక వారంలోగా జరగకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు వ్యతిరేక స్పందనలు తెలిపిన చదువరి, ప్రభాకర్ గౌడ్ గార్లపై కానీ, ఈ హెచ్చరిక చేస్తున్న నాపై కానీ దురుసుగా, అనుచితంగా వ్యక్తిగతమైన దాడికి దిగే పక్షంలో ఆ వారం గడువు రద్దయి తక్షణ చర్యలు జరుగుతాయని తెలియజేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:25, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

గమనిక: పైన వైవియస్ రెడ్డి గారు రాసిన దానిలో "ప్రణయ్‌రాజ్ వంగరి, కే.వెంకటరమణ గార్లు నేను ప్రారంభించిన వ్యాసాల తొలగింపే లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. అందువలన నేను ప్రారంభించిన వ్యాసాలను ప్రణయ్‌రాజ్ వంగరి, కే.వెంకటరమణ గార్లు తప్ప మరెవరైనా తొలగించేలా చేయవలసిందిగా వైజాసత్య గారిని, చంద్రకాంతరావు గారిని, చదువరి గారిని, అర్జున్ గారిని, సుజాత గారిని, రవిచంద్ర గారిని, రామారావు గారిని మరియు ఇతర నిర్వాహకులను కోరుచున్నాను." అన్న భాగంలో మొదటిది ప్రణయ్ రాజ్, వెంకటరమణ గార్ల నిబద్ధతపై ప్రత్యక్ష దాడి. రెండవది, వారిపై చర్యలు తీసుకొమ్మంటూ ఈ వ్యవహారంలో కలగజేసుకొమ్మని వారిద్దరూ మినహా ఇతర నిర్వాహకులందరినీ కోరుతూ పిలుపు. మొదటి భాగంలో వైవియస్ రెడ్డి గారు ప్రణయ్, రమణ గార్ల నిబద్ధతపై చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోగలిగినంత పాటి ఆధారాలు ఇవ్వలేదు. ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసేప్పుడు ఆధారాలు ఇవ్వక్కర లేదనుకోవడం సరికాకపోగా వికీపీడియా మూలస్తంభమైన "తిరుగులేని సాక్ష్యం ఉన్నంతవరకూ ఎదుటివారికి మీ అంత నిబద్ధత ఉందని నమ్మడాన్ని" వమ్ము చేస్తోంది. కాబట్టే పిలుపును అందుకున్న నిర్వాహకుల్లో ఒకనిగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 12:32, 14 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

  1. గాలి ఉంటేనే ఏ జీవి అయినా సంతోషంగా జీవించగలదు, గాలి అనేది లేదు, ఉంటే నాకు చూపించు అంటే ఎవరు చూపించలేరు. నిద్రపోతున్న వారిని లేపగలము గాని, నిద్ర నటిస్తున్న వారిని లేపలేము. సృష్టించబడిన రోజే తీగ వ్యాసంలో 3000 బైట్లకు మించి తెలుగులో సమాచారం ఉంది. అదనంగా చేర్చబడిన ఆంగ్ల సమాచారం అందరికి అర్థమయ్యే వైర్ అబ్రివేషన్ లకు సంబంధించిన ఒక పెట్టె. పవన్ సంతోష్ గారు మీ ఆరోపణలు నిజమని మీరు తిరుగులేని సాక్ష్యంతో నిరూపించనన్నా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి అని నన్ను అడిగే బదులు, 3000 బైట్లకు మించి తెలుగులో సమాచారం ఉన్న వ్యాసాలను ఎందుకు తొలగిస్తున్నారు, తిరుగులేని సాక్ష్యంతో నిరూపించనన్నా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి అని వ్యాసాలను తొలగిస్తున్న వారిని అడగవచ్చు కదా. YVSREDDY (చర్చ) 16:55, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాదాలు ఉడికాయో లేదో.. ఇదుగో పది మెతుకులు చూడండి

