వికీపీడియా:సహాయ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 414: పంక్తి 414:
—[[వాడుకరి:Bvlk manohar|Bvlk manohar]] ([[వాడుకరి చర్చ:Bvlk manohar|చర్చ]]) 07:43, 6 అక్టోబరు 2020 (UTC)
—[[వాడుకరి:Bvlk manohar|Bvlk manohar]] ([[వాడుకరి చర్చ:Bvlk manohar|చర్చ]]) 07:43, 6 అక్టోబరు 2020 (UTC)
:[[వాడుకరి:Bvlk manohar|Bvlk manohar]] గారు, [[ప్రత్యేక:ContentTranslation]] పేజీలో ఇతర వికీల వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేయవచ్చు. మరింత సమాచారానికి [[వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి]] చూడండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:33, 12 అక్టోబరు 2020 (UTC)
:[[వాడుకరి:Bvlk manohar|Bvlk manohar]] గారు, [[ప్రత్యేక:ContentTranslation]] పేజీలో ఇతర వికీల వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేయవచ్చు. మరింత సమాచారానికి [[వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి]] చూడండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:33, 12 అక్టోబరు 2020 (UTC)
:[[వాడుకరి:Bvlk manohar|Bvlk manohar]] గారు, అన్నట్లు ఇటువంటి సందేహాలను మీ వాడుకరి చర్చాపేజీలో అడగవచ్చు. ఈ పేజీ ప్రధానంగా వాడుకరి ఖాతా లేని వారిసందేహాలకొరకు ఉద్దేశించబడింది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:34, 12 అక్టోబరు 2020 (UTC)

04:34, 12 అక్టోబరు 2020 నాటి కూర్పు

కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.

గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)

సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.


ప్రశ్న ఎలా అడగాలి

  • ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
  • ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
  • సూటిగా, వివరంగా అడగండి.
  • ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే, ~~~~ అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు లేదా ఆకాశరామన్న అని రాయవచ్చు.
  • ప్రశ్నలకు ఈ-మెయిల్‌ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్‌ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్‌ కు గోప్యత ఉండదు.
  • అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
  • మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
  • అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
  • ప్రశ్న తెలుగులో లేక ఇంగ్లీషులో అడగండి. తెలుగుని ఆంగ్ల అక్షరాలతో రాయకండి, అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది.
  • ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌ కాదు.


సమాధానం ఎలా ఇవ్వాలి

  • వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
  • క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
  • సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
  • వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
  • వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, ఆ విషయపు చర్చా పేజీ వాడండి.


తెలుగు రచయితలు పుటలో పేరు చేర్చడం ఎలా?

YesY సహాయం అందించబడింది


బివిడి ప్రసాదరావు (చర్చ) 09:09, 20 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

స్నేహాంజలి. తెలుగు రచయితలు పుటలో నేను రచయితగా చేరడము ఎలా? నా eMail: prao.bvd@gmail.com

తెలుగు రచయితల జాబితా లో మీ పేరు చేరినది. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:34, 26 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరాకుల గురించి సందేహం

vistarakulu tayari lo enni rakala chetla akulu vadutaru? —45.115.1.84 06:07, 26 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

YesY సహాయం అందించబడింది

వికీపీడియాలో వ్రాసాలు రాసేటప్పుడు మీకు గల సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది. రచనలు చేసేటప్పుడు ఏ సహాయం కావలసి వచ్చినా మా వికీపీడియా బృందం సహకారాన్నందిస్తుంది. యిలా జనరల్ నాలెడ్జి ప్రశ్నలు అడగరాదు! అయినా విస్తరాకులు వ్యాసం చూడండి. మీరు వికీపీడియాలో అకౌంటు సృష్టించుకొని వ్యాసాన్ని విస్తరణ చేయగలరు. ధన్యవాదములు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 06:37, 26 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తూర్పు గోదావరి జిల్లాలో పట్టు చీరలు నేతల ఫోన్ నంబర్లు

YesY సహాయం అందించబడింది


103.46.233.19 09:27, 2 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

అజ్ఞాత వాడుకరీ, వికీపీడియా ప్రచార వేదిక కాదు. మీకు వ్యాసాలు రాయడంలో విధివిధానాలు, సలహాలు,సూచనలు గురించి ఏవైనా సందేహాలు వస్తే సహాయాన్ని అభ్యర్థించండి. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 09:36, 2 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మూసలు పనితీరు

YesY సహాయం అందించబడింది

తెవికీ ఏ మూసలు "మూత" (క్లోజ్) పడటం లేదని గమనించాను. దయచేసి పెద్దలు సరిచేయగలరు. —JVRKPRASAD (చర్చ) 03:13, 28 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ నమస్తే. ఏదైనా ఉదాహరణకు ఒక పేజీ చూపించగలరా? మీరనేది మూసలు క్లోజ్ చేయకుండా వాడుకరులు కానీ, మరెవరైనా ఐపీ అడ్రస్ రచయితలు కానీ వదిలేస్తున్నారనా? లేక చేసినా మూతపడడం లేదనా?--పవన్ సంతోష్ (చర్చ) 17:36, 7 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
Module:Navbox ఆంగ్లంనుండి తాజా చేశాను. Template:Navbox ఇప్పటికే తాజాగా వుంది. మన common.js లో మార్పులు పరిశీలించాలి. వారాంతంలో ఇంకొంచెం పరిశీలిస్తాను.--అర్జున (చర్చ) 17:45, 7 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పుడు దాచు అనేది పని చేస్తున్నది, ఇది వరకు చేయలేదు. ఇంకా మూసలలో ఏదో సమస్య కొంత ఉన్నట్లుగా అనిపిస్తోంది, అది ఏమిటో నాకు తెలియదు. నా సమస్య ఇప్పుడు తీరింది. మీ అందరికీ ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 18:27, 7 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారికి, మీ తాజావార్తకి ధన్యవాదాలు. నేను పరిశీలించాను. ఇపుడు పనిచేస్తున్నది.--అర్జున (చర్చ) 05:26, 9 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారికి, మీకు అభివాదముతో ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 05:50, 9 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సంరక్షణ తొలగింపు

YesY సహాయం అందించబడింది

నేను నిర్వాహకుడుగా ఉన్న రోజుల్లో, నా వాడుకరి పుట, వ్యాసాలు, మూసలు ఇత్యాదివి "సంరక్షణ"లో ఉంచాను. అవి నిర్వాహకులు మాత్రమే మార్చగలరు, ప్రస్తుతము నాకు కొత్తవి ఎక్కించేందుకు లేదా మార్చే ఆ అవకాశము లేదు. కనుక, దయచేసి తెవికీ నిర్వాహక పెద్దలు వీలయినన్నింటికి సంరక్షణ తొలగించ గలరు అని విన్నపము. —JVRKPRASAD (చర్చ) 11:56, 28 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుని తక్షణ సౌలభ్యం కోసం వాడుకరి పేజీ సంరక్షణ స్థితిని మాత్రమే మార్చాను. మిగతా వాటిని పరిశిలించి, వీలు వెంబడి నిర్వాహకులెవరైనా మార్చగలరు.__చదువరి (చర్చరచనలు) 14:37, 28 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 14:47, 28 మే 2017 (UTC)[ప్రత్యుత్తరం]


వికీపీడియా వివరం వేరే జాలగూడులో ఎలా?

