Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476

హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎రుచులు: (బిరియానీ కి పేరొందిన హోటళ్ళు, ఇరానీ చాయ్, గోకుల్ ఛాట్ గురించి చేర్చాను.)
→‎మల్టీప్లెక్సు థియేటర్లు: (పుస్తక శాలలని చేర్చాను)
పంక్తి 202: పంక్తి 202:
* ప్రసాద్స్ ఐమ్యాక్స్ - ఎన్ టీ ఆర్ గార్డెన్స్ ప్రక్కన, ఎన్ టీ ఆర్ మార్గ్
* ప్రసాద్స్ ఐమ్యాక్స్ - ఎన్ టీ ఆర్ గార్డెన్స్ ప్రక్కన, ఎన్ టీ ఆర్ మార్గ్
* సినీ ప్లానెట్ - కొంపల్లి
* సినీ ప్లానెట్ - కొంపల్లి

==పుస్తక శాలలు==
* క్రాస్ వర్డ్, సిటీ సెంట్రల్ మాల్, బంజారా హిల్స్
* ల్యాండ్ మార్క్, బంజారా హిల్స్


== మరిన్ని చిత్రాలు ==
== మరిన్ని చిత్రాలు ==

10:45, 3 ఆగస్టు 2009 నాటి కూర్పు

  ?హైదరాబాదు
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
చార్మినార్, హైదరాబాదు నగర చిహ్నం.
చార్మినార్, హైదరాబాదు నగర చిహ్నం.
చార్మినార్, హైదరాబాదు నగర చిహ్నం.
అక్షాంశరేఖాంశాలు: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
తీరం
625 కి.మీ² (241 sq mi)
• 536 మీ (1,759 అడుగులు)
• 0 km (0 mi)
వాతావరణం
అవపాతం
ఉష్ణోగ్రత
వేసవికాలం
శీతాకాలం
Aw (Köppen)
• 803 mm (31.6 in)
26.0 °సె (79 °ఫా)
• 30.3 °సె (87 °ఫా)
• 23.5 °సె (74 °ఫా)
దూరాలు
డిల్లీ నుండి
ముంబాయి నుండి
చెన్నై నుండి

• 1,499 కి.మీలు S (land)
• 711 కి.మీలు SE (land)
• 688 కి.మీలు N (land)
ప్రాంతం తెలంగాణా
జిల్లా (లు) హైదరాబాదు జిల్లా జిల్లా
జనాభా
జనసాంద్రత
Metro
ఆడ-మగ నిష్పత్తి
36,32,094 (2006 నాటికి)
• 5,811/కి.మీ² (15,050/చ.మై)
• 61,12,250 (6th) (2006)
• 1.07[1]
మేయరు తీగల కృష్ణా రెడ్డి [2]
కమీషనరు సంజయ్ జాజు
నిర్మించిన సం. 1591
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
UN/LOCODE
వాహనం

• 500 xxx
• +91-40
• INHYD
• AP9, AP10, AP11, AP12, AP13, AP28, AP29
వెబ్‌సైటు: www.ghmc.gov.in/
  1. "Enforcement of PNDT Act to be made stringent". హిందూ పత్రిక. మార్చి 13 2006. Retrieved 2007-05-05. {{cite web}}: Check date values in: |date= (help)
  2. హిదరాబాదు నగరపాలక సంస్థ వెబ్‌సైటు నుండి ప్రస్తుత మేయరు వివరాలు 29/10/2006న సేకరించబడినది.

హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము యొక్క రాజధాని. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరియు నాట్యానికి ప్రసిద్ది. హైదరాబాదు భారత దేశములో ఆరవ అతిపెద్ద మహానగరము[1]. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మునిసిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్తానాన్ని ఆక్రమిస్తుంది. [2]

హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు మరియు సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందినాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నముగా నిర్మించారు.

చరిత్ర

మహమ్మద్ కులీ కుతుబ్ షా, 5వ కుతుబ్ షాహీ సుల్తాన్, హైదరాబాదు నగర స్థాపకుడు.
దస్త్రం:Hyderabad india .jpg
సంధ్యా సమయంలో చార్మినారు

హైదరాబాదును మూసీ నది ఒడ్డున క్రీ.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు[3]. గోల్కొండలోని నీటి సమస్యకు సమాధానంగా పరిపాలనను ఇక్కడకు మార్చారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్తులు ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని మరియు కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని భాగాలను పాలించారు.[4]

పేరు పుట్టుక

హైదరాబాదుకు భాగ్యనగరము అనే పేరు కూడా ఉంది. మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెండ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగరము అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది[5]. ఉర్దు బాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం వుంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.

