వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 6: పంక్తి 6:
ఇందులో పాల్గొనే ముందు, కింద చూపిన సూచనలు, నియమాలను సంపూర్ణంగా చదవడం ముఖ్యం. '''ఈ నియమాలను పాటించకపోతే, మీ దిద్దుబాట్లు పోటీకి అనర్హమయ్యే అవకాశం ఉంది'''.
ఇందులో పాల్గొనే ముందు, కింద చూపిన సూచనలు, నియమాలను సంపూర్ణంగా చదవడం ముఖ్యం. '''ఈ నియమాలను పాటించకపోతే, మీ దిద్దుబాట్లు పోటీకి అనర్హమయ్యే అవకాశం ఉంది'''.


[[Image:BKV m 1 jms.svg|22px|alt=]] మీకు ఈసరికే ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా ఖాతా ఉంటే అందులోకి [[ప్రత్యేక:వాడుకరిప్రవేశం|లాగినవండి]]. ఖాతా లేకపోతే, వికీపీడియాలో [[ప్రత్యేక:ఖాతా సృష్టించు|ఖాతా తెరవండి]] (ఈ ఖాతాను తెలుగు వికీపీడియాలోనే తెరవాలని ఏమీ లేదు, ఏ భాషా వికీపీడియా లోనైనా తెరవవచ్చు). వికీపీడియా ఏయే భాషల్లో ఉందో [[ప్రత్యేక:SiteMatrix|ఇక్కడ చూడవచ్చు]].
[[Image:BKV m 1 jms.svg|22px|alt=]] మీకు ఈసరికే ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా ఖాతా ఉంటే అందులోకి [[ప్రత్యేక:వాడుకరిప్రవేశం|లాగినవండి]]. ఖాతా లేకపోతే, వికీపీడియాలో [[ప్రత్యేక:ఖాతాసృష్టించు|ఖాతా తెరవండి]] (ఈ ఖాతాను తెలుగు వికీపీడియాలోనే తెరవాలని ఏమీ లేదు, ఏ భాషా వికీపీడియా లోనైనా తెరవవచ్చు). వికీపీడియా ఏయే భాషల్లో ఉందో [[ప్రత్యేక:SiteMatrix|ఇక్కడ చూడవచ్చు]].


[[Image:BKV m 2 jms.svg|22px|alt=]] ఫొటో చేర్చాల్సిన అవసరమున్న వ్యాసం ఒకదాన్ని ఎంచుకోండి. ఇలాంటి వ్యాసాలను పట్టుకోవడానికి కింది వర్గాలను చూడవచ్చు. ఈ వర్గాలు ఎందులోనూ లేని వ్యాసాల్లో కూడా బొమ్మలు లేకుండా ఉండే అవకాశం ఉంది. అలాంటి వ్యాసాల్లో కూడా బొమ్మను చేర్చవచ్చు. అలాగే ఈ వర్గం లోని వ్యాసాల్లో కొన్నిటిలో బొమ్మ ఉండి ఉండవచ్చు కూడా. అలాంటి వ్యాసాలలో మరో బొమ్మను చేర్చకండి. చేర్చినా అవి పోటీ లోకి పరిగణించబడవు.
[[Image:BKV m 2 jms.svg|22px|alt=]] ఫొటో చేర్చాల్సిన అవసరమున్న వ్యాసం ఒకదాన్ని ఎంచుకోండి. ఇలాంటి వ్యాసాలను పట్టుకోవడానికి కింది వర్గాలను చూడవచ్చు. ఈ వర్గాలు ఎందులోనూ లేని వ్యాసాల్లో కూడా బొమ్మలు లేకుండా ఉండే అవకాశం ఉంది. అలాంటి వ్యాసాల్లో కూడా బొమ్మను చేర్చవచ్చు. అలాగే ఈ వర్గం లోని వ్యాసాల్లో కొన్నిటిలో బొమ్మ ఉండి ఉండవచ్చు కూడా. అలాంటి వ్యాసాలలో మరో బొమ్మను చేర్చకండి. చేర్చినా అవి పోటీ లోకి పరిగణించబడవు.

08:38, 29 జూన్ 2021 నాటి కూర్పు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో వాడుకరులు, వికీపీడియా సమూహాలు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. అనేక వికీమీడియా ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తుంది. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.

వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఎలా పాల్గొనాలి?

ఇందులో పాల్గొనే ముందు, కింద చూపిన సూచనలు, నియమాలను సంపూర్ణంగా చదవడం ముఖ్యం. ఈ నియమాలను పాటించకపోతే, మీ దిద్దుబాట్లు పోటీకి అనర్హమయ్యే అవకాశం ఉంది.

మీకు ఈసరికే ఏ వికీమీడియా ప్రాజెక్టులోనైనా ఖాతా ఉంటే అందులోకి లాగినవండి. ఖాతా లేకపోతే, వికీపీడియాలో ఖాతా తెరవండి (ఈ ఖాతాను తెలుగు వికీపీడియాలోనే తెరవాలని ఏమీ లేదు, ఏ భాషా వికీపీడియా లోనైనా తెరవవచ్చు). వికీపీడియా ఏయే భాషల్లో ఉందో ఇక్కడ చూడవచ్చు.

ఫొటో చేర్చాల్సిన అవసరమున్న వ్యాసం ఒకదాన్ని ఎంచుకోండి. ఇలాంటి వ్యాసాలను పట్టుకోవడానికి కింది వర్గాలను చూడవచ్చు. ఈ వర్గాలు ఎందులోనూ లేని వ్యాసాల్లో కూడా బొమ్మలు లేకుండా ఉండే అవకాశం ఉంది. అలాంటి వ్యాసాల్లో కూడా బొమ్మను చేర్చవచ్చు. అలాగే ఈ వర్గం లోని వ్యాసాల్లో కొన్నిటిలో బొమ్మ ఉండి ఉండవచ్చు కూడా. అలాంటి వ్యాసాలలో మరో బొమ్మను చేర్చకండి. చేర్చినా అవి పోటీ లోకి పరిగణించబడవు.

కామన్సులో సముచితమైన బొమ్మ ఒకదాన్ని ఎంచుకోండి. సరైన బొమ్మ పేరును గానీ, వర్గం పేరును గానీ వాడి బొమ్మ కోసం వెతకండి. వేతికేందుకు అనేక పద్ధతులున్నాయి. బొమ్మలను వాడడంలో సూచనల కోసం ఇది చూడండి. బొమ్మలను చేర్చడం లోని ఉద్దేశం, వ్యాసానికి సంబంధించిన వ్యక్తులు, వస్తువులు, కార్యకలాపాలు, భావనలకు సంబంధించిన బొమ్మలతో వ్యాస విషయం గురించి తెలుసుకోవడంలో పాఠకులకు మరింత సహాయపడడమే. బొమ్మకు వ్యాసానికి ఉన్న సంబంధ మేంటనేది స్పష్టంగా తెలిసిపోతూ ఉండాలి. బొమ్మలు ప్రధానంగా అలంకారం కోసం కాకుండా వ్యాసంలో సందర్భోచితంగా ఉండాలి.

వ్యాసం పేజీలో ఏ విభాగంలో బొమ్మను చేర్చితే సముచితంగా ఉంటుందో, ఎక్కడ పెడితే పాఠకుడి అవగాహనకు దోహదపడుతుందో ఆ విభాగాన్ని ఎంచుకోండి. "సవరించు" నొక్కి బొమ్మను చొప్పించండి. బొమ్మ వ్యాసంలో దేన్ని వర్ణిస్తోందో చెబుతూ క్లుప్తంగా కొంత వివరణను చేర్చండి. అందుబాటులో ఉన్న అత్యుత్తమ నాణ్యత గల బొమ్మలను వాడండి. సరైన నాణ్యత లేని బొమ్మలను —మసకగా, అస్పష్టంగా ఉన్నవి; బొమ్మలో వస్తువు బాగా చిన్నవిగా ఉన్నవి, అనేక వస్తువుల మధ్య దాగి ఉన్నవి,సందిగ్ధంగా ఉన్నవి; వగైరా— కచ్చితంగా తప్పనిసరైతే తప్ప వాడరాదు. వ్యాస విషయాన్ని ఏ బొమ్మలు అత్యుత్తమంగా వర్ణిస్తాయో జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చేసే దిద్దుబాటు లన్నిటికీ తప్పనిసరిగా దిద్దుబాటు సారాంశాన్ని ఇవ్వాలి. "మునుజూపు" చూసుకుని ఏమైనా మార్పులవసరమైతే చెయ్యండి. ఇలా బొమ్మలను చేర్చి మెరుగుపరచిన దిద్దుబాట్ల సారాంశాల్లో #WPWPTE,#WPWP అనే హ్యాష్‌ట్యాగులను చేర్చండి. అప్పుడు "మార్పులను ప్రచురించు" ను నొక్కండి. మరిన్ని వివరాలకు మెటా వికీమీడియా లో ఉన్న ఈ గైడు పేజీని చూడండి.

