అక్షాంశం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: mk:Лонгитуда
చి యంత్రము కలుపుతున్నది: ko:경도
పంక్తి 42: పంక్తి 42:
[[it:Longitudine]]
[[it:Longitudine]]
[[ja:経度]]
[[ja:経度]]
[[ko:경도]]
[[ku:Hêlîlar]]
[[ku:Hêlîlar]]
[[la:Longitudo geographica]]
[[la:Longitudo geographica]]

12:21, 3 జూన్ 2009 నాటి కూర్పు

భూగోళాన్ని తూర్పు, పడమర భాగాలుగా విడగొట్టే ఊహాజనితమైన గీతలను అక్షాంశాలని (Longitude) పిలుస్తారు. ఈ రేఖలు ఏదైనా ప్రదేశం అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశానికి ఎంత దూరంలో ఉన్నది అన్న విషయం తో పాటు, ఆ ప్రదేశం తూరపు దిక్కున ఉన్నదా, లేక పడమటి దిక్కున ఉన్నదా అన్న విషయాన్ని సూచిస్తాయి. గ్రీకు అక్షరం లామ్డా, అక్షాంశాలకు గుర్తు. సాధారణంగా అక్షాంశాలను డిగ్రీలతో కొలుస్తారు. అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశం 0° గా వ్యవహరిస్తారు. భూగోళం మొత్తం 360 రేఖాంశాలుగా విభజింపబడింది. అంతర్జాతీయ తేదీ రేఖ చాలా వరకు 180వ అక్షాంశాన్ని అనుసరిస్తుంది.

రేఖాంశాలు, అక్షాంశాలు నౌకాయానంలోనూ, పటాలను తయారు చేయడంలోనూ విరివిగా ఉపయోగించబడతాయి. ఒక ప్రదేశాన్ని స్పష్టంగా గుర్తించడానికి ఆ ప్రదేశపు అక్షాంశంతో పాటు, రేఖాంశం కూడా తెలియాలి.

తతిమ్మా గ్రహాల అక్షాంశాలు

భూమధ్య రేఖ వలె కాక అంతర్జాతీయ గ్రీన్ విచ్ రేఖాంశాన్ని 0° గా వ్యవహరిచడానికి ప్రత్యేకమయిన కారణం ఏదీ లేదు. అంతర్జాతీయంగా అందరూ అంగీకరించిన కారణాన గ్రీన్ విచ్ రేఖాంశం 0° గా వ్యవహరించబడుతుంది. అయితే తతిమ్మా గ్రహాలకు రేఖాంశాలను నిర్ణయించేందుకు ఆయా గ్రహాలయొక్క axis of rotation, మరియు వాటి నిర్మాణాన్ని బట్టి నిర్థారిస్తారు. స్పష్టంగా కనిపించే ఒక లోయనో , లేక పర్వతాన్నో ఎంచుకుని వాటి మీదుగా ఆ గ్రహపు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక గీత గీసి, ఆ గీతను ఆ గ్రహపు 1వ అక్షాంశంగా వ్యవహరిచడం కూడా కద్దు.

"https://te.wikipedia.org/w/index.php?title=అక్షాంశం&oldid=416635" నుండి వెలికితీశారు