హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
పంక్తి 45: పంక్తి 45:
ఇక్కడ హస్త కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శింప బడతాయి.
ఇక్కడ హస్త కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శింప బడతాయి.


==గోల్కొండ==
==[[గోల్కొండ]]==
[[బొమ్మ:Golkonda_Fort_View.jpg|right|250px|thumb|గోల్కొండ కోట ఒక దృశ్యం]]
[[బొమ్మ:Golkonda_Fort_View.jpg|right|250px|thumb|గోల్కొండ కోట ఒక దృశ్యం]]
భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన [[గోల్కొండ కోట]]. దీని నిర్మాణ శైలి, రక్షణాత్మకమైన కట్టడం సందర్శకులను అబ్బుర పరుస్తాయి. దీనిని హైదరాబాదు నవాబు [[కులీ కుతుబ్ షా]] నిర్మించాడు.
భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన [[గోల్కొండ కోట]]. దీని నిర్మాణ శైలి, రక్షణాత్మకమైన కట్టడం సందర్శకులను అబ్బుర పరుస్తాయి. దీనిని హైదరాబాదు నవాబు [[కులీ కుతుబ్ షా]] నిర్మించాడు.

17:51, 16 ఆగస్టు 2009 నాటి కూర్పు

హైదరాబాదులో ఉన్నవివిధ ప్రదేశాల గురించి ఈ వ్యాసంలో చదువవచ్చును. హైదరాబాదు లో చాలా ప్రదేశాలకు చివరన ఆబాద్ అని, గూడ అన్న పదాలు వస్తాయి. "ఆబాద్" అనగా హిందీలో వర్థిల్లాలి అని అర్థం. ఉదాహరణకి ఖైరతాబాద్ (ఖైరత్ + ఆబాద్) అంటే ఖైరత్ వర్థిల్లాలి అని అర్థం. ఇది హైదరాబాదు లో కూడా చూడొచ్చు. హైదర్ ఆలీ వర్థిల్లాలి అని అర్థం. భాగ్యనగరం, అత్రఫ్-ఎ-బల్దా లు నగరానికి పూర్వపు పేర్లు.

హైదరాబాదు నగరంలో ఒక భాగం

అమీర్ పేట

అత్యధిక సాఫ్టువేరు ఇన్స్టిట్యూటులు ఉండే ప్రదేశం. ముఖ్యంగా, ఆదిత్య ఎంక్లేవ్, మైత్రీ వనములలో, వాటి చుట్టుప్రక్కల ఎక్కువ కలవు. దీని వలన ఇక్కడ చాలా హాస్టళ్ళు నెలకొని ఉన్నాయి. రెడ్డీస్ ల్యాబ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, మినర్వా హోటల్ ఇక్కడే ఉన్నాయి.

సంజీవ రెడ్డి నగర్ (ఎస్. ఆర్. నగర్)

ఐ.పీ.ఎస్ అధికారి ఉమేశ్ చంద్ర ని నక్సలైట్ల చేతిలో ప్రాణాలని కోల్పోయింది ఈ కూడలి లోనే.

ఎస్.ఆర్.నగర్

సోమాజీగూడ

ముఖ్యమంత్రి నివాసం ఉండే చోటు. కీర్తిలాల్ జ్యువెలర్స్, పుల్లారెడ్డి నేతి మిఠాయిల దుకాణము, యశోద ఆసుపత్రి, నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (NIMS) ఇక్కడ కలవు.

ఇ ఎస్ ఐ

ఈ ప్రదేశం లో ESI ఆసుపత్రి కలదు

అబీడ్స్

దస్త్రం:Hyderabad Abids street.JPG
హైదరాబాదు యాబిడ్స్‌లో వీధి

ఈ ప్రదేశంలో అబీదు అనబడు ఒక మధ్యప్రాచ్య వ్యాపారవేత్త ఉండేవాడు. అరుదైన, విలువైన రాళ్ళను కోఠీ లో ఉన్న నవాబుకి బహుమతులుగా ఇచ్చేవాడు. అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ తపాలా ప్రధాన కార్యాలయం కలదు. ఇంకనూ పుల్లారెడ్డి మిఠాయిల దుకాణము, బిగ్ బజార్, సిటీ సెంట్రల్ మాల్, తాజ్ మహల్ హోటల్, బ్రాండ్ ఫ్యాక్టరీ లు కలవు. సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ఎక్కువగా అమ్మబడు ప్రదేశం.

కోఠి

మహిళా కళాశాల, ఉస్మానియా వైద్య కళాశాల, గోకుల్ ఛాట్ భండార్ కలవు. ప్రక్కనే ఉన్న సుల్తాన్ బజార్ అన్ని రకాల దుకాణాలకి పేరు పొందినది. ఫస్ట్ హ్యాండ్ పుస్తకాలతో బాటు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కూడా దొరుకుతాయి.