బొమ్మ సింటాక్సు ఎలా ఉండాలో చూసుకోండి! సమాచారపెట్టెల్లో బొమ్మలను చేరుస్తూంటే, దాని సింటాక్సు చాలా తేలిగ్గా ఉంటుంది — దస్త్రం పేరు ఇస్తే చాలు. అంటే [[File:Obamas at church on Inauguration Day 2013.jpg|thumb|వాషింగటన్ డిసి లోని ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థన చేస్తున్న ఒబామా కుటుంబం. 2013 జనవరి]] అని ఇచ్చే బదులు The Obamas at church on Inauguration Day 2013.jpg అని టైపు చేస్తే సరిపోతుంది.

నియమాలు

  • వికీపీడియా వ్యాసాల్లో బొమ్మలను చేర్చడం 2021 జూలై 1 - ఆగస్టు 31 మధ్య జరగాలి.
  • ఒక్కొక్కరు ఎన్ని ఫైళ్ళను వాడొచ్చు అనే దానికి పరిమితి ఏమీ లేదు. అయితే, బహుమతుల్లో వివిధ వర్గాలున్నాయి. అనేకమైన ఫొటోలను, సంబంధం లేని ఫొటోలను పెట్టేసి వ్యాసాలను వికారంగా చెయ్యకండి. అసలు ఒక్క ఫొటో కూడా లేని వ్యాసాల్లో మాత్రమే ఫొటో చేర్చండి.
  • బొమ్మ స్వేచ్ఛగా వాడుకునే లైసెన్సుకు లోబడి గానీ పబ్లిక్ డొమెయిన్ లో గానీ విడుదలై ఉండాలి. వాడదగ్గ లైసెన్సులు CC-BY-SA 4.0, CC-BY 4.0, CC0 1.0.
  • పాల్గొనేవారు ఏదో ఒక వికీమీడియా ప్రాజెక్టులో సభ్యులై ఉండాలి. ఖాతా ఉంటే లాగినవండి. లేదంటే వికీపీడియాలో ఖాతాను సృష్టించుకోండి (ఏ భాషకు చెందిన వికీపీడియాలో నైనా ఖాతాను సృష్టించుకోవచ్చు. ఆ ఖాతాను ఏ వికీమీడియా ప్రాజెక్టులో నైనా వాడవచ్చు).
  • తక్కువ నాణ్యత కలిగిన ఫొటోలకు సాధారణంగా అనుమతింపబడవు.
  • బొమ్మ కనీసం 200 పిక్సెళ్ళ పరిమాణం కలిగి ఉండాలి. దీనికన్న తక్కువ పరిమాణం కల బొమ్మలు పోటీకి పరిగణింపబడవు.
  • బొమ్మకు చేర్చే వ్యాఖ్య, వివరణ స్పష్టంగా ఉండాలి, వ్యాసానికి సరిపోయేలా ఉండాలి.
  • చేర్చే ప్రతీ బొమ్మకూ, అది దేనికి సంబధించినదో వివరించే వ్యాఖ్య తప్పనిసరిగా ఉండాలి.
  • పేజీలో చేర్చే బొమ్మ వీలైనంత ఖచ్చితంగా ఆ పేజీకి సరిపోయేలా ఉండాలి. జనరిక్ బొమ్మలను, సముచితం కాని బొమ్మలను చేర్చరాదు.
  • వ్యాసంలో సంబంధమున్న చోటనే బొమ్మను చేర్చాలి.
  • మీకు భాష సరిగ్గా తెలియని వికీపీడియాలో బొమ్మలను చేర్చకండి. వ్యాఖ్యల్లేని బొమ్మలు, సంబంధం లేని బొమ్మలు వగైరాలను పదేపదే చేర్చే వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు.
  • బొమ్మలను చేర్చాక, మార్పులను ప్రచురించేటపుడు రాసే దిద్దుబాటు సారాంశంలో సవివరమైన సారాంశంతో పాటు #WPWPTE, #WPWP అనే హ్యాష్‌ట్యాగులను తప్పనిసరిగా చేర్చాలి. ఉదాహరణకు, "సమాచారపెట్టెలో బొమ్మను చేర్చి మెరుగుపరచాను" #WPWPTE, #WPWP. ఈ హ్యాష్‌ట్యాగులను చేర్చకపోతే, ఆ వాసాలు పోటీ పరిగణన లోకి రావు. ఈ హ్యాష్‌ట్యాగులను (#WPWPTE), (#WPWP) వ్యాసం లోపల చేర్చకండి.
  • పేజీలో బొమ్మను చేర్చి మెరుగు పరచాక, సంబంధిత చర్చ పేజీలో ఉన్న {{బొమ్మ అభ్యర్థన}} అనే మూసను తీసెయ్యాలి.

