దుమ్కా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స.పె సవరణ
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 40: పంక్తి 40:
|-
|-
| ఇది దాదాపు.
| ఇది దాదాపు.
| [[మొరీషియస్]] దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
| [[మొరీషియస్]] దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote = Mauritius
Mauritius
1,303,717
1,303,717
July 2011 est. | website = | archive-date = 2011-09-27 | archive-url = https://web.archive.org/web/20110927165947/https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | url-status = dead }}</ref>
July 2011 est.
}}</ref>
|-
|-
| న్యూహాంప్ షైర్ అమెరికాలోని.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =
| న్యూహాంప్ షైర్ అమెరికాలోని.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =

23:26, 13 నవంబరు 2021 నాటి కూర్పు

దుమ్కా జిల్లా
दुमका जिला
జార్ఖండ్ పటంలో దుమ్కా జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో దుమ్కా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుసంతాల్ పరగణా
ముఖ్య పట్టణందుమ్కా
Government
 • లోకసభ నియోజకవర్గాలుదుమ్కా
 • శాసనసభ నియోజకవర్గాలు4
Area
 • మొత్తం3,716 km2 (1,435 sq mi)
Population
 (2011)
 • మొత్తం13,21,096
 • Density360/km2 (920/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత62.54 %
 • లింగ నిష్పత్తి974
Websiteఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాలలో దేవ్‌ఘర్ (హింది:दुमका जिला ) జిల్లా ఒకటి. దుమ్కా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గణాంకాల ప్రకారం జిల్లావైశాల్యం 3716 చ.కి.మీ ఉంటుంది. జిల్లా జనసంఖ్య 1,321,096.

ఆర్ధికం

2011 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దుమ్కా జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు

జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం ఉంది: దుమ్కా. ఇందులో 10 బ్లాకులు ఉన్నాయి: దుమ్కా, గోపికండర్, జమ, జర్ముండి, కథికుండ్, మసిల, రాంగర్, రాణీశ్వర్, షికరిపరా, సరైయహత్.

  • జిల్లాలో 4 విధాన సభ నియోజకవర్గాలు ఉన్నాయి: దుమ్కా, జమ, షికరిపరా, జర్ముండి. ఇవన్నీ దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
  • దుమ్కా భారతదేశంలోని సుందర నగరాలలో ఒకటి. అంతేకాక ఇది మినీ కొలకత్తాగా పేరుపొందింది..[ఆధారం చూపాలి]

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,321,096,[2]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
న్యూహాంప్ షైర్ అమెరికాలోని.[4] నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 370 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 340 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.39%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 974:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 62.54%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

విద్య

1992 దుమ్కాలో జనవరి 10న " సిద్ధు కంహు విశ్వవిద్యాలయం " స్థాపించబడింది. 2003 మే 6 న ఈ విశ్వవిద్యాలయానికి " సిదో కంహు ముర్ము విశ్వవిద్యాలయం" అని పేరు మార్చబడింది. ఈ విశ్వవిధ్యాలయం ఆధ్వర్యంలో 13 కాలేజీలు ఉన్నాయి. 1955 లో స్థాపినబడిన శాంతల్ పరగణాలు కాలేజ్, 1974లో స్థాపించబడిన ఎస్.పి మహిళా కాలేజ్ కూడా ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉంది.

ప్రయాణ సౌకర్యాలు

దుమ్కా చాలా చిన్న పట్టణం పక్కన ఉన్న పట్టణంలో ఉన్న రహదారితో అనుసంధానమై ఉంది. 2011 జూలై న దుమ్కా కొత్తగా నిర్మించబడిన జసిధ్- దుమ్కా రైల్వే మార్గంతో అనుసంధానించబడింది. తరువాత నగరంలో 3 చక్రాల వాహనాల రద్దీ అధికమైంది. రైల్వే మార్గం ఇంకా నిర్మాణదశలో ఉన్నప్పటికీ దుమ్కా పట్టణం బీహార్ లోని భాగల్‌పూర్, పశ్చిమ బెంగాల్ లోని రాంపూర్‌హత్ లతో అనుసంధానం చేస్తుంది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ యాజమాన్యం నదుపుతున్న బసులే ఈ పట్టణం చేరడానికి అనువైనదని భావించవచ్చు. దుమ్కా పొరుగునా ఉన్న జిల్లాతో రహదారి మార్గంతో చక్కగా అనుసంధానించబడి ఉంది. దుమ్కా - రాంచి, కొలకత్తా ల మద్య సరికొత్తగా విలాసవంతమైన నైట్ బసు సౌకర్యం ఉంది.

