గ్రంథచౌర్యం గుర్తింపు - సాధనాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 27: పంక్తి 27:
అయితే మిలియన్ల సంఖ్య లోని ఈ స్వేచ్ఛా వనరులతో పాటు పాఠ్య పుస్తకాలు, గ్రంధాలయాలు చందా ద్వారా సేకరిస్తున్న ప్రచురణకర్తల లైసెన్స్ పరిమితులలో ఉన్న డేటాబేసులు, పత్రికలు, వ్యాసాలు, చందా ఆధారిత తాజా/పూర్వ ప్రతుల ప్రచురణలు, విద్యార్ధులు గ్రంధ చౌర్య గుర్తింపు కొరకు సమర్పించిన ప్రతులను (భాండాగారాలు లేదా స్టూడెంట్ రిపోజిటరీ) సమగ్రంగా తనిఖీ చేయడానికి ‘ప్లగారిజం’ గుర్తించే సాధనాలు (డిటెక్షన్ సిస్టమ్స్) వాణిజ్యపరంగా అందుబాటులో ఉద్భవించాయి (ఉదా).
అయితే మిలియన్ల సంఖ్య లోని ఈ స్వేచ్ఛా వనరులతో పాటు పాఠ్య పుస్తకాలు, గ్రంధాలయాలు చందా ద్వారా సేకరిస్తున్న ప్రచురణకర్తల లైసెన్స్ పరిమితులలో ఉన్న డేటాబేసులు, పత్రికలు, వ్యాసాలు, చందా ఆధారిత తాజా/పూర్వ ప్రతుల ప్రచురణలు, విద్యార్ధులు గ్రంధ చౌర్య గుర్తింపు కొరకు సమర్పించిన ప్రతులను (భాండాగారాలు లేదా స్టూడెంట్ రిపోజిటరీ) సమగ్రంగా తనిఖీ చేయడానికి ‘ప్లగారిజం’ గుర్తించే సాధనాలు (డిటెక్షన్ సిస్టమ్స్) వాణిజ్యపరంగా అందుబాటులో ఉద్భవించాయి (ఉదా).


* టర్నిటిన్,
* [https://www.turnitin.com/ టర్నిటిన్]


* ఐథెంటిక్,
* [https://www.ithenticate.com/ ఐథెంటిక్]


* [https://copyleaks.com/ కాపీ లీక్స్]
* [https://copyleaks.com/ కాపీ లీక్స్]
పంక్తి 35: పంక్తి 35:
* [https://www.plagscan.com/plagiarism-check/ ప్లాగ్ స్కాన్]
* [https://www.plagscan.com/plagiarism-check/ ప్లాగ్ స్కాన్]


* ఊర్కుండ్, మొదలగునవి.
* [https://www.urkund.com/urkund-goes-india/ ఊర్కుండ్], మొదలగునవి.


సాధారణంగా ఈ అధునిక సాధనాలు విద్యా సంస్థల ప్రాంగణమునకు సంబంధించిన అభ్యాస నిర్వహణ వ్యవస్థతో (Campus Learning Management Systems) వారి విద్యా కార్యక్రములతో అనుసంధానించబడగలుగుతాయి. ఇవి అధ్యాపకులకు, విద్యార్ధులకు, నిర్వాహుకులకు అందుబాటులో ఉంటూ వేర్వేరు దశలలో కార్యక్రమాలు నిర్దేశిస్తాయి.   ఉదాహరణకి, ఈ సాధనాల ద్వారా విద్యార్ధులు తమ ప్రతిని సమర్పించడము, దాని ప్లగారిజం నివేదిక చూడడము చేయగలుగుతారు, అధ్యాపకులు తమ విద్యార్ధులను, తరగతుల వారీగా నమోదు చేయడము తమ విద్యార్ధులకు విషయ నిర్దేశం చేయడము, తమ విద్యార్ధుల నివేదికలను విశ్లేషించడము మొదలగునవి చేస్తారు. నిర్వాహుకులు ఈ సాధనాల ద్వారా ఎవరు ఏవిధముగా పనులు నిర్వర్తించడమో, నివేదికలు ఏవిధముగా రూపొందించాలో నిర్దేశిస్తారు.  వీటిలో కూడా ముఖ్యంగా తమ విద్యార్ధులు సమర్పించే డేటాబేస్ అనుసరించి, నివేదికల రూపము లోను కొంత వైవిధ్యము సహజముగానే ఉంటుంది.
సాధారణంగా ఈ అధునిక సాధనాలు విద్యా సంస్థల ప్రాంగణమునకు సంబంధించిన అభ్యాస నిర్వహణ వ్యవస్థతో (Campus Learning Management Systems) వారి విద్యా కార్యక్రములతో అనుసంధానించబడగలుగుతాయి. ఇవి అధ్యాపకులకు, విద్యార్ధులకు, నిర్వాహుకులకు అందుబాటులో ఉంటూ వేర్వేరు దశలలో కార్యక్రమాలు నిర్దేశిస్తాయి.   ఉదాహరణకి, ఈ సాధనాల ద్వారా విద్యార్ధులు తమ ప్రతిని సమర్పించడము, దాని ప్లగారిజం నివేదిక చూడడము చేయగలుగుతారు, అధ్యాపకులు తమ విద్యార్ధులను, తరగతుల వారీగా నమోదు చేయడము తమ విద్యార్ధులకు విషయ నిర్దేశం చేయడము, తమ విద్యార్ధుల నివేదికలను విశ్లేషించడము మొదలగునవి చేస్తారు. నిర్వాహుకులు ఈ సాధనాల ద్వారా ఎవరు ఏవిధముగా పనులు నిర్వర్తించడమో, నివేదికలు ఏవిధముగా రూపొందించాలో నిర్దేశిస్తారు <ref>https://www.turnitin.com</ref>.