సూచనలు

  • బొమ్మను ఎక్కించటానికి బొమ్మలు కావలసిన వ్యాసాలు వర్గంలో మొదటి పేరుబరితో కాని పేజీలు, అయోమయనివృత్తి పేజీలు పొరపాటున చేరిఉండవచ్చు.వాటిని పరిగణనలోకి తీసుకోరాదు

లక్ష్యం

తెలుగు వికీపీడియాలో బొమ్మలు లేని వ్యాసాలు 11,000కు పైగా ఉన్నాయి. వాటిని బొమ్మలు కావలసిన వ్యాసాలు అనే వర్గంలో చూడవచ్చు. వాటిలో కనీసం 3000 పేజీలలో బొమ్మలు చేర్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

వనరులు

ఫోటోగ్రఫీ పోటీలు

  1. c:Category:Wiki Loves Africa 2014
  2. c:Category:Wiki Loves Africa 2015 - "Cultural Fashion and Adornment"
  3. c:Category:Wiki Loves Africa 2016 - "Music and Dance"
  4. c:Category:Wiki Loves Africa 2017 - "People at Work"
  5. c:Category:Wiki Loves Africa 2019 - "Play!"
  6. c:Category:Wiki Loves Africa 2020 - "Africa on the Move"
  7. c:Category:Wiki Loves Africa 2021 - "Health and wellness"
  8. c:Category:Wiki Loves Monuments 2021
  9. c:Category:Wiki Loves Monuments 2020
  10. c:Category:Wiki Loves Monuments 2019
  11. c:Category:Wiki Loves Monuments 2018
  12. c:Category:Wiki Loves Monuments 2017
  13. c:Category:Wiki Loves Monuments 2016
  14. c:Category:Wiki Loves Monuments 2015
  15. c:Category:Wiki Loves Monuments 2014
  16. c:Category:Wiki Loves Monuments 2013
  17. c:Category:Wiki Loves Monuments 2012
  18. c:Category:Wiki Loves Monuments 2011
  19. c:Category:Wiki Loves Monuments 2010
  20. c:Category:Wiki Loves Earth 2013
  21. c:Category:Wiki Loves Earth 2014
  22. c:Category:Wiki Loves Earth 2015
  23. c:Category:Wiki Loves Earth 2016
  24. c:Category:Wiki Loves Earth 2017
  25. c:Category:Wiki Loves Earth 2018
  26. c:Category:Wiki Loves Earth 2019
  27. c:Category:Wiki Loves Earth 2020
  28. c:Category:Wiki Loves Earth 2021
  29. c:Category:Wiki Loves Heritage Belgium in 2021
  30. c:Category:Wiki Loves Heritage Belgium in 2020
  31. c:Category:Wiki Loves Heritage Belgium in 2019
  32. c:Category:Wiki Loves Heritage Belgium in 2018
  33. c:Category:Wiki Loves Public Space 2017 in Belgium
  34. c:Category:Wiki Loves Art Belgium in 2016
  35. HELP campaign
  36. European Science Photo Competition 2015
  37. Wiki Science Competition 2017
  38. Wiki Science Competition 2019

ఫోటో వాక్స్

  1. c:Category:Photowalks
  2. c:Category:Wikiexpeditions

కాలక్రమ వివరాలు

ఈ WPWP పోటీ ఏటా జరుగుతుంది.

  • పోటీ ప్రారంభం: 2021 జూలై 1 00:01 (UTC)
  • పోటీ చివరి తేదీ: 2021 ఆగస్టు 31 23:59 (UTC)
  • ఫలితాల ప్రకటన: 2021 అక్టోబరు 1

వ్యాసానికి సరిపోయే ఫొటోలను పట్టుకోవడంలో కొన్ని చిట్కాలు

వ్యాసానికి సరిపోయే ఫొటోలను వెదకడంలో కింది చిట్కాలను పాటించవచ్చు.