గోల్కొండ కోటపై నుండి హైదరాబాదు నగరం

స్వాతంత్రం అనంతరం

1947లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార, వాణిజ్యాలు స్థిరముగా ఉండేందుకు హైదరాబాదు రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణా కమ్యునిస్టులు హైదరాబాదును బారత దేశంలో కలుపుటకు, నిజాము సొంత సైన్యమయిన రజాకర్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణించాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగినాయి. అటువంటి సమయంలోనే, అప్పటి హోంమంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్యకు ఉపక్రమించింది. సెప్టెంబరు 17, 1948న, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడం వల్ల హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత ఎనిమిది సంవత్సరాలపాటు హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్టంగా ఉన్నది. 1956 నవంబర్ 1న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం మరియు దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర ప్రదేశ్ లో కలిసాయి, అంతేకాదు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది.

వాణిజ్య వ్యవస్ధ

హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే ముత్యాల మార్కెట్టు ఉంది. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ మరియు కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన సినిమా నిర్మాణ కేంద్రం రామోజీ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని 1996లో నిర్మించారు[6]. అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ సినీ నిర్మాణ కేంద్రం అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది. [7]

హైదరాబాదు పేరెన్నికగన్న పరిశోధనాలయాలు మరియు విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే మరికొన్ని ప్రైవేటు రంగంలొ ఉన్నాయి. అంతేకాదు ఈ పరిశోధనాలయాలు వివిధ రంగాలకు విస్తరించాయి కూడా. వాటిలో కొన్ని:

హైదరాబాదులోనే స్థాపించబోయే మరికొన్ని ముఖ్యమయిన ప్రాజెక్టుల వివరాలు

  • జీనోము వ్యాలీ :- ఇది ICICI బ్యాంకు మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టు. బయోటెక్నాలజీ కంపెనీలకు ఉపయుక్తగా ఉండేటట్లు 200 ఎకరాలలో ఒక నాలేడ్జి పార్కును స్థాపించే ప్రయత్నం ఇది.[8]
  • రాజీవ్ గాంధీ నానో టెక్ సిలికాన్ ఇండియా పార్కు :- దీనిని శంషాబాదు లో నిర్మింప తలపెట్టిన కొత్త అంతర్జాతీయ విమానాస్రయానికి దగ్గరలో నిర్మిస్తున్నారు. దీనిని 350-ఎకరాలలో (మొదటి దశ 50 ఎకరాలు) నిర్మించాలని తలపెట్టారు. ఈ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్లో సుమారు 250 కోట్ల (మొదటి దశలో 60 కోట్లు) డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచానా వెస్తున్నారు. [9]

రియల్ ఎస్టేట్ రంగము

భారత దేశంలోని మరెన్నో ఇతర నగరాల వలే హైదరాబాదులో కూడా రియల్ ఎస్టేటు రంగము మంచి వృద్ది సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణంగా ఇటీవల కాలంలో తామర తంపరగా వస్తున్న ఐటి సంస్థలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం హైటెక్ సిటీని నిర్మించిన తరువాత ఎంతోమంది ప్రైవేటు భాగస్వాములు కూడా ఐటి పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు సింగపూరు లో కార్యకలాపాలు సాగించే ఎసెండాస్ 2002లో హైదరాబాదులోని హైటెక్ సిటీ దగ్గర ఐటీ పార్కుని నిర్మించటానికి ఎల్&టి తో మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు [10]. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ కూడా, CESMA International అనే సింగపూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటి ఉద్యోగులకు ఉపయుక్తంగా పోచారం దగ్గర 16000 గృహాల సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది [11].

సైబర్ టవర్లు, హైదరాబాదు ఐటి చిహ్నము

రియల్ ఎస్టేట్

ఐటి రంగము

1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి మరియు ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును బెంగుళూరు తరువాత రెండో సిలికాను వ్యాలీ గా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ సత్యం కంప్యూటర్స్ యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. ఐ బి ఎం, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగిల్, ఒరాకిల్,డెల్, కాన్బే, జిఇ, సొన్స్ ఈన్దీ, డెలాయిట్, హెచ్ఎస్‌బిసి, జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న ప్రముఖ కంపెనీలలో కొన్ని. ప్రతిష్టాత్మకమయిన ఫ్యాబ్ సిటీ ప్రాజెక్టును సాధించి తానే భవిష్యత్తు ఐటి కేంద్ర బిందువునని చాటి చెప్పింది[12].