==== భారతీయ భాషలలో సాధనాలు ====
చాలావరకు గ్రంధచౌర్యం గుర్తించే సాధనాలు చాలా వరకు ఆంగ్లము కొన్ని ఇతర అంతర్జాతీయ భాషల వ్రాతప్రతులకు మాత్రమే పరిమితమయినాయి. ఇటీవల భారతీయ భాషలలో  కొన్ని సాధనాలు అభివృద్ధి చేసారు. పంజాబీ విశ్వవిద్యాలయం, జలంధర్ లోని డి.ఎ.వి. కాలేజీ, హిందీ, పంజాబీలపై ప్రత్యేక దృష్టి సారించి భారతీయ భాషా పత్రాల కోసం ‘శోధ్ మాపక్’ సాధనం కోసం కాపీరైట్ పొందారు. “చెక్ ఫర్ ప్లాగ్” (Check for Plag) అను సాఫ్ట్ వేర్ ఉర్దు, పర్శియన్, అరబిక్, పంజాబీ, హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు, మళయాలం, కన్నడ, గుజరాతీ, రాజస్తానీ, అస్సామీ మొదలగు భాషలకు ఇంఫోకార్ట్ ఇండియా, దిల్లీ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్నారు. ఇదే విధంగా మౌలిక్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్  “మౌలిక్” (MOULIK) అను సాఫ్ట్  వేర్ హిందీ ప్రతులలో తనిఖీ చేయడానికి అభివృద్ధి చేసారు<ref>Tribune India https://www.tribuneindia.com/news/archive/chandigarh/tool-to-detect-plagiarism-in-indian-languages-854202</ref><ref>
Urvashi Garg, Goyal, Vishal. Maulik: A Plagiarism Detection Tool for Hindi Documents. March 2016 Indian Journal of Science and Technology 9(12). DOI: 10.17485/ijst/2016/v9i12/86631 https://www.researchgate.net/publication/300377827_Maulik_A_Plagiarism_Detection_Tool_for_Hindi_Documents</ref>.


=== పరిమితులు ===
=== పరిమితులు ===
పంక్తి 45: పంక్తి 49:
* చర్చలు, సమావేశాలు, సెమినార్లు లేదా వర్క్‌షాప్‌లు లేదా సింపోసియాలో చర్చించబడిన / సమర్పించబడిన ఆలోచనలను  తమ రచనలలొ తీసుకొన్నప్పటికిని వాటిని గుర్తించలేము.
* చర్చలు, సమావేశాలు, సెమినార్లు లేదా వర్క్‌షాప్‌లు లేదా సింపోసియాలో చర్చించబడిన / సమర్పించబడిన ఆలోచనలను  తమ రచనలలొ తీసుకొన్నప్పటికిని వాటిని గుర్తించలేము.
* స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినప్పటికీ, సమర్పించిన వచనం అటువంటి చిత్ర (ఇమేజ్) ఆకృతులలోని కంటెంట్‌ను సరిపోల్చదు.   
* స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినప్పటికీ, సమర్పించిన వచనం అటువంటి చిత్ర (ఇమేజ్) ఆకృతులలోని కంటెంట్‌ను సరిపోల్చదు.   

