షిర్డీ సాయిబాబా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: wuu:赛义巴巴
→‎బోధనలు: image replaced by duplicate
పంక్తి 51: పంక్తి 51:


==బోధనలు==
==బోధనలు==
[[Image:Saibaba.jpg|frame|right|మసీదు గొడకానుకొని ఉన్న సాయిబాబా, భక్తులతోడుగా]]
[[Image:Shirdi sai3.jpg|thumb|right|మసీదు గొడకానుకొని ఉన్న సాయిబాబా, భక్తులతోడుగా]]
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించాడు. [[నమాజ్]] చదవడం, అల్-ఫతీహా మననం, [[ఖొరాన్]] అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించాడు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling The Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1999 | pages = p.29 | isbn = 8120721470}}</ref> ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించాడు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించాడు.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | authorlink = Antonio Rigopoulos | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 139 | isbn = 0791412687}}</ref> తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పాడు. ప్రార్ధన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించాడు. [[ఖొరాన్]] చదువమని ముస్లిములకూ, [[రామాయణం]], [[భగవద్గీత]], [[విష్ణు సహస్రనామ స్తోత్రం]] వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించాడు.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 27 [http://www.saibaba.org/satcharitra/sai27.html]</ref> నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పాడు. తన భక్తులకు [[రెండు]] ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పాడు - అవి '''శ్రద్ధ''' (విశ్వాసం, భక్తి, దీక్ష), '''సబూరి''' (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టాడు<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 3 [http://www.saibaba.org/satcharitra/sai3.html]</ref>. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించాడు.
తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించాడు. [[నమాజ్]] చదవడం, అల్-ఫతీహా మననం, [[ఖొరాన్]] అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించాడు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.<ref>{{cite book | last = Warren | first = Marianne | title = Unravelling The Enigma: Shirdi Sai Baba in the Light of Sufism | publisher = [[Sterling Publishing|Sterling Publishers]] | date= 1999 | pages = p.29 | isbn = 8120721470}}</ref> ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించాడు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించాడు.<ref>{{cite book | last = Rigopoulos | first = Antonio | authorlink = Antonio Rigopoulos | title = The Life and Teachings of Sai Baba of Shirdi | publisher = [[State University of New York Press|SUNY]] | date= 1993 | pages = 139 | isbn = 0791412687}}</ref> తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పాడు. ప్రార్ధన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించాడు. [[ఖొరాన్]] చదువమని ముస్లిములకూ, [[రామాయణం]], [[భగవద్గీత]], [[విష్ణు సహస్రనామ స్తోత్రం]] వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించాడు.<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 27 [http://www.saibaba.org/satcharitra/sai27.html]</ref> నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పాడు. తన భక్తులకు [[రెండు]] ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పాడు - అవి '''శ్రద్ధ''' (విశ్వాసం, భక్తి, దీక్ష), '''సబూరి''' (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టాడు<ref>Dabholkar/Gunaji ''Shri Sai Satcharita''/''Shri Sai Satcharitra'' chapter 3 [http://www.saibaba.org/satcharitra/sai3.html]</ref>. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించాడు.


పంక్తి 78: పంక్తి 78:
# నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
# నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
# నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.
# నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.

==భక్తులు, పూజా విధానాలు==
==భక్తులు, పూజా విధానాలు==
ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు. బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.<ref name=srinivas>Srinivas ''Sathya Sai Baba movement''</ref>
ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు. బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.<ref name=srinivas>Srinivas ''Sathya Sai Baba movement''</ref>

08:43, 7 అక్టోబరు 2008 నాటి కూర్పు

సంబంధిత ఇతర వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ సాయిబాబా చూడండి

షిరిడీ సాయిబాబా
గురువువెంకూసా
తత్వంఅద్వైతం
ఉల్లేఖనసబ్‌కా మాలిక్ ఏక్ హై
(అందరి ప్రభువు ఒక్కడే)

షిర్డీ సాయిబాబా (?? - అక్టోబర్ 15, 1918) భారతీయ గురువు మరియు సాధువు, ఫకీరు. ఇతని అసలు పేరు, జన్మ స్థలం తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులూ సాధువుగా నమ్ముతారు. ఇతని జీవిత నడవడిలో, భోధనలలో రెండు మతాలను అవలంభించి, సహయోగము కుదర్చడానికి ప్రయత్నించాడు. సాయిబాబా మసీదులో నివసించాడు, గుడిలో సమాధి అయ్యాడు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించాడు. ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించాడు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరి ప్రభువు ఒక్కడే). పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.


సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు.[1] అతను హిందువా, ముస్లిమా, దేవుడా, గురువా, సామాన్యుడా అన్ని విషయాల గురించి పలు వాదాలున్నాయి.[2]

జీవిత చరిత్ర

నేపధ్యం

దస్త్రం:Sai1.jpg
అధికంగా కనుపించే సాయిబాబా చిత్రం

సాయిబాబా పుట్టుపూర్వోత్తరాల గురించి తెలియడంలేదు. ఈ విషయమై జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడీ చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చుననీ, అతని బాల్య నామం హరిభావు భుసారి కావచ్చుననీ కొన్ని అభిప్రాయాలున్నాయి.[3] తన జన్మ, బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. అవి అనవుసరమని అనేవాడు. ఒకమారు తన ప్రియానుయాయుడైన మహాల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కధనం ఉంది.[4]. మరొకమారు ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోసా అనే గురువుకు అప్పగించినట్లు, తాను వెంకోసా వద్ద పన్నెండేళ్ళు శిష్యరికం చేసినట్లు చెప్పాడంటారు.[5] ఈ రెండు కధనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలున్నాయి.[6]


తన షుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో బాబా మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని, అక్కడ మూడేండ్లు ఉండి తరువాత తరువాత కొంత కాలం కనుపించలేదని, మళ్ళీ ఒక సంవత్సరం తరువాత (షుమారు 1858లో) షిరిడీకి తిరిగి వచ్చాడనీ అత్యధికులు విశ్వసించే విడయం. ఈ ప్రకారం బాబా షుమారు 1838లో జన్మించి ఉండవచ్చును.[7]


ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవళ్ళు కూర్చుని ఉండేవాడు. అతనిని చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు.[8]. మహాల్సాపతి, అప్పా జోగలే, కాశీనాధ వంటి ధార్మిక చింతనాపరులైన గ్రామస్తులు బాబాను తరచు దర్శించసాగారు. అతడు పిచ్చివాడని మరి కొందరు రాళ్ళు కూడా రువ్వేవారు.[9]. మళ్ళీ కొంతకాలం కనుపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అప్పుడు అతను చాలా మంది సాధువులను, ఫకీరులను కలిశాడని, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి అధ్వర్యంలో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చుననీ, కొంతకాలం నేత పని చేశాడనీ కొన్ని సూచనల వలన తెలుస్తున్నాయి.[10]

షిరిడీలో నివాసం

తన మసీదు వరండాలో సాయిబాబా

1858లో చాంద్ పాటిల్ కుటుంబపు పెళ్ళివారితో కలిసి బాబా షిరిడీ వచ్చాడు. అక్కడ ఖండోబా మందిరం దగ్గర అతను బండి దిగినప్పుడు మందిరం పూజారి మహాల్సాపతి "దయ చేయుము సాయీ" అని పిలిచాడు. తరువాత 'సాయి' పదం స్థిరపడి అతడు "సాయిబాబా"గా ప్రసిద్ధుడైనాడు.[11] షిరిడీ ప్రాంతంలో సాము గరిడీలు, కుస్తీలు ప్రసిద్ధం. సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్‌లలాగా ఉండేది. ఒకసారి 'మొహిదీన్ తంబోలీ' అనే వానితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది. సూఫీ ఫకీరులలాగా మోకాళ్ళవరకు ఉండే 'కఫనీ', తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలుపెట్టాడు. [12] ఇలా ముస్లిం ఫకీరులా ఉండే బాబాకు స్థానిక హిందువులనుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది.[13]


