వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 12: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రకాంతరావుగారి అనుచిత వ్యాఖ్యలు-ఫిర్యాదు
సత్యాగారికి మనవి
పంక్తి 30: పంక్తి 30:


==ఫిర్యాదు==
==ఫిర్యాదు==

కాసుబాబుగారూ, మీరు వ్రాసిన "లైట్‌గా తీసుకకోండి" అన్న వ్యాఖ్య బాగానే ఉన్నది. ఈ మాట మీరు నాలాంటి సామాన్య సభ్యునికి చెపుతున్నారు. కానీ నేను విషయాన్ని మూడవ వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళి వివరణలు కోరుతుండగా(ఆ వివరణలో భాగంగా ఆ వివరణలు అడగవలసిన అవసరం కలిగించిన వ్యక్తి '''దయచేసి''' కలుగ చేసుకోవద్దని వ్రాసినప్పటికీ), నిర్వాహకుడైన ఈ వ్యక్తి తన సంయమనం కోల్పోయి ఇటువంటి (ఈ క్రింద కాపీ చేశాను)వ్యాఖ్యలు చెయ్యటం భావ్యమేనా. నిర్వాహకుడైన వారికి ఓర్పు, పరిణితి మరియు ముఖ్యంగా '''సంయమనం''' ముఖ్యం. వీరి వ్యాఖ్యలలో తెలిసిపోతొంది నన్ను కావాలని "నువ్వు" అని సంభోదించినట్టుగా.
సత్యాగారూ, నమస్తే. కాసుబాబుగారి చర్చాపుటలో ఈ క్రింది ఫిర్యాదు వ్రాశాను. దయచేసి, మీరు ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ లో పాలు పంచుకోమని మనవి.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 18:11, 29 ఏప్రిల్ 2009 (UTC)

కాసుబాబుగారూ, మీరు వ్రాసిన "లైట్‌గా తీసుకోండి" అన్న వ్యాఖ్య బాగానే ఉన్నది. ఈ మాట మీరు నాలాంటి సామాన్య సభ్యునికి చెపుతున్నారు. కానీ నేను విషయాన్ని మూడవ వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళి వివరణలు కోరుతుండగా(ఆ వివరణలో భాగంగా ఆ వివరణలు అడగవలసిన అవసరం కలిగించిన వ్యక్తి '''దయచేసి''' కలుగ చేసుకోవద్దని వ్రాసినప్పటికీ), నిర్వాహకుడైన ఈ వ్యక్తి తన సంయమనం కోల్పోయి ఇటువంటి (ఈ క్రింద కాపీ చేశాను)వ్యాఖ్యలు చెయ్యటం భావ్యమేనా. నిర్వాహకుడైన వారికి ఓర్పు, పరిణితి మరియు ముఖ్యంగా '''సంయమనం''' ముఖ్యం. వీరి వ్యాఖ్యలలో తెలిసిపోతొంది నన్ను కావాలని "నువ్వు" అని సంభోదించినట్టుగా.
చంద్రకాతరావుగారి వ్యాఖ్యల కాపి ఈ కింద ఇవ్వబడినది
చంద్రకాతరావుగారి వ్యాఖ్యల కాపి ఈ కింద ఇవ్వబడినది
ఏమిటీ దాష్టీకం, పిడివాదం
ఏమిటీ దాష్టీకం, పిడివాదం
పంక్తి 50: పంక్తి 53:
నేను కూడ ఘాటుగా స్పందించగలను, కానీ నేనుకూడ నా సంయమనాన్ని కోల్పోతే సరికాదు అన్న విషయాన్ని తెలిసినవాడినై,ఈ విషయంలో నేను వివరణలుగా కోరిన విషయాలను, మరియు నేను పైన ఉదహరించిన విషయాలను నా ఫిర్యాదుగా తీసుకుని, పైన కాపీ చేయబడిన చంద్రకాతరావుగారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారి మీద తగిన చర్య తీసుకొనమని కోరుతున్నాను. ఇదే విషయం వైజా సత్యగారి చర్చా పుటలో కూడ వ్రాస్తున్నాను. ఈ dispute resolution ప్రక్రియ జరుగుతుండగా, శ్రీ చంద్రకాంతరావుగారిని ఈ విషయం మీద ఎక్కడా కూడ వ్యాఖ్యలు చెయ్యకుండా (డిస్ప్యూట్ రిజల్యూషన్ లో భాగంగా తప్పితే) కట్టడి చెయ్యమని మనవి, భరించలేకుండా ఉన్నాను వారి అనుచిత వ్యాఖ్యల భాష.
నేను కూడ ఘాటుగా స్పందించగలను, కానీ నేనుకూడ నా సంయమనాన్ని కోల్పోతే సరికాదు అన్న విషయాన్ని తెలిసినవాడినై,ఈ విషయంలో నేను వివరణలుగా కోరిన విషయాలను, మరియు నేను పైన ఉదహరించిన విషయాలను నా ఫిర్యాదుగా తీసుకుని, పైన కాపీ చేయబడిన చంద్రకాతరావుగారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారి మీద తగిన చర్య తీసుకొనమని కోరుతున్నాను. ఇదే విషయం వైజా సత్యగారి చర్చా పుటలో కూడ వ్రాస్తున్నాను. ఈ dispute resolution ప్రక్రియ జరుగుతుండగా, శ్రీ చంద్రకాంతరావుగారిని ఈ విషయం మీద ఎక్కడా కూడ వ్యాఖ్యలు చెయ్యకుండా (డిస్ప్యూట్ రిజల్యూషన్ లో భాగంగా తప్పితే) కట్టడి చెయ్యమని మనవి, భరించలేకుండా ఉన్నాను వారి అనుచిత వ్యాఖ్యల భాష.


