నోరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: sco:Mooth; cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21: పంక్తి 21:
}}
}}


'''నోరు''' (Mouth) మనిషి [[ముఖం]]లో మధ్యక్రిందభాగంలో ఉంటుంది. దీని ముందుభాగంలో రెండు [[పెదవులు]] నోరు తెరవడానికి లేదా మూయడానికి అనువుగా ఏర్పాటుచేయబడ్డాయి. వెనుకభాగం [[గొంతు]]తో కలుస్తుంది. నోటి లోపక కదులుతూ [[నాలుక]] ఉంటుంది. నోటి కుహరపు పైభాగాన్ని [[అంగిలి]] (Palate) అంటారు.
'''నోరు''' లేదా '''మూతి''' (Mouth) మనిషి [[ముఖం]]లో మధ్యక్రిందభాగంలో ఉంటుంది. దీని ముందుభాగంలో రెండు [[పెదవులు]] నోరు తెరవడానికి లేదా మూయడానికి అనువుగా ఏర్పాటుచేయబడ్డాయి. వెనుకభాగం [[గొంతు]]తో కలుస్తుంది. నోటి లోపక కదులుతూ [[నాలుక]] ఉంటుంది. నోటి కుహరపు పైభాగాన్ని [[అంగిలి]] (Palate) అంటారు.


జీర్ణప్రక్రియ నోటినుండే మొదలౌతుంది. ఇక్కడే [[ఆహారం]] చిన్నచిన్నముక్కలుగా చేయబడి [[లాలాజలం]]తో కలుస్తుంది.
జీర్ణప్రక్రియ నోటినుండే మొదలౌతుంది. ఇక్కడే [[ఆహారం]] చిన్నచిన్నముక్కలుగా చేయబడి [[లాలాజలం]]తో కలుస్తుంది.

06:24, 20 జనవరి 2010 నాటి కూర్పు

నోరు
Head and neck.
A human mouth, closed.
లాటిన్ cavitas oris
MeSH Oral+cavity
Dorlands/Elsevier c_16/12220513

నోరు లేదా మూతి (Mouth) మనిషి ముఖంలో మధ్యక్రిందభాగంలో ఉంటుంది. దీని ముందుభాగంలో రెండు పెదవులు నోరు తెరవడానికి లేదా మూయడానికి అనువుగా ఏర్పాటుచేయబడ్డాయి. వెనుకభాగం గొంతుతో కలుస్తుంది. నోటి లోపక కదులుతూ నాలుక ఉంటుంది. నోటి కుహరపు పైభాగాన్ని అంగిలి (Palate) అంటారు.

జీర్ణప్రక్రియ నోటినుండే మొదలౌతుంది. ఇక్కడే ఆహారం చిన్నచిన్నముక్కలుగా చేయబడి లాలాజలంతో కలుస్తుంది.

ఇదే కాకుండా మాటలాడడానికి, ద్రవపదార్ధాలు త్రాగడానికి, సిగరెట్లు త్రాగడానికి, గాలిపీల్చుకోవడానికి మరియు ముద్దు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.

మనిషి నోటిలో ఇంచుమించుగా 100 మి.లీ. ద్రవం పడుతుంది.

లాలాజల గ్రంథులు

నోటిలో మూడు జతల లాలాజల గ్రంథులున్నాయి. అవి

  1. పెరోటిడ్
  2. అథోజిహ్విక
  3. అథోజంబిక

వీటిలో పెరోటిడ్ గ్రంథులు చెవి దగ్గరగా ఉంటాయి. అథోజిహ్విక, అథో జంభికా గ్రంథులు నాలుక క్రిందకు తెరుచుకుంటాయి. ఈ గ్రంథుల నుంచి లాలాజలం విడుదలౌతుంది. లాలాజలంలో ఎక్కువగా నీరు, కొద్దిగా లవణాలు, ఎమైలేజ్, టయొలిన్ అనే ఎంజైమ్ లు ఉంటాయి. ఈ ఎంజైమ్ లు ఆహారంలోని పిండిపదార్థాన్ని డెక్స్ట్రిన్, మాల్టోజ్ అనే చక్కెరలుగా మారుస్తుంది. డెక్స్ట్రిన్ కూడా చివరకు మాల్టోజ్ గానే మారుతుంది. ఆహారంలోని పిండి పదార్థం నోట్లోనే పాక్షికంగా జీర్ణమవుతుంది. ఆహారం నోటి నుంచి గ్రసని ద్వారా ఆహార నాళంలోకి ప్రవేశిస్తుంది. గ్రసనిలో ఉన్న కొండనాలుక ఆహారం వాయునాళం లోకి పోకుండా కాపాడుతుంది. ఆహార వాహికలో స్రవించే శ్లేష్మం వల్ల ఆహారం సులువుగా కదులుతుంది. ఆహార వాహికలోని కండరాలు ఏర్పరిచే అలల వంటి సంకోచ కదలికలను పెరిస్టాటిక్ చలనాలు అంటారు. ఇవి అనియంత్రితమైనవి.

"https://te.wikipedia.org/w/index.php?title=నోరు&oldid=482929" నుండి వెలికితీశారు