1918లో తన మరణం వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు. ఒక పాత మసీదును తన నివాసం చేసుకొన్నాడు. యాచన అతని వృత్తి. మసీదులో ధునిని వెలిగించాడు. అందులోనుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవాడు. అది తమకు రక్షణ ఇస్తుందని భక్తులు నమ్మేవారు. వచ్చిన వారికి ఉపదేశాలు, ధర్మ బోధలు చేసేవాడు. చాలా మహత్తులు చూపించేవాడని భక్తులు చెబుతారు. స్వయంగా వండి ప్రసాదాన్ని పంచేవాడు. ఉత్సవాలలో పాల్గొనేవాడు. ఒకోమారు విపరీతంగా కోపం చూపేవాడు.[14][15]

1910 తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది. గొప్ప మహత్తులు చూపే సాదువనీ, లేదా అవతారమని విశ్వసించే భక్తులు పెక్కురు బాబా దర్శనానికి రాసాగారు.[16] అక్టోబరు 15, 1918 మధ్యాహ్నం 2.30కి బాబా తన భక్తుని వడిలో కన్ను మూశాడు (మహా సమాధి చెందాడు). అతని దేహం బూటెవాడలో ఖననం చేయబడింది. అక్కడే 'సమాధి మందిరం' నిర్మించబడింది.[17]

ముఖ్యమైన శిష్యులు, అనుయాయులు

సాయిబాబా తన మార్గానికి, ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చెయ్యలేదు. ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకొనే వ్యవస్థ కూడా ఏమీ లేదు. ఆయన అందరికీ చెందినవాడు. సకోరీకి చెందిన ఉపాసనీ మహారాజ్, అహమ్మద్ నగర్‌కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు.


సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకొని ఉన్నారు - వారిలో ముఖ్యులు: మహాల్సాపతి, హేమాండ్ పంతు..

బోధనలు

మసీదు గొడకానుకొని ఉన్న సాయిబాబా, భక్తులతోడుగా

తన దైనిక వ్యవహారాలలోను, బోధనలలోను సాయిబాబా హిందూమతానికి చెందిన సంప్రదాయాలనూ, ఇస్లాం సంప్ర్రదాయాలనూ కూడా పాటించాడు. నమాజ్ చదవడం, అల్-ఫతీహా మననం, ఖొరాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించాడు కాని చాలా ఇతర ఆచారాలను పాటించలేదు.[18] ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి. మతం, కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించాడు. అలాగే సనాతన ఛాందస సంప్రదాయాలను, ఏ మతానివైనా గాని, ఖండించాడు.[19] తాను ఫకీరుగా ఉన్నా తన అనుయాయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పాడు. ప్రార్ధన, భగవన్నామస్మరణ, పుణ్యగ్రంధ పఠనం - వీటిని ప్రోత్సహించాడు. ఖొరాన్ చదువమని ముస్లిములకూ, రామాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకూ ఉపదేశించాడు.[20] నీతి బద్ధమైన జీవనం గడపమనీ, ఇతరులను ప్రేమించి సహాయం చేయమనీ చెప్పాడు. తన భక్తులకు రెండు ముఖ్యమైన లక్షణాలు అలవరచుకోమని పదేపదే చెప్పాడు - అవి శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు, సాధన). నాస్తికత్వాన్ని తప్పు పట్టాడు[21]. అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలనీ, వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలనీ ఉపదేశించాడు.


రెండు మతాల గ్రంధాలనూ సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించాడు. వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉందని ఆయనతో ఉన్నవారు చెప్పారు. హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యానాలలో అద్వైతం, భక్తి అంశాలు కలగలిసి ఉండేవి.[22] తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నాడు[6].


భగవంతుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలలో ఒక ముఖ్యాంశం. అతని ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకూ, ఉపనిషత్సూత్రాలకూ కూడా సరిపోతాయి. ఈ లోకం నశ్వరమనీ, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమనీ చెప్పాడు. సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించీ, గురువునే దేవుడిగా భావించమనీ పదేపదే చెప్పాడు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పాడు.

సాయిబాబా రచించిన గ్రంధాలేవీ లేవు. అతని బోధనలు మౌఖికంగానే శిష్యులకు లభించాయి. అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలు కావు. సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు. తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచు సాయిబాబా ‘దక్షిణ’ అడుగుతుండేవాడు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవాడు. మిగిలిన కొద్దిపాటి ధనంతో పుగాకు, అగ్గిపెట్టెలవంటివి కొనేవాడు. భక్తులవద్ద దక్షిణ తీసికొని వారి పూర్వ ఋణాలను చెల్లించడానికి దోహదం చేస్తాడని అతని అనుయాయులు అనేవారు.