సార్ ఇది ఒక వెబ్ లింకు చూడండి ఈ లింకును వికీపీడియా ఆన్ లైన్లో మోత్తం కనిపిస్తూంది ఆ సైట్ యోమిటని సందేహం వచ్చి అడుగుచున్నాను.--N.P.Gouda (చర్చ) 12:22, 21 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]


2405:204:6404:2C4E:27B0:1491:8D2E:15EC 10:19, 20 జూలై 2017 (UTC)[ప్రత్యుత్తరం]

N.P.Gouda గారూ, నమస్తే. చూశాను, కానీ ఈ వెబ్సైట్ గురించి నాకేమీ తెలియదు. ఐతే సాధారణంగా జరిగేది చెప్తున్నాను. వికీపీడియాలన్నీ స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదలై ఉంటాయి. అంటే మనం రాసే ప్రతీదీ ప్రపంచంలో ఎవరైనా వికీపీడియాకు, వాడుకరులకు అట్రిబ్యూషన్ ఇచ్చి తోచిన విధంగా వాడుకోవచ్చు. ఆ పద్ధతిలో ఐరోపా, అమెరికా (వారి పుస్తక సంస్కృతి బలమైనది) దేశాల్లో కొన్ని ప్రచురణ సంస్థ ప్రతీ ఏటా వికీపీడియాను ప్రచురించి అమ్ముతూంటాయట, జాలంలో ఉచితంగా లభిస్తున్నా ప్రింట్ పుస్తకాలపై మక్కువ ఉన్నవారు కొనుక్కుంటూంటారు కూడాను. ఓ టీచర్ పిల్లలకు ఏదైనా కొత్త విషయాన్ని బోధించడం మొదలుకొని, వాణిజ్యావసరాలతో సహా దేనికైనా వికీపీడియాలోని సమాచారాన్ని స్వేచ్ఛగా వాడుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఇటువంటి మిర్రర్ సైట్లు (అద్దంలా మనల్ని ప్రతిబింబిస్తూంటాయి, ఐతే అది నిజం కాదు ప్రతిబింబమే) ఉపయోగించుకుని వికీపీడియాలోని సమాచారాన్ని ప్రతిబింబిస్తూంటాయి. ఇదండీ సంగతి. --పవన్ సంతోష్ (చర్చ) 17:42, 7 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

-పవన్ సంతోష్ గారూ సార్ నమస్తే నా సందేహం కూడ అలానే ఉండేది ఇప్పుడు తీరింది. మీకు ధన్యవాదములు సార్.--N.P.Gouda (చర్చ) 06:39, 8 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

రాశివనం వివరాలు దానికి సంబందించిన మొక్కల వివరాలు

YesY సహాయం అందించబడింది


124.123.82.183 06:42, 20 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఎవరైనా సభ్యులు మీ సందేహ నివృత్తి చేయాలంటే ముందు మీరు ప్రశ్న సుస్పష్టంగా అడగండి. మీరిప్పుడు ఏం అడుగుతున్నారో సరిగా తెలియట్లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 15:56, 20 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, చదువరి గారూ ఈ ప్రశ్న గమనించండి. సూటిగా లేదు. సరే నేను సూటిగా అడగమన్నా అడగలేదు. ఇప్పుడు ఈ అంశం ముగించడానికి సహాయం చేయబడిందితో మూస మార్చాలా, సహాయం విఫలమైందని మార్చాలా? ఎందుకంటే సహాయం విఫలమైందన్నది నిర్దుష్ట సమయంలోపు (వారం) ఎవరూ సమాధానం చెప్పకపోతే చేయాలని నాకు తెలిసిన విషయం. కానీ ఇక్కడ సమాధానం చెప్పాం, కానీ ప్రశ్న సరిగాకుండడం వల్ల సహాయం జరగలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 10:47, 25 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రశ్న వివరంగా లేదు. కానీ నా కర్థమైనంతలో ఈ ప్రశ్నకిది తగు స్థలం కాదు. ఇక్కడ వికీపీడియాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలి. అదే ముక్క చెప్పి, ఈ అంశాన్ని ముగించండి. {{సహాయం చేయబడింది}} మూస ఈ సందర్భానికి తగినదని నా ఉద్దేశం.__చదువరి (చర్చరచనలు) 11:04, 25 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చదువరి గారూ అలా చేశానండీ. --పవన్ సంతోష్ (చర్చ) 11:39, 26 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, అర్ధవంతం కాని సందేహలను నేనైతే తొలగిస్తున్నాను. వాటివలన ఉపయోగం ఏమీలేదు.--అర్జున (చర్చ) 07:55, 29 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]

క్రుత్రిమంగ కాయలను పంద్లుగా మార్చె విదానం

YesY సహాయం అందించబడింది


157.48.240.125 14:46, 29 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఇటువంటి ప్రశ్నకిది తగు స్థలం కాదు. ఇక్కడ వికీపీడియాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగాలి.--కె.వెంకటరమణచర్చ 16:42, 29 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పండు చూడండి.--అర్జున (చర్చ) 06:21, 21 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం sri venkaateswara suprabhatam

YesY సహాయం అందించబడింది


49.206.217.126 06:44, 20 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం మరియు s:శ్రీ_వేంకటేశ్వర_సుప్రభాతము చూడండి.--అర్జున (చర్చ) 06:19, 21 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం: ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం వివిధ భాషలలో ఉంది... దానిని తెలుగు భాషలోనికి మార్చి అదే పేజిలో భాష అనే కాలంలో పొందుపర్చాలంటే ఏమి చేయాలో తెలుపగలరు... మెయిల్ ఐనా ఫోన్ చేసి తెలియచేసినా సంతోషం..

YesY సహాయం అందించబడింది


ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం వివిధ భాషలలో ఉంది... దానిని తెలుగు భాషలోనికి మార్చి అదే పేజిలో భాష అనే కాలంలో పొందుపర్చాలంటే ఏమి చేయాలో తెలుపగలరు... మెయిల్ ఐనా ఫోన్ చేసి తెలియచేసినా సంతోషం..

