టిఎన్ఆర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 52: పంక్తి 52:
మొదట్లో దర్శకుడు [[తేజ]]<nowiki/>తో చేసిన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో "ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్" ప్రారంభమైంది. [[రామ్ గోపాల్ వర్మ|రామ్ గోపాల్ వర్మ,]] [[కృష్ణవంశీ]], [[విజయ్ దేవరకొండ]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] వంటి సినిమా ప్రముఖులతో టిఎన్ఆర్ చేసిన ఇంటర్వ్యూలు బాగా ప్రాచుర్యం పొందాయి.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/news/ram-gopal-varma-no-need-guns-without-thighs-058802.html|title=తొడల కోసమే గన్స్ .. సెక్స్ కావాలని డైరెక్టుగా అడుగుతా.. ఆ రోజే చచ్చిపోతా.. వర్మ|last=Rajababu|date=2017-06-01|website=telugu.filmibeat.com|language=te|url-status=live|access-date=2021-05-10}}</ref><ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/ade+prashna+ninnu+adigite+mi+aavida+ninnu+intloki+kuda+raanivvadu+mohan+baabu-newsid-n145815604|title=అదే ప్రశ్న నిన్ను అడిగితే మీ ఆవిడ నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు..మోహన్ బాబు..? - Telugu Ap Herald|website=Dailyhunt|language=en|access-date=2021-05-10}}</ref> 4 - 8 గంటల సుదీర్ఘమైన సమయం ప్రేక్షకుల ఆసక్తి కోల్పోకుండేలా టి.ఎన్.ఆర్. పలువురు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు.<ref name=":3" /> [[కృష్ణవంశీ]], [[తనికెళ్ళ భరణి]] వంటివారిని 4 గంటల పైచిలుకు ఇంటర్వ్యూలు చేశాడు. తాను గురువుగా భావించే [[ఎల్. బి. శ్రీరామ్]] తో చేసిన ఇంటర్వ్యూ ఏకంగా 8 గంటల పాటు చేసి రికార్డు సృష్టించాడు.<ref name=":3" /> ఇంటర్వ్యూయర్‌గానూ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం అందుకునేవాడు.<ref name=":2" />

ఇంటర్వ్యూయర్‌గా ప్రాచుర్యం పొందాక టి.ఎన్.ఆర్.కు నటన అవకాశాలు పెరిగాయి. [[నేనే రాజు నేనే మంత్రి]], [[జార్జ్ రెడ్డి (సినిమా)|జార్జ్ రెడ్డి]], [[సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)|సుబ్రహ్మణ్యపురం]], [[ఉమామహేశ్వర ఉగ్రరూపస్య]], వంటి సినిమాల్లో టి.ఎన్.ఆర్. పాత్రలు పోషించాడు.<ref name=":0" /> నటుడు [[పవన్ కళ్యాణ్]], దర్శక రచయిత [[త్రివిక్రమ్ శ్రీనివాస్]]<nowiki/>లను ఇంటర్వ్యూ చేయాలని, తాను దర్శకునిగా సినిమా తీయాలని టిఎన్ఆర్ తీరని కోరికలు.<ref name=":3" />
ఇంటర్వ్యూయర్‌గా ప్రాచుర్యం పొందాక టి.ఎన్.ఆర్.కు నటన అవకాశాలు పెరిగాయి. [[నేనే రాజు నేనే మంత్రి]], [[జార్జ్ రెడ్డి (సినిమా)|జార్జ్ రెడ్డి]], [[సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)|సుబ్రహ్మణ్యపురం]], [[ఉమామహేశ్వర ఉగ్రరూపస్య]], వంటి సినిమాల్లో టి.ఎన్.ఆర్. పాత్రలు పోషించాడు.<ref name=":0" /> నటుడు [[పవన్ కళ్యాణ్]], దర్శక రచయిత [[త్రివిక్రమ్ శ్రీనివాస్|త్రివిక్రమ్ శ్రీనివాస్‌]]<nowiki/>లను ఇంటర్వ్యూ చేయాలని, తాను దర్శకునిగా సినిమా తీయాలని టిఎన్ఆర్ కోరికలు.<ref name=":3" />