దోమల్ గూడ

ఇద్దరు మల్ల యోధులు నివాసం ఉండటం వలన దీనికి ఈ పేరు వచ్చినది. (దోమల గూడ కాదు, దో మల్ గూడ)

పంజగుట్ట

హైదరాబాద్ సెంట్రల్ మాల్ ఉండేది ఇక్కడే

లకిడీ కా పుల్

కర్ర తో చేసిన వంతెన అని అర్థం. నగరానికి నడి బొడ్డు. నగర కూడళ్ళలో ఇది ప్రధానమైనది. సాయంత్రం 5.00 గం నుండి రాత్రి 10.00 గం వరకు ఇక్కడ ట్రాఫిక్ దుర్భేద్యం. పోలీసు కంట్రోలు కార్యాలయము, అశోక హోటల్, రవీంద్ర భారతి ఇక్కడ కలవు. (తమాషా ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ ఎ సి గార్డ్స్ దగ్గర పిక్చర్ ప్యాలెస్ అనే సినిమా హాలు కట్టబోతున్నారని తెలిసి దీనిని పిక్చర్ ప్యాలెస్ గానే వ్యవహరించేవారు. కానీ, అనివార్య కారణాల వలన దానిని నిర్మించలేదు. తర్వాత కూడా చాలాకాలం అదే పేరుతో వ్యవహరించబడేది. ఇప్పుడున్న గంగా-జమునా కేఫ్ యే ఆ ప్రదేశం.)

బేగంపేట

ఇదివరకు ఇక్కడ విమానాశ్రయం ఉండేది. ఇప్పుడు దానిని షంషాబాదుకి తరలించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూలు, షాపర్స్ స్టాప్, ప్యాంటలూన్స్ ఇక్కడే కలవు.

బంజారా హిల్స్

బంజారాహిల్స్‌లో తాజ్ కృష్ణా హోటల్

సినిమా తారలు, రాజకీయవేత్తలు ఉండే ఖరీదైన ప్రదేశం. తాజ్ బంజారా హోటల్, జి వి కే వన్ మాల్ ఇక్కడ కలవు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాన్స్ టర్ ఇండియా కూడా ఇక్కడే ఉన్నాయి. అబీడ్సు లోని సిటీ సెంట్రల్ కన్నా ఈ ప్రదేశంలో ఉన్న సిటీ సెంట్రల్ కే ఎక్కువ గుర్తింపు వచ్చినది.

జుబిలీ హిల్స్

బంజారా హిల్స్ ని ఆనుకుని ఉన్న మరొక ప్రదేశము. సంపన్నులు ఉండే ప్రదేశం.

హైటెక్ సిటీ

హైదరాబాద్ లోని సాఫ్ట్‌వేర్ సంస్థలకు ప్రధాన కేంద్రం. ఇక్కడ ఉన్న సైబర్ టవర్స్, సైబర్ పెర్ల్, సైబర్ గేట్‌వే, రహేజా మైండ్‌స్పేస్ మొదలైన ఐటి పార్కుల్లో దేశ విదేశాలను చెందిన అనేక కంపెనీలు కొలువై ఉన్నాయి. ఒకప్పుడు కొండలు గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రదేశం సాఫ్ట్‌వేర్ సంస్థల పుణ్యమా అని హైదరాబాదు కే తలమానికంగా మారింది.

శిల్పారామం

శిల్పారామం ముఖద్వారం

ఇక్కడ హస్త కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శింప బడతాయి.

గోల్కొండ

గోల్కొండ కోట ఒక దృశ్యం

భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన గోల్కొండ కోట. దీని నిర్మాణ శైలి, రక్షణాత్మకమైన కట్టడం సందర్శకులను అబ్బుర పరుస్తాయి. దీనిని హైదరాబాదు నవాబు కులీ కుతుబ్ షా నిర్మించాడు.

చార్మినార్

చార్మినార్ అంటే నాలుగు మినార్లు కలది అని అర్థం. కలరా నిర్మూలనకి జ్ఞాపకార్థంగా నిర్మించబడిన కట్టడం.

గచ్చీబౌలి

నగర రణగొణ ధ్వనులకి దూరంగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశం. హిల్ రిట్జ్ స్ప్రింగ్స్ హోటల్, విప్రో టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్, పొలారిస్, డెలాయిట్ వంటి బహుళ జాతీయ సంస్థలు నింగిని తాకే ఆకాశహర్మ్యాలలో ఉన్నవి.

నాంపల్లి

నాంపల్లి రైల్వే స్టేషను ఉండే చోటు.

ఇమ్లీబన్

మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉండే చోటు. ఆసియాలోనే అతి పెద్ద బస్ స్టేషన్లలో ఒకటి.

శంషాబాదు

బేగంపేట నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తరలించిన చోటు. జీ ఎం ఆర్ (గ్రంధి మల్లికార్జున రావు) గ్రూపు ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ నాణ్యతలతో నిర్మించినది.


ఇవి కూడా చూడండి

హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శనశాల లోపటి దృశ్యం

హైదరాబాదుకు సంబంధించిన కొన్ని వ్యాసాలు

మూలాలు

బయటి లింకులు