59.93.94.15 07:54, 29 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాలో వ్యాసం ఎలా ప్రారంభించాలి
వేర్వేరు భాషల వికీపీడియాల్లో ఒకే అంశం గురించి ఉన్న వ్యాసాలు అనుసంధానించడం
"ఒక వ్యక్తి గురించిన వ్యాసం పలు భాషల వికీపీడియాల్లో ఉంది, తెలుగు వికీపీడియాలోకి తీసుకువచ్చి ఆ పేజీని మిగిలిన భాషలతో అనుసంధానించడం ఎలాగ?" అన్నది మీ ప్రశ్న అని అనుకుంటూ సమాధానమిస్తున్నాను. (ఎందుకంటే ఇంగ్లీష్ వికీపీడియా వ్యాసంలో ఇంగ్లీషే ఉండాలి, తెలుగు వికీపీడియా వ్యాసంలో అదే అంశం గురించి తెలుగులో సమాచారం ఉండొచ్చు) ఏదైనా భాష వికీపీడియాలో ఒక వ్యాసం ఉంటే, దానికి ప్రాధాన్యత ఉండివుంటే, తెలుగులోకి అనువదించవచ్చు. అలా అనుదించడానికి వ్యాసం ప్రారంభించాలి కదా. అది ఎలా ప్రారంభించాలన్నది నేర్చుకునేందుకు ఈ పక్కన ఉన్న వీడియో పాఠం పనికివస్తుంది.
వేరే భాషలోని అదే వ్యాసంతో ఈ వ్యాసాన్ని అనుసంధానించాలంటే ఎలాగన్నదానికి మరో వీడియో పెట్టాను అది చూడండి.
మరేవైనా సందేహాలుంటే pavansanthosh.s@gmail.comకు సంప్రదించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 04:53, 30 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

YesY సహాయం అందించబడింది

సార్/మేడమ్ ఈ రోజుల్లో సివిల్ సర్వీసెస్ ను తెలుగు వారు సులభంగా చేదిస్తున్నారు.నాకు  భారత  రాజ్యాంగ ము గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కావాలి...ఇంగ్లీషు లో ఉన్నది కాని...తెలుగు లో కొంచెమ్ తక్కువ గా ఉన్నది.....ఇవేకాక భారతదేశ చరిత్ర..స్వాతంత్ర్య ఉద్యమం గురించి కూడా తెలుగు లో ఇన్ఫర్మేషన్ తక్కువ గా ఉన్నది... దయచేసి.... ఇంగ్లీషు లోని ఎక్కువ ఇన్ఫర్మేషన్ ను తెలుగు వ్యాసాలు గా రాయాలని నా యొక్క విన్నపం

157.48.113.236 12:55, 6 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆకాశరామన్నకి, స్వచ్ఛందంగా చేసే పనికావున సభ్యులు వారి వారి ఆసక్తులను బట్టి వ్యాసాలు రాస్తుంటారు. మీ సూచన ఆసక్తివున్న సభ్యులు గమనించి ఇంకొన్ని వ్యాసాలు సృష్టిస్తారని ఆశించుదాము. దీనిలో అందరు పాల్గొనవచ్చు కాబట్టి, మీరే కొన్ని వ్యాసాలు తయారు చేసి సహాయపడడం మెరుగైనది. దానిద్వారా, మీకు అనుభవం, భావప్రసరణ నైపుణ్యాలు, పోటీలలో బహుమతులు గెలుచుకొనే అవకాశాలు వుంటాయి.--అర్జున (చర్చ) 04:10, 7 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారత రాజ్యాంగ ము , చరిత్ర..స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుగు వ్యాసాలు

YesY సహాయం అందించబడింది


సార్/మేడమ్ భారత రాజ్యాంగ ము , చరిత్ర..స్వాతంత్ర్య ఉద్యమం గురించి తెలుగు లో ఇన్ఫర్మేషన్ తక్కువ గా ఉన్నది... దయచేసి.... ఇంగ్లీషు లోని ఎక్కువ ఇన్ఫర్మేషన్ ను తెలుగు వ్యాసాలుగా కావాలి.

సందేహం సార్/మేడమ్ ఈ రోజుల్లో సివిల్ సర్వీసెస్ ను తెలుగు వారు సులభంగా చేదిస్తున్నారు.నాకు భారత రాజ్యాంగ ము గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కావాలి...ఇంగ్లీషు లో ఉన్నది కాని...తెలుగు లో కొంచెమ్ తక్కువ గా ఉన్నది.....ఇవేకాక భారతదేశ చరిత్ర..స్వాతంత్ర్య ఉద్యమం గురించి కూడా తెలుగు లో ఇన్ఫర్మేషన్ తక్కువ గా ఉన్నది... దయచేసి.... ఇంగ్లీషు లోని ఎక్కువ ఇన్ఫర్మేషన్ ను తెలుగు వ్యాసాలు గా రాయాలని నా యొక్క విన్నపం....ధన్యవాదాలు ఆకాశ రామన్న ..

ఆకాశరామన్నకి, స్వచ్ఛందంగా చేసే పనికావున సభ్యులు వారి వారి ఆసక్తులను బట్టి వ్యాసాలు రాస్తుంటారు. మీ సూచన ఆసక్తివున్న సభ్యులు గమనించి ఇంకొన్ని వ్యాసాలు సృష్టిస్తారని ఆశించుదాము. దీనిలో అందరు పాల్గొనవచ్చు కాబట్టి, మీరే కొన్ని వ్యాసాలు తయారు చేసి సహాయపడడం మెరుగైనది. దానిద్వారా, మీకు అనుభవం, భావప్రసరణ నైపుణ్యాలు, పోటీలలో బహుమతులు గెలుచుకొనే అవకాశాలు వుంటాయి.--అర్జున (చర్చ) 04:12, 7 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం naga pamu

naga pamu karichina taravata yravi cheayali yeavi cheyakidadi


223.182.102.19 08:37, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

YesY సహాయం అందించబడింది


వికీపీడియా కేవలం విజ్ఞాన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. చికిత్స వివరాలను ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా, వాటిపై ఆధారపడకుండా సరైన చికిత్సకై నిపుణుడైన వైద్యుణ్ణి సంప్రదించాలి. నాగుపాము గురించిన వ్యాసాన్ని ఇక్కడ చూడవచ్చు. మరొక్క విషయం.. ఈ పేజీ వికీపీడియాలో పనిచేసే విషయంలో అవసరమైన సహాయం అందించేందుకు ఉద్దేశించినదే గానీ, విజ్ఞానపరమైన సలహాలు ఇచ్చేందుకు, సందేహాలు తీర్చేందుకూ కాదు. గమనించగలరు.__చదువరి (చర్చరచనలు) 09:15, 18 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

tholi ekadhasi stori

YesY సహాయం అందించబడింది


103.5.16.61 08:16, 23 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తొలి ఏకాదశిచూడండి.--అర్జున (చర్చ) 03:19, 28 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఇల్లు నానా అర్ధలు

YesY సహాయం అందించబడింది


171.49.227.248 10:52, 20 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా విజ్ఞాన సర్వస్వం, నిఘంటువు కాదు. తెలుగులో స్వేచ్ఛా నిఘంటువుగా తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టు తెలుగు విక్షనరీ ఉంది. ఇల్లుకు సంబంధించిన విక్షనరీ పేజీలో మీరు అడిగిన నానార్థాలు దొరుకుతాయి. --పవన్ సంతోష్ (చర్చ) 08:23, 21 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక పదవి ఓటింగ్ ప్రక్రియ - అభ్యర్ధి జవాబులు

