పొంగలి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సృష్టించాను
(తేడా లేదు)

10:58, 6 ఆగస్టు 2009 నాటి కూర్పు

తమిళనాడు, కర్ణటక, ఆంధ్ర ప్రదేశ్ లలో అన్నం తో చేయబడు అల్పాహారం. అయితే రోజూ తినే అన్నం కంటే కొద్దిగా ఎక్కువగా ఉడికించటం వలన ఇది మెత్తగా ఉంటుంది. పొంగలి రెండు రకాలు. చక్కెర పొంగలి, పొంగలి. చక్కెర పొంగలి తీయగా ఉంటుంది. దీనిని స్వీట్ గా తింటారు. పొంగలి లో మిరియాలు వేస్తారు. రెంటినీ ప్రసాదానికి కూడా వినియోగిస్తారు. ఇష్ట ప్రకారం రెంటిలోనూ జీడి పప్పు వేసుకొనవచ్చును.

తమిళనాడు, ఆంధ్ర ల లో పొంగలి ఒకే రకంగా ఉంటుంది. ఉప్మా లాగా హస్తం గరిటె తో ముద్దలు ముద్దలు గా పెట్టుకోవటానికి వీలౌతుంది. వేరుశనగ కాయలతో లేదా పప్పులతో చేసిన పచ్చడి, కొబ్బరి పచ్చడి, సాంబారు తో మరింత రుచిగా ఉంటుంది. మినప వడ లని కూడా ఇందులో నంజుకొంటారు.

కర్ణాటక లో పొంగలి లో పాలని వినియోగిస్తారు. అందువల్ల ఇది పాయసం లాగా ద్రవ పదార్థం లాగా ఉంటుంది. వడ్డించటానికి గుంట గరిటెలు వాడవలసి వస్తుంది. ఈ పొంగలి లోకి మినప వడ అంతగా రుచించదు.

తమిళులు, కన్నడిగులు పొంగల్ అంటారు. ఆంధ్రులు పొంగలి అంటారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పొంగలి&oldid=445301" నుండి వెలికితీశారు