దహరోపాసన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి {{Orphan}}
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{Orphan}}
{{Orphan}}
దహరమనిన అల్పము అని అర్ధము. సూక్ష్మము గా జేసినందువలన అల్పముకానీ దేశ లేదా ప్రదేశవ్యాప్తిచే అల్పమని కాదు.అది ఈ ఆకాశము కంటే విశాలము.
ఇది హిందువులకు సంబంధించిన ఒక ఉపాసనా మార్గము.దహరమనిన అల్పము అని అర్ధము. సూక్ష్మము గా జేసినందువలన అల్పముకానీ దేశ లేదా ప్రదేశవ్యాప్తిచే అల్పమని కాదు.అది ఈ ఆకాశము కంటే విశాలము.ఈ ఉపాసన యందు సాధకుడు హృదయ గుహలో నుండును. దహరాకాసమునందు మనస్సును లగ్నము చేసి నేను బ్రహ్మమును అని ధ్యానింపవలెను. ఇచట ధ్యానము గాంభీరమగుచో తత్త్వప్రకాశము కలుగును. దీనివలన సంకల్ప సిద్ధికలుగును.హృదయమును కేంద్రీకరించి ధ్యానమును చేసినచో శ్రీఘ్రముగా అఖండమగు ఒకానొక తేజస్సు కనపడును. ఇక్కడ హృదయమనగా హృదయాకాశమనియే అర్ధము. ఉపాసన సిద్ధించినచో విశ్వవ్యాప్తి అగు జ్ఞానముతో పరిచయము కలుగును.
ఈ ఉపాసన యందు సాధకుడు హృదయ గుహలో నుండును. దహరాకాసమునందు మనస్సును లగ్నము చేసి నేను బ్రహ్మమును అని ధ్యానింపవలెను. ఇచట ధ్యానము గాంభీరమగుచో తత్త్వప్రకాశము కలుగును. దీనివలన సంకల్ప సిద్ధికలుగును.హృదయమును కేంద్రీకరించి ధ్యానమును చేసినచో శ్రీఘ్రముగా అఖండమగు ఒకానొక తేజస్సు కనపడును. ఇక్కడ హృదయమనగా హృదయాకాశమనియే అర్ధము. ఉపాసన సిద్ధించినచో విశ్వవ్యాప్తి అగు జ్ఞానముతో పరిచయము కలుగును.

ఆకాశమునకు ఎల్లలు లేవు. ధ్యానము గంభీరమగు కొలదిని దీని నైజము మనకు ఉపలబ్ధమగును. ధ్యానము నిర్రుఢమైనపుడు హృదయ గుహనుండి సహస్రారమునకు పోవు నాడీ రూపమగు ఒకానొక దారి కనపడును. సాధకుడీదారిని పయనించినచో తేజమగు ఒకానొక సత్తను అధిగమించవచ్చును. ఈమార్గము అతి సూక్ష్మము. ఇది మనోబుద్ధులకు అందదు.దహరాకాశమున ధ్యానమునకు ఫలముగా సాధకుడు అధ్యాత్మానుభవ సంపన్నుడగును. మరియు అతని అలౌకిక జ్ఞానము సత్యాద్భాసితమును సతతము ప్రకాశ శీలమగును. కర్మ కించిత్ కూడా అంటదు. సాధారణ జ్ఞానము దీనిని ఎరుగజాలదు.ఇది దివ్యము.దీని వలన అహంకారమునకు నాశనము కలుగును.

08:32, 30 అక్టోబరు 2020 నాటి కూర్పు

ఇది హిందువులకు సంబంధించిన ఒక ఉపాసనా మార్గము.దహరమనిన అల్పము అని అర్ధము. సూక్ష్మము గా జేసినందువలన అల్పముకానీ దేశ లేదా ప్రదేశవ్యాప్తిచే అల్పమని కాదు.అది ఈ ఆకాశము కంటే విశాలము.ఈ ఉపాసన యందు సాధకుడు హృదయ గుహలో నుండును. దహరాకాసమునందు మనస్సును లగ్నము చేసి నేను బ్రహ్మమును అని ధ్యానింపవలెను. ఇచట ధ్యానము గాంభీరమగుచో తత్త్వప్రకాశము కలుగును. దీనివలన సంకల్ప సిద్ధికలుగును.హృదయమును కేంద్రీకరించి ధ్యానమును చేసినచో శ్రీఘ్రముగా అఖండమగు ఒకానొక తేజస్సు కనపడును. ఇక్కడ హృదయమనగా హృదయాకాశమనియే అర్ధము. ఉపాసన సిద్ధించినచో విశ్వవ్యాప్తి అగు జ్ఞానముతో పరిచయము కలుగును.

