పసిఫిక్ మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 46: పంక్తి 46:
== చరిత్ర ==
== చరిత్ర ==
[[దస్త్రం:Ortelius - Maris Pacifici 1589.jpg|right|thumb|300px|ఓర్తెలియుస్ చే 1589లో తయారుచేయబడిన పటం. [[పసిఫిక్]] మహాసముద్రాన్ని సూచించిన తొలి పటం బహుశా ఇదే కావచ్చు.]]
[[దస్త్రం:Ortelius - Maris Pacifici 1589.jpg|right|thumb|300px|ఓర్తెలియుస్ చే 1589లో తయారుచేయబడిన పటం. [[పసిఫిక్]] మహాసముద్రాన్ని సూచించిన తొలి పటం బహుశా ఇదే కావచ్చు.]]
చరిత్రకు అందని రోజుల్లో ప్రముఖమైన మానవ వలసలు పసిఫిక్ ప్రాంతంలో జరిగాయి. వీటిలో ముఖ్యమైనవి ఆస్ట్రోనేషియన్లు, పొలినేషియన్ల వలసలు. వీరు [[ఆసియా ఖండం]] నుండి [[తాహితి ద్వీపం|తాహితి]] ద్వీపానికి, అక్కడ నుండి [[హవాయి]], [[న్యూజిలాండ్]] కు, ఆ తరువాత చాలా కాలానికి ఈస్టర్ ద్వీపానికి వలస వెళ్ళారు.
చరిత్రకు అందని రోజులలో పసిఫిక్ ప్రాంతంలో ప్రముఖమైన మానవ వలసలు జరిగాయి. వీటిలో ఆస్ట్రోనేషియన్లు, పొలినేషియన్ల వలసలు ముఖ్యమైనవని భావిస్తున్నారు. వీరు [[ఆసియా ఖండం]] నుండి [[తాహితి ద్వీపం|తాహితి]] ద్వీపానికి, అక్కడ నుండి [[హవాయి]], [[న్యూజిలాండ్]] కు, ఆ తరువాత చాలా కాలానికి ఈస్టర్ ద్వీపానికి వలస వెళ్ళారు.


యూరోపియన్లు ఈ సముద్రాన్ని తొలిసారి 16వ శతాబ్దంలో వీక్షించారు. తొలిగా [[స్పెయిన్]] నావికుడు వాస్కో న్యూనెజ్ డి బాల్బొవా 1513 లోనూ, ఆపై తన భూప్రదక్షిణంలో మాగెల్లాన్ (1519-1522) ఈ సముద్రంపై ప్రయాణించారు.
16వ శతాబ్దంలో యూరోపియన్లు ఈ సముద్రాన్ని తొలిసారి వీక్షించారు. తొలిసారిగా 1513 లో [[స్పెయిన్]] నావికుడు వాస్కో న్యూనెజ్ డి బాల్బొవా తరువాత తన భూప్రదక్షిణంలో భాగంగా మాగెల్లాన్ (1519-1522) ఈ సముద్రం మీద ప్రయాణించారు.
{{ప్రపంచం}}
{{ప్రపంచం}}
{{మహాసముద్రాలు}}
{{మహాసముద్రాలు}}

13:31, 15 నవంబరు 2020 నాటి కూర్పు

భూమి మీద ఉన్న మహాసముద్రాలలో పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) అతి పెద్దది. పోర్చుగీసు నావికుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్ లాటిన్ భాషలో ఈ మహాసముద్రానికి "మేర్ పసిఫికమ్" Mare Pacificum అన్న పేరు సూచించాడు. ఈ పేరుకు "ప్రశాంతమైన సముద్రం" అని అర్థం.

పేరు వెనుక చరిత్ర

చరిత్రపూర్వ కాలం నుండి ఆసియా, ఓషియానియా ప్రజలు పసిఫిక్ మహాసముద్రంలో ప్రయాణించారు. స్పానిష్ అన్వేషకుడు వాస్కో నీజ్ డి బాల్బోవా 1513 లో పనామా ఇస్తమస్‌ను దాటి దక్షిణ పసిఫిక్ సముద్రాన్ని చూసి దానికి ఆయన " మార్ డెల్ సుర్ " (స్పానిష్ భాషలో) అని పేరు పెట్టాడు. 1521 లో స్పానిషు నావికులు ప్రపంచ ప్రదక్షిణ చేసిన సమయంలో బృందంలోని పోర్చుగీసు అన్వేషకుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్ ఈ మహాసముద్రానికి ప్రస్తుత పేరును ఉపయోగించాడు. ఆయన సముద్రం చేరుకోవడానికి అనుకూలమైన గాలులను ఎదుర్కొన్నందున ఈ మహాసముద్రానికి ఆయన " మార్ పాసిఫికో " పేరు పెట్టాడు. పోర్చుగీసు, స్పానిషు రెండుభాషలలో మార్ పసిఫికో అనే పదానికి "ప్రశాంతమైన సముద్రం" అని అర్ధం.