== మరణం ==
== మరణం ==

08:29, 10 మే 2021 నాటి కూర్పు

టిఎన్ఆర్
దస్త్రం:TNR.jpg
తుమ్మల నరసింహారెడ్డి
జననంజనవరి 9, 1976
మంచిర్యాల, తెలంగాణ
మరణంమే 10, 2021
హైదరాబాదు, తెలంగాణ
మరణ కారణంకరోనా
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ప్రసిద్ధిఇంటర్వ్యూ హోస్ట్, సినిమా జర్నలిస్టు, నటుడు.
తండ్రిరాజిరెడ్డి

టి.ఎన్.ఆర్.గా పేరొందిన తుమ్మల నరసింహారెడ్డి (1976 జనవరి 9 - 2021 మే 10) తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సినిమా జర్నలిస్టు, నటుడు."ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్" పేరిట అతను నిర్వహించే ఇంటర్వ్యూ సీరీస్‌ ద్వారా చాలా ప్రాచుర్యం చెందాడు. పలువురు తెలుగు సినీ నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర ప్రముఖులను అతను "ఫ్రాంక్లీ స్పీకింగ్‌ విత్‌ టిఎన్‌ఆర్‌ " షోలో భాగంగా ఇంటర్వ్యూ చేయగా వాటిలో పలు వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూలు పొందాయి. టి.ఎన్.ఆర్. కోవిడ్-19 వ్యాధి బారిన పడి వ్యాధి విషమించడంతో మరణించాడు.

తొలినాళ్ళ జీవితం

తుమ్మల నరసింహారెడ్డి 1976 జనవరి 9న మంచిర్యాలలో జన్మించాడు.[1] అతని స్వంత ఊరు మంచిర్యాల, తండ్రి రాజిరెడ్డి గ్రామ సర్పంచిగా మూడు పర్యాయాలు ఎన్నికై పనిచేశాడు.[2]

కెరీర్

సహాయ రచయితగా, టీవీ జర్నలిస్టుగా

టి.ఎన్.ఆర్. దర్శకత్వంపై ఆసక్తితో డిగ్రీ పూర్తికాగానే సినిమా రంగంలోకి వచ్చాడు. 1992లో టి.ఎన్.ఆర్. దేవదాస్ కనకాల వద్ద దర్శకత్వం గురించి నేర్చుకున్నాడు.[3] ఆపైన సినిమా రచయిత ఎల్. బి. శ్రీరామ్ వద్ద సహాయ రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత టెలివిజన్ జర్నలిస్టుగా పలు టెలివిజన్ ఛానళ్ళలో పనిచేశాడు.[4] ఎన్ టీవీలో క్రైమ్ స్టోరీస్ వంటి కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాడు.[1]

ఇంటర్వ్యూయర్‌గా, నటునిగా

ఐడ్రీమ్ మీడియాలో "ఫ్రాంక్లీ స్పీకింగ్‌ విత్‌ టిఎన్‌ఆర్‌" అన్న ఇంటర్వ్యూ సీరీస్‌లో ఇంటర్వ్యూయర్‌గా తెలుగు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు.[5] ఈ కార్యక్రమంలోని పలు ఇంటర్వ్యూలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూలు లభించాయి.[6] 2018 అక్టోబరు నాటికే టిఎన్ఆర్ ఇంటర్వ్యూలకు మొత్తంగా 20 కోట్ల పైచిలుకు వీక్షణలు లభించినట్టు సాక్షి పత్రికలో ప్రకటించిన అంచనా.[2]

