ప్రేమ ఖైదీ: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
చి వర్గం:పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 71: | పంక్తి 71: | ||
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]] |
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]] |
||
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]] |
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]] |
||
[[వర్గం:పి.ఎల్.నారాయణ నటించిన సినిమాలు]] |
14:55, 24 జనవరి 2021 నాటి కూర్పు
ప్రేమ ఖైదీ | |
---|---|
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
రచన | పరుచూరి సోదరులు (కథ, మాటలు), గజ్జల వినాయక శర్మ (మాటలు), ఇ. వి. వి. సత్యనారాయణ (చిత్రానువాదం) |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | హరీష్, మాలాశ్రీ |
ఛాయాగ్రహణం | కె. రవీంద్ర బాబు |
కూర్పు | కృష్ణారెడ్డి, మాధవ్ |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 1991 |
భాష | తెలుగు |
ప్రేమ ఖైదీ 1991 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో హరీష్, మాలాశ్రీ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమాను నిర్మాత డి. రామానాయుడు ప్రేమ్ ఖైదీ పేరుతో హిందీలో పునర్నిర్మాణం చేశాడు. తెలుగులో కథానాయకుడిగా నటించిన హరీశ్ నే హిందీ సినిమాకు కూడా పరిచయం చేశాడు. కరిష్మా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. హిందీలో కూడా ఈ చిత్రం విజయం సాధించింది.[2]
కథ
చంద్రం అనే 21 ఏళ్ళ యువకుణ్ణి తండ్రిని హత్య చేసిన నేరం కింద జైలుకి తీసుకురావడంతో కథ ప్రారంభమవుతుంది. వచ్చీ రాగానే తోటి ఖైదీలు అతనితో గొడవ పెట్టుకుంటారు. జైలు గోడమీద చంద్రం ఓ అమ్మాయి బొమ్మ వేస్తాడు. దాన్ని గురించి జైలరు నీచంగా మాట్లాడితే అతన్ని కూడా కొడతాడు. జైలరు జైలులో ఉన్న ఖైదీలను అక్రమంగా బయటకు పంపించి దారి దోపిడీలు చేయిస్తుంటాడు. ప్రభావతి అనే లేడీ ఆఫీసరు బోస్టన్ స్కూలుకి సూపరింటెండెంటు గా వస్తుంది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న చంద్రాన్ని ఆసుపత్రికి తరలించమంటుంది. ఈ లోపున నీలిమ అనే అమ్మాయి చంద్రాన్ని చూడటానికి జైలుకి వస్తుంది కానీ పోలీసులు అనుమతించరు. ఈ లోపున ఆమె తండ్రి పంపించిన మనుషులు ఆమెను బలవంతంగా తీసుకెళ్ళబోతే చంద్రం వారి వెంట పడతాడు కానీ మళ్ళీ పోలీసులకు చిక్కి ఆసుపత్రిలో చేరతాడు. కానీ కొంతమంది గూండాలు వచ్చి అతన్ని చంపబోతే ప్రభావతి వచ్చి వారిని అడ్డుకుంటుంది. ప్రభావతి చంద్రం గురించి ఆరా తీయగా తన కథ గురించి చెబుతాడు.