దానము, ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం – ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు. ఏదో సంబంధం లేకుండా ఎవరూ ఎక్కడికీ వెళ్ళలేరు అని బాబా అనేవాడు. దగ్గరకు వచ్చినవారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవాడు. “దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాసం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారియెడల కుక్కలాగా మొరగవద్దు” అని చెప్పాడు.[23]


బాబా చెప్పిన వాటిలో మరి కొన్ని ప్రసిద్ధ వాక్యాలు – “నేనుండగా భయమెందులకు?”[24]"అతనికి మొదలు లేదు... తుది లేదు ",[24]. తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు.:

  1. షిరిడీలో అడుగు పెట్టినవారి కష్టాలు తీరినట్లే.
  2. మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లివిరుస్తుంది.
  3. నేనీ భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను.
  4. నా సమాధి నా భక్తులను దీవిస్తుంది. వారి అవుసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది.
  5. నాసమాధినుండే నేను మీకు దర్శనమిస్తాను.
  6. నా సమాధినుండి నేణు మాట్లాడుతాను.
  7. నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేనెప్పుడూ ఉంటాను.
  8. మీరు నావంక చూడండి. నేను మీవంక చూస్తాను.
  9. మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను.
  10. నా సహాయం, బోధన కోరినవారికి అవి వెంటనే లభిస్తాయి.
  11. నా భక్తుల ఇంట ‘లేమి’ అనేది ఉండదు.

భక్తులు, పూజా విధానాలు

ఖండోబా ఆలయంలోని పూజారి మహాల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి. తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు, విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరి కొద్దిమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును. 1910 తరువాత ఒక భక్తుడైన దాసగణు తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు. అప్పటినుండి దేశంలో చాలా ప్రాంతాలనుండి హిందూ, ముస్లిమ్ భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు. బాబా జీవిత కాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ, పార్శీ భక్తులు కూడా షిరిడి సాయి దర్శనానికి రాసాగారు.[1]


షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ అనే సంస్థ షిరిడీ కేంద్రంగా వివిధ కార్యక్రమాలు, ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నది.

దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ సాయిబాబా మందిరాలున్నాయి. ఆంధ్ర ప్రదేశ్…లో అనెక నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి.[1] సాయి బాబా గురించి అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి.[25] హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింపబడుతున్నది.[26] అయితే సాయిబాబా ఆరాధనోద్యమంలో కొద్దిపాటి మాత్రమే షిరిడి సాయి సంస్థానం మార్గదర్శకత్వ వ్యవస్థలో ఉంది. అధికంగా భక్తులు, పూజలు, ఆలయాలు అక్కడి ప్రజల సంకల్పానుసారం ఏర్పాటు చేయబడుతున్నది.


భారత దేశం వెలుపల అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయి బాబా భక్తులు, ఆరాధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి.[27]

షిరిడీలోని సాయిమందిరానికి సగటుమ రోజూ 20 వేల మంది సందర్శకులు వస్తారని. కొన్ని ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుందని అంచనా.[28]

మహిమలు

సాయిబాబా భక్తులు అనుచరులు చెప్పే కధనాల ప్రకారం సాయిబాబా పెక్కు మహిమలు కనబరచాడు. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన ‘సాయి సచ్చరిత్ర’లో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘ కాలిక వ్యాధులను నయం చేయడం, ఖండ యోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, గాలిలో తేలి ఉండడం, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలిసికోవడం, దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటివి ఇలాంటి మహిమలలో కొన్ని.


తన భౌతిక దేహాన్ని విడచిన తరువాత కూడా బాబా అనేక భక్తులకు కలలలోను, మనోధ్యాన సమయంలోను దర్శనమిచ్చి మార్గ నిర్దేశనం చేయడం, కష్టాలనుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబరచినట్లు పెక్కు భక్తులు చెబుతుంటారు. [29] ఇటువంటి విషయాలు భక్తుల సత్సంగ కార్యక్రమాలలో తరచు చెప్పబడతాయి.