ఆకాశమునకు ఎల్లలు లేవు. ధ్యానము గంభీరమగు కొలదిని దీని నైజము మనకు ఉపలబ్ధమగును. ధ్యానము నిర్రుఢమైనపుడు హృదయ గుహనుండి సహస్రారమునకు పోవు నాడీ రూపమగు ఒకానొక దారి కనపడును. సాధకుడీదారిని పయనించినచో తేజమగు ఒకానొక సత్తను అధిగమించవచ్చును. ఈమార్గము అతి సూక్ష్మము. ఇది మనోబుద్ధులకు అందదు.దహరాకాశమున ధ్యానమునకు ఫలముగా సాధకుడు అధ్యాత్మానుభవ సంపన్నుడగును. మరియు అతని అలౌకిక జ్ఞానము సత్యాద్భాసితమును సతతము ప్రకాశ శీలమగును. కర్మ కించిత్ కూడా అంటదు. సాధారణ జ్ఞానము దీనిని ఎరుగజాలదు.ఇది దివ్యము.దీని వలన అహంకారమునకు నాశనము కలుగును.

అహం గ్రహోపాసన

కొన్ని ఉపాస్తులలో బాహ్య పదార్ధముల యెడ బ్రహ్మదృష్టి చెప్పబడినది. ఈ ఉపాసనయందు సక్రియమగు తమ అహం సత్తయెడ బ్రహ్మదృష్టి చెప్పబడినది. మానవుని అహం వృత్తి నేను అని వృత్తి మనశ్శరీరేంద్రియములపై సంచారితమై వానియందే బిగిసికొనును. అనగా ప్రతివారు తమ శరీరమునే తాననుకొనును.ఉపనిషత్తులు నేను అను ఈ వృత్తిని వ్యాపకమను ఉదారమును చేయమని ఉపదేశించును. ఈ ఉపాసనలో- మనస్సుని అన్నిచోట్లా నేను అను బోధనమును నెలకొల్పవలయును. క్రమక్రమముగా నేను అను ఈభావన సూక్ష్మమై ఆయా ఈ పదార్ధ స్వరూపము పడయును.సూర్యునియందు ఆత్మ ప్రతిష్ఠి యొనర్చినచో నేను అను ఈ ఎరుకలో విశ్వస్ఫూర్తి కలుగును.వాయువునందిటులు చేయుచో శక్తి స్ఫూర్తియు కలుగును.ఇటులీ ఆత్మప్రతిష్ఠ చేసినచో విశ్వమంతయు నేను లో అంతర్గతమై ఉద్భాసితమగును.ఉపనిషత్ సాధనలో ఇదియే విశేషము.సకల పదార్ధములను ఆత్మరూపముగా చూచుకొనిపోగా పోగా నిజవిరాట్ స్ఫూర్తి కలుగును.అటు పిదప దేశకాలములలో ఆత్మ బుద్ధి బంధింపబడి ఉండదు.

ఉపనిషత్తులలో శబ్దము బ్రహమని చెప్పబడినది. శబ్దమునకు అర్ధముతో ధృఢమగు సంబంధము కలదని అందరికి తెలియును.శబ్దము అర్ధమును తెలుపును. "పర-శబ్దము" అని ఒకటి ఉపనిషత్తులు నిర్వచించుచున్నవి. ఇది నిశ్శబ్ద శబ్దము, అనాహత శబ్దము దీనినే వస్తువు అని అందురు.ఉపాసకుడు గాయత్రి మంత్రమును ఉచ్చరించుచు శబ్దబ్రహ్మమును ఉపాసించవలెను.గాయత్రీ మంత్రము మూడు విభాగములు: సూక్ష్మ, స్థూల, అంతర్లోకము లందలి చైతన్య ప్రకాశము నవలంబించి ఈ విభాగము చేయబడెను. గాయత్రీ మంత్రము ఈ అంతశ్చేతనా బహిశ్చేతనా సూక్ష్మ చేతలను సాధకుని చిత్తమునకు తెచ్చి అచట ప్రకాశింపజేయును. గాయత్రి సవిత ప్రతీకముగా గల్ విశ్వ చైతమ్యునకు జీవ చైతన్యమునకును బేధము పోగొట్టును.అంతర దీప్తికిని విశ్వదీప్తికిని సంబంధము కలిగినచో విశ్వవిజ్ఞానముతో అంతరము పూర్ణ మగును.సవిత్సుమండలమునుండి ఏకల్యాణమూర్తి ప్రకాశించునో ఆకల్యాణమూర్తితో ఆ సాధకునకు పరిచయము కలుగును. అప్పుడు స్వచ్చతా స్వాచ్చంద్యములచే జీవనము పరిపూర్ణమగును.

మూలము

  • 1980 భారతి మాసపత్రిక: వ్యాసము: దహరోపాసన: వ్యాసకర్త: శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారు.
"https://te.wikipedia.org/w/index.php?title=దహరోపాసన&oldid=3054142" నుండి వెలికితీశారు