YesY సహాయం అందించబడింది

నిర్వాహక పదవి ఓటింగ్ ప్రక్రియలో [1] సభ్యులు సందేశాలు, సలహాలు, ప్రశ్నల రూపంలో పాల్గొని ఓటు చేస్తున్నారు. వాటికి నేను సమధానం ఇవ్వవలసిన అవసరం ఉంటే ఎక్కడ వ్రాయాలో దయచేసి తెలియ జేయండి. —JVRKPRASAD (చర్చ) 00:04, 22 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, ఆ పుటలో చివరన "చర్చ" అనే విభాగంలో ప్రశ్నల రూపంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానములు తెలియజేయగలరు.--కె.వెంకటరమణచర్చ 01:00, 22 జనవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మూసలు-రంగులు

YesY సహాయం అందించబడింది


JVRKPRASAD (చర్చ) 11:29, 10 ఫిబ్రవరి 2019 (UTC) నేను నిన్న పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు నందు ఉన్న మండలాలకు చెందిన మూసలు వర్గం:పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మూసలు రంగు వెలసిపోయినట్లు ఉంటే నేను దాని పాత రంగు మార్చి కొత్త రంగుతో మూసలు ఆకృతి మార్చాను. ఈ పని చేయుటకు సమూహ అభిప్రాయ సేకరణ తీసుకోవటం అనేది ఇంతకు ముందు నేను చూడలేదు. అందుకనే చర్చలో పెట్టలేదు. ప్రస్తుత వికీలో నా స్థితి, పరిస్థితి దృష్ట్యా (నా మీద సదభిప్రాయ సదుద్దేశ్య మనసులు చాలా వరకు కొరవడిన నేపథ్యంలో) ఇది ఒక నేరం లేదా వికీ నియమాలకు విరుద్ధం అని వికీ పెద్దలు తెలియజేస్తే వెంటనే ఉన్న పాత రంగునే పునరుద్ధరిస్తాను. దయచేసి తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 07:06, 10 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@JVRKPRASAD గారికి, ఒక విషయానికి సంబంధించిన మూసలు (ఉదా: మూస:మర్పల్లి మండలంలోని గ్రామాలు, మూస:అత్తిలి మండలంలోని గ్రామాలు) వికీపీడియా మొత్తంలో ఒకే రంగులశైలి వాడితే వాడుకరులకు సౌలభ్యంగా వుంటుంది. ఏమైనా మార్పులు చేయాలంటే వికీపీడియా వ్యాప్తంగా చేయాలి. మీకు ఈ విషయంపై చర్చకు పెట్టి దాని ఫలితం ప్రకారం మార్పులు చేయటం మంచిది. ఇంకొకసంగతి, ఒక విషయం గురించి ఒకచోటనే చేయటం మంచిది. రచ్చబండలో వ్రాశారుకద, ఇక్కడ వ్రాయవలసినఅవసరం లేదు. ఇకముందు ఈ సలహాను పాటించితే మంచిది.--అర్జున (చర్చ) 04:29, 11 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, రచ్చబండలో లేటు అవుతోందని ఇక్కడ కూడా పెట్టాను. అందుకు కారణం, పెద్దలు సరి అయిన సలహా ఇస్తే, మరికొంత ముందుకు వెళ్ళి వెంటనే అన్ని మూసలు కొత్త రంగులోకి మార్చుదామని అభిప్రాయంతో రెండుచోట్ల పెట్టాను. పేజీలు కొత్తగా కూడా ఉంటాయని అనిపించి ఒక జిల్లాకు మార్చాను. తప్పులేదని సలహా ఇస్తే మిగతా జిల్లాకు ఒకే రంగులశైలితో, రంగు మార్చుతాను. మీరు చూపించినది తెలంగాణ మూస మరియు నేను మార్చిన మూస చూపించారు. నేను కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒక వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు మాత్రమే ఉదాహరణ కోసం మార్చాను. తెలంగాణాకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు వేరు వేరు రంగులు ఇవ్వవచ్చును అని నా అభిప్రాయం. దేశం మొత్తం ఇటువంటి మూసలకు ఒకే రంగు ఉండాలని మీరు చెబుతున్నారని నాకు అర్థం అయ్యింది. రాష్ట్రానికి వేరు వేరు రంగు మూసకి ఇవ్వకూడదా ? మూసల రంగుల గురించి విధి విధానాలకు సంబంధించి లింకు తెలుగులోది ఉంటే ఇవ్వండి. ఒక ఎవరైనా ఒక అధికారి అయినా ఒక టైం టేబుల్ ప్రకారమయినా వాడుకరులకు అందుబాటులో ఉంటే మంచిదని నా అభిప్రాయం. పని కుంటు పడక ఉంటుంది. ఈ విషయము మీద త్వరలో ఒక నిర్ణయము తెలియజేస్తే చేసిన మార్పును ముందుకు తీసుకు వెళ్ళడమా లేదా చేసిన పని రద్దు చేయడమో చేస్తాను. JVRKPRASAD (చర్చ) 04:43, 11 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, నేను ఒక రాష్ట్రంలో ఒక జిల్లాకు మాత్రమే చేసిన మార్పులు రద్దు చేద్దామని అనుకుంటున్నాను. నిర్ణయము చేసే సభ్యుల చర్చలు, అభిప్రాయములు తదుపరి నిర్ణయం ప్రకటింపుకు ఎక్కువ రోజులు పట్టే అవకాశం ఉండవచ్చును. ఈ రంగులు మార్పిడి గురించిన నిర్ణయం ఎలా చేయవచ్చునో ఆరకంగా ఆ పని తదుపరి చేపట్టవచ్చును. JVRKPRASAD (చర్చ) 05:24, 11 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@ JVRKPRASAD మంచిది. en:Wikipedia:Manual_of_Style/Accessibility#Color చూడండి. తెలుగులో లింకు ఏమి కనబడలేదు. దీనిని మీరు అనువదించవచ్చు. వికీలో పనిచేసేవారు స్వచ్ఛందసేవకులు కావున మరియు ఒక్కరిచే నిర్ణయాలు తీసుకోవడం కుదరదు కాబట్టి కాలపట్టిక ప్రకారం కృషిచేయడం వీలుపడదని మీకు గుర్తుచేస్తున్నాను. --అర్జున (చర్చ) 04:26, 12 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, వాడుకరులకు వచ్చే చిన్న చిన్న సందేహాలకు కూడా నిర్వాహక, అధికారులు అందుబాటులో ఉన్ననూ లేక పోయిననూ అవి తీరడానికి సమయము ఎక్కువ తీసుకోవటం వలన తెవికీ అనుకున్నంత వేగంగా అభివృద్ధి జరగడానికి ఒక అవరోధంగా ఉన్నదని నేను విమర్శ చేయటం లేదండి. పాలసీ విషయాలు తెలుగులోకి తర్జుమా జరిగితే సమస్యలు లేకుండా, ముందు ముందు రాకుండా సందేహాలకు లింకులు వలన ప్రయోజనం ఉంటుంది. నేను ఏ పని చేసినా, మాట్లాడినా, చెప్పినా అందులోని లోపాలు వెదికి, జీవితకాలం నాకు వాటి లింకులు ఇస్తారు ఇతర వాడుకరులు, ఇది మనిషికి మనసుకు చాల బాధాకరం. నేను ఏదైనా చేయవలసిన పని విషయములో మాత్రం తక్కువ సమయములో తప్పులు లేకుండా ఎక్కువ పని చేయటం నా జీవితం అలవాటు గా ఉండటం, ఏదైనా అ పనిలో నాకు వచ్చిన సందేహం వెంటనే నివృత్తి అయితే చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళడం, సందేహం వెంటనే తీరకపోతే అ పని ఆపి మరొక పని చేయటం నా మనస్తత్వం వలన, నన్ను సరిగా చాలా మంది అర్థం చేసుకోలేక పోవచ్చును. ఇప్పుడు ఈ మూసల రంగు మార్పిడి పనిలో నాకు వచ్చిన సందేహం ఇప్పటిలో సమూహం నిర్ణయం వేలువడదని తెలిసి, నేను చేసిన మార్పులు తొలగించి అన్నీ యదాతధంగా ఉంచాను. మీకు నా ధన్యవాదములు ఈ సందర్భముగా తెలియజేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 06:06, 12 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@JVRKPRASAD మంచిపని చేశారు. ప్రతివ్యవస్థకి కొన్నిపరిమితులు వుంటాయి. వాటికి లోబడి వీలైనంత మంచి పనిచేయడమే మంచిది. మీకు సందేహాలుండి త్వరగా సలహా కావాలంటే నన్ను ఫోను ద్వారా సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 01:33, 13 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, చాలా సంతోషం. ఒకనాడు మిమల్ని నేను మార్పులకు ఎంతగానో ధై ర్యంగా చేయండని ప్రోత్సహించిన వాడిని. ఇప్పుడు నా స్థితి పరిస్థితి ఇక్కడ కొంతమంది ఎంతగానో మార్చివేసారు, ఆనాడు పని చేసే ఆనందం, సహకారం చాలా కొరవడింది. ప్రతి మనిషి గురించి నిజాలు నిదానంగా తెలుస్తాయి. ఇప్పుడు నేను ఎంతో భయంగానే పనిచేస్తున్నాను. ఏ పని చేస్తే ఏ తప్పు వెతుకుతారో అని చాలావరకు పనులు తగ్గించుకున్నాను. మీ ఫోను నంబరు నా దగ్గర లేదు. నా ఫోను, వాట్సప్ నంబరు:8333011899. వీలయితే మీది పంపండి. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 01:56, 13 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@JVRKPRASAD గారికి, నా ఫోన్ నంబరు మీ ఫోన్ కి ఎస్ఎమ్ఎస్ ద్వారా మరియు మీ మెయిల్ కి పంపించాను. శుభం.--అర్జున (చర్చ) 03:59, 14 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