విద్య

విద్య పరంగా హైదరాబాదు దక్షిణ భారతంలో ప్రముఖ కేంద్రం. ఇక్కడ రెండు కేంద్ర విశ్వవిద్యాలయాలు, రెండు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు మరియు ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం భారతదేశంలో ఉన్న పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సాంకేతిక విద్యకు సంబందించి జవహర్లాల్ నెహ్రూ టెక్నొలాజికల్ విశ్వవిద్యాలయం, ఇంటర్నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, సెంట్రల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హైదరాబాదుకు విద్యారంగంలో ఖ్యాతి తెచ్చిన సంస్థల్లో కొన్ని. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, నల్సార్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రముఖ సంస్థలెన్నో ఉన్నాయి. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఇస్లామిక్ విశ్వవిద్యాలయం అయిన జామియా నిజామియా కూడా ఇక్కడే ఉంది.

పౌర పరిపాలన

నగర పరిపాలన హైదరాబాదు నగరపాలక సంస్థ చేతిలో ఉంది. దీనికి నేత మేయరు అయినప్పటికీ ఆయన అధికారాలు పరిమితం. నిజమైన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే మునిసిపల్ కమిషనరు అనబడే ఒక ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటాయి. ప్రస్తుతం తీగల కృష్ణా రెడ్డి[13] మేయరుగా, సంజయ్ జాగు[14] మునిసిపల్ కమీషనరుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల నిత్యావసరాలు, మౌలిక వసతులకు బాధ్యత ఈ సంస్థదే. నగరం 100 వార్డులుగా విభజింపబడి ఉంది. ఒక్కో వార్డుకు ఒక కార్పొరేటరు ఎన్నికై కార్పొరేషనులో తన వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. నగరప్రాంతం మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌లోని 23 జిల్లాల్లో ఒకటి - అదే హైదరాబాదు జిల్లా. ఆస్తుల దస్తావేజులు, రెవిన్యూ సమీకరణకు జిల్లా కలెక్టరు బాధ్యుడు. హైదరాబాదు జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా కలెక్టరుదే.

భారతదేశంలోని ఇతర మహానగరములలో వలెనే, హైదరాబాదు పోలీసుకు పోలీసు కమీషనరుగా ఒక ఐపీఎస్‌ అధికారి ఆధిపత్యము వహిస్తుంటాడు. హైదరాబాదు పోలీసు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వములో పని చేయుస్తుంది. హైదరాబాదును ఐదు పోలీసు జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్‌కు ఒక డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు అధిపతిగా ఉంటాడు. ట్రాఫిక్‌ పోలీసు విభాగము హైదరాబాదు పోలీసు శాఖలో పరిమిత స్వయంప్రతిపత్తి కలిగిన ఒక విభాగము. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము మొత్తము తన న్యాయ పరిధిలో ఉండే ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానము యొక్క పీఠము హైదరాబాదు నగరంలోనే ఉంది. హైదరాబాదులో రెండు దిగువ న్యాయస్థానములు, పౌరసంబంధ సమస్యలకై చిన్న సమస్యల (small cases) న్యాయస్థానము మరియు నేర విచారణ కొరకు ఒక సెషన్స్ న్యాయస్థానము కలవు. హైదరాబాదు నగరానికి లోక్‌సభ లో రెండు సీట్లు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ లో పదమూడు సీట్లు ఉన్నాయి.

రవాణా వ్యవస్థ

విమానాశ్రయాలు

ఇప్పుడు హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరుతో 15,మార్చి, 2008తేదీన ప్రారంభించబడింది.[15] ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మరియు కొన్ని అంతర్జాతీయ గమ్యములకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.[16]. మధ్య ప్రాచ్యము, నైరుతి ఆసియా, దుబాయి, సింగపూరు, మలేషియా మరియు చికాగో, ఫ్రాంక్‌ఫర్ట్ మొదలైనటువంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు చక్కని విమాన ప్రయాణ సౌకర్యములు కలవు.

పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని మార్చి 2008 నాటికి హైదరాబాదులోని శంషాబాద్ లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడి నుండి సంవత్సరానికి 5 కోట్ల మంది విమానా సౌకర్యాన్ని వినియోగించుకో గలుగుతారు[17]. అంతేకాదు 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు.[18] ప్రస్తుతం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయము మూసివేయబడింది.