చారిత్రిక ఆధారాలు

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ, స్మృతి శ్రీనివాస్, ఆంటోనియో రిగోపోలస్ వంటి వారు వ్రాసిన సాయిబాబా జీవిత చరిత్రలు వారు విన్న విషయాలపై ఆధారపడినవి. గణేష శ్రీకృష్ణ ఖర్పడే వ్రాసిన ‘షిరిడి దినచర్య’ కూడా ఒక ముఖ్యమైన ఆధారం. 1916లో గోవిందరావు రఘునాధ దభోల్కర్ (ఇతనికి సాయిబాబా ‘హేమాండ్ పంత్’ అనే పేరు పెట్టాడు) మరాఠీలో వ్రాసిన ‘సాయి సచ్చరిత్ర’ అనే గ్రంధం సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించన ముఖ్యమైన ఆధారం. ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అనుచరుడు. ఎక్కువ విషయాలు తను ప్రత్యక్షంగా చూచినవి లేదా బాబా మాటలలో చెప్పినవి లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి వ్రాశాడు. ఈ గ్రంధం దాదాపు అన్ని భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువదించబడింది. తెలుగుగులో ప్రత్తి నారాయణరావు అనువదించిన ‘సాయి సచ్చరిత్ర’ ఒక నిత్య పారాయణ గ్రంధంగా పెక్కు భక్తులు పరిగణిస్తారు.


ఇంకా బి.వి.నరసింహస్వామిజీ రచించిన ‘సాయి సందేశం’, ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రచించిన ‘సాయి చరిత్ర, సందేశం’ కొన్ని ముఖ్యమైన వనరులు.

వివిధ మతాలలో అభిప్రాయాలు

హిందూమతంలో

సాయిబాబా జీవితకాలంలోనే యెవాలా ఆనందనాధ్ అనే సాధువు బాబను ఒక ఆధ్యాత్మ వజ్రంగా అభివర్ణించాడు..[30] గంగాగిర్ అనే మరొక సాధువు కూడా ఇదే భావాన్ని వెలిబుచ్చాడు..[30] బాబాను అమితంగా విశ్వసించిన బేడేకర్ మహారాజ్ 1873లో బాబాను దర్శించుకొన్నపుడు ఆయనను జగద్గురు అని సంబోధించాడు.[31][32] టెంబే స్వామీజీ అనబడే వసుదేవానంద సరస్వతి కూడా బాబాను అమితంగా గౌరవించాడు.[33] చాలా మంది శైవ సాధువులు కూడా బాబాను ఆరాధించారు.[34] స్వామి కాళేశ్వర్ బాబాను తన దైవ సమానుడైన గురువుగా పూజించాడు.[35] సత్యసాయిబాబా తనను తాను షిరిడీ సాయిబాబా అవతారమని చెప్పుకొంటున్నాడు.[36]

ఇతర మతాలు

అధికంగా సూఫీ సంప్రదాయానికి చెందిన మహమ్మదీయులు సాయిబాబాను గురువుగా పరిగణించడం జరుగుతున్నది. మెహెర్ బాబా సాయిబాబాను కుతుబ్ ఎ ఇర్షాద్ (అత్యుత్తమమైన కుతుబ్) అని అభివర్ణించాడు.[37] జోరాస్ట్రియన్ మతానికి చెందిన నానీ ఫాల్కీవాలా, హోమీ భాభా వంటి ప్రముఖులు కూడా సాయిబాబాను విశ్వసించారు.[38]

సంస్కృతిలో

ఒక తివాచీపై అల్లిన బాబా చిత్రం

భారత దేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాలలోను, చాలా పట్టణాలలోను సాయిబాబా మందిరాలున్నాయి.[1] కొన్ని విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి. ముంబైకు వెందిన షామారావు జయకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది. షిరిడీలోని సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహం ‘తలీమ్’ అనే శిల్పి చెక్కినది.[39] వివిధ బాబా ఆలయాలలోను, సత్సంగాలలోను, కుటుంబ ప్రార్ధనా సమావేశాలలోను బాబా భజన, ఆరతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.[40]

సినిమాలు

సాయి బాబా జీవిత చరిత్ర ఆధారంగా పలు భారతీయ సినిమాలు నిర్మింపబడ్డాయి.