నాకు సాహిత్యం మీద ఉన్న అభిరుచి నన్ను వికేలోకి ఆకర్షించింది. అమరావతి కథలు, చందమామ వ్యాసం విస్తరణ, ఇల్లాలి ముచ్చట్లు, చలం వ్యాసం విస్తరణ, కార్టూనిస్టుల మీద వ్యాస పరంపర వ్రాశాను, ఇప్పటివరకు రెండు పతకాలను సంపాయించుకున్నాను. అటువంటి వికీ లో నేను ఇటువంటి ఫిర్యాదు వ్రాయవలసి రావటం దురదృష్టకరం.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 17:58, 29 ఏప్రిల్ 2009 (UTC)
నాకు సాహిత్యం మీద ఉన్న అభిరుచి నన్ను వికేలోకి ఆకర్షించింది. అమరావతి కథలు, చందమామ వ్యాసం విస్తరణ, ఇల్లాలి ముచ్చట్లు, చలం వ్యాసం విస్తరణ, కార్టూనిస్టుల మీద వ్యాస పరంపర వ్రాశాను, ఇప్పటివరకు రెండు పతకాలను సంపాయించుకున్నాను. అటువంటి వికీ లో నేను ఇటువంటి ఫిర్యాదు వ్రాయవలసి రావటం దురదృష్టకరం.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 17:58, 29 ఏప్రిల్ 2009 (UTC)



==కార్టూనిస్ట్‌ల మీద వ్యాసాలు==
==కార్టూనిస్ట్‌ల మీద వ్యాసాలు==

18:11, 29 ఏప్రిల్ 2009 నాటి కూర్పు


కొత్త సందేశాలను పేజీలో క్రింది భాగాన వ్రాయండి. నెనర్లు :)

సత్యాగారూ! నమస్తే. మధ్యలో కలగచేసుకుని సద్ది చెప్పినందుకు ధన్యవాదములు. ఒక పరిణితి చెందిన నిర్వాహకునిగా మంచి పాత్ర నిర్వహించారు. కొన్ని కొన్ని మాటలు ఆవతలి వారు ఎందుకన్నది తెలియదు, మనం వాటిని అర్ధం చేసుకోవచ్చును లేదా అపార్ధం చేసుకొనవచ్చును. చంద్రకాంతరావు గారు "సబ్యత" వంటి మాటలు వాడేసరికి కొంత కోపం వచ్చిన మాట నిజం. OK ఇక ఈ విషయం సాగతీయదలుచుకోలేదు. వారి చర్చా పేజీలోకూడ నా స్పందన వ్రాసి విషయం ముగించాను. ఇక ఇక్కడ బెంగుళూరులో ఇంకా పూర్తిగా స్థిరపడలేదు. మరి కొన్ని రోజులలో ఇంటర్‌నెట్ కనెక్షన్ రావచ్చును. మళ్ళీ చురుకుగా రచనలు/దిద్దుబాట్లు చెయ్యలనే ఉన్నది. మరొక్కసారి మీకు ధన్యవాదములతో శలవు.--S I V A 10:10, 4 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సహృదయంతో అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు --వైజాసత్య 16:31, 8 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వివరణల అవసరం

వైజా సత్యగారూ నమస్తే. చాలా కాలం తరువాత మళ్ళీ ఇంటినుండి వికీలో వ్రాయగలుగుతున్నాను. నేను వికీలోకి వచ్చిన తరువాత మీరు మరియు కాసుబాబుగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. మీరిచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను అనేక వ్యాసాలు, దిద్దుబాట్లు చెయ్యగలిగాను, చెయ్యటానికి ఉత్సాహం వచ్చింది. కాని, ఈ మధ్య జరిగిన (అతి చిన్న విషయం మీద)జరిగిన సంఘటన(ఎంత కాదని మర్చిపోదామన్నా) చాలా చీకాకు పరుస్తున్నది, మళ్ళీ వ్రాయటానికి మనస్కరించటంలేదు. అందువలన దయచేసి, నాకు కొన్ని వివరణలు ఇవ్వగలరా.

