పప్పు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎రకరకాల పప్పు: కంది పప్పు బొమ్మ
పంక్తి 1: పంక్తి 1:
'''పప్పు''' లేదా '''పప్పు కూర''' [[ఆంధ్రులు]] ఎంతో ఇష్టంగా [[అన్నం]]లో కలుపుకొని తినే పదార్థం. తెలుగు వారి [[భోజనం]]లో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు. వివిధ రకాల పప్పు దినుసులకు ఉడికించి రుచికరమైన [[కూర]]గా తింటారు. రుచి కోసం చాలా రకాల మసాలా, [[కూరగాయలు]] మొదలైన వాటిని చేర్చి అందరికీ నచ్చే విధంగా తయారుచేస్తారు. ఉత్తర హిందుస్థానంలో పప్పు కూరల్ని [[రొట్టె]]లు, [[చపాతీ]]లతో కలిపి తింటారు.
'''పప్పు''' లేదా '''పప్పు కూర''' [[ఆంధ్రులు]] ఎంతో ఇష్టంగా [[అన్నం]]లో కలుపుకొని తినే పదార్థం. తెలుగు వారి [[భోజనం]]లో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు. వివిధ రకాల పప్పు దినుసులకు ఉడికించి రుచికరమైన [[కూర]]గా తింటారు. రుచి కోసం చాలా రకాల మసాలా, [[కూరగాయలు]] మొదలైన వాటిని చేర్చి అందరికీ నచ్చే విధంగా తయారుచేస్తారు. ఉత్తర హిందుస్థానంలో పప్పు కూరల్ని [[రొట్టె]]లు, [[చపాతీ]]లతో కలిపి తింటారు.
==రకరకాల పప్పు==
==రకరకాల పప్పు==
[[File:Masoor dal.JPG|right|thumb|కందిపప్పు]]
* [[కందిపప్పు]]
* [[కందిపప్పు]]
* [[పెసరపప్పు]]
* [[పెసరపప్పు]]

02:28, 21 అక్టోబరు 2009 నాటి కూర్పు

పప్పు లేదా పప్పు కూర ఆంధ్రులు ఎంతో ఇష్టంగా అన్నంలో కలుపుకొని తినే పదార్థం. తెలుగు వారి భోజనంలో తప్పనిసరిగా ఉండేది పప్పు. పప్పు భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళూ వేర్వేరు రకాలుగా చేస్తారు. వివిధ రకాల పప్పు దినుసులకు ఉడికించి రుచికరమైన కూరగా తింటారు. రుచి కోసం చాలా రకాల మసాలా, కూరగాయలు మొదలైన వాటిని చేర్చి అందరికీ నచ్చే విధంగా తయారుచేస్తారు. ఉత్తర హిందుస్థానంలో పప్పు కూరల్ని రొట్టెలు, చపాతీలతో కలిపి తింటారు.

రకరకాల పప్పు

కందిపప్పు

వండే విధం

పప్పుని వివిధమైన పాత్రలలో వండుతారు, పప్పు వండే విధానాన్ని బట్టి రుచిలో తేడా ఉంటుంది. పూర్వం రాచిప్ప (రాతితో చేసిన చిప్ప) లలో పప్పును వండి తినేవారు, ప్రస్తుతం ఎక్కువగా ఉడకడానికని కుక్కర్ లో వండుతున్నారు. సాధారంగా ఉడికిన పప్పుని కవ్వం గానీ, లేక గట్టి గరిటెను గానీ ఉపయోగించి చిదుముతారు దాని వల్ల రుచి ద్విగుణీకృతమవుతుంది.

ప్రాంతాన్ని బట్టి తేడాలు

  • గుజరాతీ పప్పు : పలుచగా ఉంటుంది, కొంచెం పంచదార వెయ్యడం వల్ల తియ్యగా ఉంటుంది
  • అస్సామీ పప్పు: కారం వెయ్యరు, కాయగూరలు వేయ్యరు (ఉత్త పప్పు అనుకోవచ్చు కానీ పలుచగా ఉంటుంది), ఒక్క మెంతులతో పోపు పెడతారు. అన్ని రకాల పప్పు చేస్తారు. మినపప్పు కూడా పప్పు చేస్తారు.
  • బెంగాలి పప్పు: పచ్ ఫోరన్ (అయుదు దినుసులతో) పోపు పెడతారు (ఆ అయిదు: 1. జీల కర్ర 2. మెంతులు 3. శోంపు 4.కాలాజీర (?)5. తెల్ల ఆవాలు) కొంచెం తియ్యగా కూడా (పంచాదార కలిపి) చేస్తారు.
  • ఉత్తర భారతంలో పప్పు: చాల రకాలు ఉన్నయి, దాల్ మఖనీ, మసాలా పప్పు, మొదలైనవి.

భారతీయ పప్పు ప్రపంచ వంటకాల్లోనే ఉత్తమం

భిన్న దేశాల్లో విభిన్న రుచులు చవిచూసిన ఓ బ్రిటన్ రచయిత భారతీయ పప్పుకు సాటి మరే వంటకం లేదంటున్నారు. తన అభిమాన వంటకమైన పప్పును 'లైఫ్ సేవింగ్ డిష్ '(ఎల్ఎస్‌డీ) గా రచయిత సిమోన్ మజుందార్ అభివర్ణిస్తున్నారు. 30 దేశాల్లోని శాకాహార, మాంసాహార వంటకాల్లో ఉత్తమమైన వాటి కోసం అన్వేషించారు. చివరకు భారతీయ పప్పు అత్యుత్తమ వంటకమని తేల్చేశారు. (ఈనాడు19.10.2009)

పప్పుపై సామెతలు జాతీయాలు

  • పప్పులో కాలెయ్యటం
  • పప్పులు ఉడకవు
  • సుద్దపప్పులాగా
  • పప్పుకూటికి ముందు వెట్టిమూటకు వెనక ఉంటాడు
  • అప్పుచేసి పప్పుకూడు

పప్పుమీద పద్యాలు,పాటలు

  • ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య

ఉండ్రాళ్ళ మీదికీ దండు పంపు
కమ్మని నెయ్యయ్య కడు ముద్ద పప్పయ్య
బొజ్జ నిండా తినుము పొరలుకొనుచు

  • పొందూర నొక విప్రుని

విందుకు రాబిలిచి
ఎందెందు ఇష్టమనగా
పప్పందే ఇష్టమని బాపడుబలికెన్

పప్పుకూరలపై వెబ్ సమాచారం

"https://te.wikipedia.org/w/index.php?title=పప్పు&oldid=462355" నుండి వెలికితీశారు