నేరేడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: tl:Duhat
చి యంత్రము కలుపుతున్నది: kn:ನೇರಳೆ
పంక్తి 34: పంక్తి 34:


[[en:Jambul]]
[[en:Jambul]]
[[kn:ನೇರಳೆ]]
[[ta:நாவல் (மரம்)]]
[[ta:நாவல் (மரம்)]]
[[ml:ഞാവല്‍]]
[[ml:ഞാവല്‍]]

09:03, 3 జూలై 2009 నాటి కూర్పు

నేరేడు
Jambul (Syzygium cumini)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
షై. క్యుమిని
Binomial name
షైజీజియం క్యుమిని
(L.) Skeels.

నేరేడు (Jamun) ఒక పెద్ద వృక్షం. దీనిని పండ్లు కోసం పెంచుతారు. నేరేడు శాస్త్రీయ నామం 'షైజీజియం క్యుమిని'. ఇది మిర్టేసి కుటుంబానికి చెందినది. భారతదేశం, పాకిస్థాన్, మరియు ఇండోనేషియా లో ప్రధానంగా పెరుగుతుంది. అంతే కాకుండా ఫిలిప్పైన్స్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ లలో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. భారతదేశానికి పోర్చుగీసు వారు వచ్చినపుడు వారు ఈ విత్తనాన్ని బ్రెజిల్ కు తీసుకుని వెళ్ళారు. అక్కడి పక్షులు కొన్ని దీనిని ఇష్టంగా తింటుండటంతో అక్కడ చాలా వేగంగా వ్యాపించిపోయింది. ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 30 మీటర్లు ఎత్తు పెరిగే అవకాశం. ఉంది. నేరేడు చెట్లు వంద ఏళ్ళకు పైగా జీవించగలవు.

మత విశ్వాసం

బెంగళూరు మార్కెట్ లో నేరేడుపళ్ళు

రామాయణం లో శ్రీరాముడు పద్నాలుగేళ్ళు వనవాసం చేసినపుడు, ఎక్కువ భాగం ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం. అందుకనే భారతదేశంలోని గుజరాత్ మరియు వివిధ ప్రాంతాల్లో దీనిని దేవతా ఫలంగా భావిస్తారు.

ఉపయోగాలు

  • నేరేడు పండ్లు గుజురుతో కసగా ఉండి తియగా ఉంటాయి. వీనితో పచ్చళ్ళు, జామ్ లు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు.
  • నేరేడు కలపను వ్యవసాయ పనిముట్లు, దూలాలు తయారుచేయుటకు వాడతారు.
  • చెట్టు బెరడులో మరియు విత్తనాలలో 13- 19 % వరకు టానిన్లు ఉంటాయి.
  • విత్తనం నుండి తీసిన రసం అధిక రక్తపోటును నయం చేస్తుంది. ఇవి కొంతవరకు మధుమేహంలో కూడా పనిచేస్తాయి[1].

మూలాలు

  1. [1] Article in The Hindu, retrieved June 23 2007
"https://te.wikipedia.org/w/index.php?title=నేరేడు&oldid=426783" నుండి వెలికితీశారు