సంవత్సరం సినిమా ప్రధాన పాత్రధారి దర్శకుడు భాష గమనికలు
1977 షిర్డీ కె సాయిబాబా సుధీర్ దాల్వి అశోక్ భూషణ్ హిందీ ఇతర పాత్రధారులు - మనోజ్ కుమార్, రాజేంద్ర కుమార్, హేమ మాలిని, శతృఘ్న సిన్హా, సచిన్, ప్రేమ్ నాధ్
1986 శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం విజయచందర్ కె.వాసు తెలుగు హిందీ, తెలుగులలోకి డబ్ చేయబడింది.
1993 సాయిబాబా ??? బాబాసాహెబ్ ఎస్.ఫత్తేలాల్ మరాఠి ఇతర పాత్రధారులు - లలితా పవార్
2001 షిర్డీ సాయిబాబా సుధీర్ దాల్వి బలరాజ్ దీపక్ విజ్ హిందీ ఇతర పాత్రధారులు - ధర్మేంద్ర, రోహిణి హత్తంగడి, సురేష్ ఓబెరాయ్
2005 ఈశ్వర్ అవతార్ సాయిబాబా ముకుల్ నాగ్ రామానంద్ సాగర్ హిందీ టెలివిజన్ సీరియల్ ‘సాయిబాబా’ ఆధారంగా.