అనువాద ఉపకరణంలో మానవిక అనువాద శాతాన్ని ప్రస్తుతమున్న 30% నుండి యథా పూర్వ స్థితికి తీసుకెళ్ళాలని అర్జున గారు పట్టుబట్టారు. 30% కు మార్చకముందు ప్రచురించిన కొన్ని అనువాదాలను చాలా ర్యాండమ్‌గా తీసుకుని తయారు చేసిన పట్టిక కింద ఉంది. వీటిలో ఒక వ్యాసం ఈ వాక్యంతో మొదలౌతుంది: "ఈ సందర్భంలో సాధారణంగా కాకి కి సంబందించిన పక్షులు రెండు జాతులు ఉన్నాయి". మచ్చుకు ఈ పేజీల్లోని మరికొన్ని వాక్యాలు:

  • రోటీని సాంప్రదాయకంగా ఆటా అని పిలుస్తారట.
  • "చదువులపై ఆసక్తి లేకపోవడం మరియు కబడ్డీపై అతనికున్న ప్రేమకు నిరంతరం అతన్ని చితకబాదారు. దీనికి విరుద్ధంగా, అతని తల్లి అతనిపై చుక్కలు చూపిస్తుంది, మరియు అతని చెల్లెలు భువన , పదునైన మరియు పరిశోధనాత్మక పాఠశాల విద్యార్థి, వేలును వారి తండ్రితో నిరంతరం ఇబ్బందులకు గురిచేస్తుంది , అయినప్పటికీ అతను ఆరాధిస్తాడు."
  • "రెండు జాతులు జీవితానికి జత చేస్తాయి, వాటి సంతానోత్పత్తి ప్రదేశాలకు విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి, ఇవి సాధారణంగా ఒక గుట్ట ముఖంలో గుహలు లేదా పగుళ్ళు. వారు ఒక చెట్లతో కూడిన గూడును నిర్మించి, మూడు నుండి ఐదు గుడ్లు పెడతారు."
  • "1948 నుంచి వినియోగంలో సైతం భాష్పీభవన ఉత్సర్జనం తోపాటు ఉష్ణోగ్రత మరియు అవపాతం సమాచారం చేపడుతుంది మరియు దీనిని జీవ వైవిధ్యం అధ్యయనంలో ఉపయోగిస్తారు మరియు వాతావరణ మార్పుని ఇది ప్రభావితం చేస్తుంది. వాయు ద్రవ్యరాశి యొక్క మూలం బెర్గెరాన్ మరియు ప్రాదేశిక సినోప్టిక్ వర్గీకరణ వ్యవస్థలు ఒక ప్రాంతం యొక్క వాతావరణాన్ని నిర్వచించే దృష్టి పెడతాయి."
  • "తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య యొక్క ప్రారంభ దశలలో, గతంలో ఒక నిర్దిష్ట ప్రోటీన్ లేదా ప్రోటీన్ భిన్నానికి సున్నితత్వం కలిగిన లింఫోసైట్లు స్రవింపబడిన IgE (sIgE) అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం యాంటీబాడీని త్వరగా ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తాయి, ఇది రక్తంలో తిరుగుతుంది మరియు IgE- నిర్దిష్ట గ్రాహకాలతో బంధిస్తుంది మాస్ట్ కణాలు మరియు బాసోఫిల్స్ అని పిలువబడే ఇతర రకాల రోగనిరోధక కణాల ఉపరితలం. ఈ రెండూ తీవ్రమైన తాపజనక ప్రతిస్పందనలో పాల్గొంటాయి."
  • "దంతాలలో రత్నాలను చొప్పించడం హిప్ హాప్ సంస్కృతిలో ముందే ఉంది. ఇప్పుడు మెక్సికోలో సంపన్న మాయన్లు వారి దంతాలలోకి రంధ్రం చేసినప్పుడు జాడే ముక్కలను అమర్చుకోవడం ప్రారంభమైంది." - ఈ వాక్యాల మూలాన్ని చూస్తే తెలుస్తుంది, ఈ అనువాదంలో ఎంత దోషముందో, "జాడే" ముక్కలంటే ఏంటో.