రైలు రవాణా

నక్లెస్ రోడ్డులోని ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను

హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది. హైదరాబాదులో మొత్తం మూడు ముఖ్య రైల్వేస్టేషన్లు ఉన్నాయి:

  1. సికింద్రాబాదు రైల్వేస్టేషను
  2. నాంపల్లి రైల్వేస్టేషను
  3. కాచిగూడ రైల్వేస్టేషను

హైదరాబాదు నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలకుగాను, 2003లో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థను నిర్మించడం మొదలు పెట్టారు. ఈ వ్యవస్థ రైలు రవాణా మరియు రోడ్డు రవాణాను అనుసందించటాకి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ వలన, సికింద్రాబాదు - లింగంపల్లి, హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - ఫలక్‌నుమా, లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ఫలక్‌నుమా - షంషాబాదు, సికింద్రాబాదు - మనోహరబాదుల మధ్య కూడా రైలు బండ్లు తిరిగేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది కాక నగరానికి మెట్రో రైలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి [19].

రోడ్డు రవాణా

హైదరాబాదులోని ఒక ఫై ఓవరు

హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉన్నది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు మరియు కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పటణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-9 మరియు ఎన్‌హెచ్-202 నగరంలో నుండే వెళ్తుంటాయి.

హైదరాబాదు నగరం లోపలకూడా అత్భుతమైన రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు 3-లేన్ సౌకర్యము ఉన్నది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగానుఔటర్ రింగు రోడ్డు నిర్మాణము తల పెట్టారు. ఇందుకు మొదటి దశకు 500 కోట్లు, మలిదశకు 2500 కోట్లతో ప్రణాలికలు కూడా సిద్దంచేశారు[20]. మొత్తం 160కీమీల పొడవు ఉండే ఈ రింగురోడ్డు ఇంకో 4-5 సంవత్సరాలలో పూర్తవుతుందని ఒక అంచనా.

హైదరాబాదు నగరంలో ప్రయాణ అవసరాలకు ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ, లెక్కకు మిక్కిలి సిటీ బస్సులను నడుపుతుంది. ఇక్కడ ఉన్న మహత్మా గాంధీ బస్ స్టేషను 72 ప్లాట్ఫారాలతో ఆసియాలోకెల్లా అతిపెద్ద బస్‌స్టేషనుగా పేరు సంపాదించింది. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం.

భౌగోళికము

హైదరాబాదు దాదాపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము మధ్యలో తెలంగాణ ప్రాంతములో ఉన్నది. ఇది దక్కను పీఠభూమిపై సముద్రమట్టము నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు).

గణాంకాలు

2001 జనాభా లెక్కల ప్రకారము నగర జనాభా 36.9 లక్షలుగా అంచనా వేయబడినది. కానీ మహానగర ప్రాంతము యొక్క జనాభా 63.9 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. హైదరాబాదు లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. తెలుగు, ఉర్దూ, హిందీ ఎక్కువగా మాట్లాడే భాషలు. వ్యాపార వ్యవహారాల్లో ఇంగ్లీషు ఎక్కువగానే వాడుతారు. భారత దేశములోని అనేక ప్రాంతములనుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు.

సంస్కృతి

ఛార్మినార్ నుండి ఒక దృశ్యం

హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. సిక్కులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు తెలుగు, ముస్లిములు ఉర్దూ మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి.


ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను ఖచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు.

రుచులు

హైదరాబాదు రుచులు మిగతా భారతదేశపు రుచుల కంటే భిన్నంగా ఉంటాయి. మొఘలుల రుచులతో కలిసిన తెలంగాణా వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. బిరియానీ, బగారాబైంగన్ (గుత్తి వంకాయ), ఖుబానీ కా మీఠా, డబల్ కా మీఠా, హలీమ్, ఇరానీ చాయ్ మొదలైనవి ఇక్కడి ప్రముఖ వంటకాల్లో కొన్ని. చాలామంది హైదరాబాదీ ముస్లింలు పని చేయడానికి మధ్య ప్రాచ్యము అందులో ప్రత్యేకముగా దుబాయి వెళ్ళడము వలన, ఇప్పుడు హలీం ఆ ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందినది.

బావర్చీ, సికింద్రాబాద్ లోని ప్యారడైజ్, వివిధ ప్రదేశాల్లో ఉన్న హైదరాబాద్ హౌస్ లు బిరియానీ కి పెట్టింది పేరు. ఏ కెఫేలకి వెళ్ళినా ఆలూ సమోసా ఇరానీ చాయ్ లు తక్కువ ధరలకే జంటనగరాల్లో లభిస్తాయి. కోఠి లోని గోకుల్ ఛాట్ భండార్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది.

