సాక్షి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nkamatam (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 359654 ను రద్దు చేసారు
బొమ్మ అమరిక
పంక్తి 9: పంక్తి 9:
}}
}}

[[బొమ్మ:SAAKSHI_cinima_b&w.jpg|150px|left|thumb|సాక్షి సినిమాలో టైటిల్ పడినప్పడి దృశ్యం]]
బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణగాని, విజయనిర్మల గాని ప్రేక్షకులకి అంతగా తెలియదు. పైగా ఈ సినిమాలో వీరిద్దరూ ఏవిధమైన మేకప్ లేకుండా నటించారు.
బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణగాని, విజయనిర్మల గాని ప్రేక్షకులకి అంతగా తెలియదు. పైగా ఈ సినిమాలో వీరిద్దరూ ఏవిధమైన మేకప్ లేకుండా నటించారు.

17:34, 7 డిసెంబరు 2008 నాటి కూర్పు

సాక్షి
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
రాజబాబు,
విన్నకోట రామన్న పంతులు,
సాక్షి రంగారావు,
జగ్గారావు,
విజయలలిత
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీరమణ చిత్ర
భాష తెలుగు
దస్త్రం:SAAKSHI cinima b&w.jpg
సాక్షి సినిమాలో టైటిల్ పడినప్పడి దృశ్యం

బాపు దర్శకుడిగా తీసిన మొట్టమొదటి చిత్రం. ఈ చిత్రం తీసే సమయానికి కృష్ణగాని, విజయనిర్మల గాని ప్రేక్షకులకి అంతగా తెలియదు. పైగా ఈ సినిమాలో వీరిద్దరూ ఏవిధమైన మేకప్ లేకుండా నటించారు.

ఈ చిత్రం ఒక ప్రయోగాత్మక చిత్రమని చెప్పచ్చు. ఇటువంటి ప్రయోగాత్మక చిత్రాలు తెలుగు లో వచ్చినవి వేళ్ళతో లెక్కపెట్టవచ్చు. గ్రామీణ వాతావరణం, అక్కడి రాజకీయాలు, మనవ సహజమైన భయాలు, మనకెందుకొచ్చిన గొడవ అని ఎంతటి ఘోరాన్నైనా చూడనట్టుగా ఊరుకోవటం చక్కగా చిత్రీకరించారు. హీరో కృష్ణ బాపు దర్శకత్వంలో చక్కగా నటించాడు. ఆ పాత్రకి అతన్ని తప్ప ఇంకెవర్నీ తల్చుకోలేము. అలాగే విన్నకోట రామన్న పంతులు (కన్యాశుల్కం (సినిమా) లో అగ్నిహోత్రావధానులు), రాజబాబు కూడ చక్కటి నటనను కనబరిచారు. రంగారావు అనే నటుడు ఈ చిత్రంలో కరణం పాత్రను పోషించిన, సాక్షి రంగారావు గా ప్రసిద్ధికెక్కాడు.

కధ కొస్తే, గ్రామంలో పడవ నడిపేవాడు కృష్ణ. అతన్ని ప్రేమించే అమ్మాయిగా విజయ నిర్మల. ఊరి రౌడీ, లారీ డ్రైవరు జగ్గారావు. రౌడీ చేసిన హత్య చూసిన పడవ నడిపేవాడు న్యాయస్తానానికి వెళ్ళి సాక్ష్యం చెప్తాడు. రౌడీకి జైలు శిక్ష పడుతుంది. కాని రౌడీ జైలు నుంచి తప్పించుకుని వస్తున్నాడని తెలిసిన అప్పటిదాకా మెచ్చుకున్న ఊరి జనం, ప్రాణ భయంతొ ఉన్న పడవాడికి ఆశ్రయం ఇవ్వటానికి నిరాకరిస్తారు. ఇక రౌడీ చేతులో ఎట్టాగో చావు తప్పదని నిబ్బరం గా ఉన్న పడవ వాడు, రౌడీ వచ్చి తన్నటం మొదలు పెట్టేసరికి, భయంలోంచి వచ్చిన తప్పనిసరి ధైర్యంతో తాగి ఉన్న రౌడీని తన్ని చంపేస్తాడు.

ఆర్ధిక పరంగా విజయం సాధించపోయినప్పటికి, ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా మంచిపేరు తెచ్చుకున్నది.