star box ను తెలుగు వ్యాసంలో తీసుకు రావడం గురించి

సర్, en:Sirius ఇంగ్లీష్ వ్యాసంలో వున్న విధంగా Star Box ను సిరియస్ నక్షత్రం అనే తెలుగు వ్యాసంలో యధాతంగా పేజీకి కుడి వైపు కాలమ్ మాదిరి వచ్చేటట్లు తేలేకపోతున్నాను. ఇంగ్లీష్ లోని స్టార్ బాక్స్ ను ఉన్నదున్నట్లుగా ({{Starbox begin | name=Sirius ...... నుండి |} వరకు కాపీ చేసి తెలుగు వ్యాసంలో పేస్ట్ చేస్తుంటే, తెలుగు వ్యాసంలో అది మొత్తం పేజీ అంతటా ఆక్రమిస్తుంది. ఆంగ్ల వ్యాసంలో మాదిరిగా రైట్ కాలమ్ లో star box రావాలంటే ఎలా చేయవలసి ఉంటుంది. —Vmakumar (చర్చ) 00:30, 28 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@Vmakumar గారికి, తెలుగు వికీలో పాతబడిన starbox మూసలను ఆంగ్లవికీనుండి తాజాచేయటం ద్వారా మీ సమస్యను పరిష్కరించాను. అయినా ఇంకా కొన్ని పరామితులను చూపించడంలో దోషంవుంది. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. అన్నట్లు ఇలాంటి సమస్యలను ఆయా వ్యాస చర్చాపేజీలో {{సహాయం కావాలి}} మూసతో చేర్చి అందరి దృష్టికి కనబడేటట్లు చేయవచ్చు.--అర్జున (చర్చ) 04:42, 28 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@అర్జున గారికి కృతఙ్ఞతలు. మీరు తెలియ చేసినట్లు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను.

--Vmakumar (చర్చ) 10:03, 28 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం meaning of therapa in Telugu

YesY సహాయం అందించబడింది


123.201.170.186 05:09, 27 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అది ఏ భాష లోని పదమో తెలియలేదు. ఒకవేళ మీరు అడగదలచినది Therapy అయితే దాని అర్థం "చికిత్స" అట. ఇంగ్లీషు- తెలుగు, తెలుగు-ఇంగ్లీషు అర్థాలు వెతుక్కునేందుకు ఆన్‌లైనులో ఉన్న ఉత్తమ వనరుల్లో ఒకటి http://andhrabharati.com/dictionary/ - చూడండి. __చదువరి (చర్చరచనలు) 05:24, 27 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం vihari nama samvashtaram andra pradesh rajakeeyalu

YesY సహాయం అందించబడింది


106.51.38.64 12:53, 27 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రశ్న ఏమీ లేదు. రాజకీయాలపై చర్చకు ఇది వేదిక కాదు. __చదువరి (చర్చరచనలు) 10:51, 28 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]


చర్చ లేదా అభిప్రాయం రాయాల్సిన పేజీ యొక్క డైరెక్ట్ అండ్ సింగల్ లింక్ గురించి

YesY సహాయం అందించబడింది

చర్చ లేదా అభిప్రాయం రాయాల్సిన పేజీ యొక్క డైరెక్ట్ అండ్ సింగల్ లింక్ గురించి
సర్, నాకు మెయిల్ క్రింది విధంగా వచ్చింది. వర్గం:యోగాచారులు వర్గం:యోగాచారులు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you. --కె.వెంకటరమణ⇒చర్చ 11:49, 22 జూన్ 2019 (UTC)