క్రీడలు

క్రికెట్ తోపాటు అనేక ఇతర క్రీడలు కూడా హైదరాబాదులో ప్రాచుర్యం పొందాయి. 2005 లో హైదరాబాదులో జరిగిన మొదటి ప్రీమియర్ హాకీ లీగ్ లో హైదరాబాదు సుల్తానులు జట్టు కప్పు గెలిచింది. ఇక్కడ లాల్ బహదూర్ స్టేడియము, జి.ఎం.సి.బాలయోగి స్టేడియము, కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియము మొదలైన ప్రముఖ క్రీడా కేంద్రాలున్నాయి. ఇప్పటికే ఉన్న స్టేడియములకు అదనంగా ఒక కొత్త క్రికెట్ స్టేడియము - రాజీవ్ క్రికెట్ స్టేడియము - 2005 లో ప్రారంభోత్సవం చేసుకుంది.

ప్రస్తుత సమస్యలు

తాగునీటి సమస్య హైదరాబాదు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల్లో ఒకటి. హిమాయత్ సాగర్, సింగూరు జలాశయం, కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. కృష్ణా నది నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

దక్కను పీఠభూమి పైనున్న హైదరాబాదు పెద్ద ఎర్రరాళ్ళతో కూడుకొని ఉన్నది. నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా ఈ రాళ్ళను పగలగొట్టడం జరుగుతూ ఉంది. ఇది పర్యావరణంపై ప్రభావం చూపుతుండడంతో శిలా సంరక్షణ సమితి పేరుతో ఏర్పడిన ఒక సంస్థ రాళ్ళను సంరక్షించే పనికి నడుం కట్టింది.

మతఘర్షణలకు, ఉద్రిక్తతలకు హైదరాబాదు తరచూ గురవుతూ ఉంటుంది. హిందూ, ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఘర్షణలకు అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా ఘర్షణలను చాలావరకు నివారించగలిగినా ఉద్రిక్తతలు మాత్రం అంతగా తగ్గుముఖం పట్టలేదు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ తీవ్రవాదుల కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చాయి.

ఆకర్షణలు

సచివాలయం ప్రధాన ద్వారం
హైదరాబాదు అబిడ్స్ నందలి బిగ్ బజార్
హైదరాబాదులోని ఇస్కాన్ దేవాలయ గోపురం

*టాంక్ బండ్ హైదరాబాద్-సికిందరాబాద్ జంటనగరాలను కలుపుతున్న మార్గము

  • లుంబిని పార్కు

హైదరాబాదు]] నగరంలోని ఒక ఉద్యానవనం. ఇది హుస్సేన్ సాగర్ ఒడ్డున, సచివాలయం ఎదురుగా ఉన్నది. ఇక్కడ నుండి బుద్దవిగ్రహం దగ్గరకు బోటులో వెళ్ళవచ్చు ఇంకా వివిధ రకాలయిన బోటులుపై షికారు చేయవచ్చు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది


  • పబ్లిక్ గార్డెన్స్- శాసనసభ, జూబిలీ హాలు వంటీ కట్టడాలతో కూడిన చక్కటి వనం.
  • లక్ష్మీ నారాయణా యాదవ్ పార్క్- ఈ యస్ ఐ వద్ద : లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు హైదరాబాదు లోని ప్రముఖ పార్కుల్లో ఒకటి. ఇది ESI బస్టాపు నుండి కొద్దిగా లోనికి వెళ్తే వస్తుంది. పార్కు చక్కగా నిర్వహించబడుతూ, ఆహ్లాదకరంగా ఉంటుంది.
  • లాడ్ బజార్- చార్మినారుకు పశ్చిమాన ఉంది. గాజులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది.
  • అష్టలక్ష్మి దేవాలయం - దిల్ షుక్ నగర్ దగ్గరి వాసవి కాలనీ లో ఉంది.
  • ఓషన్ పార్కు,మౌంట్ ఓపెరా వంటి థీమ్ పార్కులు కలవు.
  • ఇస్కాన్ దేవాలయం

ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ భక్తుల సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతను, కృష్ణ తత్వాన్నీ ప్రచారం చేస్తుంటారు. ప్రతి పట్టణములోనూ కృష్ణ మందిర నిర్మాణములు చేపట్టి వ్యాప్తి చేస్తుంటారు. హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ రోడ్డులో తపాలా కార్యాలయానికి చేరువలో ఉంటుంది.[21]

  • బిగ్ బజార్ -
  • శిల్పారామం
లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు
లుంబిని పార్కు ముఖ ద్వారం

మల్టీప్లెక్సు థియేటర్లు

హైదరాబాదు నందు మొత్తం ఆరు మల్టీప్లెక్సులు కలవు.