  1. ఈ వారం బొమ్మగా ఒక బొమ్మను పెట్టటానికి ఎన్ని రోజులు, గంటలు,నిమిషాలు, సెకండ్లు వేచి చూడాలి లేదా వ్యవధి ఉండి తీరాలి. అలాంటి నియమం గనుక ఉంటే ఆ నియమం ఆ పుటలోనే ఎందుకు పొందుపరచలేదు. ఆపైన ఈ పని నిర్వాహకులే చెయ్యనక్కర్లేదు, సభ్యులెవరైనా చొరవగా చెయ్యచ్చు అని ఎందుకు వ్రాశారు.
  2. వెరొకరి చర్చా పుటలో మరొక సభ్యుడు వ్యాఖ్య వ్రాసేప్పుడు, ఇక్కడే వ్రాయాలని (కిందనే) అని నియమేమన్నా ఉన్నదా? ఉంటే ఆ నియమం ఎక్కడ వ్రాసి ఉన్నది?
  3. నేను పైన ఉదహరించిన వాటిగురించి లిఖిత నియమాలు లేక పోతే,ఎవరైనా సభ్యుడుగాని, నిర్వాహకుడుగాని లేని నియమాన్ని ఉదహరిస్తే సామాన్య సభ్యుని పరిస్థితి ఏమిటి.
  4. ఏదైనా విషయం గురించి ఇతర సభ్యులు వ్రాయదలచుకొన్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన చర్చా పుటలో కాకుండా, నేరుగా ఆ సభ్యుని చర్చా పుటలో వ్రాయవచ్చునా లేక నిర్వాహకులకు అటువంటి ప్రత్యేక అధికారాలు ఏమన్న ఉన్నాయా. ఉంటే, వికీ నియమాలలో ఎక్కడ ఉన్నాయి.
  5. విషయానికి సంబంధించిన చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్య, నాకు సంబంధించిన చర్చా పుటలో వ్రాస్తే, ఆ వ్యాఖ్య నా చర్చా పుటలో నేను అనవసరం అని బావిస్తే ఆ మాటే వ్రాసి నేను తొలగించకూడదా
  6. చిన్న అభిప్రాయ భేదం వస్తే నిర్వాహకుడైనవారు(ఆ సభ్యునితో ఏమాత్రం చనువు లేని), సభ్యుని వెంటనే "నువ్వు" "నీవు" అని సంభొదించవచ్చునా(మనం వ్యాసాలలో ఎంత గొప్పవారి గురించైనా అతను అని వ్రాయటానికి ఈ విషయం ఒకే గాటన కట్టలేమని నా మనవి), ఒక చిన్న విషయానికి "సభ్యత" వంటి మాటలు వ్రాయవచ్చా.

నేను ఈ వివరణలు అడగటానికి కారణం, భవిష్యత్తులో నేను గాని, ఇతర నాలాంటి సామాన్య సభ్యులెవరైనా గాని, ధాష్టీకానికి, పిడివాదానికి గురికాకుండా ఉండాలని మాత్రమే.