=== మూలాలు ===

18:22, 27 మే 2021 నాటి కూర్పు

గ్రంధచౌర్యం గుర్తింపు - సాధనాలు

గ్రంధచౌర్యం అంటే "వేరొక రచయిత భాష, ఆలోచనలు, భావాలు, వ్యక్తీకరణలను అసలు వారికి గుర్తింపు ఇవ్వకుండా తమ స్వంతంగా సూచించడం అని అర్ధము[1][2][3]. సమాచార ప్రచురణ పరిశ్రమలో సాంకేతిక పురోగతి కారణంగా, చాలా వైజ్ఞానిక సాహిత్యం ఎలక్ట్రానిక్ రూపంలో అంతర్జాలం లో లభిస్తొంది. అనాదిగా వివిధ రంగాలలో గ్రంధచౌర్యం వంటి అనైతిక చర్యలు అసలు పని, కళారూపాలను, సోర్స్ కోడ్ లను, కంప్యుటర్ ప్రోగ్రాములను, రచయతలు, రచనల మౌలికత్వాన్ని సవాలు చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యారంగం లో విద్యార్ధులు, పరిశోధకులు ఉద్దేశపూర్వకముగానో, తెలియకనో మూలాలను సూచించకుండా రచనలలో చాలా భాగము లేదా కొంత భాగమును తమ రచనలో పొందుపరచడం వలన ప్రపంచవ్యాప్తంగా విద్యా, పరిశోధనారంగానికి తీవ్ర నష్టం కలుగచేస్తుండటముతో పరిశోధనా పత్రాలు, నివేదికలు, సిద్ధాంత గ్రంధాలు మొదలైన వాటిలో గ్రంధచౌర్య గుర్తింపు, నివారణ చర్యలకు ప్రభుత్వాలు, ప్రచురణకర్తలు, నిధులు సమకూర్చే సంస్థలు, ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు పట్టుబట్టడం అనివార్యం అయింది. పర్యవేక్షకులు స్వయంగా వేల సంఖ్యలో విద్యార్ధుల సమర్పణలలో ఈ గ్రంధచౌర్యాన్ని గుర్తించడము వీలు కాదు కాబట్టి వివిధ సాధనాలు (సాఫ్ట్‌వేర్‌ను) ఆవిర్భవించాయి[4].

సాధనాలు

కాబట్టి, సమాచార పరిశ్రమ సోర్స్ కోడ్, కంప్యుటర్ ప్రోగ్రాములు, ఎలక్ట్రానిక్ రూపములో ప్రచురింపబడి అంతర్జాలం ద్వారా అందుబాటులోకి వస్తున్న సాహిత్యాన్ని అంటే, ఇప్పటికే ప్రచురించబడిన పూర్తి వ్యాసాలు, సారాంశాలు (ఆబ్స్ట్రాక్ట్స్), పుస్తకాలు, పత్రాల పూర్తి ప్రతులు, బిబ్లియోగ్రఫిక్ రికార్డుల డిజిటల్ ప్రతుల తో సారూప్యతను కనుగొనడానికి శోధించి గ్రంధచౌర్యం గుర్తించే వ్యవస్థలను (సాధనాలను) అభివృద్ధి చేయడం ఆరంభించింది.

రెండు రకాల గ్రంధచౌర్య గుర్తింపు సాధనాలు ఉపయోగిస్తున్నారు: 1. బాహ్య గ్రంధచౌర్య గుర్తింపు సాధనాలు, 2. అంతర్గత సాధనాలు. బాహ్య సాధనాలు, సమర్పించిన వ్రాతప్రతి (మాన్యుస్క్రిప్ట్‌ను) లోని విషయాన్ని శోధించి అప్పటికే ప్రచురింపబడిన విషయము తో సరిపోల్చుతుంది. అంతర్గత సాధనాలు వ్యాకరణము, పదవిన్యాసముల సమన్వయముతో వ్రాతప్రతులలోని గ్రంధచౌర్యాన్ని సహజభాషా ప్రక్రియ ద్వారా గుర్తిస్తుంది. [5] ఈ ‘గ్రంధచౌర్యం’ గుర్తించే సాధనాలు వెలువరించే నివేదికలు సారూప్యతను, మూలాలను సూచించుటే కాకుండా, గుర్తించడానికి, సరిపోల్చడానికి వీలుగా గ్రంధచౌర్యాన్ని శాతం లో లెక్కించి సూచిస్తుంది. ఈ ‘గ్రంధచౌర్యం’ గుర్తించే సాధనాలు సమర్పింపబడిన వ్రాతప్రతులను 3 మూలాల విషయం తో సరిపోల్చుతాయి. 1. గ్రంధస్వామ్యం, లైసెన్స్ పరిధిలోని పుస్తక, వైజ్ఞానిక పత్రికల, డేటాబేస్ ల ప్రచురణ కర్తల భాగస్వామ్యము ద్వారా అందుబాటులో ఉన్న విషయము, 2. విద్యార్ధులు సమర్పించిన వ్రాతప్రతుల భాండాగారం, 3. అంతర్జాలం లో ప్రచురించబడి ఉచితంగా లభ్యమవుతున్న ప్రతులు, భద్రపరచబడిన ప్రతులు మొదలగునవి.