దీని ప్రకారం category's entry లింక్ ను క్లిక్ చేస్తే పేజీ ఖాళీగా వుంది. అక్కడ నా అభిప్రాయం ప్రకటించాల్సింది ఆ పేజీ ("ప్రాజెక్ట్ పేజీ") లోనేనా లేదా ఆ పేజీ కి ప్రక్కనే అనుబంధంగా వున్న "చర్చ" అనే పేజీ లోనా అనేది కూడా సందేహంగా వుంది.
ఇవి కాదంటే మీరు చెప్పినట్లు Categories for discussion page ను క్లిక్ చేసి వెళితే ఆ పేజీలో ఎక్కడా category's entry అంటూ ఏమీ కనిపించడం లేదు. అక్కడ "Category:జీవిస్తున్న ప్రజలు to Category:సజీవ వ్యక్తులు" లాంటివి కనిపిస్తున్నాయి. నేను కూడా వాటిలాగే "Category:యోగాచారులు" అంటూ ఒక విభాగం సృష్టించి, అందులో నా అభిప్రాయం చెప్పవలసి ఉంటుందా? అదీ కాకపొతే
అక్కడనే వున్న "ప్రస్తుత చర్చలు" అనే విభాగంలో ఈ రోజు june 26 కాబట్టి "జూన్ 26 (బుధవారం)" అన్న లింక్ ను క్లిక్ చేసి అలా సృష్టించిన పేజీ లో నా అభిప్రాయం రాయవలసి ఉంటుందా?
లేదా నాకు మెయిల్ వచ్చింది జూన్ 22 కాబట్టి "జూన్ 22 (శనివారం)" అన్న లింక్ ను క్లిక్ చేసి అలా సృష్టించిన పేజీ లో నా అభిప్రాయం రాయవలసి ఉంటుందా? ఇలా అనేకానేక సందేహాలు వస్తున్నాయి.

కనుక దయచేసి ఏదైనా సందర్భంలో వాడుకరులు నుండి చర్చ లేదా అభిప్రాయం కోరుతున్నప్పుడు, ఆ చర్చను ఎక్కడ అంటే సూటిగా ఏ పేజీలో ప్రారంభించాలో ఆ పేజీ (ప్రాజెక్ట్ పేజీ లేదా చర్చ పేజీ అనేది స్పష్టంగా తెలియచేస్తే కూడా బాగుంటుంది) యొక్క డైరెక్ట్ లింక్ ను వారికి తెలియచేస్తే వాడుకరులకు మరింత ఈజీగా ఉంటుందాని భావిస్తున్నాను.

ఇంతకీ యోగాచారులు వర్గం తొలగింపు proposals పై చర్చను, నా అభిప్రాయాన్ని రాయాల్సిన పేజీ యొక్క డైరెక్ట్ సింగల్ లింక్ ను తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

--Vmakumar (చర్చ) 15:10, 26 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యోగాచారులు వర్గం తొలగింపు ప్రతిపాదనపై పై చర్చను, యోగాచారులు వర్గం పేజీలో పైన వర్గం పక్కనే చర్చ అని ఉన్నది.గమనించండి.దానిని క్లిక్ చేస్తే వర్గం చర్చ:యోగాచారులు పేజీని సృష్టిస్తున్నారు అని వస్తుంది.దానిలో మీ అభిప్రాయం రాసి సంతకం చేయండి.(సంతకం ఏలా చేయాలో తెలుసనుకుంటాను).--యర్రా రామారావు (చర్చ) 15:28, 26 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

రామారావు గారు, థాంక్యూ వెరీ మచ్ .
--Vmakumar (చర్చ) 16:49, 26 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మాలతీ మాధవం పేరుతొ వున్న ఒక ఖాళీ పేజీ తొలగింపు కై అభ్యర్ధన

YesY సహాయం అందించబడింది

సర్, మాలతీ మాధవం పేరుతొ రెండు వ్యాసాలుండడంతో అయోమయ పేజీ నివృత్తి ఏర్పరిచాను. అంటే మాలతీ మాధవం (సంస్కృత నాటకం), మాలతీ మాధవం (1940 సినిమా), మాలతీ మాధవం (అయోమయ నివృత్తి) అనే 3 పేజీలు ఏర్పాటు అయ్యాయి. అయితే పాత పేజీ ఒకటి "మాలతీ మాధవం" పేరుతొ అలాగే ఖాళీగా పడి వుంది. దీని వలననే అనుకుంటా సెర్చ్ బాక్స్ లో మాలతీ మాధవం అని టైపు చేసి సెర్చ్ చేస్తుంటే మాలతీ మాధవం పేరుతొ ఖాళీ పేజీ కనిపిస్తుంది. సెర్చింగ్ ఫలితంలో కనీసం "మాలతీ మాధవం (అయోమయ నివృత్తి)" అనే పేజీ అయినా ఓపెన్ కావడం లేదు. కాబట్టి ఆ ఖాళీ పేజీ (మాలతీ మాధవం అనే పేజీ) ని అవకాశం ఉంటే దయచేసి delete చేయవలసిందిగా కోరుతున్నాను.

--Vmakumar (చర్చ) 00:02, 11 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ మాలతీ మాధవం ఖాళీ పేజీ తొలగించబడింది.గమనించినందుకు ధన్యవాదాలు--యర్రా రామారావు (చర్చ) 03:53, 11 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

YesY సహాయం అందించబడింది


Chraj0264 (చర్చ) 03:31, 2 జనవరి 2020 (UTC) నేను 'లోకేష్ బోయిళ్ల' అను ఒక వికీపీడియా పేజీ ని సృష్టించాను। అందులో భాగం గా కాపీరైట్స్ లేని ఫోటో దస్త్రాన్ని ఎక్కించాను। కానీ అది పేజీ లో కనబడుటలేదు। ఇంతకూ అది చెల్లుబాటు అవుతుందా లేదా అనే సందేహం ఉంది। నాకు సహాయం చేయగలరు।[ప్రత్యుత్తరం]

Chraj0264 గారూ లోకేష్ బోయిళ్ల వ్యాసంలో మీరు ఎక్కించిన పొటో ఇమడ్చబడింది.--యర్రా రామారావు (చర్చ) 04:21, 2 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల మూసలు దిగుమతి చేసుకోవడం ఎలా?

