గరికిపాటి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:పద్మ శ్రీ పొందిన తెలుగు వ్యక్తులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 154: పంక్తి 154:
[[వర్గం:లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:పద్మ శ్రీ పొందిన తెలుగు వ్యక్తులు]]

15:12, 26 జనవరి 2022 నాటి కూర్పు

గరికిపాటి నరసింహారావు
జననం(1958-09-14)1958 సెప్టెంబరు 14
పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిధారణాబ్రహ్మరాక్షసుడు
మతంహిందూ
భార్య / భర్తశారద
పిల్లలుశ్రీశ్రీ, గురజాడ
తండ్రిగరికిపాటి వెంకట సూర్యనారాయణ
తల్లివెంకట రమణమ్మ
వెబ్‌సైటు
http://srigarikipati.com

గరికిపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశాడు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నాడు. భారత ప్రభుత్వంచే 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.[1]

జీవిత విశేషాలు

నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958, సెప్టెంబర్ 14వ తేదీకి సరియైన విలంబి నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమినాడు జన్మించాడు. ఇతడు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశాడు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.

అవధానాలు

ఇతడు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించాడు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేశాడు. 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

రచనలు

  1. సాగరఘోష (పద్యకావ్యం)
  2. మనభారతం (పద్యకావ్యం)
  3. బాష్పగుఛ్ఛం (పద్య కవితా సంపుటి)
  4. పల్లవి (పాటలు)
  5. సహస్రభారతి
  6. ద్విశతావధానం
  7. ధార ధారణ
  8. కవితా ఖండికా శతావధానం
  9. మౌఖిక సాహిత్యం (పరిశోధన)
  10. పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు
  11. మా అమ్మ (లఘుకావ్యం)
  12. అవధాన శతకం
  13. శతావధాన భాగ్యం (సంపూర్ణ శతావధానం)
  14. శతావధాన విజయం (101 పద్యాలు)

టి.వి.కార్యక్రమాలు

ఇతడు అనేక టి.వి.ఛానళ్లలో కార్యక్రమాలు నిర్వహించాడు. వాటిలో కొన్ని:

  1. ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం
  2. ఓం టి.వి. (సి.వి.ఆర్.స్పిరిట్యుయల్)లో రఘువంశం
  3. భక్తి టి.వి.లో ఆంధ్ర మహాభారతం: 1818 ఎపిసోడ్లు
  4. భక్తి టి.వి.లో తరతరాల తెలుగు పద్యం
  5. దూరదర్శన్ సప్తగిరిలో మంచికుటుంబం
  6. ఈ.టి.వి-2 - చమక్కులు (తెలుగు వెలుగు)
  7. తెలుగు వన్ డాట్ కామ్ ఇంటర్నెట్ ఛానల్‌లో సాహిత్యంలో హాస్యం

సి.డి.లు, డి.వి.డి.లు

వివిధ సందర్భాలలో ఈయన చేసిన ప్రసంగాలు, ప్రవచనాలు, సాగరఘోష కావ్యపఠనం సిడిలుగా డివిడిలుగా విడుదల చేయబడ్డాయి. వాటి వివరాలు:

  1. పలకరిస్తె పద్యం (హాస్య పద్యాలు)
  2. శివానంద లహరి
  3. సౌందర్య లహరి
  4. కనకథారా స్తవము
  5. భక్త ప్రహ్లద
  6. గజేంద్ర మోక్షము
  7. కాశీ ఖండము
  8. భగవద్గీత
  9. శకుంతలోపాఖ్యానము
  10. శ్రీ కాళహస్తి మహాత్మ్యం
  11. సాగరఘోష (1116 పద్యాలు x 20 గంటల వ్యాఖ్యానంతో సహా) (డివిడి)

పురస్కారాలు

  1. ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)
  2. కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)
  3. సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)
  4. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)
  5. 2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం
  6. 2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి
  7. 2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)
  8. 2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి
  9. భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం
  10. 2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం
  11. 2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం
  12. సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)
  13. తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
  14. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.[2]
  15. భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.[3]

బిరుదులు

  • శతావధాన గీష్పతి
  • అవధాన శారద
  • ధారణ బ్రహ్మ రాక్షస
  • అమెరికా అవధానభారతి

పరిశోధన

ఇతని సాహిత్యంపై ఇంతవరకు వివిధ విశ్వవిద్యాలయాలలో రెండు ఎం.ఫిల్, రెండు పి.హెచ్.డి పరిశోధనలు జరిగాయి.

అవధానాలలో కొన్ని పూరణలు

దత్తపది

  • ఆకాశం, సూరీడు, యవ్వారం, నారాయుడు పదాలతో బాపు రమణల ప్రశస్తి
ఆకాశంబది యెర్రబారినది ఏ హత్యల్‌జొరంబారెనో
సోకుల్నేర్చిన బాపు కుంచియలతో సూరీడు నేరేడగున్‌
ఆకే చాకుగ తోచు నా బుడుగు, ఈ యవ్వార మెవ్వారిదో
నాకంబందున ముళ్ళుపూడె ఇటకా నారాయుడేవచ్చెనో!

వర్ణన

  • అమెరికాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి, ఇండియాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి లండన్‌లో కలిస్తే...
అమెరికా కన్య ఓ యంచు ననగ జనదు
ఇండియా కన్య వూరకే వుండబోదు
మౌన భాషణ లొక్కచో స్నానమాడ
లండనున చల్లబడ్డది గుండెమంట

ఆశువు

  • కుండలాలతో, గండ పెండేరాలతో, కళ్ళద్దాలతో, పట్టు పంచెలతో సర్వాలంకారాలతో ఉన్న అవధానిని కలలో చూసి, దిగ్గున లేచిన రసజ్ఞుని పరిస్థితి
పంచెగట్టిరి పద్యాలు పంచి ఇడిరి,
నాల్గుకన్నులు సంద్రాలు నాల్గు గాగ
ధారణా కంకణమ్ములు దాల్చినారు
మాయమైనారు కలలోనె గాయమయ్యె!
  • కార్యేషు మంత్రి కరణేషు .....కి పేరడీ
కార్యేషు మిక్సి శయనేషు సెక్సీ భరణే చ కూలి తరునీషు శూలి రూపేచ హీరో కోపేచ  జీరో షట్కర్మ కర్త కలి కాల భర్త

సమస్యాపూరణ

  • వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో
వెధవల్‌బుట్టిరి వింతదేశమున నవ్వే వచ్చెడిన్‌విన్నచో
కథలున్‌గోడలకెక్కె యీ కళకు పక్కా సంస్థలున్‌లేచె యీ
సుధలీనేలను రోగ రూపమున సంక్షోభమ్ము పుట్టించునో
వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో

ఆధారాలు

  1. ఎ. రామలింగశాస్త్రి (11 November 2005), "Rich entertainer", ది హిందూ, retrieved 17 December 2014
  2. ఈరంకి వెంకటకామేశ్వర్, "తెలుగుతేజోమూర్తులు", సృజన రంజని అంతర్జాల తెలుగు మాసపత్రిక, సిలికానాంధ్ర, archived from the original on 15 మార్చి 2016, retrieved 17 December 2014
  3. భక్తి టీవీలో గరికపాటి గురించి

మూలాలు