హదీసులు: కూర్పుల మధ్య తేడాలు
చి యంత్రము కలుపుతున్నది: lt:Hadisai |
చి యంత్రము కలుపుతున్నది: pnb:حدیث |
||
పంక్తి 111: | పంక్తి 111: | ||
[[no:Hadith]] |
[[no:Hadith]] |
||
[[pl:Hadis]] |
[[pl:Hadis]] |
||
[[pnb:حدیث]] |
|||
[[pt:Hadith]] |
[[pt:Hadith]] |
||
[[ru:Хадис]] |
[[ru:Хадис]] |
05:00, 17 ఆగస్టు 2009 నాటి కూర్పు
హదీసులు (హదీసు యొక్క బహువచనం) మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే హదీసులు అంటారు. ఈ హదీసులు, సున్నహ్ మరియు ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.
సనద్ మరియు మతన్ లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.
సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు
సున్నీ ముస్లిం ల ప్రకారం ఆరు హదీసుల క్రోడీకరణలు గలవు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం అత్యంత ప్రాముఖ్యమైనవి.
క్రింద నుదహరింపబడిన ఆరు హదీసుల క్రోడీకరణలు చూడండి.
సహీ బుఖారి
(ఇమామ్ బుఖారి) = (7275 హదీసులు) అధికారిక క్రోడీకరణలు (అరబ్బీ: الجامع الصحيح, అల్-జామి అల్-సహీ [1]) లేదా ప్రఖ్యాతమైన అల్-బుఖారీ యొక్క అధికారితా పూర్ణ (Arabic: صحيح البخاري, సహీ అల్-బుఖారి) సున్నీ ముస్లింల ఆరు ప్రధాన హదీసులలో ప్రథమమైనది. సున్నీ ముస్లింల ప్రకారం ఇది అత్యంత నమ్మదగినది. [2]. దీనిని క్రోడీకరించినవారు ముహమ్మద్ అల్-బుఖారి. ఫత్వా ల ప్రకటనలకు ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగిస్తారు.
సహీ ముస్లిం
(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు) సహీ ముస్లిం (అరబ్బీ: صحيح مسلم, ) ఆరు ప్రధాన హదీసుల క్రోడీకరణల్లో ఒకటి. ఇవి మహమ్మదు ప్రవక్త యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. సున్నీ ముస్లింలలో రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.
సునన్ అబి దావూద్
(అబూ దావూద్)
సునన్ అల్-తిర్మజి
(అల్-తిర్మజి)
సునన్ అల్-సొగ్రా
(అల్-నసాయి)
సునన్ ఇబ్న్ మాజా
(ఇబ్న్ మాజా)
షియా ముస్లింల ప్రామాణిక హదీసులు
షియా ముస్లింల ప్రకారం నాలుగు వర్గాల హదీసులు మాత్రమే ప్రామాణికమైనవి. అవి.
పేరు | సేకర్త | కొలమానం |
ఉసుల్ అల్-కఫి | హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి(329 AH) | 15,176 హదిత్ లు |
మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్ | ముహమ్మద్ ఇబ్న్ బాబుయా | 9,044 |
అల్-తహ్ ధిబ్ | షేక్ ముహమ్మద్ తూసీ | 13,590 |
అల్-ఇస్తిబ్సర్ | షేక్ ముహమ్మద్ తూసీ | 5,511 |
మూలాలు