ప్రచురించే ముందు ఒక్కసారి వాటి వంక చూస్తే చాలా దోషాలను పరిహరించ గలిగే వాళ్ళు. దోషాలేంటో తెలియక కాదు.

ఈ జాబితా లోని వ్యాసాల్లో లక్షా ఇరవై రెండు వేల బైట్లున్న ఒక వ్యాసాన్ని కేవలం మూడున్నర గంటల్లో అనువదించి ప్రచురించేసారు. దానిలో మానవిక అనువాదం 1%

సం. తొలి ప్రచురణ కూర్పు పేజీ పేరు మానవిక అనువాద శాతం
1 [1] పాలు_అలెర్జీ 1.00%
2 [2] గ్రిల్_(ఆభరణాలు_) 1.57%
3 [3] రెండు రకాల కాకిజాతులు 1.66%
4 [4] అర్జెన్_రోబెన్ 15%
5 [5] గినియా పిగ్ 12.99%
6 [6] రోటి 19.30%
7 [7] కథియావారి_గుర్రం 8.74%
8 [8] శీతోష్ణస్థితి 14.28%
9 [9] ఘిల్లి 7.19%
10 [10] శ్వేతా_బసు_ప్రసాద్ 9.36%

అర్జున గారూ, పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 10:05, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా పైన బారం పడుతుందా

నిర్వాహకుల అందరికీ నమస్కారం, ప్రతిరోజు కొత్త వాడుకరులు అజ్ఞాత వ్యక్తులు నియమాలు తెలిసి తెలియక కొత్త పేజీలను సృష్టిస్తూనే ఉంటారు ... యాంత్రిక భాష ఉన్న పేజీలు కూడా సృష్టిస్తారు. సుమారు ఐదువేల బైట్లల తో ఒక వ్యాసం సృష్టిస్తే... కొత్త పేజీల వలన వికీపైన భారం ఎంత మేర నష్టం, అలాగే కొన్ని పేజీలను తొలగిస్తాం... ఆ నష్టాన్ని తగ్గించుకోవచ్చా ఉదా. 05.02.2020 రోజున సుమారు 1700 పైగా పేజీలను నిర్వాహకులైన మీరు తొలగించారు. ఈ తొలగింపుల వలన వికీ కి కొంతం అయినా జరిగిన నష్టం తిరిగి వికీ కి పుడ్చుకోవస్తూందా?. ఎందుకు అడిగాను అంటే ప్రయోగశాలలో అనువాదాలు చేసి మరల ప్రయోగశాలలో తొలగించి వ్యాసాంగా కొత్త పేజీలు రాస్తాం కదా... దాని గురించి ఈ ప్రశ్న.... దయచేసి వివరించగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 15:56, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ గారూ, మీరు అడిగే ప్రశ్నలు నాకు కొంత అయోమయాన్ని కలిగిస్తున్నాయి. 1700 పేజీల అసహజమైన అనువాదాలు తొలగించడం వల్ల వికీకి నష్టం లేకపోగా లాభం అని తెలుగు వికీపీడియా సముదాయ నిర్ణయించి తొలగించింది. ఐతే, ఏమిటి ఇప్పుడు సమస్య? --పవన్ సంతోష్ (చర్చ) 05:12, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, ప్రయోగశాలలో అనువాదాలు చేసి మరల ప్రయోగశాలలో తొలగించి వ్యాసాంగా కొత్త పేజీలు రాస్తాం కదా...వికీపీడియా పైన బారం పడుతుందా లేదా అని అడిగాను గురువా. అయోమయాన్ని కలిగిస్తే వదిలేయండి. ధన్యవాదాలు. Prabhakargoudnomula 05:23, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానానికి ఓటు ప్రక్రియ ముగింపు 2020-09-20 23:59(UTC)

కొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానానికి ఓటు ప్రక్రియ ముగింపు 2020-09-20 23:59(UTC) అనగా ఇంకా నాలుగు రోజులలో. ఇప్పటికే 12 మంది ఓటు ప్రక్రియలో పాల్గొన్నారు. వారందరికి ధన్యవాదాలు. అర్హులైన సభ్యులందరు తమ అభిప్రాయాన్ని సులభంగా అనుకూలం, తటస్థం లేక వ్యతిరేకం విభాగాలలో వికీసంతకంచేయటం ద్వారా తెలియచేయవచ్చు. కావున వెనువెంటనే ఓటు వేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సహకారానికి ముందస్తు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:36, 16 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఓటింగ్ ప్రక్రియలో మీరు పెట్టిన ప్రతిపాదనలు పరస్పర విరుద్ధమైన ప్రాతిపదికలతో వచ్చినవీ, చర్చలో తిరస్కరణ పొందినవీ అని చర్చలో పాల్గొన్నవారిలో అత్యధికులు, అనువాద ఉపకరణం ఎంతగానో వాడి కృషిచేసినవారూ అంటూ ఉంటే, మరోపక్క ఇప్పటికే ఓటు వేసినవారిలో ఒకరిద్దరు చర్చ చూసి నిరుత్సాహపడుతూ ఉంటే - ఈ ప్రచారం ఏమిటీ? --పవన్ సంతోష్ (చర్చ) 05:06, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్తగా సృష్టించే పేజీలకు ఎన్వికీ లింకులు

కొత్తగా సృష్టించే పేజీలకు ఎన్వికీ లింకులు ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఆ లింకులు ఉండడం లేదు. వాటిని చేరిస్తే కింది ప్రయోజనాలుంటాయి.

  1. తెలుగు వ్యాసం చదివిన పాఠకుడికి ఇంగ్లీషు వ్యాసం కూడా చదివి అందులో మరింత సమాచారం ఉంటే తెలుసుకునే వీలు కలుగుతుంది.
  2. నేరుగా ఇంగ్లీషు వ్యాసానికి వెళ్ళిన తెలుగు పాఠకుడికి తెలుగు వ్యాసపు లింకు తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చి ఈ వ్యాసం చదవవచ్చు. అసలు తెలుగు వికీపీడియా అనేది ఒకటి ఉంది అనే సంగతి కూడా
  3. సాధారణంగా ఎన్వికీ పేజీకి వికీడేటాలో పేజీ ఉండే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్వికీ లింకు చేర్చగానే సంబంధిత వికీడేటా పేజీలో తెవికీ పేజీ లింకు ఆటోమాటిగా చేరిపోతుంది. ఇదొక సౌకర్యం.
  4. చివరిగా.. అలా ఎన్వికీ లింకు ఉండని పేజీల కోసం వికీడేటాలో ఓ కొత్త పేజీని సృష్టిస్తారు. ఇది ఒక బాటు ద్వారా జరుగుతుంది. అంటే అవసరం లేని ఓ పేజీ తయారౌతుందన్నమాట. దీన్ని నివారించవచ్చు.

