నాణెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మలు చేర్చాను
బొమ్మ మార్పు
పంక్తి 1: పంక్తి 1:
[[Image:SamudraguptaCoin.jpg|right|thumb|సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం. గరుడ స్తంభపు బొమ్మ చూడవచ్చును. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో వున్నది.]]
[[Image:2 rupee coin.jpg|right|thumb|300px|భారత ప్రభుత్వం విడుదల చేసిన 2 రూపాయల నాణెం.]]
[[Image:VarahaVishnuAvatarPratiharaKings850-900CE.jpg|thumb|850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై [[వరాహ]] బొమ్మ ([[విష్ణు]] [[అవతారం]]).]]
[[Image:VarahaVishnuAvatarPratiharaKings850-900CE.jpg|thumb|850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై [[వరాహ]] బొమ్మ ([[విష్ణు]] [[అవతారం]]).]]
'''నాణెం''' అనగా ఏదైనా ఒక లోహంతో చేసిన గుండ్రటి లేదా బహుభుజి ఆకారంలో గల బిళ్ళ. వీటిని సమాజంలో ద్రవ్యంగానూ, ముద్రికలగానూ ఉపయోగించడం పరిపాటి.
'''నాణెం''' అనగా ఏదైనా ఒక లోహంతో చేసిన గుండ్రటి లేదా బహుభుజి ఆకారంలో గల బిళ్ళ. వీటిని సమాజంలో ద్రవ్యంగానూ, ముద్రికలగానూ ఉపయోగించడం పరిపాటి.

10:52, 2 జూలై 2009 నాటి కూర్పు

సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం. గరుడ స్తంభపు బొమ్మ చూడవచ్చును. ప్రస్తుతం ఇది బ్రిటిష్ మ్యూజియంలో వున్నది.
850-900 నాటి ప్రతిహర కాలపు నాణెంపై వరాహ బొమ్మ (విష్ణు అవతారం).

నాణెం అనగా ఏదైనా ఒక లోహంతో చేసిన గుండ్రటి లేదా బహుభుజి ఆకారంలో గల బిళ్ళ. వీటిని సమాజంలో ద్రవ్యంగానూ, ముద్రికలగానూ ఉపయోగించడం పరిపాటి.

చరిత్ర

భారతదేశంలో

క్రీ.పూ 1000 సంవత్సరం నుంచి భారతదేశంలో నాణేలు చెలామణిలో ఉన్నాయని కన్నింగ్‌హామ్ అభిప్రాయం. జె.క్రిబ్ అనే మరో పురావస్తు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ క్రీ.పూ 350 సంవత్సరం కంటే ముందే నాణేలను వినియోగించారు. మనదేశంలో క్రీస్తుపూర్వం 6-7 శతాబ్దాలలో, లేదా అంతకంటే కొంచెం ముందు నాణేలు తయారై ఉండవచ్చునని పి ఎల్ గుప్తాతో పాటు, అధిక సంఖ్యలో చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు. ఇంత వివాదానికి కారణం తొలినాటి నాణేల మీద పాలకుల వివరాలు లేవు. నాణేలు తమ సంగతి తాము చెప్పలేనపుడు వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఉపయోగపడేవి సాహిత్య, పురావస్తు ఆధారాలే. క్రీ.శ ఒకటవ శతాబ్దానికి చెందినట్టు భావించే పాణిని తన అష్టాధ్యాయి గ్రంధంలో నాణేల ప్రస్తావన తెచ్చాడు. క్రీస్తుశకం నాల్గవ శతాబ్దం వాడైన కౌటిల్యుడు అర్థశాస్త్రంలో దొంగనాణేలను గురించి, సీసం గనుల గురించి ప్రస్తావించాడు. కాబట్టి దేశంలో పంచ్‌మార్క్‌డ్ నాణేలు నాల్గవ శతాబ్దానికే చెలామణీలో ఉన్నట్టే. లేదంటే కొంచెం ముందు నుంచి ఉండవచ్చు. ఇది అందరూ అంగీకరిస్తున్న చారిత్రక సత్యం.అయితే ఎవరు విడుదల చేశారో చెప్పడానికి ఆధారాలు లేవు. మన కృష్ణాజిల్లా సింగవరంలో లభ్యమైన వెండి నాణేల పరిస్థితి కూడా ఇదే.[1]

ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం

ఇతర దేశాల్లో

మౌర్యుల కాలం నాటి నాణేలపై ఏనుగు మరియు సూర్యుని బొమ్మ.

