శలాక రఘునాథశర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36: పంక్తి 36:
}}
}}


'''శలాక రఘునాథశర్మ''' ప్రముఖ పండితుడు, కవి, రచయిత, శతాధిక గ్రంథకర్త, ప్రవచనకర్త.
'''శలాక రఘునాథశర్మ''' పండితుడు, కవి, రచయిత, శతాధిక గ్రంథకర్త, ప్రవచనకర్త.
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
===బాల్యము, విద్యాభ్యాసము===
===బాల్యము, విద్యాభ్యాసము===

02:04, 20 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

శలాక రఘునాథశర్మ
200x
శలాక రఘునాథశర్మ
జననంశలాక రఘునాథశర్మ
జూలై 23, 1941
కృష్ణా జిల్లా, నూజివీడు మండలం, గొల్లపల్లి గ్రామం
వృత్తిఆచార్యుడు
ప్రసిద్ధిబహుగ్రంథకర్త, సంస్కృతాంధ్ర పండితుడు, పురాణ ప్రవచనకర్త
తండ్రినరసయ్య
తల్లిదుర్గమ్మ

శలాక రఘునాథశర్మ పండితుడు, కవి, రచయిత, శతాధిక గ్రంథకర్త, ప్రవచనకర్త.

జీవిత విశేషాలు

బాల్యము, విద్యాభ్యాసము

ఇతడు కృష్ణా జిల్లా, నూజివీడు సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో 1941, జూలై 23వ తేదీన నరసయ్య, దుర్గమ్మ దంపతులకు జన్మించాడు. పదవ యేటనే తండ్రి మరణించడంతో ఇతని తల్లి పశ్చిమ గోదావరి జిల్లా, ఆకిరిపల్లిలో తెలిసిన వారియింట ఇతనికి వసతి, చదువు ఏర్పాటు చెసింది. ఇతడు 1960లో తెలుగు, సంస్కృత భాషలలో భాషాప్రవీణ మొదటి ర్యాంకులో ఉత్తీర్ణుడైనాడు. 1967లో తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఎ. డిస్టింక్షన్ సాధించాడు. 1975లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి 'భారతంలో ధ్వని దర్శనము ' అనే అంశంపై పి.హెచ్.డి. సంపాదించాడు. పేరి వెంకటేశ్వరశాస్త్రి, రామచంద్రుల కోటేశ్వరశర్మ, దివాకర్ల వేంకటావధాని, లంక శ్రీనివాసరావు ఇతని గురువులు[1].

ఉద్యోగ సోపానము

ఇతడు 1960-65 మధ్యకాలంలో గౌతమీ విద్యాపీఠంలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాదులో ప్రాచ్యకళాశాలలో ఒక సంవత్సరం ఉపన్యాసకుడిగా సేవలను అందించాడు. అటు పిమ్మట ఇతడు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చరర్‌గా అడుగుపెట్టి, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది డీన్‌గా పదవీవిరమణ చేశాడు. ఆ విశ్వవిద్యాలయంలో 16 సంవత్సరాలు ఆచార్యునిగా పనిచేసి, 24 మందికి డాక్టరేట్లు, 23 మందికి ఎం.ఫిల్.పట్టాలు లభించడానికి మార్గదర్శనం చేశాడు[1]. ఉద్యోగ విరమణ తరువాత రాజమండ్రిలో స్థిరపడ్డాడు.

రచనలు

మహాభారతానువాదం

ఇతడు వ్యాసభారతంలోని విరాటపర్వానికి తాత్పర్య వ్యాఖ్యానాలు రచించాడు. ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, శాంతి, అనుశాసన, అశ్వమేధిక, ఆశ్రమవాసిక, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలలోని ప్రతి శ్లోకానికి తాత్పర్య, వ్యాఖ్యానాలు రచించాడు. యుద్ధషట్కం అని పిలువబడే ఆరు పర్వాలలో కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలను వచనరూపంలో తెలుగులోనికి అనువదించాడు. మొత్తం 80వేల శ్లోకాలకు తాత్పర్యసహిత్య వ్యాఖ్యానాలను అందించాడు. మిగితా పర్వాలలోని శ్లోకాలకు కూడా వ్యాఖ్యాన తాత్పర్యాలు వ్రాస్తున్నాడు[1].

ఇతర రచనలు

ఇది కాక ఇతడు ప్రకటించిన గ్రంథాలలో కొన్ని:

  1. కవిత్రయ భారత జ్యోత్స్న
  2. భారత ధ్వని దర్శనము
  3. ఆర్షభావనా వీచికలు
  4. శ్రీ షట్పదీ కనకధారలు
  5. సనత్సు జాతీయ సౌరభం
  6. శ్రీ నాగేశ్వర మహా విభూతి
  7. శివానందలహరి హంస
  8. వసిష్ఠుడు
  9. భాగవత నవనీతము
  10. యామునప్రభు రాజనీతి (వ్యాఖ్యానము)
  11. విదురనీతి
  12. యక్షప్రశ్నలు మొదలైనవి.

సత్కారాలు, బిరుదులు

ఇతనికి అనేక సత్కారాలు, పురస్కారాలు, బిరుదులు లభించాయి. వాటిలో కొన్ని:

మూలాలు

  1. 1.0 1.1 1.2 విలేకరి, రాజమహేంద్రవరం కల్చరల్ (11 December 2017). "జ్ఞానాంజనశలాక". సాక్షి, తూర్పుగోదావరి జిల్లా టాబ్లాయిడ్. Retrieved 26 January 2018.
  2. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 7 June 2020. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 9 సెప్టెంబరు 2017 suggested (help)

బయటి లింకులు