YesY సహాయం అందించబడింది

ఆంగ్ల మూసలు దిగుమతి చేసుకోవడం ఎలా? ఉదాహరణకు ఈ క్రింది మూసను దిగుమతి చేసుకోవాలి అనుకుంటున్నాను. {{COVID-19 testing by country}} ప్రస్తుతం కరోనా వైరస్ సంబంధించిన ఆంగ్ల వ్యాసాల్లో గుణంకాలు,గ్రాఫ్లు, కాలక్రమం ఇటువంటి అన్ని మూస లోనే పెడుతున్నారు. ఆ మూసను తీసుకొచ్చి తెలుగు వ్యాసాలు లో పెడుతుంటే ఎర్రటి లింకు గా కనపడుతుంది కానీ సమాచారం రావట్లేదు. ఆ మూసను ఎలా దిగుమతి చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎలా దిగుమతి చేసుకోవాలి కొంచెం వివరంగా చెప్పండి.—Ch Maheswara Raju (చర్చ) 11:25, 6 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Ch Maheswara Raju గారూ, దిగుమతి చేసుకునే అంశం ప్రత్యేక పేజీల్లో ఉంటుంది. కాని మీకు ఆ అనుమతి బహుశా ఉండి ఉండదు, అందుకే కనబడలేదు. పోతే మీరు చెప్పిన ఆ మూసను దిగుమతి చేసేందుకు నేను ప్రయత్నించాను గానీ, అవలేదు. ఏదో లోపం తలెత్తింది. పరిశీలించాలి. __చదువరి (చర్చరచనలు) 02:01, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Ch Maheswara Raju గారూ, మీరు కోరుకున్న {{COVID-19 testing by country}} మూసను దిగుమతి చేసాను. ఉపయోగించండి. కె.వెంకటరమణ (చర్చ) 05:52, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి,కె.వెంకటరమణ గారు మూస దిగుమతి చేసినందుకు ధన్యవాదాలు.Ch Maheswara Raju (చర్చ) 07:36, 9 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కోవిడ్-19 గణాంకాలు గురించి

ఆంగ్లం Infobox pandemic తెలంగాణలో కరోనా వైరస్ పెట్టాను.. అన్ని వస్తున్నాయి కానీ పాజిటివ్ కేసులు, మరణాలు, వ్యాధి నుండి కోలుకున్న వారు వంటి సమాచారం రావడం లేదు. లూవా తప్పిదం అని వస్తుంది ఎందుకు? ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ సంబంధించిన వ్యాసంలో Infobox pandemic పెట్టాను.పాజిటివ్ కేసులు, మరణాలు, వ్యాధి నుండి కోలుకున్న వారు వంటి సమాచారం వస్తుంది.తెలంగాణ వ్యాసంలోనే రావడం లేదు. ఈ కింద పెట్టాను చూడండి..

తెలంగాణలో లో కరోనావైరస్ వ్యాప్తి (2020)
వ్యాధికోవిడ్ 19
వైరస్ స్ట్రెయిన్SARS-CoV-2
ప్రదేశంతెలంగాణ భారతదేశం
మొదటి కేసుహైదరాబాద్
ప్రవేశించిన తేదీ2 మార్చి 2020
(4 సంవత్సరాలు, 3 వారాలు, 5 రోజులు)[1]
మూల స్థానంవుహాన్ , హుబీ , చైనా
క్రియాశీలక బాధితులుసమాసంలో (Expression) లోపం: -కు ఒక ఆపరాండును ఇవ్వలేదు

Ch Maheswara Raju (చర్చ) 17:47, 23 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Ch Maheswara Raju గారూ ప్రస్తుతం "మాడ్యూల్:WikidataIB" ఫనిచేయడం లేదు. ఈ సమస్యను అర్జునరావు గారు అంగ్ల వికీలో నివేదించారు. అది సరికాబడిన తరువాత ఈ మూసలు పనిచేస్తాయి. ప్రస్తుతం ఆ వ్యాసంలోని డేటాను సరిచేసాను. చూడండి. K.Venkataramana(talk) 01:12, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారు సరే అండి. ఆంగ్లంలో కొవిడ్-19 సంబంధించిన వ్యాసాల అన్నింటిలోనూ గుణంకాలు, కాలక్రమం, గ్రాఫ్ లు వంటి సమాచారం మూస లోనే పెడుతున్నారు. మన తెలుగు వికీలో పెడుతుంటే సపోర్ట్ చేయడం లేదు. అలాగే మూస దిగుమతి చేసుకునే అవకాశం సభ్యులకు లేదు. నేను ఫోన్లో చేస్తూ ఉంటాను సవరణలు అన్ని కొంచెం ఇబ్బందిగా ఉంది అండి.. అలాగే ఈ క్రింది ఇచ్చిన దానిని కూడా దిగుమతి చేయండి. {{Sidebar timeline}}

కొవిడ్-19 సంబంధించిన అన్ని వ్యాసాలలో సపోర్ట్ చేసే లాగా ఉండాలి ధన్యవాదాలుCh Maheswara Raju (చర్చ) 03:00, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Ch Maheswara Raju ,User :K.Venkataramanaగార్లకు ఈ పేజీ వ్యాసపేజీ కాదు కావున, మూసలు సరిగా పనిచేయకపోవచ్చు. అన్నట్లు ఈ రోజు తెలంగాణలో కోవిడ్-19 మహమ్మారి గమనించితే సమస్య కనబడలేదు. ఇంకొక విషయం నేను నివేదించిన బగ్ తిరస్కరించబడింది. ఇటువంటి సమస్యలు రాకుండా మూస తయారీదారులే జాగ్రత్తలు తీసుకోవాలి. --అర్జున (చర్చ) 10:58, 25 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Notes

  1. "First confirmed Covid-19 case detected in Hyderabad; condition of man stable: Telangana minister". Republic World. 2020-03-02. Retrieved 2020-05-14.

meaning of shadabam in telugu

YesY సహాయం అందించబడింది


2405:201:2807:CF9D:1527:E971:2F40:DC35 07:05, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పదాల అర్ధాలకు తెలుగు విక్షనరీ లేక అంతర్జాలం లో ప్రముఖ నిఘంటువు చూడండి. --అర్జున (చర్చ) 10:49, 25 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

విండోస్10 డెస్ట్కోప్ ఫైర్ఫాక్స్ లో వికీపీడియా వీక్షణ సమస్య

YesY సహాయం అందించబడింది

విండోస్ 10 లో సమస్య

నా విండోస్ 10 హోమ్ డెస్క్టాప్ లోని ఫైర్ఫాక్స్ బ్రౌసర్ లో వికీపీడియా తెలుగు వ్యాసాలని వీక్షించినప్పుడు పదాలు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి

నా విండోస్ 10 ఫైర్ఫాక్స్ లో వికీపీడియా ని సాధారణ zoom లో వీక్షణ

నా విండోస్ 10 హోమ్ డెస్క్టాప్ లోని గూగుల్ క్రోమ్ బ్రౌసర్ లో అయితే దీనికి భిన్నంగా పదాలు మామూలుగానే పెద్దగా కనిపిస్తున్నాయి. కానీ చదవదగ్గగా లేదు.

దస్త్రం:Wikipedia in Windows 10 Destkop Chrome 83.0.x Default Zoom.jpg
విండోస్ 10 గూగుల్ క్రోమ్ బ్రౌసర్లో లో వికీపీడియా ని సాధారణ zoom లో వీక్షణ

ఆండ్రోయిడ్ 10 లో సమస్య లేదు

ఆండ్రోయిడ్ మొబైల్ లో అయితే డెస్క్టాప్ కి పూర్తి భిన్నంగా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ బ్రౌసర్లో రెండిటిలోనూ వికీపీడియా వ్యాసాలు పెద్దగా, స్పష్టంగా, అందంగా, చదవడానికి ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి.

