శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 62: పంక్తి 62:
*గోకర్ణేశ్వర ఆలయం, [[గోకర్ణమఠం]]
*గోకర్ణేశ్వర ఆలయం, [[గోకర్ణమఠం]]
*ఐదు దేముళ్ళగుడి, [[మున్నంగి]]
*ఐదు దేముళ్ళగుడి, [[మున్నంగి]]
*వాసీశ్వరస్వామి ఆలయం, [[తిరుప్పొచ్చూరు]]


==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

05:54, 12 జూన్ 2009 నాటి కూర్పు

పరమశివుడు ఆరాధకునిగా నిర్మించిన దేవాలయం - శివాలయం. మహా శివరాత్రి పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

దస్త్రం:IMG 1177a.JPG
వెన్నూతల అనే గ్రామంలో శివాలయం. 1885లో నిర్మింపబడిన ఈ ఆలయాన్ని 2007లో పునరుద్ధరించారు
దస్త్రం:PURAATANA SIVAALAYAM LOOPALA PUNARUDHARANA TARUVAATA.jpg
అదే ఆలయం లోపలి భాగం. గర్భగుడిలో శివలింగాన్ని, ఎదురుగా నంది ని చూడవచ్చును.


నిర్మాణ సంప్రదాయాలు

సాధారణంగా హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తమిళనాడులో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల గోపురం లేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.


శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. ఆలయం అంతర్భాగంలో, గర్భగుడిలో శివలింగం ప్రతిష్టింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. గర్భగుడి చుట్టూరా ప్రదక్షిణ మార్గం ఉంటుంది.


ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణద్వార ముఖంగా ఉంటుంది.

శివలింగం

పరివార దేవతలు

సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. నంది కొమ్ములపై తమ వేళ్ళు ఉంచి దాని ద్వారా దైవదర్శనం చేసుకోవడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా సింహం విగ్రహం ఉంటుంది.


చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా విష్ణువు రూపాన్ని ప్రతిష్టిస్తారు. వివిధ శైవ గాధలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.


అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం నవగ్రహ సన్నిధి.

అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు

విశేషాలు

కొన్ని ప్రముఖ శివాలయాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

వనరులు

"https://te.wikipedia.org/w/index.php?title=శివాలయం&oldid=419160" నుండి వెలికితీశారు