సాయి కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54: పంక్తి 54:
# [[సుప్రీమ్ (2016 సినిమా)|సుప్రీమ్]] (2016)
# [[సుప్రీమ్ (2016 సినిమా)|సుప్రీమ్]] (2016)
# [[వైశాఖం (సినిమా)|వైశాఖం]] (2017)
# [[వైశాఖం (సినిమా)|వైశాఖం]] (2017)
# [[నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా]] (2018)
# [[సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)|సుబ్రహ్మణ్యపురం]] (2018)
# [[సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)|సుబ్రహ్మణ్యపురం]] (2018)
# [[మహర్షి (2019 సినిమా)|మహర్షి]] (2019)
# [[శ్రీకారం (2021 సినిమా)|శ్రీకారం]] (2021)
# [[శ్రీకారం (2021 సినిమా)|శ్రీకారం]] (2021)
# [[ఎస్ఆర్ కల్యాణమండపం]] (2021)
# [[ఎస్ఆర్ కల్యాణమండపం]] (2021)

05:47, 30 జూన్ 2021 నాటి కూర్పు

సాయి కుమార్
దస్త్రం:Sai Kumar (Actor).jpg
జననం
పూడిపెద్ది సాయి కుమార్

జూలై 27, 1960
ఇతర పేర్లుడైలాగ్ కింగ్
వృత్తినటుడు
అనువాద కళాకారుడు
వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1976 - ఇప్పటివరకు
గుర్తించదగిన సేవలు
పోలీస్ స్టోరీ
పిల్లలుఆది
తల్లిదండ్రులు
  • పి. జె. శర్మ (తండ్రి)
  • కృష్ణజ్యోతి (తల్లి)

సాయి కుమార్ తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి. జె. శర్మ, ఇద్దరు తమ్ముళ్ళు అయ్యప్ప శర్మ, రవిశంకర్ నటులు, డబ్బింగ్ కళాకారులు. కొడుకు ఆది సినీ నటుడు.

బాల్యం

ఇతను నటుడు పి.జె.శర్మ కుమారుడు. ఈయన స్వస్థలం పెద్దకళ్ళేపల్లి. తల్లి కృష్ణజ్యోతి. ఈమె స్వస్థలం కర్ణాటకలోని బాగేపల్లి. సాయికుమార్‌ మద్రాసులో పుట్టి పెరిగాడు.[1] తండ్రి కూడా డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించాడు. కథానాయకులు సుమన్, రాజశేఖర్ ల సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్ఛారణ బాగుండటంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో నటుడిగా కూడా అవకాశాలు లభించాయి. ఆయన కుమారుడు ఆది సినీ కథానాయకుడు. సోదరుడు రవిశంకర్ డబ్బింగ్ కళాకారుడు.

సినీరంగం

సాయికుమార్‌ సినీ ప్రస్థానం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైంది. ఆయన డబ్బింగ్‌ చెప్పిన తొలిచిత్రం ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నటించిన సంసారం అనే సినిమా. కొన్నాళ్ల తర్వాత బాలనటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. బాలనటుడిగా సాయికుమార్‌ చేసిన తొలిసినిమా దేవుడు చేసిన పెళ్లి. అందులో ఆయన అంధుడిగా నటించాడు. తర్వాత దర్శకుడు మధుసూదన్‌రావు తెరకెక్కించిన జేబు దొంగ సినిమాలో నటించాడు. ముందుగా కన్నడ చిత్రాలలో కథానాయకుడిగా నటించిన తర్వాతే తెలుగు సినిమాలలో నటించాడు. 1979 లో వచ్చిన గోరింటాకు సినిమాలో మహానటి సావిత్రి గారి కొడుకు "రాముడు" పాత్ర పోషించారు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే పాటలో సాయి కుమార్ కనిపించాడు.

నటించిన తెలుగు చిత్రాలు

  1. దేవుడు చేసిన పెళ్లి (1975)
  2. స్నేహం (1977)
  3. ఛాలెంజ్ (1984)
  4. అగ్నిపర్వతం (1985)
  5. అమ్మ రాజీనామా (1991)
  6. మేజర్ చంద్రకాంత్ (1993)
  7. ఆయుధం (1990)
  8. కలికాలం (1991)
  9. అంతఃపురం (1998)
  10. శిరిడి సాయి
  11. విష్ణు
  12. శ్రీరామరాజ్యం (2011)
  13. ప్రస్థానం
  14. విజయదశమి
  15. పోలీస్ స్టోరి
  16. కర్తవ్యం
  17. అయ్యారే (2012)
  18. పవిత్ర (2013)[2]
  19. ఒక్కడినే (2013)
  20. దళం (2013)
  21. గలాట (2014)[3]
  22. భగవాన్ (అనువాద చిత్రం)
  23. అబ్దుల్లా (అనువాద చిత్రం)
  24. ఆటో నగర్ సూర్య
  25. జనతా గ్యారేజ్ (2016)
  26. సుప్రీమ్ (2016)
  27. వైశాఖం (2017)
  28. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018)
  29. సుబ్రహ్మణ్యపురం (2018)
  30. మహర్షి (2019)
  31. శ్రీకారం (2021)
  32. ఎస్ఆర్ కల్యాణమండపం (2021)
  33. అర్ధ శతాబ్దం (2021)

పురస్కారాలు

నంది పురస్కారాలు

టీవీ కార్యక్రమాలు

ఈటీవీలో ప్రసారమైన వావ్, మనం అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 విలేఖరి (27 July 2016). "బర్త్‌డే స్పెషల్‌: నటనలో 'అగ్ని'". రామోజీరావు. ఈనాడు. {{cite news}}: |access-date= requires |url= (help)
  2. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 October 2016. Retrieved 28 July 2019.
  3. సాక్షి, సినిమా (18 March 2014). "ఆండాళ్ గలాటా". Sakshi. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.