  1. వ్యాసపు అంతర్వికీ లింకులను చూడండి (పేజీకి ఎడమవైపున పట్టీలో ఉంటాయి). ఆయా భాషల పేజీలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ ఫొటోలను పెట్టారో చూడండి. వాటిలోవాగా సరిపోయే ఫొటోను మీరు ఇక్కడీ వ్యాసంలో చేర్చండి.
    1. అంతర్వికీ లింకులు లేకపోతే, ఇప్పుడు చేర్చండి. దానితో మీ పని నెరవేరడమే కాదు, ఆ మేరకు తెవికీ మెరుగు పడుతుంది కూడాను. అంతర్వికీ లింకులు ఇవ్వడం ఎలాగో తెలుసుకోండి.
    2. ఒకవేళ మీరు ఎంచుకున్న ఫొటో కామన్సులో లేకపోతే, ఏ వికీలోనైతే ఆ ఫొటోను చూసారో, ఆ వికీ నుండి ఫొటోను దించుకుని, తెవికీ లోకి ఎక్కించండి. దాన్ని పేజీలో చేర్చండి.
  2. అసలు ఇతర భాషల్లో ఈ పేజీ లేకపోయినా, పేజీ ఉన్నా వాటిలో కూడా బొమ్మ ఏమీ లేకపోయినా పై చిట్కా ఫలించదు. అలాంటపుడు, కామన్సులో బొమ్మ కోసం వెతకండి. ఇంగ్లీషు పేరుతో వెతకండి. వ్యక్తుల పేర్లు, ప్రదేశాల పేర్లు అయితే ఆ పేరుతోటే వెతకాలి. ఇతర పేజీల కోసం వెతికేటపుడు ఏ పేరుతో వెతకాలో సందేహం వస్తే, అంతర్వికీ లింకుల్లో ఇంగ్లీషు వ్యాసం పేరుతో వెతకండి.

అంతర్జాతీయ బహుమతుల వివరాలు

ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులకు బహుమతులు:

  1. మొదటి బహుమతి ― US $200 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
  2. రెండవ బహుమతి ― US $150 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
  3. మూడవ బహుమతి ― US $100 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్

ఆడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:

  • US $100 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్

వీడియోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన వాడుకరికి బహుమతి:

  • US $100 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్

ఫొటోలను చేర్చి అత్యధిక వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన కొత్త వాడుకరికి బహుమతి:

  • US $100 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్

తెలుగు వికీపీడియా స్థానిక బహుమతుల వివరాలు

ఫొటోలను చేర్చి అత్యధిక తెలుగు వికీపీడియా వ్యాసాలను మెరుగుపరచిన మొదటి ముగ్గురు వాడుకరులకు బహుమతులు:

  1. మొదటి బహుమతి ― ₹12000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
  2. రెండవ బహుమతి ― ₹6000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
  3. మూడవ బహుమతి ― ₹3000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్
  4. 7 ప్రోత్సాహక బహుమతులు - WPWP సావనీర్లు + సర్టిఫికెట్
  5. ఎక్కువ గ్రామ వ్యాసాలలో బొమ్మలు చేర్చిన వారికి ప్రత్యేక బహుమతి - ₹3000 గిఫ్ట్ కార్డు + WPWP సావనీర్లు + సర్టిఫికెట్

న్యాయనిర్ణేతలు

ఈ పోటీలకు వచ్చిన ఎంట్రీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేయడానికి ఈ క్రింది 4గురు సభ్యులతో కూడిన న్యాయనిర్ణేత సంఘం ఏర్పాటు చేస్తున్నాము. న్యాయనిర్ణేతలు కూడా పోటీలో పాల్గొన వచ్చు. వారి ఎంట్రీలను ఇతర న్యాయనిర్ణేతలు పరిశీలిస్తారు.

  1. టి.సుజాత
  2. చదువరి
  3. పాలగిరి
  4. స్వరలాసిక

పాల్గొనేవారు

ప్రస్తుతం వికీలో చురుగ్గా రాస్తున్న వాడుకరులతో సహా పాత, కొత్త వాడుకరులు అందరూ ఈ ప్రాజెక్టులో పాల్గొని తెవికీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి.

పాల్గొనేవారు ఈ క్రింద సంతకం చేయండి.

  1. : Kasyap (చర్చ) 08:14, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  2. Nskjnv (చర్చ) 10:21, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ➠ కె.వెంకటరమణచర్చ 12:52, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  4. MYADAM ABHILASH (చర్చ) 14:37, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --Rajasekhar1961 (చర్చ) 15:14, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  6. --యర్రా రామారావు (చర్చ) 15:22, 18 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  7. చదువరి (చర్చరచనలు)
  8. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 08:41, 20 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  9. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 15:34, 24 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  10. --Srilakshmi1991 (చర్చ) 15:29, 26 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  11. Thirumalgoud (చర్చ) 05:57, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  12. PARALA NAGARAJU (చర్చ) 06:04, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
  13. Ch Maheswara Raju (చర్చ) 11:15, 28 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]