ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 54: పంక్తి 54:
==మూలాలు, వనరులు==
==మూలాలు, వనరులు==


'''[[కాశీయాత్ర చరిత్ర]]''' పుస్తకం రెండు ముద్రణలలో లభ్యమవుతున్నది.
'''[[కాశీయాత్ర చరిత్ర]]''' మొదటిసారి ముద్రింపబడినపుడు దానికి కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన పీఠిక వీరాస్వామయ్య గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం. మరియు గ్రంధంలో వీరాస్వామయ్య సమయానుచితంగా చెప్పన కొద్దిపాటి స్వవిషయాలు గమనించవచ్చును. ఆ ఇప్పుడు పుస్తకం రెండు ముద్రణలలో లభ్యమవుతున్నది.


* '''ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర''' -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది [[దిగవల్లి వేంకటశివరావు]] సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగనల్లి వేంకటశివరావు గ్రంధకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకంనుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.
* '''ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర''' -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది [[దిగవల్లి వేంకటశివరావు]] సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగనల్లి వేంకటశివరావు గ్రంధకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకంనుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.

08:06, 6 నవంబరు 2008 నాటి కూర్పు

ఏనుగుల వీరాస్వామయ్య (1780 - 1836) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధులు.


కాశీయాత్ర చరిత్ర మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, దిగవల్లి వేంకటశివరావు, ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంధాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.

బాల్యం

ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవత్స గోత్రంలో 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో వుండేది.


ఉద్యోగం

12 యేళ్ళకే వీరాస్వామయ్య ఆంగ్లం ధారాళంగా చదవడం నేర్చుకొన్నాడు. ఆ వయసులోనే "బోర్డ్ ఆఫ్ ట్రేడ్"లో "వాలంటీరు"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పటిలో ఇంగ్లీషు వేర్చుకొన్నవారు అధికంగా వాలంటీరుగానే చేరి, తమ శక్త్యనుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. అతి చిన్న వయసులోనే అతని ప్రతిభ చూసి పై అధికారులు అతనిని తమ వద్ద పనిచేయించుకోవాలని పోటీ పడేవారట. తెలుగు, తమిళ, ఇంగ్లోషు భాషలలో కూడా అతను మంచి ప్రభ సాధించి ఉండవచ్చును. 13వ యేట తిరునల్వేలి జిల్లా కలెక్టర్ ఆఫీసులో "ఇంటర్ప్రిటర్"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పట్లో కలెక్టర్ చాలా చాలా పెద్ద ఉద్యోగం. అంత చిన్నవయసులో కలెక్టర్ ఆఫీసులో చేరగలగడం వీరాస్వామయ్య ప్రతిభకు తార్కాణం.


రెండు సంవత్సరాల తరువాత వీరాస్వామయ్య చెన్నపట్నం చేరి అనేక వ్యాపార సంస్థలలో పనిచేసి బుక్‌కీపింగ్ లాంటి అనేక విద్యలలో నిపుణుడయ్యాడు. బోర్డ్ ఆఫ్ ట్రేడ్‌లో ఎకౌంటెంట్‌గా పని చేశాడు. ఈ సమయంలోనే సంస్కృతంలోను, జ్యోతిష్యం, ఖగోళం, స్మృతులు, పురాణాలు వంటి అనేక విషయాలలో పండితుడైనట్లున్నాడు. 15యేళ్ళ బాలుడు బాధ్యత గల ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతూ అంత శాస్త్రవిజ్ఞానం సంపాదించడం ఆశ్చర్యకరం. అతని ప్రతిభను గుర్తించి మద్రాసు సుప్రీం కోర్టువారు అతనికి "హెడ్ ఇంటర్ప్రిటర్" ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇది చాలా గొప్ప ఉద్యోగంగా భావింపబడేది. పాశ్చాత్య చట్టాలను, స్థానిక ధర్మ సంప్రదాయాలను, ఆచారాలను సమన్వయపరుస్తూ విచారణ జరపడానికి బ్రిటిష్ జడ్జీలకు ఇంటర్‌ప్రిటర్లు సహాయపడేవారు. క్రొత్త ఉద్యోగంలో చేరేముందు పాత సంస్థవారు అతనికి ఘనమైన వీడ్కోలు ఇస్తూ బంగారపు నశ్యపు డబ్బాను బహూకరించారు. అప్పటిలో బ్రిటష్ పాలనలో ఉన్న ప్రాంతాలలోని బలమైన చట్టాలవలన నెలకొన్న స్థిరత్వానికి, ఇతర పాలకుల ప్రాంతాలలో జరిగే అరాచకాలకు మధ్య భేదాన్ని వీరాస్వామయ్య యాత్రా చరిత్రలో స్పష్టంగా గమనించవచ్చును.


అప్పటికి కృష్ణా గోదావరి నదులపై ఆనకట్టలు కట్టలేదు. 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. ప్రజల ఆకలి తీర్చడానికి "గంజిదొడ్లు" (ఆహార సహాయ కేంద్రాలు) ఏర్పాటు చేశారు. అలాంటి గంజిగొడ్లదగ్గర ఒక తపస్విలా తన బాధ్యత నిర్వహించి వీరాస్వామయ్య వీలయినంతమందికి సహాయపడ్డాడు.


