ప్రతాపరుద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''ప్రతాపరుద్రుడు''' [[కాకతీయులు|కాకతీయ]] రాజవంశమునకు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది.
'''ప్రతాపరుద్రుడు''' [[కాకతీయులు|కాకతీయ]] రాజవంశమునకు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడను పేర్లుండెను. జినకళ్యాణాభ్యుదయమను రచనను ముగించుచూ గ్రంథకర్త అప్పయార్యుడు తన్న గ్రంథమును రుద్రకుమారదేవుని రాజ్యములో శకము 1241లో ముగించితినని చెప్పుకున్నాడు.



1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది<ref>A Social History of the Deccan, 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, ISBN:0521254841</ref>.
1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది<ref>A Social History of the Deccan, 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, ISBN:0521254841</ref>.


==రాజ్యము==
==రాజ్యము==


రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి <ref>Hindu Law, Sir Thomas Strange, 1830, Parbury, Allen, & Co., London</ref>. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించినాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది
రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి <ref>Hindu Law, Sir Thomas Strange, 1830, Parbury, Allen, & Co., London</ref>. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది


==యుధ్ధములు==
==యుధ్ధములు==

18:00, 5 జూలై 2008 నాటి కూర్పు

ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడను పేర్లుండెను. జినకళ్యాణాభ్యుదయమను రచనను ముగించుచూ గ్రంథకర్త అప్పయార్యుడు తన్న గ్రంథమును రుద్రకుమారదేవుని రాజ్యములో శకము 1241లో ముగించితినని చెప్పుకున్నాడు.


1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది[1].


రాజ్యము

రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి [2]. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది

యుధ్ధములు

క్రీ. శ. 1289లో రుద్రమ దేవి మరణానంతరము రాజ్యాధికారము చేబట్టిన వెంటనే అంబదేవుని తిరుగుబాటు అణచివేయుటకు ప్రతాపరుద్రుడు పూనుకున్నాడు. అందుకోసం నాయంకారవిధానమును కట్టుదిట్టం చేశాడు. నాయకుల సైన్యమునంతనూ తీర్చిదిద్ది మంచి శిక్షణ ఇప్పించి సిద్ధపరిచాడు. తన దాడిని మూడుగా విభజించి మూడు మార్గములలో నడిపించాడు. ఒకటి అంబదేవుని పైకి, రెండవది నెల్లూరు పైకి, మూడవది సేవుణ రాజ్యము పైకి. ఇందులూరి అన్నయ త్రిపురాంతకముపై దాడిచేసి క్రీ. శ. 1291లొ అంబదేవుని తరిమివేశాడు. ఆడిదము మల్లు నెల్లూరిపైకి వెడలి అచట మనుమగండభూపాలుని హతమార్చాడు. పశ్చిమరంగములో గోన గన్నయ, విట్ఠలుడు యాదవరాజాక్రాంతములైనున్న ఆదవాని, తుంబళము కోటలు పట్టుకొని రాయచూరుదుర్గముపై దాడికి వెడలారు. కన్నడప్రాంతాలైన మాణువ, హాళువలను కూడ సాధించి కృష్ణా తుంగభద్రల నడిమిదేశమంతటినీ జయించారు. దీనితో సేవుణ రాజు దురాక్రమణము కట్టుబడింది. ఆంతరంగిక వ్యవహారాలీవిధముగా చక్కదిద్దుకొనగలిగినను ప్రతాపరుద్రునికి గొప్ప విపత్కరపరిస్థితి ఉత్తరదేశము నుండి ముంచుకొచ్చింది.

ముస్లిం దండయాత్రలు

ఢిల్లీ సుల్తాను జలాలుద్దీను అల్లుడు గరషాస్ప్ మాలిక్ క్రీ.శ. 1296లో యాదవరాజ్యముపై దండెత్తి దేవగిరిని దోచుకుపోయాడు. గరషాస్ప్ మామను హత్యచేసి అల్లావుద్దీన్ ఖిల్జీ అను పేరుతో సింహాసనమెక్కాడు. సిరిసంపదలతో తులతూగుతున్న ఓరుగంటిపై ఖిల్జీ కన్ను బడింది. తెలుగుదేశముపై ముస్లిముల దాడులకు క్రీ.శ. 1303లో అంకురార్పణ జరిగింది.

మొదటి దాడి

అల్లావుద్దీను ఖిల్జీ తన విశ్వాసపాత్రులైన సర్దారులు మాలిక్ ఫక్రుద్దీన్ జునా మరియు జాజు లను గొప్ప సైన్యముతో బంగాళదేశము మీదుగా పంపాడు. కాకతీయ నాయకుడు పోతుగంటి మైలి ఉప్పరపల్లి (ప్రస్తుత కరీంనగర్ మండలం)వద్ద తురుష్క సైన్యాన్ని ఎదుర్కొని తరిమివేశాడు.

