రామానుజాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 36: పంక్తి 36:


ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి అందరికీ ఉపదేశిస్తారు.గురువు నీవు నరకానికి వెళతావేమో నని అంటే అందరూ స్వర్గానికి వెళతారని బదులిస్తారు.<ref>http://www.ramanuja.org/sv/bhakti/archives/jul95/0050.html</ref>
ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి అందరికీ ఉపదేశిస్తారు.గురువు నీవు నరకానికి వెళతావేమో నని అంటే అందరూ స్వర్గానికి వెళతారని బదులిస్తారు.<ref>http://www.ramanuja.org/sv/bhakti/archives/jul95/0050.html</ref>

==ఇతర మూలాలు మరియు వనరులు==

'''రామానుజాచార్యుల జీవిత చరిత్ర'''<br />
* Sri Ramanuja's Teachings in His Own Words, by M. Yamunacharya, published by Bharatiya Vidya Bhavan.
* The Theology of Ramanuja, by John B. Carman, published by Yale University Press, reprinted by Anantacharya Indological Institute, Bombay.<ref> http://www.ramanuja.org/sv/bhakti/archives/dec95/0005.html</ref>
* రామానుజాచార్యుల జీవిత చరిత్రకు సంబంధించిన మరి కొన్ని గ్రంథాలను ఇక్కడ పేర్కొన్నారు. <ref>http://www.ramanuja.org/sv/bhakti/archives/apr96/0083.html</ref>


==మూలాలు==
==మూలాలు==

11:59, 26 డిసెంబరు 2008 నాటి కూర్పు

రామానుజాచార్య(క్రీ.శ. 1017-1137 ) విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త ఆస్తిక హేతువాది , యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యులలొ ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిరాని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు రెండు:

  • మొదటిది, ప్రబలంగా కొనాసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.
  • రెండవది, ఆదిశంకరుని అద్వైత సిద్ధాంతంలోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి:

  • ప్రస్తుత సాంప్రదాయంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.
  • దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.
  • మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది సరో తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యం చేయవలసిన పనిలేదు.
  • ఒక పని వల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగా మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.


దేశకాల పరిస్థితులు

రామానుజుల జన్మసమయానికి దక్షిణభారతదేశాన ఉన్న రాజవంశాలు, వారి మతసంబంధిత రాజకీయాలను ఈ క్రింది విధంగా సంక్షిప్త పరచవచ్చు:

  • చోళులు - చోళులు శైవమత అనుచరులైనప్పటికీ, వైదికమత విధివిధానలను వ్యతిరేకించలేదు. చోళరాజ ప్రముఖులలో ఒకడైన రాజరాజ నరేంద్ర చోళుడే వైదికమతకర్మలను, వర్ణాశ్రమాలనూ, ప్రోత్సహించి, పలువు యఙయాగాదులు చేయించాడు. ఒకటవ కులోత్తుంగ చోళుడు కూడా ఎందరో వైదిక బ్రాహ్మణులను ఆదరించి, దానధర్మాలు చేశాడని చరిత్రలో రుజువులున్నాయి.[1]
  • చాళుక్యులు - చాళుక్యులు మొదటిలో శైవులైనప్పటికీ, రానురాను జైనమతాన్ని ఆదరించారని చరిత్ర చెబుతోంది. తూర్పు, పశ్చిమ చాళుక్య రాణులనేకమంది జైనమత ప్రభావానికి లోనై తమ రాజులను ఆ మతాన్ని ఆదరించేట్లుగా మార్చిఉన్నారని శిలాశాసనాలద్వారా తెలుస్తోంది. వెంగీ ప్రాంతాధిక్యతకై చోళ చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధాలలో అనేక మార్లు చోళులు చాళుక్య జైన ఆరామాలను, మందిరాలను ధ్వంసం చేశారని రుజువులున్నాయి.[2]
  • హోయసళ రాజులు - నేటి ఉత్తరకర్నాటక ప్రాంతాలైన బేలూరు, బాదామిలను రాజధానులుగా చేసికొని, కర్నాటక ప్రాంతాన్ని పరిపాలించిన హోయసళ రాజులు జైన, వీరశైవ మతాలను ఆదరించారు. బిత్తిదేవన్ లేక బిత్తిగ లేక విష్ణు అను పేరున్న హోయసళ రాజును రామానుజాచార్యుడు జైనమతానుసరణనుంచి వైష్ణవానికి మరల్చినట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి.[3]

ఇవియే కాక, ఈ క్రింది మతసంబంధిత విషయాలను కూడా మనసులో ఉంచుకోవటం వల్ల, రామానుజాచార్యుని జీవితాన్ని, ఆయన చేసిన సేవను మరింత హర్షించవచ్చు.