మొదటలో ఈ సాధనాలను కంప్యూటర్ ప్రోగ్రాములు, సోర్స్ కోడ్ ల చౌర్యాన్ని గుర్తించడానికి ఉపయోగించేవారు. ఉదాహరణకి 'సిం' (SIM) అను సాధనము డిక్ గ్రనే అను అతను వ్రిజే యూనివర్సిటీ, ఆమ్స్టర్డామ్ నుంచి 1989 వ సంవత్సరం లో సోర్స్ కోడ్ లో చౌర్యాన్ని గుర్తించడానికి అభివృద్ధి చేసాడు. 2002 లో 'ప్లాగీ' సాధనాన్నిహెల్సెంకీ సాంకేతిక విశ్వవిద్యాలయం, 'మార్బుల్' ను యుట్రెక్ విశ్వవిద్యాలయం తయారు చేసాయి. జె ప్లాగ్ (JPlag) కూడా ఇటువంటిదే. [6].

ఉచిత సాధనాలు

వినియోగదారులకు అంతర్జాలం లో స్వేచ్ఛగా లభిస్తున్న రచనలు (వెబ్ ఆధారిత కంటెంట్), వనరులతో సారూప్యతను గుర్తించడానికి వీలుగా ఉచిత సాధనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇవి అంతర్జాలంలో ఉచితంగా లభించే లైసెన్స్ పరిమితులకు లోబడని విషయాన్ని, స్వేచ్ఛా వనరులని మాత్రమే శోధించుతాయి.  విద్యార్దులు తమ వ్రాత ప్రతిని తయారు చేయడములోని మొదటి దశలలో తమ వివరాలు నమోదు చేయడము ద్వారా ఈ సాధనాలను వినియోగించి లభ్ఢి పొందవచ్చు.  

వాణిజ్య సాధనాలు

అయితే మిలియన్ల సంఖ్య లోని ఈ స్వేచ్ఛా వనరులతో పాటు పాఠ్య పుస్తకాలు, గ్రంధాలయాలు చందా ద్వారా సేకరిస్తున్న ప్రచురణకర్తల లైసెన్స్ పరిమితులలో ఉన్న డేటాబేసులు, పత్రికలు, వ్యాసాలు, చందా ఆధారిత తాజా/పూర్వ ప్రతుల ప్రచురణలు, విద్యార్ధులు గ్రంధ చౌర్య గుర్తింపు కొరకు సమర్పించిన ప్రతులను (భాండాగారాలు లేదా స్టూడెంట్ రిపోజిటరీ) సమగ్రంగా తనిఖీ చేయడానికి ‘ప్లగారిజం’ గుర్తించే సాధనాలు (డిటెక్షన్ సిస్టమ్స్) వాణిజ్యపరంగా అందుబాటులో ఉద్భవించాయి (ఉదా).

సాధారణంగా ఈ అధునిక సాధనాలు విద్యా సంస్థల ప్రాంగణమునకు సంబంధించిన అభ్యాస నిర్వహణ వ్యవస్థతో (Campus Learning Management Systems) వారి విద్యా కార్యక్రములతో అనుసంధానించబడగలుగుతాయి. ఇవి అధ్యాపకులకు, విద్యార్ధులకు, నిర్వాహుకులకు అందుబాటులో ఉంటూ వేర్వేరు దశలలో కార్యక్రమాలు నిర్దేశిస్తాయి.   ఉదాహరణకి, ఈ సాధనాల ద్వారా విద్యార్ధులు తమ ప్రతిని సమర్పించడము, దాని ప్లగారిజం నివేదిక చూడడము చేయగలుగుతారు, అధ్యాపకులు తమ విద్యార్ధులను, తరగతుల వారీగా నమోదు చేయడము తమ విద్యార్ధులకు విషయ నిర్దేశం చేయడము, తమ విద్యార్ధుల నివేదికలను విశ్లేషించడము మొదలగునవి చేస్తారు. నిర్వాహుకులు ఈ సాధనాల ద్వారా ఎవరు ఏవిధముగా పనులు నిర్వర్తించడమో, నివేదికలు ఏవిధముగా రూపొందించాలో నిర్దేశిస్తారు [7].