రెండవ దాడి

క్రీ.శ. 1309లో సుల్తాను మరింత సైన్యముతో మాలిక్ నాయిబ్ కాఫూర్ ను పంపాడు. అతడు దేవగిరిమీదుగా పయనించి దారిలో సిరిపూరు కోటను స్వాధీనము చేసుకుంటాడు. విషయము తెలిసి ప్రతాపరుద్రుడు సైన్యమును సిద్ధముచేసి కోట సంరక్షణకు సన్నిద్ధుడవుతాడు. కాఫూర్ హనుమకొండను ఆక్రమించి ఓరుగల్లు ముట్టడించాడు. బురుజునకొక నాయకుని చొప్పున తగు సైన్యముతో నెలరోజులు వీరోచితముగా కోటను కాపాడారు. తుదకు ముస్లిం సేనలు మట్టిగోడను చుట్టిఉన్న అగడ్తను దాటి లోపలికి ప్రవేశించగలిగాయి. ప్రతాపరుద్రుడు రాతికోటను సురక్షితముగా కాపాడగలిగాడు. విసిగి వేసారిన కాఫూర్ ఓరుగంటి పరిసరప్రాంతం, గ్రామాలు భస్మీపటలం చేసాడు. అమాయక ప్రజలను, ఆడువారిని, పిల్లలను, ముసలివారు అని కూడ చూడకుండ నరసంహారం చేశాడు. సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేశారు. ఇది తెలిసి ప్రతాపరుద్రుడు సంధికి ఒప్పుకొని అపారమైన ధనమును, ఏనుగులను బహూకరించాడు.

మూడవ దాడి

క్రీ. శ. 1318లో సుల్తాను పేరిట సర్వాధికారము వహించి పాలన చేస్తున్న మాలిక్ కాఫూర్ ను హత్య చేసి అల్లావుద్దీన్ కొడుకు కుతుబుద్దీన్ ముబారక్ సింహాసనమాక్రమించాడు. దక్కన్ వ్యవహారములు చక్కబెట్టడానికి ముబారక్ స్వయంగా దేవగిరి మీదుగా ఓరుగల్లు వస్తాడు. ఆతని దురాగతముల గురించి విన్న ప్రతాపరుద్రుడు ధనకనకవస్తువాహనాలిచ్చి పంపుతాడు.

నాలుగవ దాడి

క్రీ. శ. 1320లొ ఢిల్లీ రాజకీయాలలో పెద్ద మార్పు వచ్చింది. ఖిల్జీ వంశం పోయి తుగ్లక్ వంశం అధికారములోకి వచ్చింది. ఘియాజుద్దీన్ తుగ్లక్ సుల్తానయ్యడు. ఇది అదనుగా చూసి ప్రతాపరుద్రుడు వార్షిక కప్పం ఆపివేస్తాడు. లోగడ సుల్తానుకప్పగించిన బీదర్ కోట మరల ఆక్రమిస్తాడు. కోపగించిన ఘియాజుద్దీన్ తన కొడుకు ఉలుఘ్ ఖానును ఓరుగల్లుపై దండయాత్రకు పంపుతాడు. దారిలోగల బీదర్, కోటగిరి లోబరుచుకొని ఓరుగల్లు కోట ముట్టడించాడు. ఎంత ప్రయత్నించినా కోట స్వాధీనము కాలేదు. అయిదు నెలల ముట్టడి తర్వాత విఫలుడైన ఉలుఘ్ ఖాన్ ఢిల్లీ మరలి పోయాడు. చరిత్రకారులు ఈ విషయముపై పలువిధాలుగా వ్రాశారు. కాని ప్రతాపరుద్రుని నాయకుల, సేనల ధైర్యసాహసములకు, పోరాట పటిమకు ఇది ఒక మచ్చుతునక.


అయిదవ దాడి

ఇక ఉపద్రవములుండవని భావించిన ప్రతాపరుద్రుడు యుద్ధములో జరిగిన నష్ఠాలను పూడ్చుకొనక ఉపేక్షించాడు. కొటకు మరమ్మతులు చేయించలేదు. సామగ్రి సమకూర్చుకొనలేదు. నెలరోజులలో మహాసైన్యముతో తిరిగివచ్చిన ఉలుఘ్ ఖాన్ తో తలబడిన ప్రతాపరుద్రుని సేనలు వీరోచితముగా పోరాడినను పరాజయము తప్పలేదు. కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాలు కూడా ఓటమికి కారణాలని చరిత్రకారుల అభిప్రాయం.


ప్రతాపరుద్రుడు, కటకపాలుడు గన్నమ నాయుడు మరియూ పెక్కు సేనానులు బందీలయ్యారు. వీరందనీ ఢిల్లీ తరలించుతుండగా మానధనుడైన మహరరాజు శత్రువు చేతిలో బందీగా చనిపోవుటకంటె ఆత్మహత్యే మేలని భావించి నర్మదా నదిలో మునిగి ఆత్మార్పణం చేసుకున్నాడు.

పతనము

వనరులు

  • ప్రతాపరుద్ర చరిత్రము
  • సిద్ధేశ్వర చరితము, ఏకాంబరనాథ

మూలాలు

  1. A Social History of the Deccan, 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, ISBN:0521254841
  2. Hindu Law, Sir Thomas Strange, 1830, Parbury, Allen, & Co., London

ఇవి కూడా చూడండి