2000 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: lv:2000. gada Vasaras Olimpiskās spēles
చి యంత్రము కలుపుతున్నది: sah:2000 Сайыҥҥы Олимпия онньуулара
పంక్తి 215: పంక్తి 215:
[[ro:Jocurile Olimpice de vară din 2000]]
[[ro:Jocurile Olimpice de vară din 2000]]
[[ru:Летние Олимпийские игры 2000]]
[[ru:Летние Олимпийские игры 2000]]
[[sah:2000 Сайыҥҥы Олимпия онньуулара]]
[[sh:Olimpijada 2000]]
[[sh:Olimpijada 2000]]
[[simple:2000 Summer Olympics]]
[[simple:2000 Summer Olympics]]

12:34, 4 మార్చి 2010 నాటి కూర్పు

ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు జరిగిన సిడ్నీ ఒలింపిక్ స్టేడియం

21 వ శతాబ్దములో జరిగిన తొలి ఒలింపిక్ క్రీడలకు ఆస్ట్రేలియాలోని సుందరనగమైన సిడ్నీ వేదికగా నిలిచింది. 2000 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగిన 27 వ ఒలింపిక్ క్రీడలలో 199 దేశాల నుంచి 10651 క్రీడాకారులు పాల్గొని తమ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. 298 క్రీడాంశాలలో పోటీలు జరుగగా అమెరికా 37 క్రీడాంశాలలో నెగ్గి అత్యధిక స్వర్ణ పతకాలతో ప్రథమస్థానంలో నిలిచింది.భారత్ కు చెందిన కరణం మల్లేశ్వరి మహిళల 69 కిలోగ్రాముల వెయిట్ లిప్టింగ్ లో కాంస్యం సాధించి భారత్‌కు ఏకైక పతకం సంపాదించిపెట్టింది.

అత్యధిక పతకాలు సాధించిన దేశాలు

2000 వేసవి ఒలింపిక్ క్రీడలలో 28 క్రీడలు 300 క్రీడాంశాలలో పోటీలు జరగగా అత్యధికంగా 37 స్వర్ణ పతకాలను సాధించి అమెరికా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాలు రష్యా, చైనాలు పొందినాయి.

స్థానం దేశం స్వర్ణ పతకాలు రజత పతకాలు కాంస్య పతకాలు మొత్తం
1 అమెరికా 37 24 31 92
2 రష్యా 32 28 28 88
3 చైనా 28 16 15 59
4 ఆస్ట్రేలియా 16 25 17 58
5 జర్మనీ 13 17 26 56
6 ఫ్రాన్స్ 13 14 11 38
7 ఇటలీ 13 8 13 24
8 నెదర్లాండ్స్ 12 9 4 25
9 క్యూబా 11 11 7 29
10 బ్రిటన్ 11 10 7 28

క్రీడలు

2000 ఒలింపిక్ క్రీడలలో భాగంగా జరిగిన క్రీడలు

2000 ఒలింపిక్స్‌లో భారత్ స్థానం

2000 ఒలింపిక్ క్రీడలలో భారత్ ఒకే ఒక్క కాంస్య పతకాన్ని సాధించి పతకాల పట్టికలో 70వ స్థానాన్ని పొందినది. మహిళల 69 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లేశ్వరి భారతదేశానికి ఏకైక స్వర్ణాన్ని సాధించిపెట్టింది. అథ్లెటిక్స్‌లో చాలా భారత క్రీడాకారులు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా రాజీవ్ బాల కృష్ణన్, బీనామోల్‌లు సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగాలు. పురుషుల లైట్ వెయిట్ లిఫ్టింగ్ (81 కేజీల విభాగం)లో గురుబచన్ సింగ్ క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయాడు. హాకీలో 7వ స్థానాన్ని మాత్రమే పొందగలిగింది.

సిడ్నీ ఒలింపిక్ క్రీడలు - కొన్ని ముఖ్య విషయాలు

  • 2000 ఒలింపిక్ క్రీడల నిర్వహణకై హోరాహోరీ పోరులో 1993లో జరిగిన ఓటింగ్‌లో సిడ్నీ, బీజింగ్‌ను కేవలం రెండు ఓట్ల తేడాతో ఓడించింది.
  • సిడ్నీ ఒలింపిక్ క్రీడల నిర్వహణకై 6.6 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు ఖర్చు అయింది.
  • ఆస్ట్రేలియా గవర్నర్-జనరల్ విలియం డీన్ ఈ క్రీడలకు ప్రారంభోత్సవం చేశాడు.
  • 3 స్వర్ణాలు, 2 రజత పతకాలు సాధించిన అమెరికాకు చెందిన మరియన్ జోన్స్ మాదక ద్రవ్యాలు సేవించినట్లు విశదం కావడంతో ఏడేళ్ళ తరువాత పతకాలు స్వాధీనం చేసుకొని రెండేళ్ళ నిషేధం కూడా విధించారు. [1] [2] [3] [4][5][6][7][8][9][10][11][12][13]

ఇవి కూడా చూడండి

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.



బయటి లింకులు

మూలాలు