పర్యాటకం

బాబా బసుకీనాథ్ ధాం

దుమ్కా జిల్లాలో ఉన్న బాబా బసుకీనాథ్ ధాం దేవ్‌ఘర్ - దుమ్కా రాష్ట్ర రహదారి మార్గంలో ఉంది. దుమ్కాకు ఇది వాయవ్యంగా 25కి.మీ దూరంలో ఉంది. ఇది హిందువుల యాత్రాస్థలం. ఇక్కడ ప్రధాన ఆకర్షణ బసుకీనాథ్ ఆలయం. దేశ నలుమూలల నుండి ఇక్కడి లక్షలాది మంది భక్తులు శివుని పూజించుట కొరకు ఇక్కడికి వస్తుంటారు. శ్రావణ మాసంలో విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇది రాష్ట్ర రహదారిలో జిల్లా కేంద్రమైన డుంక నుండి 28 కిలోమీటర్ల్ దూరంలో ఉంది. బసుకినాథ్ రైల్వే స్టేషను అతి సమీపమైన రైల్వే స్టేషను.

Basukinath is located in Dumka District of Jharkhand. It lies on the Deoghar – Dumka state highway and is around 25 km northwest of Dumka. It is a place of pilgrimage for Hindus. Basukinath Temple is the main attraction here.It is situated on Jasidih Dumka New Railway line and Basukinath Railway Station is the nearest railheads. Ranchi Airport is the nearest airport. It is situated at Jarmundi Block on Dumka Deoghar State Highway, 24 km from the District Headquarters Dumka. In a year lacs and lacs people from different parts of country come here to worship Lord Shiva. In the month of Shravan people of several country also come here to worship Lord Shiva. For more details, kindly follow : http://www.bababasukinath.com[permanent dead link]

మలూటి

షికరిపరా బ్లాకులో ఉన్న మాలూటి చారిత్రక, మతసంబంధిత ముఖ్య ప్రదేశాలలో ఒకటి. ఇది జిల్లాకేంద్రం దుమ్కా రాపూర్హత్ రాష్ట్ర రహదారి నుండి 55 కి.మీ దూరంలో ఉంది. రాజా బస్ంత్ రాయ్ 1860లో మలూటీని పన్ను రహిత రాజధానిగా చేసాడు. ప్రకృతి సౌందర్యం కలిగిన మలూటి పురాతత్వపరిశోధనకు, మతప్రాముఖ్యతకు కేంద్రంగా ఉంది.

Malooti mandir
Malooti mandir
Malooti mandir
Malooti mandir
Malooti mandir
Malooti mandir

బాబా సుమేశ్వర్ నాథ్

సరైయహత్ బ్లాకులో ఉన్న బాబా సుమేశ్వర్ నాథ్ మత ప్రాముఖ్యత కలిగి ఉంది. జిల్లాకేంద్రం దుమ్కాకు ఇది 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ ఒక పెద్ద శివాలయం ఉంది. ఇక్కడ నిత్యపూజతో శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహించబడుతుంటాయి. శివరాత్రి సమయంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తుంటారు.

మసంజోర్ ధాం

దుమ్కా జిల్లాలో మసంజోర్ ప్రబల విహారప్రదేశంగా గుర్తింపు పొందింది. దక్షిణ దుమ్కాకు ఈ కుగ్రామం 31కి.మీ దూరంలో ఉంది. మయూరాక్షి నదీ ద్వీపంలో ఉన్న ఈ దునదగ్రామంలో 1955లో ఇక్కడ ఆనకట్ట నిర్మించడానికి, మయూరాక్షిని అభివృద్ధి చేయడానికి కెనడా నిధులను అందించింది. అందువలన ఈ ఆనకట్టకు కెనడా ఆనకట్ట అని పేరు పెట్టారు. కొండలు, అరణ్యాల మద్య నిర్మితమైన ఈ ఆనకట్ట విహారానికి అనువైనది. మయూరాక్షి బంగ్లా, ఇంస్పెక్షన్ బంగ్లా పర్యాటకులు బసచేయడానికి అనువైనవి. రహదారి మార్గం ద్వారా మసంజోర్ Vakreshwara]] (59 కిమీ), Sainthia (50 కిమీ), తారాపిత్ (70 కిమీ), Rampurhat (62 km), Deoghar (98 కిమీ) లతో అనుసంధానమై ఉంది. అరణ్యాలతో నిండి ఉన్న రెండు పర్వతశ్రేణుల మద్య నిర్మించిన పియర్సన్ ఆనకట్ట ప్రయాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ హైడ్రాలిక్ పవర్ స్టేషను కూడా ఉంది. పర్యాటకుల కొరకు ఇక్కడ ఒక డాక్- బంగళా, పూదోట కూడా ఉంది.