ఈ విషయాలకు మీరు గాని, కాసుబాబుగారుగాని (వారి చర్చా పుటలో కూడ ఈ వ్యాఖ్యని కాపీ చేస్తున్నాను) నాకు వివరించగలరు. ఈ వ్యాఖ్యలు నేను వ్రాయటానికి పురికొల్పిన సంఘటనకు కారణమైన వారు దయచేసి కలుగ చేసుకొనవద్దు--S I V A 03:05, 26 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో చాలా నియమాలు అభివృద్ధి క్రమబద్దీకరించడానికి అభివృద్ధి చెందుతున్న కొద్ది ఏర్పరచుకొన్నవే. మీకో చిన్న ఉదాహరణ ఇస్తాను ఒక ఊళ్లో ఒక కాలిబాట ఉందనుకోండి అందులో ఎవరిష్టం వచ్చినట్టు వస్తూ వెళుతూ ఉంటారు. అప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లు, రైట్ అఫ్ వేలు, ఏడమవైపునే నడవటాలు ఇవన్నీ ఉండవు. కానీ ఆ కాలిబాటలో రద్దీ ఎక్కువై అది అభివృద్ధి చెందే కొద్ది కాస్త ఆ విషయం ఆలోచన చేసిన వ్యక్తి వచ్చి బాటలో నడిచేవాళ్లందరూ ఎడమవైపున నడుస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అంటాడు. చాలామంది ఏదో ఒక పద్ధతి బాగానే ఉంది అనుకుని ఆయన చెప్పింది పాటించడం మెదలెడతారు. అదే కాలక్రమంలో మరింత ధృడమై ఒక నియమం అవుతుంది. అలా ఏర్పడే తొలి దశలోనే కొందరు ఎడమ వైపు ఎందుకు నడవాలి కుడివైపున నడిస్తే ఏం పోయింది అని ప్రశించవచ్చు. నష్టమేం లేదు అలాగే నిక్షేపంగా నడవవచ్చు. అలా నియమాలు ఏర్పడే ముందస్తుగా కొంత ఇబ్బంది ఎదురౌతుంది దానికి అనుగుణంగానే కాస్త ఇలా చేస్తే బాగుంటుందేమో ఎవరో ఒకరు ముందుకొచ్చి ప్రతిపాదిస్తారు.
ఇక అసలు విషయానికొస్తే బొమ్మ చేర్చిన ఎన్ని ఘడియలు, విఘడియలకు అది ఈ వారం బొమ్మగా పెట్టగలమో ఇప్పటివరకు తెలుగు వికీలో నియమమేమి లేదు. ఇక్కడ చిన్న ఇబ్బంది ఎదురైంది కాబట్టి ఇప్పుడే మనం కలిసి ఒక నియమం సృష్టిద్దాం. ఒక బొమ్మను ఈ వారం బొమ్మగా పెట్టే ముందు దాన్ని ఈ వారం బొమ్మ పరిగణన అన్న మూస తగిలించి దిన్నీ మొదటి పేజీలో పెట్టాలనుకుంటున్నాం అని తెలియజేయటం కొన్నాళ్ళుగా నడిస్తున్న సంప్రదాయామే. అది కొత్తేమీ కాదు. అలా చేయటం వలన అది ప్రదర్శించడానికి ఇతర సభ్యులకేమైనా అభ్యంతరాలు కానీ ఇతర చర్చలు కానీ చేయటానికి కొంత సమయం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఈ వారం బొమ్మ పరిగణన మూస అంటించిన తర్వాత కనీసం ఒక నెల రోజులైనా ఆగి దాన్ని మొదటి పేజీలో ప్రదర్శిస్తే బాగుంటుంది. మీరు ప్రదర్శించాలనుకున్న బొమ్మకు ఎవరూ అభ్యంతరపెడతారని కాదు, ఒక పద్ధతి కోసమని అంతే. మీకు ఇతర సూచనలు, ఇతర పద్ధతులు కానీ తొచితే అలాగే చేద్దాం.
ఎవరైనా ఒక పద్ధతిని ప్రతిపాదిస్తే కాలిబాట విషయంలో జరిగినట్టు మొదట ఆ పద్ధతినే ఎందుకు పాటించాలి అని కొంతమందికి అనిపించవచ్చు. అది సహజం. ఎడమవైపే వెళ్ళాలని ప్రతిపాదించిన వ్యక్తిని అలానే ఎందుకు చేయాలో అడిగి తెలుసుకోవచ్చు. అది నచ్చకపోతే ప్రత్యామ్నాయ పద్ధతిని మీరూ ప్రతిపాదించవచ్చు. నియయాలు చేయటానికి నిర్వాహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. చాలా మందికి సభ్యులకు ఏది సబబుగా అనిపిస్తే అదే నియమమౌతుంది. ఉదాహరణకు నాతో పాటు కొందరు నిర్వాహకులు, సభ్యులకు తెవికీ వ్యాసాల్లో ఏకవచనమే ఉపయోగిస్తే బాగుంటుందని అనిపించింది. దాన్ని రచ్చబండలో చర్చించాం. ఆ నియమానికి మద్దతుగా కొన్ని విషయాలను సేకరించి నేను ఒక నియమపు పేజీ వ్రాశాను. రాజశేఖర్ గారితో పాటు కొందరు సభ్యులకు ఆ నియమాన్ని పాటించడం సబబుగా అనిపించలేదు. అందుకే ఆయన వ్రాసేవి ఆయన బహువచనంలోనూ, నేను వ్రాసేవి ఏకవచనంలోనూ ఉంటాయి. చివరకు ఏ పద్ధతి ఎక్కువమంది సభ్యులు పాటిస్తే అదే నెగ్గుతుంది. ఇలాంటి పద్ధతుల్లో తేడా ఉన్నా అందరం కలిసి పనిచేయటానికి ఏనాడూ అడ్డురాలేదు. అయితే మీరు ప్రత్యామ్నాయ పద్ధతిని ప్రతిపాదిస్తే దాన్ని గల కారణాలు వివరిస్తే చాలా మంది సభ్యులు ఆ పద్ధతి ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
క్రిందనే వ్రాయాలని నియమేమీ లేదు. అదో ఆనవాయితీ మాత్రమే. కొత్త సందేశం వచ్చిందనగానే వెతుక్కోకుండా క్రిందనే ఉంటుందనే ఒక సౌకర్యం. ఆంగ్ల వికీలో నియమంగా ఉందో లేదో కానీ మర్యాదపూర్వకంగా పాటిస్తుంటారు. మీరు పైనే ఎందుకు వ్రాయాలో అని వివరించండి అది బాగుందనుకుంటే అలాగే వ్రాద్దాం ( కాలిబాట ఉదాహారణ లాగా కుడో, ఎడమో ఏదో ఒకటి పద్ధతుంటే బాగుంటుంది). చంద్రకాంతరావు ఇప్పటివరకు ఉపయోగంలో ఉన్న పద్ధతి చెప్పారంతే. నిజానికి వికీలో ఖచ్చితంగా అమలుపరచే నియమాలు ఐదే ఉన్నాయి. మిగిలినవి మార్గదర్శకాలు మాత్రమే.
ఒక వ్యాసం గురించి చర్చను సాధారణంగా ఆ వ్యాసం చర్చా పేజీలోనూ, వెంటనే దానికి సంబంధించిన సభ్యులు కూడా చూడాలనుకుంటే ఆ సభ్యుల చర్చా పేజీల్లోనూ వ్రాస్తారు. ఇది కూడా ఒక పద్ధతి మాత్రమే.
చర్చా పేజీలలో విషయం ఆ సభ్యుని చెందుతుందా, వికీకి చెందుతుందా అన్ని విషయం ఆంగ్ల వికీలో సుదీర్ఘమైన తాత్విక చింతన జరిగింది. దాని పర్యవసానంగా సభ్యుల చర్చాపేజీలను వారు తొలగించమని అడిగినా పూర్తిగా తొలగించకూడదని నిర్ణయం తీసుకున్నారు. తెవికీలో దీని గురించి చర్చించలేదు కానీ, చర్చా పేజీలను తొలగించడం అంతమంచి పద్ధతి కాదు. దానికి అనేక హేతువులున్నాయి. అవి తర్వాత వ్రాస్తాను. మీరు పైన వ్రాసిన పద్ధతులలో ఏదో ఒక పద్ధతిని అవలంబిగలరనుకుంటే ఇది మొదటిది కావాలని నా కోరిక.
నువ్వు, మీరు అన్నదాని గురించి నేను చర్చించలేను. అది మీ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. రాయలసీమలోనూ, తెలంగాణలోనూ నువ్వు అనటం పెద్ద అగౌరవసూచకంగా భావించరు అని మాత్రం చెప్పగలను. వికీ చాలా ప్రత్యక్ష మాధ్యమం కాబట్టి అవతలి వ్యక్తికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి వదిలెయ్యండి. ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగానో, ఫోన్లోనో అయితే రెండు నిమిషాల్లో అనుకున్నదనుకున్నట్టు వివరంచగలిగి ఉండేవాడిని అయితే ఒక పేజీ మొత్తం టకటకలాడించినా మీకు సరైన అర్ధంలో స్ఫురిస్తుందో లేదో తెలియదు. చంద్రకాంతరావు గారు ఇప్పటిదాకా ఉన్న పద్ధతులను వివరించే ప్రయత్నం చేశారనుకుంటాను. అది ఆ స్పిరిట్ తోనే తీసుకొని వదిలెయ్యండి.
చివరిమాటగా వికీలో పట్టూ విడుపూ రెండూ ఉంటాయి. అందరూ ఎవరి పద్ధతిని వారు వెళితే ఇది హైదరాబాదు రోడ్డవుతుంది. కానీ మార్గదర్శకాలు చేయటానికి, వాటిని ప్రభావితం చేయటానికి ప్రతి సభ్యునికి అధికారం ఉంది. నిర్వహకులకు ప్రత్యేక అధికారమేమీ లేదు. వికీ పద్ధతులలో అనుభవమున్న వాళ్ళు కొత్తవాళ్లకు మార్గదర్శకం చేస్తూ ఉండటం సాధారణమే దానికి నిర్వాహకుడే కానక్కర్లేదు.