  • ఐనాక్స్ - జివికె వన్ మాల్, బంజారా హిల్స్, రోడ్డు నెం 1
  • సినిమ్యాక్స్ - ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఎదురుగా, బంజారా హిల్స్, రోడ్డు నెం 2
  • బిగ్ సినిమాస్ - బిగ్ బజార్ కాంప్లెక్సు, అమీర్ పేట
  • పి వి ఆర్ - సెంట్రల్ మాల్, పంజగుట్ట
  • ప్రసాద్స్ ఐమ్యాక్స్ - ఎన్ టీ ఆర్ గార్డెన్స్ ప్రక్కన, ఎన్ టీ ఆర్ మార్గ్
  • సినీ ప్లానెట్ - కొంపల్లి

పుస్తక శాలలు

  • క్రాస్ వర్డ్, సిటీ సెంట్రల్ మాల్, బంజారా హిల్స్
  • ల్యాండ్ మార్క్, బంజారా హిల్స్

మరిన్ని చిత్రాలు

చూడండి

మూలాలు

  1. World Gazetteer:India - largest cities (per geographical entity) నుండి 28/10/2006న సేకరించబడినది.
  2. ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా నుండి 28/10/2006 న సేకరించబడినది.
  3. హైదరాబాదు అధికారిక వెబ్‌సైటు నుండి హైదరాబాదు చరిత్ర గురించి 29/10/2000న సేకరించబడినది.
  4. ఆర్.ప్లంకెట్, టి.కాన్నన్, పి.డేవిస్, పి.గ్రీన్‌వే మరియు పి.హార్డింగ్‌లు, (2001)లో రాసిన Lonely Planet South India అనే పుస్తకములోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: Lonely Planet
  5. హైదరాబాదుకు ఆ పేరు ఎలా వచ్చింది ఇండియా ట్రావెల్ టైంస్ సైటు నుండి మే 12, 2007న సేకరించబడినది
  6. రామోజి ఫిలిం సిటీ వెబ్‌సైటు నుండి 28/10/2006న సేకరించబడినది.
  7. గిన్నీసు బుక్కులో అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిలం సిటీ స్థానము, 28/10/2006న సేకరించబడినది.
  8. జీనోము వ్యాలీ నుండి 28/10/2006 న సేకరించబడినది.
  9. ఏపి ప్రభుత్వ సైటు నుండి 28/10/2006న సేకరించబడినది.
  10. ఎసెండాస్ ఇంఫోసిటీ వెబ్‌సైటు నుండి 28/10/2006న సేకరించబడినది.
  11. ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్త వెబ్‌సైటులో సంస్కృతి గృహసముదాయం గురించిన వివరణ, 28/10/2006న సేకరించబడినది.
  12. ఎకనామిక్ టైంస్లో ఫ్యాబ్ సిటీ ఒప్పందం గురించి 10/2/2006న వచ్చిన వార్త, 28/10/2006న సేకరించబడినది.
  13. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; mayor అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  14. హైదరాబాదు నగరపాలక సంస్థ వెబ్‌సైటు నుండి ప్రస్తుత మునిసిపల్ కమిషనరు వివరాలు 29/10/2006న సేకరించబడినది.
  15. ది హిందూ ఆంగ్ల దినపత్రిక నుండి వివరాలు రాజీవ్ గాంధీ విమానాశ్రయ ప్రారంభం, 20/06/2008న సేకరించబడినది.
  16. భారత విమానాశ్రయాల అధికార సంస్థ (AAI) వెబ్‌సైటు నుండి బేగుంపేట విమానాశ్రయ సమాచారం, 29/10/2006న సేకరించబడినది.
  17. శంషాబాద్ లో నిర్మించబోయే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వివారాలు 29/10/2006న సేకరించబడినది.
  18. శంషాబాద్ లో నిర్మించబోయే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సౌకర్యాలు 29/10/2006న సేకరించబడినది.
  19. ద హిందూ బిజినెస్ లైన్లో మార్చి 14, 2005 న వచ్చిన వార్త. 29/10/2006న సేకరించబడినది.
  20. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వివరాలు 29/10/2006న సేకరించబడినది.
  21. http://www.iskcon-hyderabad.com/directions.html

బయటి లింకులు