నా ఆండ్రోయిడ్ 10 మొబైలు ఫైర్ఫాక్స్ లో వికీపీడియా ని సాధారణ zoom లో వీక్షణ
నా ఆండ్రోయిడ్ 10 మొబైలు గూగుల్ క్రోమ్ లో వికీపీడియా ని సాధారణ zoom లో వీక్షణ

ఫలిం'చ'ని ప్రయత్నాలు

  1. వికీపీడియా భాష అమరికలు లో ఖతి అమరికలు లో Download Fonts when needed ని ఎంచుకున్నా
  2. వికీపీడియా Universal Language Selector/WebFonts వ్యాసంలో ఈ సమస్య కి కారణాలు కొన్ని పరిష్కారాలు వున్నా ఏవి సహాయపడలేదు
  3. వికీపీడియా లో సాధారణంగా వాడే Webfonts మెరుగ్గా పనిచేయడానికి నా విండోస్ 10 డెస్క్టాప్ నుండి తెలుగు ఖతులు తొలగించా
  4. నా విండోస్ 10 డెస్క్టాప్ Screen Resolution ని పూర్తిగా పెంచాను

ప్రస్తుతం ఎంచుకున్న ప్రత్యామ్నాయ మార్గం

వికీపీడియా వీక్షించినప్పుడు బ్రౌసర్ లో కనీసం zoom (140%) చేస్తే తప్ప చదవడానికి ఇబ్బంది గా వుంది. వ్యాసాలు రచించినప్పుడు కూడా ఇదే సమస్య.

విండోస్ 10 ఫైర్ఫాక్స్ లో వికీపీడియా ని 140% zoom లో వీక్షణ

మీ నుండి కోరుతున్న సహాయం

నేను డెస్క్టాప్ లో ఫైర్ఫాక్స్ వాడుక ఇష్టపడతాను. ఈ సమస్యకి మెరుగైన పరిష్కారం వుంటే తెలియచేయగలరు. ముందుగానే ధన్యవాదాలు.


BINDURTHI (చర్చ) 20:42, 30 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

BINDURTHI గారికి, Preferences -> General -> Language and Appearance -> Advanced లో Fonts for Telugu ఎంపికలో తెలుగు ఖతి పరిమాణం పెంచి చూడండి. తెలుగు అక్షరాలు పెద్దవిగా కనబడ్తాయి. నేను పై సూచనలు లినక్స్ లో ఫైర్ఫాక్స్ ప్రకారం రాశాను. విండోస్ స్వల్పతేడాలుంటే వుండవచ్చు. --అర్జున (చర్చ) 07:39, 2 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు మీరు సూచించినట్టు విండోస్ 10 లో scale settings పెంచాను. దాని వల్ల వికీపీడియా వీక్షించినప్పడు పదాల పరిమాణం పెరిగి చూడడానికి అనుకూలం గా వుంది.

విండోస్ 10 డెస్క్టాప్ లో 150% Scale Settings తో తెలుగు వికీపీడియా వ్యాసం స్పష్టంగా కనిపిస్తోంది

కానీ, విండోస్ 10 లో scale settings విండోస్ 10 లో భాష స్థాయి లో మార్చడానికి అవకాశం లేదు. పూర్తి సిస్టమ్ స్థాయిలో అమలుపరచడం వల్ల మార్పు మొత్తం system లో అయింది. దీని వల్ల నా కంప్యూటరు లో ప్రతి App చాలా పెద్దిగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇలా సద్దుకుపోవాలి అనుకుంటా! ధన్యవాదాలు

విండోస్ 10 లో Scale and Layout సెట్టింగ్స్
BINDURTHI గారికి, నేను సూచించినది Firefox మెనూ లోని ఎంపికలు. మరింత సమాచారం కోసం లింకు 1, లింకు2 చూడండి. --అర్జున (చర్చ) 04:14, 4 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]


అర్జున, మీరు చెప్పినట్టు గా ఫైర్ఫాక్స్ అమరికల్లో ప్రత్యేకంగా తెలుగు ఖతులను మార్చాను.

తెలుగు ఖతుల పరిమాణం మార్చడానికి ఫైర్ఫాక్స్ లో అమరికల స్క్రీన్

ఇప్పుడు వికీపీడియా వ్యాసాలు వీక్షించినప్పుడు తెలుగు పదాల స్పష్టత కోసం జూమ్ చేయవలసిన అవసరం లేదు. స్వతహాగా పదాలు పెద్దగా కనిపిస్తున్నాయి. సమస్య తీరినది. చాలా సంతోషం :) ధన్యవాదాలు!

ఫైర్ఫాక్స్ మెనూలో తెలుగు ఖతుల ఎంపికలు మార్చిన (పరిమాణం పెంచిన) తరువాత వికీపీడియా వ్యాసం వీక్షణ. బ్రౌసర్ లేదా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ జూమ్ వాడలేదు

--BINDURTHI (చర్చ) 17:39, 6 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

BINDURTHI గారు, సంతోషం. ఇకముందు మీ వ్యక్తిగత సందేహాలకు మీ చర్చాపేజీ ఇతరాలకు ఆయా పేజీల చర్చాపేజీలు వాడితే మంచిది. ఈ పేజీ సభ్యులు కానివారి సాధారణ సమస్యలకొరకు వాడబడుతున్నది. --అర్జున (చర్చ) 03:55, 7 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

YesY సహాయం అందించబడింది

తాజ్ మహల్ పేజీలో విద్వంసపు పనులు... సరిచేయగలరు. — ప్రభాకర్ గౌడ్ నోముల 10:18, 9 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రభాకర్ గౌడ్ నోముల గార్కి, తాజ్ మహల్ విధ్వంసాన్ని గుర్తించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. కొత్త వాడుకరి తొలగించిన సమాచారాన్ని తిరిగి చేర్చితిని. అతని పేజీలో సూచనలు మీరిచ్చారు. నేను కూడా సూచనలను చేసాను. ధన్యవాదాలు. సహాయం మూసను అచేతనం చేస్తున్నాను. K.Venkataramana(talk) 10:49, 9 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదం ఎలా?

సహాయం కావాలి
క్రింది అభ్యర్థన లేక చర్చకు స్పందించటం ద్వారా తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాలకు చూడండి {{సహాయం కావాలి}}.
నేను ఇంగ్లీషులో ఉన్న విషయాలను తెలుగులోకి అనువదించడానికి ఏం చేయాలి

Bvlk manohar (చర్చ) 07:43, 6 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Bvlk manohar గారు, ప్రత్యేక:ContentTranslation పేజీలో ఇతర వికీల వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేయవచ్చు. మరింత సమాచారానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చూడండి. --అర్జున (చర్చ) 04:33, 12 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Bvlk manohar గారు, అన్నట్లు ఇటువంటి సందేహాలను మీ వాడుకరి చర్చాపేజీలో అడగవచ్చు. ఈ పేజీ ప్రధానంగా వాడుకరి ఖాతా లేని వారిసందేహాలకొరకు ఉద్దేశించబడింది.--అర్జున (చర్చ) 04:34, 12 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]