బాపినీడు అనే వ్యక్తి చేపలు వ్యాపారం చేస్తుంటాడు. అతని దగ్గర చంద్రం తండ్రి పనిచేస్తూ రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు. కుటుంబం గడవడం కోసం చంద్రం వారింట్లో గుమాస్తాగా చేరతాడు. అక్కడే అతనికి బాపినీడు కూతురు నీలిమ పరిచయం అవుతుంది. నీలిమ మొదట్లో స్నేహితురాళ్ళతో పందెం కాసి చంద్రాన్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది. కానీ తర్వాత అతని మంచితనం గురించి తెలుసుకుని నిజంగా ప్రేమించడం మొదలుపెడుతుంది. కానీ బాపినీడు వారి ప్రేమను అంగీకరించడు. చంద్రాన్ని చంపమని గూండాలని పురమాయిస్తాడు. కానీ వాళ్ళు పొరపాటున చంద్రం తండ్రిని చంపేసి ఆ నేరాన్ని చంద్రం మీద వేస్తారు. ఈ కథంతా విన్న ప్రభావతికి చంద్రం మీద జాలి కలిగి వారిద్దరి పెళ్ళి తాను చేస్తానని మాట ఇస్తుంది. నేరుగా బాపినీడు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయమని చెబుతుంది. బాపినీడు ఆమె హద్దుల్లో ఆమెను ఉండమని, అవమానించి పంపించేస్తాడు. ప్రభావతి బాపినీడుకు తెలియకుండా జైల్లో ఉన్న చంద్రం, నీలిమ కలిసే ఏర్పాటు చేస్తుంది. బాపినీడు నీలిమను ఓ వ్యాపారవేత్త కొడుక్కిచ్చి పెళ్ళి చేయబోతే ఆమె మైనర్ అని నిరూపించి ఆ పెళ్ళిని ఆపుచేయిస్తుంది ప్రభావతి. ఆమె మీద కక్షతో ప్రభావతి కొడుకుని అన్యాయంగా జైలుకి పంపిస్తాడు బాపినీడు. మైనారిటీ తీరగానే చంద్రానికి, నీలిమకి పెళ్ళి చేస్తానని ప్రభావతి బాపినీడుతో చాలెంజ్ చేస్తుంది. బాపినీడు తన పలుకుబడి ఉపయోగించి ఆమెను వేరే చోటికి బదిలీ చేయిస్తాడు. ఈ లోపు నీలిమ ఇంటి నుంచి తప్పించుకుని జైలులో ఉన్న సూరి బాబు అనే ఖైదీ స్థానంలో చేరుతుంది. బాపినీడు సూరిబాబును బయట చూసి తన కూతురు జాడ చెప్పమని అడుగుతాడు. అతను చెప్పకపోతే చంపేస్తాడు.
తారాగణం
- చంద్రం గా హరీష్
- నీలిమ గా మాలాశ్రీ
- ప్రభావతి గా శారద
- చంద్రం తండ్రిగా పి. ఎల్. నారాయణ
- బాపినీడు గా గోకిన రామారావు
- ప్రభావతి భర్తగా గిరిబాబు
- పంతులు గా బ్రహ్మానందం
- స్టూవర్టుపురం దేవుడు గా బాబు మోహన్
- జైలు ఖైదీగా ఆలీ
- జైలు ఖైదీగా ఉత్తేజ్
- పృథ్వీరాజ్
- రజిత
- త్యాగరాజు
- రావి కొండలరావు
- జైలరు కె. కె. రావుగా జయప్రకాష్
- అతిథి పాత్రలో డి. రామానాయుడు
- పరుచూరి రవీంద్రనాథ్
- బోస్
- రాజ్ కుమార్
- ఎం. వి. రమణ
- రామలింగ స్వామి
- తాతా అప్పారావు
- గౌతంరాజు
- సత్యనారాయణ
- చార్మిళ
- నీత
- శైలజ
- స్పందన
- రాధా కుమారి
- విజయ
సాంకేతికవర్గం
పాటలు
రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు వేటూరు సుందరరామమూర్తి రాశాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, చిత్ర, ఎస్. పి. శైలజ, రమోల పాటలు పాడారు.
- ఐ లవ్ ఫర్ యూ అన్నది ప్రేమ
- నీ నవ్వులో స్నేహము
మూలాలు
- ↑ "యూట్యూబులో ప్రేమ ఖైదీ సినిమా". YouTube. Suresh Productions. 8 August 2013. Retrieved 19 April 2018.
- ↑ వినాయకరావు, యు. మూవీమొఘల్. హైదరాబాదు. p. 311.[permanent dead link]