వేదము వేంకటరాయ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[ఫైలు:Vedam Venkataray Sastry.jpg|right|thumb|175px|వేదం వేంకటరాయశాస్త్రి]]'''
[[ఫైలు:Vedam Venkataray Sastry.jpg|right|thumb|175px|వేదం వేంకటరాయశాస్త్రి]]'''
వేదము వేంకట రాయశాస్త్రి''' ([[ఆంగ్లం]]: Vedam Venkataraya Sastry) ([[1853]], [[డిసెంబర్ 21]]<ref>[http://books.google.com/books?id=ylJXAAAAMAAJ&q=vedam+venkataraya+sastry&dq=vedam+venkataraya+sastry Vedam Venkataraya Sastry, Volume 189] By Vedam Venkataraya Sastri పేజీ.70</ref> - [[1929]], [[జూన్ 18]]) సుప్రసిద్ధ పండితుడు, కవి మరియు విమర్శకుడు.
'''వేదము వేంకట రాయశాస్త్రి''' ([[ఆంగ్లం]]: Vedam Venkataraya Sastry) ([[1853]], [[డిసెంబర్ 21]]<ref>[http://books.google.com/books?id=ylJXAAAAMAAJ&q=vedam+venkataraya+sastry&dq=vedam+venkataraya+sastry Vedam Venkataraya Sastry, Volume 189] By Vedam Venkataraya Sastri పేజీ.70</ref> - [[1929]], [[జూన్ 18]]) సుప్రసిద్ధ పండితుడు, కవి మరియు విమర్శకుడు.


==జీవిత సంగ్రహం==
==జీవిత సంగ్రహం==

06:01, 2 నవంబరు 2009 నాటి కూర్పు

వేదం వేంకటరాయశాస్త్రి

వేదము వేంకట రాయశాస్త్రి (ఆంగ్లం: Vedam Venkataraya Sastry) (1853, డిసెంబర్ 21[1] - 1929, జూన్ 18) సుప్రసిద్ధ పండితుడు, కవి మరియు విమర్శకుడు.

జీవిత సంగ్రహం

ఇతడు వేంకట రమణశాస్త్రి మరియు లక్ష్మమ్మ దంపతులకు చెన్నైలో జన్మించాడు. ఈయన 1886లో మద్రాసు క్రైస్తవ కళాశాల లో సంస్కృత పండితపదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించాడు. 1887లో బి.ఎ. పరీక్షలలో ఆంగ్లం మరియు సంస్కృతం లలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. 1916లో సూర్యారాయాంధ్ర నిఘంటువు కు ప్రథాన సంపాదకుడుగా కొంతకాలం పనిచేశాడు.

వెంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషావాది. సాహిత్య ప్రక్రియల్లో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించాడు. ఈయన 1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించాడు. ఈ సంస్థలో వెంకటరాయ శాస్త్రి వ్రాసిన నాటకాలని ప్రదర్శించేవారు. ఈయన మూల నాటకాలలో 1897లో వ్రాసిన ప్రతాపురుద్రీయ నాటకం, 1901లో వ్రాసిన ఉషా నాటకం ప్రముఖమైనవి[2] ఇవేకాక ఈయన అనేక సంస్కృత నాటకాలను తెనుగించాడు.[3] వెంకటరాయ శాస్త్రి 1929, జూన్ 18న తెల్లవారు జామున 5:45కు మద్రాసులో మరణించాడు.

వెంకటరాయ శాస్త్రి 1895లో హర్షుని నాగనందం తెనుగించి అందులోని నీచపాత్రల సంభాషణలకు వ్యవహారిక భాషను ఉపయోగించాడు. ఈ ప్రయోగం సంస్కృత నాటకాల్లో నీచ పాత్రలకు ప్రాకృతాన్ని ఉపయోగించడం లాంటిదేనని సమర్ధించుకున్నాడు. కానీ ఆనాటి సాంప్రదాయవాద సాహితీకారులు ఇది భాషాపతనం, సాహితీవిలువల దిగజారుడు అని విమర్శించారు. ఇందువలన సాహిత్యానికి జరిగిన నష్టాన్ని చర్చించడానికి పండితులు 1898 డిసెంబర్లో మద్రాసులో సమావేశమయ్యారు. ఒకవైపు ఇలా విమర్శకులు విమర్శిస్తూ ఉండగానే, శాస్త్రి పంథాను అనేకమంది సృజనాత్మక సాహితీకారులు అనుకరించారు.[4]

వారసత్వం

వెంకటరాయ శాస్త్రి మనవడి పేరు కూడా వెంకటరాయశాస్త్రే. ఈయన తాతగారి లాగే నాటక రచయిత. వ్యామోహం మొదలైన నాటకాలను రచించాడు. తాతగారి జీవితచరిత్రను "వేదం వెంకటరాయ శాస్త్రి జీవిత సంగ్రహము" పేరుతో వ్రాశాడు. అలాగే తెలుగువారెవరు అనే పరిశోధనా గ్రంథాన్ని కూడా రచించాడు. ఈయన అన్నదమ్ములు వేదము వేంకటరాయశాస్త్రి అండ్ బ్రదర్స్ అనే ప్రచురణాసంస్థను ప్రారంభించి అనేక తెలుగు పుస్తకాలను అచ్చువేశారు.[5]

గౌరవాలు

  • 1920 : ఆంధ్ర మహా సభ చేత 'మహోపాధ్యాయ' బిరుదుపొందాడు.
  • 1922 : ద్వారక పీఠ శంకరభగవత్పాదులచేత 'సర్వతంత్ర స్వతంత్ర', 'మహామహోపాధ్యాయ' మరియు 'విద్యాదానవ్రత మహోదధి' అనే సత్కారాలు పొందాడు.
  • 1927 : ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చేత 'కళా ప్రపూర్ణ' గౌరవంతో సన్మానించబడ్డాడు.
  • 1958 : కుమార సంభవ ప్రబంధకర్త నన్నెచోడుని కవిత్వంపై వీరు రాసిన 'నన్నెచోడుని కవిత్వము' అనే విమర్శనా గ్రంథానికి 'ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి' బహుమతి లభించింది.

రచనలు

  • నాగానందము (1891)
  • శాకుంతలము (1896)
  • ప్రతాపరుద్రీయం (1897)
  • స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాపణము (1899)
  • గ్రామ్య భాషా ప్రయోగ నిబంధనము (1899)
  • విక్రమోర్వశీయము (1901)
  • మేఘసందేశ వ్యాఖ్య (1901)
  • ఉషా పరిణయము (1901)
  • ప్రియదర్శిక (1910)
  • విసంధి వివేకము (1912)
  • శృంగార నైషధ సర్వంకష వ్యాఖ్య (1913)
  • బొబ్బిలి యుద్ధము (1916)
  • మాళవికాగ్నివిత్రము (1919)
  • తిక్కన సోమయాజి విజయము (1919)
  • ఉత్తర రామచరిత్ర (1920)
  • విమర్శ వినోదము (1920)
  • ఆంధ్ర హితోపదేశ చంపువు
  • ఆంధ్ర సాహిత్య దర్పణము
  • ఆముక్తమాల్యదా సంజీవినీ వ్యాఖ్య (1921)
  • రత్నావళి (1921)

మూలాలు

  • Vedam Venkataraya Sastry by Vedam Venkataraya Sastri, Sahitya Akademi, 1976)
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.

బయటి లింకులు