రిఫరెన్సులు

  1. 1.0 1.1 1.2 1.3 Srinivas Sathya Sai Baba movement
  2. Rigopoulos, Antonio (1993). The Life and Teachings of Sai Baba of Shirdi. SUNY. pp. xxiii. ISBN 0791412687.
  3. Kamath, M.V. (1997). Sai Baba of Shirdi: A Unique Saint. India: Jaico Publishing House. pp. pp. 13-18. ISBN 81-7224-030-9. {{cite book}}: |pages= has extra text (help); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  4. Rigopoulos, Antonio (1993). The Life and Teachings of Sai Baba of Shirdi. SUNY. pp. pp. 8. ISBN 0791412687. {{cite book}}: |pages= has extra text (help)
  5. Narasimhaswami, B.V. (1986). Sri Sai Baba's Charters & Sayings. All-India Sai Samaj, Madras. pp. pp. 62. {{cite book}}: |pages= has extra text (help)
  6. 6.0 6.1 Hoiberg, Dale (2000). "Students' Britannica India". Popular Prakashan. Retrieved 2007-12-01. {{cite web}}: Check date values in: |date= (help); Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  7. Rigopoulos, Antonio (1993). The Life and Teachings of Sai Baba of Shirdi. SUNY. pp. pp. 45. ISBN 0791412687. {{cite book}}: |pages= has extra text (help)
  8. Rigopoulos, Antonio (1993). The Life and Teachings of Sai Baba of Shirdi. SUNY. pp. pp. 46. ISBN 0791412687. {{cite book}}: |pages= has extra text (help)
  9. Parthasarathy, Rangaswami (1997). God Who Walked On Earth: The Life and Times of Shirdi Sai Baba. Sterling Publishing. pp. pp. 15. ISBN 81-207-1809-7. {{cite book}}: |pages= has extra text (help)
  10. Narasimhaswami, B.V. (1986). Sri Sai Baba's Charters & Sayings. All-India Sai Samaj, Madras. pp. pp. 209. {{cite book}}: |pages= has extra text (help)
  11. Bharadwaja, Acharya E. (1996). Sai Baba The Master. India: Sree Guru Paduka Publications. p. 21.
  12. Warren, Marianne (1997). Unravelling the Enigma: Shirdi Sai Baba in the Light of Sufism. Sterling Publishers. p. 104. ISBN 81-207-2147-0.
  13. Rigopoulos, Antonio (1993). The Life and Teachings of Sai Baba of Shirdi. SUNY. pp. 51–52. ISBN 0791412687.
  14. "That Shirdi Sai Baba was eccentric is well-attested, for it seems that he was sometimes of uncouth and violent behaviour." In Bowen, David (1988). The Sathya Sai Baba Community in Bradford: Its origins and development, religious beliefs and practices. Leeds: University Press. p. 135.
  15. "Of unpredictable moods, devotees remember him as both loving and harsh. When he got angry, often for no apparent reason, he would scream or abuse people, sometimes for hours at an end, at times even tearing off his own clothes." In Rigopoulos, Antonio (1993). The Life and Teachings of Sai Baba of Shirdi. SUNY. pp. xxxiii. ISBN 0791412687.
  16. Ruhela Sri Shirdi Sai Baba - The Universal Master p. 65-72
  17. Dabholkar/Gunaji Shri Sai Satcharita/Shri Sai Satcharitra chapters 42, 43, 44 [1] [2]
  18. Warren, Marianne (1999). Unravelling The Enigma: Shirdi Sai Baba in the Light of Sufism. Sterling Publishers. pp. p.29. ISBN 8120721470. {{cite book}}: |pages= has extra text (help)
  19. Rigopoulos, Antonio (1993). The Life and Teachings of Sai Baba of Shirdi. SUNY. p. 139. ISBN 0791412687.
  20. Dabholkar/Gunaji Shri Sai Satcharita/Shri Sai Satcharitra chapter 27 [3]
  21. Dabholkar/Gunaji Shri Sai Satcharita/Shri Sai Satcharitra chapter 3 [4]
  22. Rigopoulos, Antonio (1993). The Life and Teachings of Sai Baba of Shirdi. SUNY. pp. 261–352. ISBN 0791412687.
  23. Dabholkar (alias Hemadpant) Shri Sai Satcharita Shri Sai Baba Sansthan Shirdi, (translated from Marathi into English by Nagesh V. Gunaji in 1944) available online or downloadable
  24. 24.0 24.1 "Saibaba.org" (HTML). Retrieved 2007-10-29.
  25. "Sai Literature" (HTML). Retrieved 2007-10-29.
  26. Gibson L. Modern World Religions: Hinduism - Pupil Book Core p. 42 [5]
  27. Brady R., Coward H. G., Hinnels J. H. "The South Asian Religious Diaspora in Britain, Canada, and the United States" p. 93 [6]
  28. "Temple Complex" (HTML). Retrieved 2007-10-29.
  29. Ruhela Sri Shirdi Sai Baba - the universal master p. 141-154
  30. 30.0 30.1 "Who is Shirdi Sai Baba"" (HTML). Retrieved 2007-10-29.
  31. "A Short Biography of Shree Sadguru Beedkar Maharaj" (HTML). Retrieved 2007-10-29.
  32. "Beedkar Maharaj" (HTML). Sai Vichaar, Oct 06, 2005, volume 8, issue 2001. Retrieved 2007-10-29.
  33. Dabholkar/Gunaji Shri Sai Satcharita/Shri Sai Satcharitra chapter 50 [7]
  34. Ruhela Sri Shirdi Sai Baba - the universal master p. 27
  35. "Sri Kaleshwar:: The Divine Lineage" (HTML). Retrieved 2007-10-29.
  36. "Bhagawan Sri Sathya Sai Baba - Introduction" (HTML). Retrieved 2007-10-29.
  37. "Who is Meher Baba?" (HTML). Retrieved 2007-10-29.
  38. Hinnels J. R. Zoroastrians Diaspora: religion and migration p. 109 [8]
  39. Ruhela Sri Shirdi Sai Baba - The Universal Master
  40. "Welcome to Shirdi Sai Trust - Arathi Timings" (HTML). Retrieved 2007-10-30.
  • Hoiberg, D. & Ramchandani, I.; Sai Baba of Shirdi, in: Students' Britannica India. Page available online
  • Dabholkar, Govindrao Raghunath (alias Hemadpant) Shri Sai Satcharita Shri Sai Baba Sansthan Shirdi, (translated from Marathi into English by Nagesh V. Gunaji in 1944) available online or downloadable
  • Kamath, M.V. & Kher, V.B., Sai Baba of Shirdi: A Unique Saint, India: Jaico Publishing House (1997). ISBN 81-7224-030-9
  • Rigopoulos, Antonio The Life and Teachings of Sai Baba of Shirdi State University of New York press, Albany, (1993) ISBN 0-7914-1268-7
  • Warren, Marianne, Unravelling the Enigma. Shirdi Sai Baba in the Light of Sufism, Revised edition, New Delhi, Sterling Publishing, 2004. ISBN 81-207-2147-0

బయటి లింకులు

ప్రార్ధనలు, స్తోత్రాలు