కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 33: పంక్తి 33:


=== ఎమ్మెల్యేగా ===
=== ఎమ్మెల్యేగా ===
2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. [[మిషన్ కాకతీయ]], [[మిషన్ భగీరథ]] ద్వారా నీటిలోని ఫ్లోరోసిస్ అంతం చేయడానికి, ఆరోగ్యం, విద్య మొదలైన ప్రధాన కార్యక్రమాల ప్రయోజనాలను మునుగోడు ప్రజలకు అందించడానికి ఆయన చురుకుగా పనిచేశాడు.
2014లో జరిగిన [[తెలంగాణ రాష్ట్ర శాసన సభ|తెలంగాణ శాసనసభ]] ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. [[మిషన్ కాకతీయ]], [[మిషన్ భగీరథ]] ద్వారా నీటిలోని ఫ్లోరోసిస్ అంతం చేయడానికి, ఆరోగ్యం, విద్య మొదలైన ప్రధాన కార్యక్రమాల ప్రయోజనాలను మునుగోడు ప్రజలకు అందించడానికి ఆయన చురుకుగా పనిచేశాడు.


2018లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో]] మరోసారి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పార్టీకి చెందిన [[కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి]] 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
2018లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో]] మరోసారి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పార్టీకి చెందిన [[కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి]] 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

12:31, 11 ఆగస్టు 2021 నాటి కూర్పు

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మాజీ శాసనసభ్యుడు
In office
2014-2018
నియోజకవర్గంమునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1965 (age 58–59)
సర్వేల్, నారాయణపూర్ మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ
జీవిత భాగస్వామిఅరుణ
సంతానంఒక కుమారుడు, ఒక కుమార్తె
తల్లిదండ్రులుజంగారెడ్డి, కమలమ్మ

కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి (జననం 1965) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. 2014-2018 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ[1][2] తరపున మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[3]

తొలి జీవితం

ప్రభాకర్ రెడ్డి 1965లో జంగారెడ్డి, కమలమ్మ దంపతులకు యాదాద్రి - భువనగిరి జిల్లా, నారాయణపూర్ మండలంలోని సర్వేల్ గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని వివేక వర్ధిని కళాశాల నుండి బి.ఎడ్. విద్యను, నల్గొండలోని నాగార్జున కళాశాల నుండి బిఎస్సీ విద్యను పూర్తిచేశాడు.[4] రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఒక విద్యాసంస్థను కూడా ప్రారంభించాడు.[5]

రాజకీయ జీవితం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తన గురువు కళ్ళెం యాదగిరి రెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి చేరాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడాడు. మునుగోడు ప్రాంతంలో రాష్ట్ర సాధనకోసం జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి, అక్కడి ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాడు. ప్రభాకర్ తల్లి ఫ్లోరోసిస్ బాధితురాలు. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉండేవారు.

ఎమ్మెల్యేగా

2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా నీటిలోని ఫ్లోరోసిస్ అంతం చేయడానికి, ఆరోగ్యం, విద్య మొదలైన ప్రధాన కార్యక్రమాల ప్రయోజనాలను మునుగోడు ప్రజలకు అందించడానికి ఆయన చురుకుగా పనిచేశాడు.

2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మరోసారి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

వ్యక్తిగత జీవితం

ప్రభాకర్ రెడ్డికి అరుణతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

మూలాలు