చతుర్దశ భువనాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి చతుర్దశభువనాలు ను, చతుర్దశ భువనాలు కు తరలించాం: సరైన విధం
పంక్తి 5: పంక్తి 5:

బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి. తత్వ పదార్ధాల సూక్ష్మ, సూక్ష్మతర అవస్థలనుబట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. క్రింది లోకాలకంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి. లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు. లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే

* మొదటి భావన ప్రకారం మొలనుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.
* మొదటి భావన ప్రకారం కటి(మొల)నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.
* రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.
* రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.
* మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.
* మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.

11:52, 6 అక్టోబరు 2008 నాటి కూర్పు

హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాళుగా విభజించారు. ఇవన్నీ విరాట్పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం రెంవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు (పైనున్నవి)ఏడు , అధోలోకాలు (క్రిందనున్నవి) ఏడు అనీ చెబుతారు.

లోకాల విభజన

లోకాల విభజన గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది.

బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి. తత్వ పదార్ధాల సూక్ష్మ, సూక్ష్మతర అవస్థలనుబట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. క్రింది లోకాలకంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి. లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు. లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే

  • మొదటి భావన ప్రకారం కటి(మొల)నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు.
  • రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు రూపొందాయి.
  • మూడవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, స్వర్లోకం శిరస్సుగా మూడే లోకాలు ఉన్నాయి.

బ్రహ్మాండపురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు, పోషిస్తాడు, తనలో లయం చేసుకొంటాడు.

ఊర్ధ్వలోకాలు

  1. భూలోకం
  2. భువర్లోకం
  3. సువర్లోకం
  4. మహర్లోకం
  5. జనలోకం
  6. తపోలోకం
  7. సత్యలోకం

అధోలోకాలు

  1. అతలం
  2. వితలం
  3. సుతలం
  4. రసాతలం
  5. మహాతలం
  6. తలాతలం
  7. పాతాళం

లోకాల తత్వం

ప్రాణిలోకం ఎల్లప్పుడూ సుఖాన్ని కోరుకుంటుంది. అయితే వారికి లభించే సుఖం తత్వం లోకాన్నిబట్టి మారుతుంది.

భూర్భువస్వర్లోకాలలో లభించే సుఖం నిత్యమైనది కాదు. నాల్గవదైన మహర్లోకం క్రమముక్తికి స్థానం కాని కల్పాంత సమయాలలో అక్కడా తాపం తప్పదు. మహర్లోకం పైన జనలోకం ఉన్నది. ఆ లోక ప్రవేశం మొదలుకొని శాశ్వత సుఖం ఆరంభమవుతున్నది. అది అమృతరూపం. జనలోకంపైన ఉన్న తపోలోకంలోని సుఖం శాస్వతమైనదే కాక క్షేమరూపంలో ఉంటున్నది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం శాశ్వతము. మోక్షప్రదము కూడాను.

వనరులు

  • శ్రీమద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు