షిండ్లర్స్ లిస్ట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: vi:Schindler's List; cosmetic changes
చి యంత్రము మార్పులు చేస్తున్నది: vi:Bản danh sách của Schindler
పంక్తి 74: పంక్తి 74:
[[tr:Schindler'in Listesi]]
[[tr:Schindler'in Listesi]]
[[uz:Schindlerning roʻyxati]]
[[uz:Schindlerning roʻyxati]]
[[vi:Bản danh sách của Schindler]]
[[vi:Schindler's List]]
[[zh:辛德勒的名单]]
[[zh:辛德勒的名单]]

14:12, 6 ఆగస్టు 2009 నాటి కూర్పు

Schindler's List
theatrical poster
దర్శకత్వంSteven Spielberg
తారాగణంLiam Neeson
Ben Kingsley
సినిమా నిడివి
195 minutes
బడ్జెట్$25,000,000
బాక్సాఫీసు$321 million

షిండ్లర్స్ ఆర్క్ అనే నవల ఆధారంగా స్టీవెన్ స్పీల్బర్గ్ 1993లో తీసిన చిత్రం ఇది. రెండవ ప్రపంచ యుద్ద కాలంలో యూదుల పైన జర్మనులు మారణహోమం సాగిస్తున్నపుడు జర్మన్ వ్యాపారవేత్త అయిన ఆస్కార్ షిండ్లర్ వెయ్యిమందికి పైగా యూదులను తన ఫ్యాక్టరీలో ఉద్యోగులుగా నియమించి వారి ప్రాణాలను కాపాడిన యథార్థ సంఘటన ఈ చిత్రానికి మూలం. 2007 లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిటూట్ ఈ చిత్రాన్ని సినీ చరిత్రలో అత్యున్నత 100 చిత్రాలో ఎనిమిదవ చిత్రంగా ఎన్నుకున్నది.

కథాంశం

1939లో చెకోస్లోవేకియాకు చెందిన ఆస్కార్ షిండ్లర్ అనే ధనవంతుడు తక్కువ కూలికి పని చేసే యూదులున్న క్రాకో అనే పట్టణానికి వస్తాడు. అప్పటికే నాజీ సభ్యుడయిన షిండ్లర్ ఆ పట్టణాన్ని తన గుప్పిట ఉంచుకున్న జర్మన్ సైన్యానికి పెద్ద ఎత్తున లంచాలు చెల్లించి యూదులను అతి తక్కువ కూలికి పని చేసే విధంగా తన ఫ్యాక్టరీకి రప్పించుకుంటాడు. జర్మన్ సైన్యానికి అవసరమయిన చిన్న చిన్న పరికరాలు తయారు చేసి లాభాలు గడిస్తూ జర్మనుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు.

అమోన్ గోథ్ అనే క్రూరుడయిన మిలటరీ అధికారి ఆ పట్టణంలో నిర్భంధ కూలీల క్యాంపు నిర్మించడానికి వచ్చి ఎదురు తిరిగినవారిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపించడం కళ్ళారా చూసి షిండ్రల్ చలించిపోతాడు. డబ్బుకంటే మనిషి ప్రాణం ఎంతో విలువయినది అని తెలుసుకుంటాడు. కొద్ది రోజులకు ఆ పట్టణాన్ని వదిలి అక్కడున్న యూదులను 'ఆస్విచ్' అనే ప్రాంతానికి తరలించమని జర్మన్ సైనికులకు ఆదేశాలు అందుతాయి. ( ఆస్విచ్ అన్నది అతి పెద్ద జర్మన్ 'కాన్సంట్రేషన్ క్యాంపు. ఈ క్యాంపులో జర్మన్ సైన్యం చేతిలో పది లక్షలకు పైగా యూదులు హింసలకు గురి అయి మరణించారు. )

తన దగ్గర పని చేస్తున్న యూదులు అక్కడికి వెళ్తే మరణిస్తారు అని తెలుసుకున్న షిండ్లర్ వారి ప్రాణాలను కాపాడడానికి అమోన్ గోథ్‌కు తన వద్ద ఉన్న మొత్తం ధనం లంచంగా చెల్లించి దాదాపు 1100 మందిని సురక్షితమయిన మరో ప్రాంతానికి తరలించగలుగుతాడు.

అప్పుడే రష్యా జర్మని సైన్యాన్ని ఓడించడంతో యూరోప్‌లో యుద్దం ముగుస్తుంది. జర్మన్ అయిన షిండ్లర్ ఆ ప్రాంతం విడిచి వెళ్ళవలసి వస్తుంది. షిండ్లర్ కు వీడ్కోలు చెప్పడానికి కార్మికులు వచ్చి తమ ప్రాణాలు కాపాడిన గొప్పవాడిగా కీర్తిస్తూ "He who saves the life of one man, saves the world entire." అని ఉన్న ఉంగరం ఇస్తారు. తన దగ్గర ఇంకా డబ్బు ఉంటే మరి కొందరి ప్రాణాలు కాపాడగలిగేవాడినని బాధపడుతూ షిండ్లర్ తన కారులో భార్యతో కలసి వెళ్ళిపోతాడు.

నిర్మాణ విశేషాలు

షిండ్లర్ పాత్ర పోషించడానికి కెవిన్ కాస్ట్నర్, మెల్ గిబ్సన్ వంటి నటులు ఆసక్తి చూపినా లియం నీసన్‌ను ఎన్నుకున్నాడు స్టీవెన్ స్పీల్బర్గ్. దాదాపు 30,000 మంది ఎక్‌స్ట్రా నటులు కావలసి వచ్చింది. షూటింగ్ పోలండ్ లోని క్రాకో వద్ద మార్చి 1 1993 న మొదలయి 71 రోజుల్లో ముగిసింది. యదార్థ సంఘటనలు జరిగిన ప్రదేశంలోనే దాదాపు మొత్తం షూటింగ్ జరిగింది. చిత్రానికి దర్శకత్వం చేస్తున్నపుడు స్పీల్బర్గ్ మానసికంగా ఎంతో క్షోభ పడ్డాడు. ముఖ్యముగా యూదులను నగ్నంగా పరిగెత్తించే దృశ్యం అందరినీ తీవ్రంగా కలచివేసింది. 40 శాతం కు పైగా చేతితో కెమెరాలు పట్టుకొని తీసిన ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్ లో చిత్రీకరింబడింది.

స్పందన

విడుదలయిన తర్వాత ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా $321.2 మిలియన్లు కలెక్షన్లు సాధించింది. మొత్తం ఏడు ఆస్కార్ అవార్డులు గెలుచుకొంది. 2008 నాటికి ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో అత్యుత్తమ చిత్రాలలో ఏడవ స్థానంలో ఉంది. ఈ చిత్రం అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 10 టాప్ 10 చిత్రాలు జాబితాలో ఎపిక్స్ విభాగంలో మూడవ స్థానంలో నిలిచింది.

బయటి లింకులు