ఈ విషయం తెలియని సముదాయ సభ్యులకు ప్రయోజనకరంగా ఉంటుందని రాస్తున్నాను. మరో సంగతి.. అనువాద పరికరం ద్వారా అనువాదం చేస్తే ఈ లింకు దానంతటదే చేరిపోతుంది. __చదువరి (చర్చరచనలు) 04:51, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు, మంచి పాయింటు. నేను ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతే ఇది. కానీ నాకు తెలుసు కాబట్టి అందరికీ తెలియాలని నియమమేమీ లేదు. ఇలా మనకు తెలిసిన విషయాలు, అందరికీ తెలిసుంటుందిలే అనుకోకుండా ఇలా పంచుకుంటే తెలియని కొద్ది వాళ్ళకి కూడా మన ట్రిక్కులు తెలియజేసినట్లుంటుంది. నేను కూడా ఇలాంటి విషయాలన్నీ గుర్తు చేసుకుని రాస్తాను. ముఖ్యంగా వికీ డేటా, వికీపీడియా పేజీలకు ఉన్న సంబంధం గురించి. - రవిచంద్ర (చర్చ) 06:00, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, రవిచంద్ర గారూ మీకు తెలియవని కాదు.తెలియని వారు తెలుసుకుంటారు అనే భావనతో నేను చేస్తున్నవి, నాకు తెలిసినవి చెపుతున్నాను.వికీ డేటాకు లింకు లేని లేదా ఇవ్వని పేజీలు నేను ఎక్కువుగా మొలకలు విస్తరణలో గమనించాను.నేను విస్తరించిన వ్యాసాలుకు లింకులు కలపటమే కాకుండా, కొన్ని పేజీలుకు ఒక పనిగా పెట్టుకుని ఆంగ్ల వ్యాసాల వికీడేటాకు లింకులు కలిపాను.ఇందులో ఏ రకాలు ఏ విధంగా ఏర్పడుతున్నవి అనేదానిని నాకు తెలిసినంతవరకు వివరిస్తున్నాను.
  • ఆంగ్ల వ్యాసంతో సంబంధం లేకుండా కొత్త వాడుకరులు కొత్తగా సృష్టించే వ్యాసాలుకు ఎక్కువుగా ఉంటున్నవి.
  • కొద్దిగా అవగాహన ఉన్నవారు ఆంగ్ల వ్యాసం ఎంచుకుని, అందులో ఆంగ్లసమాచారంను గోగుల్ ట్రాన్సులేట్, లేదా డైరెక్టుగా సృష్టించిన పేజీలో ఆంగ్ల సమాచారం నింపి, అనువాదం చేసి ఆంగ్ల పాఠ్యం తొలగించి, ఆంగ్ల వ్యాసానికి వికీ డేటా లింకు కలుపకుండా దీనికి కొత్త వికీడేటా లింకు ఇవ్వటం, లేదా ఎటువంటి లింకు ఇవ్వకుండా వదిలి వేస్తున్నారు.
  • మరి కొన్ని సందర్బాలలో తెవికీలో సవరణలు చేసేటప్పుడు వికీ డేటా లింకు లేని వ్యాసాలు గమనించి, ఆంగ్ల వ్యాసం ఉందా, లేదా అని గమనించకుండా కొత్తగా వికీ డేటా లింకు ఇస్తున్నారు. దాని వలన వికీ డేటాలో రెండు లింకులు ఉంటున్నవి.