వైజాసత్య 04:25, 26 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఫిర్యాదు

సత్యాగారూ, నమస్తే. కాసుబాబుగారి చర్చాపుటలో ఈ క్రింది ఫిర్యాదు వ్రాశాను. దయచేసి, మీరు ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ లో పాలు పంచుకోమని మనవి.--S I V A 18:11, 29 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారూ, మీరు వ్రాసిన "లైట్‌గా తీసుకోండి" అన్న వ్యాఖ్య బాగానే ఉన్నది. ఈ మాట మీరు నాలాంటి సామాన్య సభ్యునికి చెపుతున్నారు. కానీ నేను విషయాన్ని మూడవ వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళి వివరణలు కోరుతుండగా(ఆ వివరణలో భాగంగా ఆ వివరణలు అడగవలసిన అవసరం కలిగించిన వ్యక్తి దయచేసి కలుగ చేసుకోవద్దని వ్రాసినప్పటికీ), నిర్వాహకుడైన ఈ వ్యక్తి తన సంయమనం కోల్పోయి ఇటువంటి (ఈ క్రింద కాపీ చేశాను)వ్యాఖ్యలు చెయ్యటం భావ్యమేనా. నిర్వాహకుడైన వారికి ఓర్పు, పరిణితి మరియు ముఖ్యంగా సంయమనం ముఖ్యం. వీరి వ్యాఖ్యలలో తెలిసిపోతొంది నన్ను కావాలని "నువ్వు" అని సంభోదించినట్టుగా. చంద్రకాతరావుగారి వ్యాఖ్యల కాపి ఈ కింద ఇవ్వబడినది ఏమిటీ దాష్టీకం, పిడివాదం సభ్యులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చేష్టలు చేయడం ఇంకా మానలేవా? చిన్న విషయానికి అనవసరంగా రెచ్చగొట్టి ఇంతవరకు లాగి, సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తున్న నీ అసలు ఉద్దేశ్యం ఏమిటి? తెవికీ పాలసీలు, నియమాలు, సంప్రదాయాలు గురించి తెలియకుంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలిపిన సభ్యుల వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించడం ఏమిటి? "సామాన్య సభ్యుల దాష్టీకం, పిడివాదం" అంటూ పెద్ద పెద్ద పదాలను ఉపయోగిస్తున్నావు, తెవికీలో కొత్త సభ్యులకు కూడా ఎన్నో విషయాలు చెప్పాను, వారు సంతోషంగా నా వ్యాఖ్యలను స్వీకరించారే కాని నీలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేరు. నాచే "నువ్వు" అని అనిపించుకున్న సభ్యులలో నీవు రెండో వాడివి. సాధారణంగా నేనెవరికీ వ్యక్తిగతంగా విమర్శించను గౌరవంగానే చూస్తాను. ఇది తెవికీలో అందరికీ తెలుసు, నాకు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకొనేది లేదు, ఈ సంగతి కూడా అందరికీ తెలుసు. తెవికీలో ఎవరికి వారు తమకు నచ్చిన పద్దతులు పాటించడం కాదు, అమలులో ఉన్న పద్దతులనే పాటించాల్సి ఉంటుంది. ప్రవేశించిన కొత్త సభ్యులు ఒక్కక్కరు ఒక్కో పద్దతి పాటిస్తే తెవికీ గమ్యం తప్పుతుంది. అనవసరపు ప్రశ్నలు అడిగి చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నావు. అసలు ప్రశ్నలు నా వద్ద ఉన్నాయి. పరిస్థితిని బట్టి మునుముందు వెల్లడిస్తా. -- C.Chandra Kanth Rao-చర్చ 20:47, 26 ఏప్రిల్ 2009 (UTC)

