చందమామ ధారావాహికలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 17: పంక్తి 17:
# [[రాతి రథం]]
# [[రాతి రథం]]
# [[యక్ష పర్వతం]]
# [[యక్ష పర్వతం]]
# [[కంచుకోట]]
# [[జ్వాలాద్వీపం]]
# [[బంగారులోయ]] (చందమామలో రచయిత పేరు ప్రచురించిన ఏకైక సీరియల్)
# [[అపూర్వుడి సాహసయాత్రలు]]
# [[బందిపోటు యువరాజు]]
# [[ఐదు ప్రశ్నలు]]


<!--
<!--
పంక్తి 43: పంక్తి 49:
|10 ||[[యక్ష పర్వతం]] ||
|10 ||[[యక్ష పర్వతం]] ||
|} -->
|} -->

==చారిత్రక ధారావాహికలు==
==చారిత్రక ధారావాహికలు==



11:33, 15 మే 2009 నాటి కూర్పు

చందమామ పత్రిక చక్కటి ధారావాహికలకు పెట్టింది పేరు. "చిత్ర" వేసిన అద్భుతమైన బొమ్మలతో ఎంతో ఆసక్తికరమయిన కథనంతో, సరళమైన భాషలో ఒక్కొక్క చందమామ ధారావాహిక (Chandamama Serial) అనేక నెలలలపాటు జరిగేది. ప్రతి నెల ఒక ఆసక్తి కరమయిన ఘటనతో ఆపేవారు, అంటే మళ్ళీ నెల వరకు అసక్తితో చదువరులు ఎదురు చూసేటట్లు చేసేవారు. పాత్రలు ఒక డజనుకి మించి ఉండేవికాదు. "చిత్ర" గారు ఒక్కొక్క పాత్రకు మొదటిసారి బొమ్మ ఎలా వేసారో, ధారావాహిక అయ్యేవరకు కూడా, ఆ పాత్రలు అల్లాగే కనిపించేవి. ప్రతి ధారావాహికలోనూ ఇద్దరు నాయకులు ఉండేవారు: శిఖిముఖి - విక్రమకేసరి, ధూమకుడు - సోమకుడు, ఖడ్గవర్మ-జీవదత్తుడు మొదలగు నాయక ద్వయాలు పాఠకులను ఎంతగానో అలరించేవారు. కథా నాయికలు చాలా తక్కువగా కనిపించేవారు. కథకు ఎంతవరకు అవసరమో అంతవరకే కనబడేవారు. శిధిలాలయంలో ఒక్క నాగమల్లి పాత్ర తప్ప మిగిలిన కథానాయికలందరూ నామ మాత్రమయినవారే. ఒక్క నవాబు నందిని మరియు దుర్గేశ నందిని తప్ప మిగిలిన ధారావాహికలన్నీ కూడా భారతదేశపు రాజ్యాలలోనూ పల్లెటూళ్ళలోనూ జరిగినట్లు వ్రాసేవారు. అన్ని ధారావాహికలలో రాజులు, వారి రాజ్యాలు, అప్పుడప్పుడు రాక్షసులు, మాంత్రికుల పాత్రలు మరియు కథలు ఉండేవి. ఒక్క రాజుల కథలేకాక సాహస వంతమయిన యువకుల గురించి (రాకాసి లోయ, ముగ్గురు మాంత్రికులు, తోక చుక్క మొదలగునవి) కూడా ధారావాహికలు వచ్చేవి. అంతేకాకుండా, పురాణాలు, చరిత్ర కు సంబంధించిన ధారావాహికలు కూడా ప్రచురించారు.

అంతే కాదు ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ చందమామలో కథలుగా వచ్చాయి. ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, వెయ్యిన్నొక్క రాత్రులు (అరేబియన్‌ నైట్స్‌) ఇలా ప్రపంచ సాహిత్యంలోని విశిష్టమైన రచనలు అన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు మరియు ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, ఆంగ్లములోని షేక్‌స్పియర్‌ నాటకాలు ఎన్నిటినో కథల రూపంలో పాఠకులు చదవగలిగారు. ఇవికాక గ్రీకు‌ పురాణాలైన ఇలియడ్‌, ఒడిస్సే, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ చందమామలో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలే గాక ఇతర సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి.

చందమామ ధారావాహికల పుట్ట. అందుకనే 1960-1980లలో పెరిగి పెద్దయిన పిల్లలు, అప్పటి ధారావాహికలను, కథలను మర్చిపోలేకపోతున్నారు.

సాధారణ ధారావాహికలు

  1. తోకచుక్క
  2. మకర దేవత
  3. ముగ్గురు మాంత్రికులు
  4. విచిత్ర కవలలు
  5. రూపధరుడి యాత్రలు
  6. రాకాసి లోయ
  7. పాతాళ దుర్గం
  8. శిధిలాలయం
  9. రాతి రథం
  10. యక్ష పర్వతం
  11. కంచుకోట
  12. జ్వాలాద్వీపం
  13. బంగారులోయ (చందమామలో రచయిత పేరు ప్రచురించిన ఏకైక సీరియల్)
  14. అపూర్వుడి సాహసయాత్రలు
  15. బందిపోటు యువరాజు
  16. ఐదు ప్రశ్నలు


చారిత్రక ధారావాహికలు

  1. నెహ్రూ కథ
  2. భారత చరిత్ర

పురాణ ధారావాహికలు

  1. రామాయణం
  2. కృష్ణావతారం
  3. మహాభారతం
  4. శివ పురాణం
  5. శివ లీలలు
  6. విఘ్నేశ్వరుడు
  7. వీర హనుమాన్
  8. విష్ణుకథ
  9. జగన్నాథ చరిత్ర (పూరీ జగన్నాథాలయ నిర్మాణం వెనకున్న కథ)
  10. దేవీభాగవతం


పైన చెప్పినవి కాక అరణ్య పురాణం అని ఒక చక్కని ధారావాహిక ప్రచురించారు. ఈ ధారావాహికకు ఆధారం రుడ్యార్డ్ కిప్లింగ్ ([Rudyard Kipling) వ్రాసిన ఆంగ్ల నవల The Jungle Book. ఈ ఒక్క ధారావాహికకు మాత్రం, వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేసేవారు. అదే విధంగా విష్ణుశర్మ రచించిన పంచతంత్రం కూడా చక్కటి భాషలో ధారావాహికగా పూర్తిగా ప్రచురించారు. ఈ ధారావాహికకు కూడా, వడ్డాది పాపయ్య గారే బొమ్మలు వేసేవారు.

కథా స్రవంతులు

పరోపకారి పాపన్న

చక్కటి విషయాలతో కథాస్రవంతులు కూడా ప్రతి నెలా ఉండేవి. అందులో ముఖ్యమైనవి:

  1. పరోపకారి పాపన్న కథలు
  2. బండ భీమన్న కథలు
  3. తాతయ్య కథలు
  4. జాతక కథలు
  5. ఐంద్రజాలిక కథలు


1960 ప్రాంతంలో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న పరోపకారి పాపన్న కథలు కొన్నాళ్ళ క్రితం దూరదర్శన్ లో ధారావాహికగా వచ్చాయి.

చిన్న ధారా వాహికలు

అప్పుడప్పుడు 4-5 నెలలు నడిచే చిన్న ధారావాహికలు వేసేవారు. అందులో కొన్ని:

  1. సింద్ బాద్ యాత్రలు
  2. అబూకీర్-అబూసీర్
  3. భూతాలు చేసిన పెళ్ళి
  4. మాయదారి ముసలిది

చందమామ ధారావాహిక దృశ్యమాలిక