పై వాటికి ఎలా పరిష్కరించాలి అనే దానికి వస్తే గౌరవ వికీపీడియన్లు వికీ డేటాకు లింకు కలపటం తెవికీలో ఇదొక భాగం అని ముందుగా గుర్తించాలి.వ్యాసం ఎడిట్ చేసేటప్పుడు వ్యాసానికి ఎడమ వైపు వికీ డేటా లింకు ఉన్నదో లేదో పరిశీలించాలి. పరిశీలించి నప్పుడు ఆంగ్ల వ్యాసానికి, తెలుగు వ్యాసం లింకు ఉంటే అది 'ఒకెే' అని భావించ వచ్చు.లేకపోతే లింకు కలపాలి.కేవలం తెలుగు పేజీకి మాత్రమే ఉన్నదని గమనిస్తే, అదే పేరుతో ఆంగ్ల శీర్షికతో సమయస్పూర్తిగా, కొద్దిగా వికీడేడేటాలో వెతకాలి.(సెర్చి).ఒకవేళ మరొక వికీ డేటా సంఖ్యతో ఆంగ్ల పేజీ ఉన్నదనుకోండి,ఈ రెండిటిని Merge చేయాలి.చాలా ఈజీగా చేయవచ్చు.మొదటిసారి అడిగి తెలుసుకొని, ఆ తర్వాత ఎవరితో పని లేకుండా చేయవచ్చు.ఇంకొక విషయం.వికీ డేటా లింకులు కలపటం ఎంత ముఖ్యమో, ఒక్కో సందర్బంలో తొలగించుటకూడా అంతే ముఖ్యం.అది ఏ సందర్బంలో జరుగుతుంది అనే దానికి వస్తే. ఇది ఎక్కువుగా తొలగించిన పేజీల సందర్బంలో జరుగుతుంటుంది.ఏదైనా ఒక పేజీని తొలగించిన సంధర్బంలో, దీనికి వికీ డేటా లింకు ఉన్నది.దానికి వెళ్లి సవరించండి అని తెలుపుతుంది.తొలగించిన పేజీకి లింకు అవసరంలేదు కనుక ఇది కూడా అదే సమయంలో సరిచేస్తే తొలగింపు పని పరిపూర్ణమవుతుంది. పైన వివరించిన అన్ని రకాలు సవరణలు వికీడేటాలో ఈరోజువరకు నేను 4969 సవరణలు చేసాను.మనకు తెలియనిదానిలో తెలుసుకోవాలని తపన మనలో ఉన్నప్పుడు, అదే మనల్ని తెలుసుకునేటట్లు అవకాశం కల్పిస్తుందని నాఅనుభవరీత్యా చెపుతున్నానుకానీ, ఇక్కడ నా గొప్పతనం గురించి చెప్పానని భావించవద్దు.కొంత మందికి అయినా అవగాహన కలిగితే సంతోషిష్తాను.--యర్రా రామారావు (చర్చ) 07:22, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఏదన్న కొత్త వ్యాసం రాసేముందు ఆ వ్యాసం ఇంగ్లీషు వికీపీడియాలో ఉందోలేదో, ఉంటే ఆ వ్యాసంకి తెవికీ వ్యాసం లింకు ఉందోలేదో పరిశీలుస్తూ ఉంటాను. చాలావాటికి లింక్స్ ఇవ్వడంలేదు. అలా ఇవ్వకపోవడం వల్ల ఆ వ్యాసం తెవికీలో లేదనుకుంటాం. వికీ ఛాలెంజ్ లో భాగంగా రెండుమూడుసార్లు వ్యాసాలు రాసి, ఆ వ్యాసాలకు సంబంధించిన పేజీల్లో లింక్స్ ఇచ్చే సమయంలో అక్షర బేధాలతో ఆయా వ్యాసాలు కనిపించాయి. అప్పుడు ఆ పేజీ తొలగించి మళ్ళీ మరో వ్యాసం రాయాల్సివచ్చింది. చాలామంది వ్యాసం రాయగానే పని అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ, వ్యాసం రాయడంతోపాటు వ్యాసానికి సంబంధించిన ఇతర పనులు చేయడం (ఎన్వికీ లింకులు, అంతర్వికి లింకులు, వర్గాలు, మూలాలు, సమాచారపెట్టె, ఫోటో) కూడా చాలా ముఖ్యం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:52, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగుకు లేదా మన ప్రాంతాలకు సంబంధించిన ఇంగ్లీష్ వ్యాసాలలో పూర్తి సమాచారం లేకపోవటం, అనవసరం అయిన సమాచారం ఉండటం నేను గమనించాను, ప్రస్తుతానికి అంతర్జాలంలో తెలుగులో ఉన్న వనరులతో లేదా ఆయా వ్యాసము మూలం లో ఇంగ్లీష్ వచనం తెలుగులోని అనువదించి రాస్తున్నాను, భవిషత్తులో యాత్రిక అనువాదాలు జరిగి వ్యాసం విలీనం అయినా మనము ఇక్కడ బిన్నంగా రాసింది ఇతరులకు ఉపయోగ పడుతుందేమో అన్న ఆలోచన , ఆంగ్ల వ్యాసానికి నకలు గా తెలుగులోను వ్యాసం ఉండాలన్న నింబంధన నా దృష్టికి రాలేదు ఆయితే దీని మీద తెలుగులో కూడా ఒక మార్గదర్శకం ఉంటే బాగుంటుంది అని నా విన్నపము , శీర్షికలకు వికీడేటా లో సవరణలు / బాట్ లు బాగానే చేరుస్తున్నాయి Kasyap (చర్చ) 17:52, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]