"http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Vu3ktb" నుండి వెలికితీశారు


ఇంతవరకు జరిగిన సంఘటనలు

  • నేను ఒక మంచి బొమ్మను(ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన కార్టూన్ పాత్ర సామాన్యవ్యక్తి విగ్రహం) వికీలోకి ఎక్కించి, నలుగురికీ బాగా తెలియాలన్న సంకల్పంతో, వెంటనే ఈ వారపు బొమ్మ మూస తగిలించి, అప్పటికే ఉన్న బొమ్మల వరసలో చివరగా ఉంచాను. నేనేమి ఉన్న వరుస చెదర్చలేదు, ఈ బొమ్మకు ప్రాధాన్యమిచ్చి ఇతర బొమ్మలను వెనుకకు తొయ్యలేదు. ఒక నిర్వాహకుల వారు, ఈ బొమ్మ ఏమిటి? బొమ్మ ప్రాశస్త్యమేమిటి? అన్న విషయాలను అసలు పరిగణలోకి తీసుకోకుండా ఈ వారపు బొమ్మ పుటలో లేని నియమాలను ఉట్టంగిస్తూ బొమ్మ ను ఈ వారపు బొమ్మల వరుసలోనుండి తొలగించారు. ఆపైన ఆ బొమ్మ చర్చా పుటలో వ్రాయవలసిన వ్యాఖ్యను నా చర్చా పుటలో వ్రాశారు. అటువంటి వ్యాఖ్య నా చర్చా పేజీలో ఉండటం అనవసరం అని తోచి, అదే మాట వ్రాసి తొలగించాను.
  • దీనికి ఈ నిర్వాహకులవారు మళ్ళీ నా చర్చా పుటలో "ఇది సభ్యత కాదు" అన్న హెడ్డింగు పెట్టి ఎమేమో వ్రాసి తన అక్కస్సును వెళ్ళగక్కారు. ఇంత చిన్న విషయానిమి సభ్యత వంటి మాటలు వ్రాసి ఆవతలి వారిని క్యారెక్టర్ అస్సాసినేషన్ చేయటం భావ్యం కాదని తలచి, నేను ఆ నిర్వాహకుని పుటలో హెడ్‌మాస్టర్ లాగ ప్రవర్తించవద్దని, సభ్యులను నిరుత్సాహపరచవద్దని నా వ్యాఖ్యలు వ్రాశాను. దానికి వారుకూడ తన చర్యలను సమర్ధించుకుంటూ తాను వ్రాయగలిగినది వ్రాశారు. నేనుకూడ సామరస్యపూర్వకంగ స్పందిస్తూ విషయాన్ని ముగించాను.
  • ఈలోగా దేవాగారు, ఈ నిర్వాహకులవారి చర్చాపుటలో సహనం పాటించమని వారిని కోరుతూ రెండు వ్యాక్యాలువ్రాస్తే, దానికి వీరు దాదాపు పేజీడు వ్యాఖ్యవ్రాసి అందులో చాలా ఇండైరెక్టుగా వ్యాఖ్యలు చేశారు. ఇది చూసిన నాకు అనిపించింది, అసలు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, నియమాలు ఏమిటి తెలుసుకుందామని.
  • కాబట్టి మన వికీ రూల్స్ ప్రకారం మూడవ వ్యక్తులను (వైజా సత్య గారిని, కాసుబాబుగారిని)వివరణ కావాలని అడిగాను. ఈ నిర్వాహకుడి తొందరపాటుతనం ఇంతకుముందే తెలుసు కనుక, నేను వివరణలు అడగటానికి పురికొల్పిన సంఘటనలకు కారణమైన వారు దయచేసి కలుగచేసుకొనవద్దు అనికూడ చివరలో వ్రాశాను(వారి పేరును ఎక్కడా కూడ వ్రాయలేదు).
  • వైజా సత్యగారు ఎంతో పెద్దమనిషి తరహాలో నాకు కొంత సంయమనపరచటానికి చల్లటి మాటలతో నా చర్చా పేజీలో వ్యాఖ్య వ్రాశారు. కాసుబాబుగారు, లైట్ తీసుకోండి అన్నారు. నేను సత్యా గారు వ్రాసిన పాయింట్లకు నా పక్కనుండి కొన్ని సూచనలు (వారు వారి వ్యాఖ్యలో కోరిన ప్రకారం)వ్రాద్దామనుకున్నాను.
  • ఈలోగా, ఈ నిర్వాహకులవారు తన తోటి నిర్వాహకులైన సత్యాగారు, కాసు బాబుగారు వ్రాసిన వ్యాఖ్యలు లెక్క చెయ్యకుండా(వీరి వ్యాఖ్యలకిందే ఈ నిర్వాహకులవారు వ్రాశారు) ఎక్కడలేని తామసాన్ని ప్రదర్శిస్తూ, నన్ను ఏకవచన ప్రయోగం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసారు(పైన కాపీ చేసినవి). ఇప్పటికి కూడ నేను నా సభ్యతను కోల్పోకుండా వారిని గౌరవంగానే సంభోదిస్తున్నాను.

