భారత న్యాయ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొలక
 
విస్తరణ
పంక్తి 1: పంక్తి 1:
భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వహణ శాఖలతోపాటు స్వతంత్ర న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం, శాసన, కార్యనిర్వహణ శాఖలు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాయో లేదో సమీక్షించడం మొదలైన కార్యకలాపాల ద్వారా భారత న్యాయ వ్యవస్థ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ పునాది రాయి లాంటిది.

==స్వతంత్ర న్యాయ వ్యవస్థ==
ఎలాంటి భయం, పక్షపాత ధోరణి లేకుండా న్యాయాన్నందించే స్వేచ్ఛ న్యాయమూర్తులకు ఉండటం; వీరిచ్చే తీర్పులు, జారీ చేసే ఉత్తర్వులు శాసన, కార్యనిర్వాహక శాఖ ఒత్తిళ్ళకు లోను కాకపోవడమే స్వతంత్ర న్యాయవ్యవస్థ. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులకు రాజ్యాంగ బద్ధంగా పదవీ భద్రత ఉంది. న్యాయముర్తులను తొలగించాలంటే పార్లమెంటులోని ఉభయసభల్లో ప్రత్యేక మెజారిటో ఆమోదం అవసరం.
*సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలు సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఇలా వేతనాలు పొందడానికి శాసన సభల ఆమోదం అవసరం లేదు.
*న్యాయముర్తుల విధి నిర్వహణ సంబంధమైన ప్రవర్తనను పార్లమెంటులో లేదా రాష్ట్ర శాసనసభల్లో చర్చించడాన్ని నిషేధించారు.
*సుప్రీంకోర్టు, హైకోర్టులకు తమను ధిక్కరించిన వారిని శిక్షించే అధికారం ఉంది.
*50వ అధికరణం ప్రకారం న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థనుంచి వేరు చేశారు.

15:13, 14 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వహణ శాఖలతోపాటు స్వతంత్ర న్యాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటం, శాసన, కార్యనిర్వహణ శాఖలు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటున్నాయో లేదో సమీక్షించడం మొదలైన కార్యకలాపాల ద్వారా భారత న్యాయ వ్యవస్థ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ పునాది రాయి లాంటిది.

స్వతంత్ర న్యాయ వ్యవస్థ

ఎలాంటి భయం, పక్షపాత ధోరణి లేకుండా న్యాయాన్నందించే స్వేచ్ఛ న్యాయమూర్తులకు ఉండటం; వీరిచ్చే తీర్పులు, జారీ చేసే ఉత్తర్వులు శాసన, కార్యనిర్వాహక శాఖ ఒత్తిళ్ళకు లోను కాకపోవడమే స్వతంత్ర న్యాయవ్యవస్థ. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులకు రాజ్యాంగ బద్ధంగా పదవీ భద్రత ఉంది. న్యాయముర్తులను తొలగించాలంటే పార్లమెంటులోని ఉభయసభల్లో ప్రత్యేక మెజారిటో ఆమోదం అవసరం.

  • సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలు సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఇలా వేతనాలు పొందడానికి శాసన సభల ఆమోదం అవసరం లేదు.
  • న్యాయముర్తుల విధి నిర్వహణ సంబంధమైన ప్రవర్తనను పార్లమెంటులో లేదా రాష్ట్ర శాసనసభల్లో చర్చించడాన్ని నిషేధించారు.
  • సుప్రీంకోర్టు, హైకోర్టులకు తమను ధిక్కరించిన వారిని శిక్షించే అధికారం ఉంది.
  • 50వ అధికరణం ప్రకారం న్యాయవ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థనుంచి వేరు చేశారు.