మొదట్లో దర్శకుడు తేజతో చేసిన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో "ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్" ప్రారంభమైంది. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు వంటి సినిమా ప్రముఖులతో టిఎన్ఆర్ చేసిన ఇంటర్వ్యూలు బాగా ప్రాచుర్యం పొందాయి.[7][8] 4 - 8 గంటల సుదీర్ఘమైన సమయం ప్రేక్షకుల ఆసక్తి కోల్పోకుండేలా టి.ఎన్.ఆర్. పలువురు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు.[2] కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి వంటివారిని 4 గంటల పైచిలుకు ఇంటర్వ్యూలు చేశాడు. తాను గురువుగా భావించే ఎల్. బి. శ్రీరామ్ తో చేసిన ఇంటర్వ్యూ ఏకంగా 8 గంటల పాటు చేసి రికార్డు సృష్టించాడు.[2] ఇంటర్వ్యూయర్‌గానూ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం అందుకునేవాడు.[1]

ఇంటర్వ్యూయర్‌గా ప్రాచుర్యం పొందాక టి.ఎన్.ఆర్.కు నటన అవకాశాలు పెరిగాయి. నేనే రాజు నేనే మంత్రి, జార్జ్ రెడ్డి, సుబ్రహ్మణ్యపురం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, వంటి సినిమాల్లో టి.ఎన్.ఆర్. పాత్రలు పోషించాడు.[4] నటుడు పవన్ కళ్యాణ్, దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ఇంటర్వ్యూ చేయాలని, తాను దర్శకునిగా సినిమా తీయాలని టిఎన్ఆర్ కోరికలు.[2]

మరణం

టి.ఎన్.ఆర్. కోవిడ్-19 బారిన పడి మొదట కోలుకున్నాడు. అనుకోనివిధంగా ఆరోగ్యం విషమించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో 2021 మేలో కాచిగూడలోని ఎస్.వి.ఎస్. ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు.[9] ఆరోగ్యం మరింత విషమించడంతో 2021 మే 10న ఉదయం మరణించాడు.[6]

మూలాలు

  1. 1.0 1.1 1.2 Prashanth, Musti (2021-05-10). "ఆ తరువాత అత్యదిక రెమ్యునరేషన్ అందుకున్న TNR.. ఆ ఒక్క ఇంటర్వ్యూతోనే దశ తిరిగింది!". telugu.filmibeat.com. Retrieved 2021-05-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "సాక్షి 'విత్‌ టీఎన్‌ఆర్‌'". Sakshi. 2018-10-08. Archived from the original on 2018-10-09. Retrieved 2021-05-10.
  3. HMTV, Samba Siva (10 May 2021). "Journalist TNR ఇక‌లేరు.. క‌రోనాతో కన్నుమూత". www.hmtvlive.com. Retrieved 10 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. 4.0 4.1 "TNR: కరోనాతో కన్నుమూత - popular talk show host and actor tnr no more". www.eenadu.net. Retrieved 2021-05-10.
  5. "Journalist TNR health: నటుడు, జర్నలిస్ట్ TNR ఆరోగ్యం అత్యంత విషమం." News18 Telugu. 2021-05-09. Retrieved 2021-05-10.
  6. 6.0 6.1 "ప్రముఖ జర్నలిస్ట్‌ టిఎన్‌ఆర్‌ కరోనాతో కన్నుమూత | Prajasakti". www.prajasakti.com. Retrieved 2021-05-10.
  7. Rajababu (2017-06-01). "తొడల కోసమే గన్స్ .. సెక్స్ కావాలని డైరెక్టుగా అడుగుతా.. ఆ రోజే చచ్చిపోతా.. వర్మ". telugu.filmibeat.com. Retrieved 2021-05-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "అదే ప్రశ్న నిన్ను అడిగితే మీ ఆవిడ నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు..మోహన్ బాబు..? - Telugu Ap Herald". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2021-05-10.
  9. "క్రిటికల్ గా TNR హెల్త్ కండీషన్.. కోమాలో..?". Asianet News Network Pvt Ltd. Retrieved 2021-05-10.
"https://te.wikipedia.org/w/index.php?title=టిఎన్ఆర్&oldid=3188150" నుండి వెలికితీశారు