భారతీయ భాషలలో సాధనాలు

చాలావరకు గ్రంధచౌర్యం గుర్తించే సాధనాలు చాలా వరకు ఆంగ్లము కొన్ని ఇతర అంతర్జాతీయ భాషల వ్రాతప్రతులకు మాత్రమే పరిమితమయినాయి. ఇటీవల భారతీయ భాషలలో  కొన్ని సాధనాలు అభివృద్ధి చేసారు. పంజాబీ విశ్వవిద్యాలయం, జలంధర్ లోని డి.ఎ.వి. కాలేజీ, హిందీ, పంజాబీలపై ప్రత్యేక దృష్టి సారించి భారతీయ భాషా పత్రాల కోసం ‘శోధ్ మాపక్’ సాధనం కోసం కాపీరైట్ పొందారు. “చెక్ ఫర్ ప్లాగ్” (Check for Plag) అను సాఫ్ట్ వేర్ ఉర్దు, పర్శియన్, అరబిక్, పంజాబీ, హిందీ, మరాఠీ, బెంగాలీ, తెలుగు, మళయాలం, కన్నడ, గుజరాతీ, రాజస్తానీ, అస్సామీ మొదలగు భాషలకు ఇంఫోకార్ట్ ఇండియా, దిల్లీ అనే సంస్థ అభివృద్ధి చేస్తున్నారు. ఇదే విధంగా మౌలిక్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్  “మౌలిక్” (MOULIK) అను సాఫ్ట్  వేర్ హిందీ ప్రతులలో తనిఖీ చేయడానికి అభివృద్ధి చేసారు[8][9].

పరిమితులు

అయితే ఈ సాధనాలు వినియోగంలోను కొన్ని పరిమితులు ఉన్నాయి. అవి -

  • అచ్చు ఫార్మాట్‌లో మాత్రమే ప్రచురించబడిన విషయం ఆన్‌లైన్ ప్లగారిజం డిటెక్షన్ సిస్టమ్స్ ద్వారా ధృవీకరించబడదు.
  • చర్చలు, సమావేశాలు, సెమినార్లు లేదా వర్క్‌షాప్‌లు లేదా సింపోసియాలో చర్చించబడిన / సమర్పించబడిన ఆలోచనలను  తమ రచనలలొ తీసుకొన్నప్పటికిని వాటిని గుర్తించలేము.
  • స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినప్పటికీ, సమర్పించిన వచనం అటువంటి చిత్ర (ఇమేజ్) ఆకృతులలోని కంటెంట్‌ను సరిపోల్చదు.   

మూలాలు

  1. https://dictionary.cambridge.org/dictionary/english/plagiarism
  2. https://www.collinsdictionary.com/dictionary/english/plagiarism
  3. https://www.merriam-webster.com/dictionary/plagiarism
  4. Jurriaan Hage, Peter Rademaker, Nik`e van Vugt. A comparison of plagiarism detection tools. Technical Report UU-CS-2010-015.June 2010. Department of Information and Computing Sciences. Utrecht University, Utrecht, The Netherlands. www.cs.uu.nl. Available http://citeseerx.ist.psu.edu/viewdoc/download?doi=10.1.1.178.1043&rep=rep1&type=pdf
  5. Naik, Ramesh R., Landge, Maheshkumar B., and Namrata Mahender,C. A Review on Plagiarism Detection Tools. International Journal of Computer Applications. Volume 125 – No.11, September 2015, 16-22. https://citeseerx.ist.psu.edu/viewdoc/download?doi=10.1.1.695.3835&rep=rep1&type=pdf
  6. RanaKhudhair Abbas Ahmed. Overview of Different Plagiarism Detection Tools. International Journal of Futuristic Trends in Engineering and Technology. Vol. 2 (10), 2015  Available from: https://www.researchgate.net/publication/311205690_Overview_of_Different_Plagiarism_Detection_Tools
  7. https://www.turnitin.com
  8. Tribune India https://www.tribuneindia.com/news/archive/chandigarh/tool-to-detect-plagiarism-in-indian-languages-854202
  9. Urvashi Garg, Goyal, Vishal. Maulik: A Plagiarism Detection Tool for Hindi Documents. March 2016 Indian Journal of Science and Technology 9(12). DOI: 10.17485/ijst/2016/v9i12/86631 https://www.researchgate.net/publication/300377827_Maulik_A_Plagiarism_Detection_Tool_for_Hindi_Documents