నడమంత్రపు సిరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:నాగభూషణం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎మూలాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 73: పంక్తి 73:
[[వర్గం:రాజనాల నటించిన చిత్రాలు]]
[[వర్గం:రాజనాల నటించిన చిత్రాలు]]
[[వర్గం:నాగభూషణం నటించిన సినిమాలు]]
[[వర్గం:నాగభూషణం నటించిన సినిమాలు]]
[[వర్గం:సత్యనారాయణ నటించిన చిత్రాలు]]

10:47, 21 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

నడమంత్రపు సిరి
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.రామారావు
తారాగణం హరనాధ్,
విజయనిర్మల
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ నవజ్యోతి పిక్చర్స్
భాష తెలుగు

నడమంత్రపు సిరి 1968లో విడుదలైన తెలుగు చలనచిత్రం. టి.రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరనాధ్, విజయ నిర్మల నటించగా, టి.చలపతిరావు సంగీతం అందించారు.

నటవర్గం

సాంకేతికవర్గం

సంక్షిప్తకథ

పెసరట్ల భూషయ్య దశ తిరగడంతో దాదాపు దశాబ్దంగా ఉంటూ వచ్చిన పాత కొంపను వదిలి లంకంత భవనం కట్టుకుని అందులోకి మకాం మార్చాడు. తన వేషధారణలో మార్పు వచ్చింది. ఎదిగి వచ్చిన కొడుకు, కూతురు ఉండి కూడా కామిని అనే నాట్యకత్తెను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అది తెలిసి ఎదిరించిన ఇంటిల్లిపాదీ ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవలసి వచ్చింది. జమాలుద్దీన్ అబూబేకర్ యువరాజూ, పారిశ్రామికవేత్త ధర్మభోజా, ఆయన కార్యదర్శి దిల్వార్ ఖాన్ బిస్మిల్లా ఒక పెద్ద హోటల్లో మకాం చేశారనీ, వారు ప్రతియేటా నూటికి మూడు వంతుల వంతున మూడు రెట్ల లాభం వచ్చేలా పూచీ ఇవ్వగలరని తెలిశాక భూషయ్య తన యావదాస్తినీ పెట్టుబడిగా పెట్టేశాడు. కామిని తన పేరునే ఆ వాటాలన్నీ మార్చమని భూషయ్యకు తెలియకుండా భోజాను కోరింది. ఈ విషయం భూషయ్యకు ఎలాగో తెలిసిపోయింది. కానీ భూషయ్యను నిర్బంధించి భవంతిని కూడా కామిని పేరుమీద వ్రాసిపెట్టాలని ఒత్తిడి పెరిగింది. అతన్ని చూడటానికి వచ్చిన కూతురు రాధను కూడా దుర్మార్గులు బంధించారు[1]. కామిని కూతురు నళిని సహాయంతో రఘు ధర్మభోజాగా, అతని స్నేహితుడు, నళిని ప్రేమికుడు బాబూరావు అతని కార్యదర్శిగా నాటకమాడి భూషయ్య వద్ద మిగిలివున్న 7 లక్షలు కామిని, జాలయ్యలకు దక్కకుండా చేస్తారు. నానా అవస్థలు పడి, చివరకు నళిని సహాయంతో బయటపడి, పశ్చాత్తాపతప్తుడై భూషయ్య, కొడుకును, కోడలిని, కూతురును ఆదరిస్తాడు. రఘు రాధను పెళ్లి చేసుకుంటాడు[2].

పాటలు

ఈ చిత్రానికి పాటలను సినారె, కొసరాజు, సముద్రాల జూనియర్, ఆరుద్ర, దాశరథి వ్రాయగా టి.చలపతిరావు సంగీతాన్ని సమకూర్చాడు. పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, బి.వసంత, పి.బి.శ్రీనివాస్, టి.ఆర్.జయదేవ్, మాధవపెద్ది గానం చేశారు[3].

క్ర.సం. పాట పాడినవారు రచన
1 అల్లో నేరేడుపండు పుల్లపుల్లగున్నాది మామా ఎల్.ఆర్.ఈశ్వరి,
టి.ఆర్.జయదేవ్
సినారె
2 అబ్బబ్బో ఏమందం సుందరీ ఉబ్బి తబ్బిబ్బవుతు టి.ఆర్.జయదేవ్,
ఎస్.జానకి
సినారె
3 అమ్మల్లారా లాటరీ అయ్యల్లారా లాటరీ లక్ష్మీప్రసన్న లాటరీ మాధవపెద్ది కొసరాజు
4 ఆకలిమంటలు బాబు ఇవి ఆరని మంటలు బాబు పి.సుశీల సముద్రాల జూనియర్
5 ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు సమయం చిక్కింది టి.ఆర్.జయదేవ్,
బి.వసంత
కొసరాజు
6 నీదేరా నా మనసు ఇక నీకేరా నా వయసు ఎస్.జానకి,
ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
దాశరథి
7 నీ చల్లని మనసు కమ్మని వలపు ఎంతో హాయి పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్
ఆరుద్ర

మూలాలు

  1. తుర్లపాటి (22 September 1968). "చిత్రసమీక్ష నడమంత్రపుసిరి". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 6 April 2020.
  2. రాధాకృష్ణ (27 September 1968). "చిత్రసమీక్ష నడమంత్రపు సిరి". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 6 April 2020.
  3. కొల్లూరు భాస్కరరావు. "నడమంత్రపు సిరి - 1968". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 5 April 2020.