చెర్విరాల బాగయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్న సవరణ
చిన్న సవరణ
పంక్తి 1: పంక్తి 1:
చెర్విరాల భాగయ్య తెలుగు కవి, రచయిత.<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:TeluguVariJanapadaKalarupalu.djvu/529|title=పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/529 - వికీసోర్స్|website=te.wikisource.org|language=te|access-date=2021-06-23}}</ref> [[తెలంగాణ|తెలంగాణలో]] [[యక్షగానం|యక్షగానా]]<nowiki/>ల పట్ల కృషి చేసిన వారిలో అతను ముఖ్యుడు.ఇతడు రాసిన కల్పిత యక్షగాన చరిత్రే రంభా రంపాల చరిత్ర. <ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/ankuram/841189|title=యక్షగానంపై సమగ్ర పరిశోధన|website=navatelangana.com|url-status=live}}</ref>
చెర్విరాల భాగయ్య తెలుగు కవి, రచయిత.<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:TeluguVariJanapadaKalarupalu.djvu/529|title=పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/529 - వికీసోర్స్|website=te.wikisource.org|language=te|access-date=2021-06-23}}</ref> [[తెలంగాణ|తెలంగాణలో]] [[యక్షగానం|యక్షగానా]]<nowiki/>ల పట్ల విశేషంగా కృషి చేసిన వారిలో ఇతను ముఖ్యుడు.ఇతడు రాసిన కల్పిత యక్షగాన చరిత్రే రంభా రంపాల చరిత్ర. <ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/ankuram/841189|title=యక్షగానంపై సమగ్ర పరిశోధన|website=navatelangana.com|url-status=live}}</ref>


== జీవిత విశేషాలు ==
== జీవిత విశేషాలు ==

05:39, 24 జూన్ 2021 నాటి కూర్పు

చెర్విరాల భాగయ్య తెలుగు కవి, రచయిత.[1] తెలంగాణలో యక్షగానాల పట్ల విశేషంగా కృషి చేసిన వారిలో ఇతను ముఖ్యుడు.ఇతడు రాసిన కల్పిత యక్షగాన చరిత్రే రంభా రంపాల చరిత్ర. [2]

జీవిత విశేషాలు

చెర్విరాల భాగయ్య 1908 లో రాజమ్మ, వీరయ్య దంపతులకు జన్మించాడు. అతనిని అక్క, తమ్ముడు చెల్లెలూ ఉన్నారు. అతని స్వస్థలం హైదరాబాదు లోని మశూరాబాదు. తండ్రి వీరయ్య భాగయ్యకు 4 సం॥ ఉన్నప్పుడే అక్షరాలు వాక్యాలు దిద్దించి కంచర గోపన్న పాటలు నేర్పించాడు. దాశరథీ శతకంలోని పద్యాలు పాడించాడు. 7సం॥ వయస్సులో తండ్రి పోవడం ఆ కుటుంబానికి ఆశనిపాతం. కాని ఎదురవుతున్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటూ తెలుగు నేలకు, తెలుగు భాషకు ఎన లేని సేవ చేసిన మహోదాత్తుడు చెర్విరాల భాగయ్యకవి.[3]

రచనలు

యక్షగాన కవి, చిరుతల నాట్య గ్రంథ రచయిత, వేదాంత కవి, జానపదత్వం ఉన్న ప్రజాకవి, బుఱ్ఱకథల రచయిత, బ్రతుకమ్మ పాటల రచయిత, మంత్ర తంత్ర గ్రంథాల రచయిత, దేశభక్తి గీతాల రచయిత,శతక రచయిత అనువాద గ్రంథ కర్త,.భజన కీర్తనల రచయిత, నవలా రచయిత, ఉద్యమ గీతాల నిర్మాత , గ్రంథ పరిష్కర్తగా అందరికీ సుపరిచితులైన చెర్విరాల భాగయ్య స్వాతంత్య్రోద్యమంలో ముందంజ వేసి భారత జాతీయ నిర్మాణానికి కారకులైన నేతాజీ పైన భాగయ్య బతుకమ్మ పాటలు వ్రాశాడు. తెలంగాణలో స్త్రీ, బాల, వృద్ధ జనమంతా ఆ కాలంలో ఈ పాటల్ని పాడుకొన్నది. జాతీయోద్యమాన్ని రగిలించే ‘‘వీర ధవళ’’ అనే మరాఠి నవలను భాగయ్య తెనిగించారు. అది రెండు భాగాలుగా అచ్చయ్యింది.

ఆనాడు ఛత్రపతి శివాజీనే హైందవ మహావీరునిగా తీర్చిదిద్దిన సమర్థ రామదాసు ‘‘దాసబోధ’’ నాలుగు వందల పుటల గ్రంథంగా తెలుగులోకి మొదటిసారిగా తెచ్చిన ఘనత భాగయ్యకే దక్కింది.

అతను నూటికిపైగా రచనలు చేస్తే, అందులో 34 యక్షగానాలున్నాయి. తను స్వయంగా రాయడమేకాక, ఔత్సాహిక రచయితల యక్షగానాలను ఎన్నో పరిష్కరించి నగిషీలు అద్దారు. వీరి సారంగధర, మార్కండేయ విలాసము, కనకతార చరిత్రము, అల్లీరాణి చరిత్ర బహు ప్రఖ్యాతం కాగా, సుగ్రీవ విజయం అనే వీరి యక్షగానం లక్షకుపైగా ప్రతులు అమ్ముడైనట్లు చెబుతారు. అందుకే చెర్విరాల భాగయ్య కవికి-‘తెలంగాణ యక్షగాన పితామహుడు’ అనే కీర్తి దక్కింది. [4]

మూలాలు

  1. "పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/529 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2021-06-23.
  2. "యక్షగానంపై సమగ్ర పరిశోధన". navatelangana.com.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "మహోదాత్తుడు చెర్విరాల | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2021-06-23.
  4. "యక్షగాన మాధుర్యం | Telangana Magazine". magazine.telangana.gov.in. Retrieved 2021-06-23.