నిర్వాహకుడైనటువంటివారికి తామసం పనికిరాదు. ఓర్పు అవసరం అసహనం పనికిరాదు. విషయం విలువ పట్టించుకోకుండా ఎక్కడా వ్రాతలో కనపడని నియమాలు బోధించటానికి ప్రయత్నించటం,తాను చెప్పినదే వేదమన్నట్టుగా వ్యవహరించటం, దురుసైన భాష, పిడివాదం కాక మరేమవుతుంది. సామాన్య సభ్యులమీద కోప తాపాలు చూపటం, అనుచిత భాష వాడటం, తటాలున (at the drop of a hat, with least provocation)ఆవతలి వ్యక్తిని ఏకవచన ప్రయోగం చెయ్యటం, సభ్యత అంటూ వారి కారెక్టర్ గురించి వ్యాఖ్యలు చెయ్యటం ధాష్టీకం కాక ఏమిటి. వికీ అంటే ఈ నిర్వాహకుల వారు తమ సొంత జాగీర్దారు అనుకుంటున్నారా. మాట్టాడితే నేను గమనిస్తున్నాను, నేను గమనిస్తున్నాను అని వ్యాఖ్యలు. సామాన్య సభ్యులు కూడ గమనిస్తూనే ఉంటారు వారు చేస్తున్న పనులు, చేస్తున్న వ్యాఖ్యలు. వారు వ్రాసిన ప్రతి మాటలోను తాను నిర్వాహకుడినన్న అహంకారం తొణికిసలాడుతూ ఉంటుంది. నేను వికీలో చేరినది మొదలు కాసుబాబు, వైజాసత్య, రాజశేఖర్ గార్లు తదితర నిర్వాహకులు ఎంతో చక్కగా తోటి సభ్యులను ప్రోత్సహిస్తూ, అవసరమైన చోట సున్నితంగా చక్కటి ఆహ్లాదకరమైన భాషలో వారిని సరిచేస్తూ చెప్తూంటారు. వారెక్కడ, ఈ నిర్వాహకులవారెక్కడ

నేను కూడ ఘాటుగా స్పందించగలను, కానీ నేనుకూడ నా సంయమనాన్ని కోల్పోతే సరికాదు అన్న విషయాన్ని తెలిసినవాడినై,ఈ విషయంలో నేను వివరణలుగా కోరిన విషయాలను, మరియు నేను పైన ఉదహరించిన విషయాలను నా ఫిర్యాదుగా తీసుకుని, పైన కాపీ చేయబడిన చంద్రకాతరావుగారు చేసిన అనుచిత వ్యాఖ్యలకు వారి మీద తగిన చర్య తీసుకొనమని కోరుతున్నాను. ఇదే విషయం వైజా సత్యగారి చర్చా పుటలో కూడ వ్రాస్తున్నాను. ఈ dispute resolution ప్రక్రియ జరుగుతుండగా, శ్రీ చంద్రకాంతరావుగారిని ఈ విషయం మీద ఎక్కడా కూడ వ్యాఖ్యలు చెయ్యకుండా (డిస్ప్యూట్ రిజల్యూషన్ లో భాగంగా తప్పితే) కట్టడి చెయ్యమని మనవి, భరించలేకుండా ఉన్నాను వారి అనుచిత వ్యాఖ్యల భాష.

నాకు సాహిత్యం మీద ఉన్న అభిరుచి నన్ను వికేలోకి ఆకర్షించింది. అమరావతి కథలు, చందమామ వ్యాసం విస్తరణ, ఇల్లాలి ముచ్చట్లు, చలం వ్యాసం విస్తరణ, కార్టూనిస్టుల మీద వ్యాస పరంపర వ్రాశాను, ఇప్పటివరకు రెండు పతకాలను సంపాయించుకున్నాను. అటువంటి వికీ లో నేను ఇటువంటి ఫిర్యాదు వ్రాయవలసి రావటం దురదృష్టకరం.--S I V A 17:58, 29 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కార్టూనిస్ట్‌ల మీద వ్యాసాలు

సత్యా గారూ! నమస్తే. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మరిన్ని వ్యాసాలు, శంకు, సత్యమూర్తి, బాలి, గీతా సుబ్బారావు, AVM, శ్రీధర్ లగురించి వివరాల సేకరణలో ఉన్నాను. ఈ వ్యాసాలు కూడ త్వరితగతిన పూర్తి చెయ్యాలని నా ఆకాంక్ష. పాయింట్ల విషయం మీద మరొక్కసారి అవలోకించి అవసరమైన మార్పులు చెయ్యటానికి ప్రయత్నిస్తాను. వేటపాలెం గ్రంధాలయంలో కీర్తి శేషులు భగవాన్ గారి కార్టూన్లు ఉన్నాయని తెలిసింది. ఆ దగ్గరలో ఉన్న సభ్యులెవరైనా మీకు తెలిస్తే, వారికి ఆ కార్టూన్లను సేకరించమని చెప్పగలరా. అనుమతి విషయం ప్రముఖ కార్టూనిస్ట్ బాబు ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను సంప్రదించి ఉంచారు. ఈ కార్టూన్లు కూడ లబించినట్లయితే, పూర్తిగా మరుగునపడిపోయిన మరొక ప్రముఖ కార్టూనిస్ట్ గురించి సమగ్ర వ్యాసం తయారవుతుంది.--S I V A 01:21, 10 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మూసల అతికింపు