సర్ రాల్ఫు ఫాల్మరు దొరగారు ఆయనకు వ్రాసి యిచ్చిన టెష్టిమోనియల్ అనే యోగ్యతా పత్రికలో - అయన కోర్టులోనున్ను, చేంబరులోనున్ను, అలసట లేక బహునెమ్మదితో పనులు గడుపుచు వచ్చెననిన్ని, ఆయన తన గొప్ప వుద్యోగపు పనులను మిక్కిలి నమ్మకముగ జరిపించెననిన్ని, మరిన్ని ప్రజల మేలు కోరి స్మృతచంద్రిక మొదలైన పుస్తకములకు త్రాన్‌సులేషన్ చేసెననిన్ని, నేనెరిగినంతలో గనర్నమెంటువారి విశేష కృపకు యీ పురుషుడు పాత్రుడైనట్లు హిందు పెద్దమనుషులలో ఎవరున్ను ఎక్కువైనవారు లేరని నాకు తోచియున్నదనిన్ని వ్రాయబడియున్నది.

పాండిత్యం

ఆంగ్ల విద్య, పాశ్చాత్య విజ్ఞానాల అవుసరం వీరాస్వామయ్య బాగా గుర్తించాడు. అప్పటికి విశ్వవిద్యాలయాలు లేవు. కొద్దిపాటి కళాశాలలు కూడా లేవు. ఆ కాలంలోనే తన పలుకుబడితో "హిందూ లిటరరీ సొసైటీ" స్థాపించి వీరాస్వామయ్య ఆధునిక విద్యకు బాట వేశాడు. మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాలనే భావనకు ఈ చర్య పునాది వేసింది. (ఇదంతా లార్డ్ మెకాలేకు చాలా ముందుకాలం.)

అచ్చు పుస్తకాలు లేని ఆ కాలంలో వీరాస్వామయ్య సంపాదించిన పాండిత్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సందర్భానుసారంగా తన రచనలో అతను ఉదాహరించిన విషయాలు శృతి, స్మృతులపై అతని జ్ఞానాన్ని, అతని తార్కిక లక్షణాన్ని, సత్యశోధన పట్ల నిబద్ధతను తెలియజేస్తాయి. సౌరమాన చాంద్రమాన విధానాలలో అధిక క్షయ మాసాల గురించి అతని ఉపన్యాసాన్ని ఖగోళ శాస్త్ర విషయాల గురించిన పండిత సభలో హర్షించి పండితులు రత్నహారాన్ని బహూకరించారు. స్మృతులు, శృతులు ఎన్ని అన్న విషయంపై ధర్మ నిర్ణయం చేయవలసినదని అతని యాత్రా సమయంలో గయలో ఒక జడ్జి అతనిని కోరాడు. ఆ పండిత సభలో సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి, ఈ విషయంపై ఉన్న భిన్నాభిప్రాయాలను, నిశ్చయమైన ప్రమాణాలను, అఅస్పష్టతకు కారణాలను వివరించాడు. అతను ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించేవాడు.

వ్యక్తిత్వం, హోదా

కష్టాలు పడి, స్వయంకృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన వీరాస్వామి పండితుడు, వివేకవంతుడే కాక వినయశీలి. ఇంగ్లీషు దొరలవద్ద ఉద్యోగం చేస్తూ వారి అభిమానాన్ని చూరగొన్నాగాని తన మతం, సంప్రదాయం పట్ల తన భావాలను నిర్భయంగా ప్రకటించేవాడు. ఎంత పెద్ద దొరతోనైనా వాదానికి దిగి భిన్న మతతత్వాలకు సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేసేవాడు. అయినా వారి అభిమానాన్ని అతను నిలుపుకొన్నాడు.

ఉన్నత ఉద్యోగంలో తనకున్న విశేష స్థాయిని అతను ఎప్పుడూ చెప్పుకోలేదు. సందర్భానుసారంగా మాత్రమే మనం గ్రహించాలి. తన యాత్ర ఆరంభంలో అప్పటి విధానం ప్రకారం వీరాస్వామయ్య మద్రాసు దొరలనుండి "క్యారక్టర్లు" (ఇతర స్థలాలలో ఉండే అధికారులకు తనగురించిన పరిచయ పత్రాలు కావచ్చును) తీసుకొని వెళ్ళాడు. అవి చూసి దేశమంతటా దొరలు, సంస్థానాధీశులు వీరాస్వామయ్యను విశేషంగా మన్నించి అతని అవసరాలన్నీ సమకూర్చారు. గవర్నరు లాంటి హోదా ఉద్యోగులు కూడా అతనిని మన్నించారు. ఆ కాలంలో సంస్థానాధీశులకు మాత్రమే వారి పరివారం ఆయుధాలు ధరించడాని అనుమతి ఉండేది. అలాంటి సదుపాయం వీరాస్వామి పరివారానికి కలుగజేశారు. గంగను దాటే ముందు వీరాస్వామయ్య సామానులను తనిఖీ చేయాలని పట్టుబట్టిన కస్టమ్స్ ఉద్యోగిని ఆ పే కమిషనర్ వెంటనే డిస్మిస్ చేశాడు. అయితే అతనిని క్షమించమని వీరాస్వామయ్య కోరాడు.


