ప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Kalasagary (చర్చ | రచనలు) బొమ్మను చేర్చి మెరుగుపరిచాను #WPWPTE,#WPWP ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
CommonsDelinker (చర్చ | రచనలు) Prabha_actor.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fitindia. కారణం: (per c:Commons:Deletion requests/Files uploaded by Kalasagary). ట్యాగు: మానవిక తిరగవేత |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[దస్త్రం:Prabha actor.png|thumb|ప్రభ సినీనటి ]] |
|||
'''ప్రభ''' (కోటి సూర్య ప్రభ) [[తెలుగు సినిమా|తెలుగు సినీ]] నటీ, నర్తకి. |
'''ప్రభ''' (కోటి సూర్య ప్రభ) [[తెలుగు సినిమా|తెలుగు సినీ]] నటీ, నర్తకి. |
||
06:15, 12 అక్టోబరు 2021 నాటి కూర్పు
ప్రభ (కోటి సూర్య ప్రభ) తెలుగు సినీ నటీ, నర్తకి.
సినీరంగ ప్రస్థానం
ఈమె 1974లో విడుదలైన భూమి కోసం సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. అయితే నీడలేని ఆడది ఈమె విడుదలైన తొలి సినిమా. ప్రభ బాల్యము నుండే కూచిపూడి నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం వద్ద శిక్షణ పొందినది[1]. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది. ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబరు 1న మరణించాడు[2]. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది. 2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం వేగుచుక్కలు సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది[3].
చిత్ర సమాహారం
- ప్రతిరోజూ పండగే (2019)
- జేమ్స్ బాండ్ (2015)
- నాగవల్లి (2010)[4]
- ఆడదంటే అలుసా
- ఆమెకథ
- ఆత్మ బంధువులు
- అక్కమొగుడు చెల్లెలి కాపురం
- అత్తవారిల్లు
- అన్నదమ్ముల కథ
- చిలిపి కృష్ణుడు
- దేవతలారా దీవించండి
- ధర్మం దారి తప్పితే
- గీత సంగీత
- ఇదెక్కడి న్యాయం
- ఇల్లాలి ముచ్చట్లు
- ఇల్లంతా సందడి
- ఇంటింటి రామాయణం
- కొంటెమొగుడు పెంకిపెళ్ళాం
- కోరికలే గుర్రాలైతే
- సీతాపతి సంసారం
- స్నేహమేరా జీవితం
- మహాకవి క్షేత్రయ్య
- నీడలేని ఆడది
- నేను – మా ఆవిడ
- ఒకే రక్తం
- జగన్మోహిని
- జీవితమే ఒక నాటకం
- రాధమ్మ మొగుడు
- రగిలేగుండెలు
- రాముడు-రంగడు
- మాయాబజార్ (1995 సినిమా)
- పెళ్ళిళ్ళ పేరయ్య
- ప్రచండ భైరవి (1985 సినిమా)
- పార్వతీ పరమేశ్వరులు
- పగబట్టిన సింహం
- పెద్దిల్లు చిన్నిల్లు
- దాన వీర శూర కర్ణ
- స్వర్గానికి నిచ్చెనలు
- స్వర్గసీమ
- తల్లే చల్లని దైవం
- వందేమాతరం (1982 సినిమా)
- మన ఊరి మారుతి
- మంచి మనసు
- మరో సీత కథ
- శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
- గంధర్వ కన్య
అవార్డులు
- నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు - వేగుచుక్కలు (2003)
మూలాలు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2007-03-21.
- ↑ http://www.idlebrain.com/movie/archive/eventlist2.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-27. Retrieved 2007-03-21.
- ↑ "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Retrieved 9 June 2020.
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రభ పేజీ