చంద్రరేఖా విలాపం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''చంద్రరేఖా విలాపం''' అనేది హాస్యరస [[బూతు]] ప్రబంధం. దీనిని 18వ [[శతాబ్దము|శతాబ్దం]]లో [[పిఠాపురం]]కు చెందిన [[కూచిమంచి తిమ్మకవి]] తమ్ముడు [[కూచిమంచి జగ్గకవి]] వ్రాశాడు. [[పుదుచ్చేరి]] లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించారు. ఇది హాస్య కథ ప్రబంధం. ఈ గ్రంధాన్ని మితిమీరిన శృంగార అంశాలున్నందువల్ల ప్రభుత్వం దీనిని నిషేధించింది.<ref>{{Cite web|url=https://vdocuments.mx/chandra-rekha-vilapam.html|title=Chandra Rekha Vilapam - [PDF Document]|website=vdocuments.mx|language=sa|access-date=2021-04-03}}</ref>
'''చంద్రరేఖా విలాపం''' అనేది హాస్యరస [[బూతు]] ప్రబంధం. దీనిని 18వ [[శతాబ్దము|శతాబ్దం]]లో [[పిఠాపురం]]కు చెందిన [[కూచిమంచి తిమ్మకవి]] తమ్ముడు [[కూచిమంచి జగ్గకవి]] వ్రాశాడు<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Ganapeswaralayam_-_K._Srinivasa_Rao.pdf/11|title=పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/11 - వికీసోర్స్|website=te.wikisource.org|language=te|access-date=2021-04-03}}</ref>. [[పుదుచ్చేరి]] లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించారు. ఇది హాస్య కథ ప్రబంధం. ఈ గ్రంధాన్ని మితిమీరిన శృంగార అంశాలున్నందువల్ల ప్రభుత్వం దీనిని నిషేధించింది.<ref>{{Cite web|url=https://vdocuments.mx/chandra-rekha-vilapam.html|title=Chandra Rekha Vilapam - [PDF Document]|website=vdocuments.mx|language=sa|access-date=2021-04-03}}</ref>
== కవి పరిచయం ==
== కవి పరిచయం ==
కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దము తొలి భాగంలో పిఠాపురం ప్రాంతంలో ఉండేవాడు. ఇతని అన్న కూచిమంచి తిమ్మకవి. అతను కూడా ప్రసిద్ధుడే. జగ్గకవి రాసిన హాస్యరస ప్రబంధం ఇది.
కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దము తొలి భాగంలో పిఠాపురం ప్రాంతంలో ఉండేవాడు. ఇతని అన్న కూచిమంచి తిమ్మకవి. అతను కూడా ప్రసిద్ధుడే. జగ్గకవి రాసిన హాస్యరస ప్రబంధం ఇది.

11:51, 3 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

చంద్రరేఖా విలాపం అనేది హాస్యరస బూతు ప్రబంధం. దీనిని 18వ శతాబ్దంలో పిఠాపురంకు చెందిన కూచిమంచి తిమ్మకవి తమ్ముడు కూచిమంచి జగ్గకవి వ్రాశాడు[1]. పుదుచ్చేరి లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించారు. ఇది హాస్య కథ ప్రబంధం. ఈ గ్రంధాన్ని మితిమీరిన శృంగార అంశాలున్నందువల్ల ప్రభుత్వం దీనిని నిషేధించింది.[2]

కవి పరిచయం

కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దము తొలి భాగంలో పిఠాపురం ప్రాంతంలో ఉండేవాడు. ఇతని అన్న కూచిమంచి తిమ్మకవి. అతను కూడా ప్రసిద్ధుడే. జగ్గకవి రాసిన హాస్యరస ప్రబంధం ఇది.

ప్రచురణ

ఈ కావ్యాన్ని 1922లో పుదుచ్ఛేరి నుండి "కామ గ్రంథమాల" వారు ప్రచురించారు. దీనికి ఎస్.చిన్నయ్య గారు సంపాదకులుగా ఉన్నారు. 1922లో ఇది మొదటి సారి ప్రచురించబడినా తరువాత దీనిని ఎవరూ ప్రచురించలేదు.

గ్రంథ విశేషాలు

తెలుగులో విశిష్టమైన ప్రబంధం ఇది. రచనా పద్ధతి ప్రబంధాల వలెనే నడుస్తున్నా, ఇందులోని భాషా, వర్ణనా సంప్రదాయాల్ని చిన్నాభిన్నం చేసిన హాస్య రస ప్రబంధం ఇది. ఈ కావ్యంలో కవి ఈ రచనకు ఎలా అంకురార్పణ జరిగిందో వివరించాడు.

ఒక కావ్యాన్ని మొదట తన సంప్రదాయ పద్ధతిలో రాసి, అంకితం తీసుకుంటానని వాగ్దానం చేసిన చింతలపాటి నీలాద్రిరాజు తీరా ఆ ప్రబంధం రచన జరిగిన తరువాత చేతిలో డబ్బులు లేవని, తీసుకొనలేనని చెప్పాడు. అంతే కాక వాటి వల్ల ఏమీ ఉపయోగం కలగడం లేదనీ, డబ్బు ఖర్చు లేకుండా తన గురించి, తను ఉంచుకున్న వేశ్య చంద్రరేఖ గురించి, ఓ హాస్య ప్రబంధం రాయమని సలహా కూడా ఇచ్చాడు. అంతకు ముందు ఆడిమళ్ళ వెంకట శాస్త్రులు అతనికి ఒక ప్రబంధాన్ని అంకితం ఇచ్చాడు. చంద్రరేఖ ఆ వేంకటశాస్త్రులు ఉంచుకున్న వేశ్య కటకపు వేంకటసాని కూతురు. బహుశా వీటన్నిటి కారణంగా జగ్గకవి, తనకు నీలాద్రిరాజు డబ్బివ్వకపోవడానికి ముఖ్య కారకుడు ఆ వేంకటశాస్త్రి అని నమ్మినట్లు కనబడుతుంది.

నీలాద్రి రాజునీ, చంద్రరేఖనీ, వేంకటశాస్త్రుల్నీ, వేంకట సానినీ గలగలిపి చండాలంగా బండబూతులు తిడుతూ జగ్గకవి ఈ గ్రంథాన్ని రాసాడు. [3]

ఇతర విశేషాలు

వెలుదండ నిత్యానందరావు ప్రాచీనాధునిక సాహిత్యకారులందరూ ఈసడించుకున్న ఈ ప్రబంధాన్ని తన ఎం.ఫిల్. పరిశోధనాంశంగా స్వీకరించి ఈ తొలి వికట ప్రబంధం పైన సమగ్ర పరిశీలన చేసి ఈ ప్రబంధంలోని ప్రౌఢమైన పదాల గుంభనాన్ని, సరస హాస్యాలను బయల్పరిచాడు.[4]

మూలాలు

  1. "పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/11 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2021-04-03.
  2. "Chandra Rekha Vilapam - [PDF Document]". vdocuments.mx (in సంస్కృతం). Retrieved 2021-04-03.
  3. http://www.eemaata.com/books/candrarekha/candrarekha-intro.pdf
  4. "తెలుగు సంశోధన సామ్రాట్టు | దర్వాజ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2021-04-03.

బాహ్య లంకెలు