  • రామానుజుల కాలానికి మౌర్యరాజులు (ముఖ్యంగా అశోకుడు) ఆదరించిన బౌధ్ధమతం క్షీణదశలో ఉండినది. దీనికి ఆదిశంకరులవారి అద్వైతవేదాంతము కూడా కొంత కారణమైయుండవచ్చు.
  • రాజాదరణ పొంది ప్రాబల్యాన్ని పుంజుకొన్న జైన, శైవ మతాలు, స్థానిక ఆచారవ్యవహారాలతో కలసి అనేక శాఖలుగా విభజితమైనవి [4]. ఈ వేర్వేరు శాఖలు, వేర్వేరు సిధ్ధాంతాలను ప్రతిపాదిస్తూ, తమ తమ శాఖలే గొప్పవని ఉటంకిస్తూ, మూల ఉపనిషత్సారాన్ని ప్రజలకు అందించలేక పోయాయి.[5]
  • ఈ కాలంలో భక్తిమార్గానికి చాలా ప్రాబల్యం ఉండినది. భక్తిమార్గానికీ, విగ్రహారాధనకూ ఉన్న సంబంధంవలన పైన పేర్కొన్న రాజులందరూ, ఎన్నో దేవాలయాలు నిర్మించి, ఆ మార్గాన్ని ప్రోత్సహించటం జరిగింది. రాముడు, కృష్ణుడు, శివుడు (వేర్వేరు రూపాలలో) దేవుళ్ళుగా ఆరాధననందుకోవటం ఈ కాలం యొక్క విశిష్టమైన మతసంబంధిత మార్పుగా చెప్పుకోవచ్చు.[6]

జీవితకాల నిర్ణయం

సాంప్రదాయక జీవితచరిత్రకారుల ప్రకారం రామానుజాచార్యులు క్రీ.శ. 1017 - 1137 సంవత్సరాల మధ్య తమ జీవితాన్ని కొనసాగించారు. వీరి ప్రకారం ఆచార్యుల జీవితకాల వ్యవధి నూట ఇరవై సంవత్సరాలు (120 సం.). వంద సంవత్సరాలకు పైచిలుకు మనిషి బ్రతికే అవకాశం తక్కువ కనుక ఈ నూట ఇరవై సంవత్సరాల వ్యవధి కొంత అనుమానాస్పదమౌతుంది. సాంప్రదాయక ఆధారాల ప్రకారం రామానుజాచార్యులు తమిళ 'పింగళ' సంవత్సరంలో జన్మించి, మరో 'పింగళ' సంవత్సరంలో పరమపదించారు.[7] తమిళ కాలమానం ప్రకారం ఒకే పేరుగల సంవత్సరం మళ్ళీ రావటానికి అరవై సంవత్సరాల కాలం పడుతుంది. దీన్ని బట్టి మనం రామానుజాచార్యుల జీవితం అరవై లేక నూట ఇరవై సంవత్సరాలు ఉండవచ్చని భావించవచ్చు.

క్రీ.శ. 1917 లో టి.ఏ. గోపీనాథ్‌ గారు, సాంప్రదాయక మూలాల ఆధారంగా, రామానుజాచార్యులను శైవమతాధిక్యతను ఒప్పుకొనేందుకు బలవంతం చేసిన రాజును, ఒకటవ కులోత్తుంగ చోళునిగా గుర్తించి, ఆచార్యుల మేలుకోట ప్రవాసం క్రీ.శ. 1079 - 1126 ప్రాంతంలో జరిగినట్టుగా అనుమానించారు. ప్రవాస కాలం నలభై ఏడు సంవత్సరాలు కావటం, ఒకటవ కులోత్తుంగ చోళుడు వైష్ణవమత ద్వేషి కాకపోగా వైదికమత ఆదరణలో భాగంగా ఎన్నో దానాలను చేసినట్టుగా చారిత్రక ఆధారాలుండటం, ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపాలని చెప్పుకోవచ్చు.