వైజాసత్య గారు, 19వ శతాబ్దం‎ మరియు 20వ శతాబ్దం‎ మూసలను ఆయా పేజీలలో బాటు ద్వారా అతికించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:25, 3 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ మధ్య ఇంట్లో ఇంటర్నెట్టు లేక ఆ పని చేపట్టలేకపోయాను. రెండ్రోజుల్లో పూర్తి చేస్తాను --వైజాసత్య 09:48, 3 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

NOT ABLE TO WRITE IN TELUGU

Suddenly, I found today (04 01 2009) that I am unable to write in Telugu in Wiki. This is happening while I am logged in. When I am not logged in, I am able to write in Telugu. This is quite strange phenomenon. Can youkindly let me know, what could be the reason and how to rectify this.--S I V A 07:31, 4 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

కృతజ్ఞుడిని

వైజాసత్యగారూ, నమస్తే, నాపై ఉంచిన విశ్వాసానికి, నా నిర్వాహక హోదా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందుకు, కృతజ్ణుణ్ణి, ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ 04:55, 24 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

  • వైజాసత్య గారూ, నమస్తే నాకు నిర్వాహకునిగా ప్రకటించి మరింత బాధ్యతాయుతుడిగా చేసినందుకు, మనఃపూర్వక కృతజ్ఞతలు, తెవికీ అభివృద్ధికి నా శాయశక్తులా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని విన్నవిస్తున్నాను. సోదరుడు అహ్మద్ నిసార్ 05:39, 29 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మేళకర్త రాగాలు

మేళకర్త రాగాలు మూసలో ఇంకా లింకులు కొన్ని కనిపిస్తున్నాయి. వీటిని మార్చాల్సినదిగా అభ్యర్ధిస్తున్నాను. ఇంగ్లీషు వికీ en:Melakanta రాగాలలోని అన్ని రాగాల ప్రాథమిక లక్షణాలకు స్వరాల స్థితి లక్షణాలను తెలుపుతూ బొమ్మలు ఉన్నాయి. ఇవి తెలుగులోకి తీసుకొని వస్తే చదివేవాళ్ళకు ఇంకా సులభంగా అర్ధం అవుతుంది. ఈ సహాయం మీరు చేయగలరని భావిస్తున్నాను. ఇవి కామన్స్ లో ఉన్నది లేనిదీ తెలియడం లేదు. ధన్యవాదాలు.

ఈ రాగాలకు సంబంధించిన కీర్తనలకు నేను ఇచ్చిన వికీమూలాల లింకులు సరిగా కనిపించడం లేదు. కారణం తెలియదు. ఒక్కసారి చూచి సవరించండి.Rajasekhar1961 06:07, 3 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రాజశేఖర్ గారూ, మూసలో లింకులను సవరించాను. ఇప్పుడు మూస రంగు పోయినట్టుంది. అది సరిచేస్తాను. స్వరాల స్థితి లక్షణాల బొమ్మలన్నీ కామన్స్లో ఉన్నాయి కాబట్టి ఆ పేరుతోనే ఇక్కడ నేరుగా ఉపయోగించుకోవచ్చు. వీకీమూలాల లింకులు సరిగా కనపోవడకపోవటమంటే కాస్త వెలిసిపోయిన రంగులో కనిపిస్తున్నాయని మీ భావమైతే మామూలు లింకులను ఆ వికీమూలాల లింకులను వేరుగా చూపించడానికి ఇతర ప్రాజెక్టుల లింకులు అలా వెలిసిపోయిన రంగులో సూచిస్తారు. కావాలంటే మనమా రంగును మార్చవచ్చనుకుంటా. నేను మీ ఉద్దేశాన్ని సరిగా అర్ధం చేసుకున్నానా? --వైజాసత్య 09:42, 3 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • వైజాసత్యగారు! మీరుచెప్పినట్లుగా బొమ్మలు కామన్స్ లో ఉన్నడం వలన నేరుగా కాపీచేస్తున్నాను. ఇంకొక సలహా సందేహం కావాలి. అన్యధా భావించవద్దు. రాగాలకు చక్కని ఆడియో లింకు ఉంచితే ఆ రాగాన్ని వింటే ఇంకా ఈ వ్యాసాలు రసవంతమౌతాయి. భారతీయ శాస్త్రీయ సంగీతం మీద మంచి వెబ్ సైటు మీకు తెలిస్తే ఆ పేజీలో ఉంచితే బాగుంటుంది. నాకు తెలియజేస్తే ఆడియో లింకులు ఎలా ఇవ్వాలో తెలియజేస్తే నేను ఆ పని చేస్తాను.ధన్యవాదాలు.Rajasekhar1961 04:29, 12 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

Bot flag for User:Darkicebot

Hi there. Could you please grant Darkicebot the bot flag? Thanks, Razorflame 04:15, 8 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రాజు నారిశెట్టి

పేరును రాజు నరిశెట్టి గా మార్చగలరా?Kumarrao 15:25, 24 మార్చి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల పునర్వ్యవస్థీకరణ

వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)లో "సినిమా వ్యాసాల పునర్వ్యవస్థీకరణ" గురించి నేను వ్రాసింది ఒకమారు చూడగలవా? ప్రారంభంలో ఈ పేజీలపై చాలా ఎక్కువగా శ్రమించింది నువ్వే గనుక ఈ ప్రతిపాదన గురించి నీ అభిప్రాయం తెలుసుకోగోరుతున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:27, 14 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]