తన యాత్ర తనకొక్కడికే పుణ్యవంతం కావాలని అతను కోరుకొనలేదు. నూరుమందికి పైగా ఉన్న తన పరిజనం చేత యాత్రాఫలసిద్ధికి కావలసిన విధులు, కర్మలు అన్నింటినీ చేయించాడు. దారిలో తన పరిజనానికి ఆయనే వైద్యుడు కూడాను. దారిలో అస్వస్థతకు గురైన నౌకర్లు కూడా యాత్రను పూర్తి చేయాలని స్థానికి కూలీల ద్వారా డోలీలు ఏర్పాటు చేయించాడు. ఆఖరికి స్థానికంగా తెచ్చుకొన్న తాత్కాలిక కూలీకి జ్వరమొస్తే అతనిని మోసుకెళ్ళడానికి మరో నలుగురు కూలీలను నియమించాడు. కాశీలో చలికాలంలో రక్షణ కోసం అందరికీ తగు వస్త్రాలు, నూనెలు కొని ఇచ్చాడు.


తన యాత్రా ఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోలేదు. నలభై బిందెల గంగాజలాన్ని పది బాడుగ గుర్రాలమీద చెన్నపట్నం పంపించే ఏర్పాటు చేయించాడు. అయినా ఆ జలం రవాణాకు ఏమయినా అంతరాయం కలుగుతుందేమోనని మరొక ఎనిమిది బిందెల తనవెంట రెండు బండ్లలో తీసుకొని వచ్చాడు. ఆ పుణ్య తీర్ధాన్ని మద్రాసులో ఇంటింటికి పంచాడు.


దానగుణానికి వీరాస్వామి పెట్టింది పేరు. తన శక్తికి మించిన దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాలను తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేశాడు. తనకెవరైనా కొంచెమైనా సహాయపడితే అది మరచిపోకుండా గుర్తుంచుకొని అంతకు ఎన్నోరెట్ల సహాయం చేసేవాడు. తన కూతురి వివాహానికి, బంధువుల ఆక్షేపణను లక్ష్యపెట్టుండా, సమస్త జాతులవారికి భోజనాలు ఏర్పాటు చేసెను. ఇంత ఖర్చు చేసేబదులు పిల్లదానికి కొంత ఆస్తి ఏర్పరుచవచ్చునుగదా అని బంధువులు ప్రశ్నించారు. చిన్నదాని పోషణ నిమిత్తము ద్రవ్యమును మనుష్యాధీనముగా నుంచుటకు బదులుగా ఈశ్వరుని చేతిలో భద్రంగా ఉంచుతున్నాని చెప్పాడు వీరాస్వామయ్య.

కాశీయాత్ర

కాశీయాత్ర చరిత్ర

మిత్రులు, సంస్థలు

బ్రౌను దొరతో లేఖలు

మూలాలు, వనరులు

కాశీయాత్ర చరిత్ర మొదటిసారి ముద్రింపబడినపుడు దానికి కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన పీఠిక వీరాస్వామయ్య గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం. మరియు గ్రంధంలో వీరాస్వామయ్య సమయానుచితంగా చెప్పన కొద్దిపాటి స్వవిషయాలు గమనించవచ్చును. ఆ ఇప్పుడు పుస్తకం రెండు ముద్రణలలో లభ్యమవుతున్నది.

  • ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది దిగవల్లి వేంకటశివరావు సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగనల్లి వేంకటశివరావు గ్రంధకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకంనుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.
  • కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య - ఇది 1992లో ముక్తేవి లక్ష్మణరావు చే సంక్షిప్తీకరింపబడిన ముద్రణ. 1992లో తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారిచే ప్రచురింపబడింది. ఇందులో పాతపుస్తకంలో ఉన్న విషయాలు ఆధారంగా సంపాదకుడు ముక్తేవి లక్ష్మణరావు వీరాస్వామయ్య జీవితం, కాలం గురించి సుదీర్ఘమైన వ్యాసం సంపాదకీయం వ్రాశాడు. మూల ప్రతిలో కొంత భాగాన్ని (ముఖ్యంగా ఉత్తరాది ప్రయాణంలో భాగాన్ని) వదలివేసి, తక్కిన భాగాన్ని మాత్రం ప్రచురించాడు. మూల ప్రతిలో ఉన్న తెలుగు అంకెలు స్థానే ప్రస్తుతం అధికంగా వినియోగంలో ఉన్న ఇంగ్లీషు అంకెలు వాడాడు.


ఈ వ్యాసంలో వీరాస్వామయ్య గురించిన విశేషాలు పై రెండు పుస్తకాలనుండి సేకరింపబడ్డవి.

బయటి లింకులు