టి.యన్. సుబ్రమణియన్ అనే మద్రాసు ప్రభుత్వ ఉద్యోగి, 'రామానుజార్య దివ్య చరితై' అనే తమిళ సాంప్రదాయక జీవితచరిత్రలో ఉల్లేఖించిన శ్రీభాష్య రచనా సమాప్తి కాలం (క్రీ.శ. 1155-1156) ప్రకారం, రామానుజుల జీవితకాలం క్రీ.శ. 1077 - 1157 మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఈ జీవితకాలం 80 సంవత్సరాలు కావటం, వైష్ణవ ద్వేషి ఐన రెండవ కులోత్తుంగ చోళుడు ఇదే సమయంలో రాజ్యమేలటం, ఈ అంచనా సరియైనదేననటానికి రుజువులుగా చెప్పుకోవచ్చు. 'విష్ణువర్ధనుడు' అనే పేరు గల హోయసళ రాజు (హోయసళ రాజులు) ఇదే సమయంలో కర్నాటక ప్రాంతాన్ని పరిపాలించటం కూడా గమనించదగ్గ విషయం(ఇతడే పైన చెప్పుకొన్న భిత్తిగ దేవుడు అయి ఉండవచ్చు). ఐతే దేవాలయ శిలాశాసనాలు, రామానుజాచార్యుడు మరియు అతని శిష్యులు మేలుకోటలో క్రీ.శ. 1137 కు ముందే నివాసమున్నట్లు తెలుపుతుండటం ఈ జీవితకాల నిర్ణయానికి ఆక్షేపంగా చెప్పుకోవచ్చు.

జన్మవృత్తాంతం

రామానుజాచార్యుడు మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరంబదూరులో ఒక వైదిక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు ఆసూరి సర్వాకృతు కేశవ సోమయాజి దీక్షితార్ మరియు కాంతిమతి.

ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి అందరికీ ఉపదేశిస్తారు.గురువు నీవు నరకానికి వెళతావేమో నని అంటే అందరూ స్వర్గానికి వెళతారని బదులిస్తారు.[8]

ఇతర మూలాలు మరియు వనరులు

రామానుజాచార్యుల జీవిత చరిత్ర

  • Sri Ramanuja's Teachings in His Own Words, by M. Yamunacharya, published by Bharatiya Vidya Bhavan.
  • The Theology of Ramanuja, by John B. Carman, published by Yale University Press, reprinted by Anantacharya Indological Institute, Bombay.[9]
  • రామానుజాచార్యుల జీవిత చరిత్రకు సంబంధించిన మరి కొన్ని గ్రంథాలను ఇక్కడ పేర్కొన్నారు. [10]

మూలాలు

  1. Hanumantha Rao, B.S.L, Aandhrula Charitra, Vishaalaandhra Publications, 2005
  2. ibid., page(?)
  3. Smith, Vincent, The Oxford Student's History of India (15th Ed), Oxford University Press, London, 1954, page#85
  4. Hanumantha Rao, B.S.L., op.cit., page(?)
  5. Eliot, Sir Charles, Hinduism and Buddhism: A Historical Sketch, Routeledge and Kegan Paul Ltd., London, 1921, Volume II, Chapter 29: Vishnuism in South India, Page#234, http://www.gutenberg.org/files/16546/16546-h/16546-h.htm#CHAPTER_XXIX
  6. ibid., Volume I, Chapter 8, http://www.gutenberg.org/files/15255/15255-h/15255-h.htm#page_xxxiii
  7. http://sriranganatha.tripod.com/id47.html
  8. http://www.ramanuja.org/sv/bhakti/archives/jul95/0050.html
  9. http://www.ramanuja.org/sv/bhakti/archives/dec95/0005.html
  10. http://www.ramanuja.org/sv/bhakti/archives/apr96/0083.html