భారత్ వలెనే ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేశాలుగ్రీస్, చైనా, రోమ్, మొదలైనవి. గ్రీకులు, చైనీయులు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్ధంలో నాణేలు విడుదల చేసుకున్నారని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రోమన్లు, పర్షియన్లు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో నాణేలను చెలామణీలోకి తెచ్చారని కూడ నిర్దిష్టమైన ఆధారాలు ఉణ్ణాయి. అయితే భారతదేశ నాణేల చరిత్రకు ఇలాంటి విస్పష్టమైన ఆధారలేమీ లేవు. ఇక్కడ నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయనే సంగతి ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలి ఉంది.

నాణేల మీద పుంఖానువుంఖాలుగా ముద్రలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేర్వేరు రాజులవని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే నాణేం మీద గుర్తు మారినంత మాత్రాన పాలకుడు మారిపోయాడని చెప్పలేమని చరిత్రకారులు చెబుతున్నారు. జనపదాలలో స్థానిక పాలకుల నాణేలతో పాటు, సామ్రాజ్యాలు విడుదల చేసిన నాణేలు కూడా బయల్పడినాయి. ఆంధ్రజనపదమే ఇందుకు గొప్ప ఉదాహరణ. అమరావతిలో దొరికిన 7668 నాణేలలో కనిపించిన రకాలు దేశంలో ఇంకెక్కడా కనిపించలేదు. ఈ వెండి పంచ్‌మార్క్‌డ్ నాణేలలో 235 రకాలను కనుగొన్నారు. ఇందులో 48 రకాలు మరెక్కడా బయల్పడలేదు. పి ఎల్ గుప్తాయే వీటి గురించి పరిశోధించారు. పరిష్కారమైన సమస్యల కంటె పరిష్కారం కాని ప్రశ్నలే ఇందులో ఎక్కువ. మరో లోపం - నాణేలను ఇంతకాలం భూగర్భంలో దాచిపెట్టిన కుండలు కాలాన్ని చెప్పగలవు. కానీ ఆ ప్రయత్నం కూడా చాలాసార్లు విఫలమైంది. ఆ కుండలు మిగలడం లేదు. ఇందుకు బీహార్‌లో పైలా అనే చోట దొరికిన నిధి మాత్రమే మినహాయింపు. అక్కడ దొరికిన నాణేల కాలాన్ని శాస్త్రీయ పద్థతిలో నిర్థారించగలిగారు. కాని ఎక్కువ చోట్ల అది సాధ్యం కావడం లేదు. దాంతో శాస్త్రీయ పద్ధతులతో అవకాశాన్ని అలా జారవిడుచుకోవలసి వస్తున్నది. నాణేలలో కార్బన్ ఉంటుందా, కార్బన్ పరీక్ష జరిపి కాలాన్ని నిర్ధారించవచ్చా? అంటే ఈ అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి.

ఎందుకంటే ఒకసారి కార్బన్ పరీక్ష్ జరపాలంటే ఒక మిల్లీగ్రాము పదార్ధమైనా కావాలి. అంటే కొన్ని నాణేలనైనా త్యాగం చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి ఎవరూ సాహసించడం లేదు. నాణేల కాలం తెలియవచ్చేమో కాని నాణేలు మాత్రం కరిగిపోతాయి. కాబట్టే భారతదేశంలో నాణేలు ఎప్పటి నుంచి చెలామణీ అవుతున్నాయో ఇప్పటికీ చిక్కువీడని ప్రశ్నేగానే ఉండిపోయింది.

హాబీ

వివిధ కాలాలకు చెందిన వివిధ రకాలైన నాణేలను సేకరించడం కొంతమందికి అభిరుచి.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=నాణెం&oldid=426279" నుండి వెలికితీశారు