టట్లోయి

టట్లోయి ఒక వేడి నీటి ఊట. జిల్లాకేంద్రం దుమ్కా నుండి 15 కి.మీ దూరంలో ఉంది. దీని చుట్టూ చిన్న కొండలు, ఆకర్షణీయమైన అందమైన పచ్చని వాతావరణం ఉన్నాయి. ఈ ఊటలోని జలం చాలా స్పష్టమైనది, ఆరోగ్యకరం.

కుంరాబాద్

కుంరాబాద్ చాలా అందమైన విహారప్రదేశం. జిల్లా కేంద్రం దుమ్కాకు 13 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ చిన్న కొండలతో నిండిన అతి సుందర ప్రకృతి మద్య " మయూరాక్షి నది ప్రవహిస్తుంది " .

పర్వాతళి

పర్వాతళి పాకూర్ నుండి దక్షిణంగా గొడ్డా వైపు విస్తరించి ఉంది. దుమ్కా పర్వాతళి సమాంతరంగా విస్తరించి మంగళ్భంగ కొండలతో ముగుస్తుంది. దుమ్కా ఆగ్నేయంలో రాంఘర్ కొండలు సమాంతరంగా కొంచెం పశ్చిమ దిశగా విస్తరించి మసంజోర్ నుండి రాణిభల్ వరకు తూర్పు దిశగా తిరిగి ఉన్నాయి. ఈ పర్వతావళితో అక్కడక్కడా విడివిడిగా కొండలు ఉన్నాయి. నానిహత్ వద్ద టాట్లాయి వేడినీటి ఊట ఉన్న లాగ్వా కొండ, హిజ్ల కొండ, సప్చల కొండశిఖరం, చుటో పహారి, ఉన్నాయి. రాంపూర్ మార్గంలో మలుటి ఆలయ గ్రామం ఉంది.

కుర్వా (ష్రిష్టి)

కుర్వా (ష్రిష్టి) చిన్న విహారప్రదేశం. జిల్లాకేంద్రానికి ఇది 5కి.మీ దూరంలో ఉంది. ఇందులో ఒక అనదమైన పూదోట (పార్క్), బోటొంగ్ సౌకర్యం, ఒకచిన్న కొండ ఉన్నాయి.

చుటోనాథ్

చుటోనాథ్ జిల్లా కేంద్రానికి ఇంది 20 కి.మీ దూరంలో ఉంది. ఇది అందమైన విహారప్రదేశమే కాక మతప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా కూడా ఉంది. ఈ ప్రాంతం నదీతీరంలో కొండల మద్య మనోహరంగా ఉంటుంది. ఇక్కడ చుటోనాథ్ ఆలయం ఉంది.

మిషనరీలు

" న్యూ లైఫ్ చర్చ్ మినిస్టర్స్ " [5] దుమ్కాకు 20 కి.మీ దూరంలో ఉంది. కటికుండ్ బ్లాకులో ప్రాంతంలో మొదటి క్రైస్తవ మిషనరీ. ఇది పెద్ద అనాథశరణాలయం ఉంది. 2005 లో స్థాపినబడిన ఈ సంస్థ 500 మంది విడిచిపెట్టబడిన, అనాథలైన గిరిజన పిల్లలకు ఆశ్రయం ఇస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 150 మంది పిల్లలు ఉన్నారు. ఈ సేవా సంస్థ ఐ.ఎస్.ఒ 9001:2008 అనుమతి పొందింది. ఈ సంస్థ ప్రాంతీయ గిరిజన పిల్లలకు ప్రాథమిక విద్యను అందించడానికి ఈ బ్లాకులో ఒక పాఠశాలను ప్రారంభించారు.

బిషప్ పర్యవేక్షిత ప్రాంతం

దుమ్కా జిల్లాలో 14,356 చ.కి.మీ ప్రాంతం బిషప్ పర్యవేక్షిత ప్రాంతంగా ఉంది. షాహిబ్‌గంజ్, పాకూర్, జంతర (ఇందులో దేవ్‌ఘర్, మోహన్‌పూర్, శరవన్ బ్లాకులు లేవు ), పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిర్భం జిల్లాలోని రాంపూర్‌హత్ ఉపవిభాగాలు ఉన్నాయి.

  • ప్రస్తుతం ఇది బిషప్ జూలియస్ మరండి ఆధ్వర్యంలో పర్యవేక్షించబడుతుంది.[6]

మూలాలు

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 10 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470 {{cite web}}: line feed character in |quote= at position 14 (help)
  5. New Life Children Home[permanent dead link]
  6. [Dumka Diocese] http://directory.ucanews.com/dioceses/india-dumka/66 Archived 2014-08-19 at the Wayback Machine

మూస:జార్ఖండ్ లోని జిల్లాలు