పసిఫిక్ మహాసముద్రంలోని అతి పెద్ద సముద్రాలు

అతి పెద్ద సముద్రాలు:[1][2][3]

  1. ఆస్ట్రేలియన్ మెడిటరేనియన్ సముద్రం– 9.080 మిలియన్ల కి.మీ2
  2. ఫిలిప్పియన్ సముద్రం - 5.695 మిలియన్ల కి.మీ 2
  3. పగడపు సముద్రం – 4.791 మిలియన్ల కి.మీ 2
  4. దక్షిణ చైనా సముద్రం – 3.5 మిలియన్ల కి.మీ 2
  5. టాస్మన్ సముద్రం – 2.3 మిలియన్ల కి.మీ 2
  6. బెరింగు సముద్రం – 2 మిలియన్ల కి.మీ 2
  7. ఒకోట్సక్ సముద్రం – 1.583 మిలియన్ల కి.మీ 2
  8. అలాస్కాఖాతం – 1.533 మిలియన్ల కి.మీ 2
  9. తూర్పు చైనా సముద్రం – 1.249 మిలియన్ల కి.మీ 2
  10. మార్ డీ గ్రౌ – 1.14 మిలియన్ల కి.మీ 2
  11. జపాన్ సముద్రం – 978,000 కి.మీ2
  12. సాల్మన్ సముద్రం – 720,000 కి.మీ 2
  13. బండా సముద్రం – 695,000 కి.మీ 2
  14. అరాఫురా సముద్రం – 650,000 కి.మీ km2
  15. తిమూరు సముద్రం – 610,000 కి.మీ 2
  16. ఎల్లో సముద్రం – 380,000 కి.మీ 2
  17. జావా సముద్రం – 320,000 కి.మీ 2
  18. తాయిలాండు ఖాతం – 320,000 కి.మీ 2
  19. కార్పెంటరియా ఖాతం – 300,000 కి.మీ 2
  20. సెలెబ్స్ సముద్రం – 280,000 2
  21. సులు సముద్రం – 260,000 కి.మీ 2
  22. అనాడిర్ ఖాతం – 200,000 కి.మీ 2
  23. మొలుక్కా సముద్రం – 200,000 కి.మీ 2
  24. కలిఫోర్నియా ఖాతం – 160,000 కి.మీ 2
  25. టొంకిన్ ఖాతం – 126,250 కి.మీ 2
  26. హాల్మహేరా సముద్రం – 95,000 కి.మీ 2
  27. బొహై సముద్రం – 78,000 2
  28. బాలి సముద్రం – 45,000 కి.మీ 2
  29. బిస్మార్క్ సముద్రం – 40,000 కి.మీ 2
  30. సవు సముద్రం - 35,000 కి.మీ 2
  31. సెటో ద్వీపసముద్రం – 23,203 కి.మీ 2
  32. సెరం సముద్రం – 12,000 కి.మీ 2

భోగోళిక స్వరూపం

పసిఫిక్ మహాసముద్రం ఉత్తరాన ఆర్కిటిక్ వలయం నుండి దక్షిణాన అంటార్కిటిక్ ఖండం వరకు వ్యాపించి ఉంది. 169.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ మహాసముద్రం భూవైశల్యంలో మొత్తంలో 32 శాతాన్ని, జలభాగంలో 46 శాతాన్ని ఆక్రమించింది. ఈ మహాసముద్ర వైశాల్యం మొత్తం అన్ని ఖండాలన్నిటి సమైక్య వైశాల్యం కన్నా ఎక్కువ. భూమధ్య రేఖకు ఇరువైపులా ఉన్న ఈ మహాసముద్రాన్ని ఉత్తర పసిఫిక్ సముద్రం, దక్షిణ పసిఫిక్ సముద్రాలుగా వ్యవహరిస్తారు. వాయువ్య పసిఫిక్ లో గల మరియానా అగడ్త భూమిపై అత్యంత లోతైన ప్రదేశం. ఈ ప్రదేశంయొక్క లోతు 10,911 మీటర్లు.భూమి పై ఉన్న అనీ అగ్ని పర్వతాలలోకీ అత్యంత చురుకైనవిగా పేరు బడ్డ అగ్నిపర్వతాలు పసిఫిక్ లోనే ఉన్నాయి. ఈ పర్వతాలు ఉన్న ప్రాంతానికి అగ్ని వలయమని పేరు. పసిఫిక్ ఉపరితల జలాలు సాధారణంగా ఉత్తరార్ధ గోళంలో సవ్యదిశలోనూ, దక్షిణార్ధ గోళంలో అపసవ్య దిశలోనూ ప్రవహిస్తాయి.

చరిత్ర

ఓర్తెలియుస్ చే 1589లో తయారుచేయబడిన పటం. పసిఫిక్ మహాసముద్రాన్ని సూచించిన తొలి పటం బహుశా ఇదే కావచ్చు.

చరిత్రకు అందని రోజులలో పసిఫిక్ ప్రాంతంలో ప్రముఖమైన మానవ వలసలు జరిగాయి. వీటిలో ఆస్ట్రోనేషియన్లు, పొలినేషియన్ల వలసలు ముఖ్యమైనవని భావిస్తున్నారు. వీరు ఆసియా ఖండం నుండి తాహితి ద్వీపానికి, అక్కడ నుండి హవాయి, న్యూజిలాండ్ కు, ఆ తరువాత చాలా కాలానికి ఈస్టర్ ద్వీపానికి వలస వెళ్ళారు.

16వ శతాబ్దంలో యూరోపియన్లు ఈ సముద్రాన్ని తొలిసారి వీక్షించారు. తొలిసారిగా 1513 లో స్పెయిన్ నావికుడు వాస్కో న్యూనెజ్ డి బాల్బొవా తరువాత తన భూప్రదక్షిణంలో భాగంగా మాగెల్లాన్ (1519-1522) ఈ సముద్రం మీద ప్రయాణించారు.

  1. https://www.livescience.com/29533-the-worlds-biggest-oceans-and-seas.html
  2. https://www.worldatlas.com/
  3. http://listofseas.com/