Coordinates: 46°13′40″N 6°8′14″E / 46.22778°N 6.13722°E / 46.22778; 6.13722

రెడ్‌క్రాస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: fiu-vro:Riikevaihõlinõ Verevä Risti ja Verevä Puulkuu Liikminõ
పంక్తి 148: పంక్తి 148:
[[fa:نهضت بین‌المللی صلیب سرخ و هلال احمر]]
[[fa:نهضت بین‌المللی صلیب سرخ و هلال احمر]]
[[fi:Punaisen Ristin ja Punaisen Puolikuun kansainvälinen liike]]
[[fi:Punaisen Ristin ja Punaisen Puolikuun kansainvälinen liike]]
[[fiu-vro:Riikevaihõlinõ Verevä Risti ja Verevä Puulkuu Liikminõ]]
[[fr:Mouvement international de la Croix-Rouge et du Croissant-Rouge]]
[[fr:Mouvement international de la Croix-Rouge et du Croissant-Rouge]]
[[gl:Movemento Internacional da Cruz Vermella e da Media Lúa Vermella]]
[[gl:Movemento Internacional da Cruz Vermella e da Media Lúa Vermella]]

20:07, 27 మే 2010 నాటి కూర్పు

అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం
The Red Cross and the Red Crescent emblems, the symbols from which the Movement derives its name.
Founded1863
HeadquartersGeneva, Switzerland

అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం (ఆంగ్లం : The International Red Cross and Red Crescent Movement) ఒక అంతర్జాతీయ మానవతావాద ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) వున్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ మరియు వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో పనిచేస్తూ వుంటారు.

ఐ.సి.ఆర్.సి.హెడ్ క్వార్టర్స్ జెనీవా

తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవ చేయడానికి మాత్రమే ఇది పరిమితమై ఉండేది. ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలొను రెడ్ క్రాస్ శాఖలు, యుద్ధ సమయాలలోను, శాంతి కాలంలోను నిర్విరామంగా పనిచేస్తునే ఉంటాయి. జాతి, కుల, మత విచక్షణా భేదం లేకుండా నిస్సహాయులకు ఇది సేవ చేస్తుంది. శాంతికాలంలో దీని కార్యకలాపాలేవంటే - ప్రథమ చికిత్స, ప్రమాదాలు జరగకుండా చూడడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను స్థాపించడం, రక్త నిధులు (Blood Banks) సేకరించడం, మొదలైన పనులు చేస్తుంటుంది.

రెడ్ క్రాస్ ను స్థాపించినది జీన్ హెన్రీ డ్యూనంట్ (Jean Henry Dunant). ఆయన జూన్ 24, 1859న వ్యాపారం నిమిత్తమై లావర్డి (Lavardi) నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఫ్రాన్స్ ఆస్ట్రియాల మధ్యన జరుగుతున్న యుద్ధం వల్ల గాయపడిన వేలాది స్త్రీ పురుషులు ప్రథమ చికిత్స లేక మరణించడం అతను చూశాడు. హృదయ విదారకమైన ఈ దృశ్యం అతని మనస్సులో చెరగని ముద్ర వేసింది. తన స్వంత పని మరచిపోయి ఆపదలోనున్న వారందరికీ సహాయం చేశాడు.

యుద్ధం ముగిసాక అతను ప్రజలందరికీ ఇలా విజ్ఞప్తి చేశాడు. "యుద్ధాలలో గాయపడిన వారందరికి, తక్కిన వారందరూ సహాయం చేయాలి. ఇది మానవ ధర్మం." ఈ విజ్ఞప్తి ప్రజలందరినీ ఆకట్టుకుంది. 1864లో జెనీవాలో అంతర్జాతీయ సమావేశం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థాపనకు 14 దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి.

ఇదో ప్రైవేటు సంస్థ. దీనిలో ముఖ్యంగా క్రింది అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి:

"ఎ మెమరీ ఆఫ్ సోల్‌ఫెరీనో" రచయిత రెడ్ క్రాస్ ఉద్యమ స్థాపకుడు హెన్రీ డ్యురాంట్.

ఈ సమాఖ్యల అధ్యక్షులు

2001 నుండి, ఈ సమాఖ్యకు అధ్యక్షుడు స్పెయిన్ కు చెందిన డాన్ మాన్యుయేల్ సువారెజ్ డెల్ టోరూ రివెరో, మరియు ఉపాధ్యక్షులు రెనే రైనో (ఎక్స్ అఫీషియో అధ్యక్షుడు [[::Swiss Red Cross|స్విస్ రెడ్‌క్రాస్]] సొసైటీ) మరియు, స్వీడెన్ కు చెందిన బెంన్గ్‌ట్ వెస్టర్‌బర్గ్, జపాన్ కు చెందిన టడాటెరూ కొనోయె, ఇథియోపియాకు చెందిన షిమెలిస్ అడుంగా మరియు బార్బడోస్ కు చెందిన రేమాండ్ ఫోర్డే లు.

మాజీ అధ్యక్షులు (1977 వరకూ వీరిని "ఛైర్మెన్"లుగా వ్యవహరించేవారు) :

కార్యకలాపాలు

ఉద్యమ సంస్థ

జెనీవాలోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్ క్రెసెంస్ మ్యూజియం యొక్క ద్వారం.

ఈ అంతర్జాతీయ సమాఖ్య మరియు జాతీయ సంఘాలలో దాదాపు 9.7 కోట్ల వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. మరియు 3 లక్షల మంది పూర్తికాలపు ఉద్యోగస్తులు గల సంస్థ.

1965 వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో, ఏడు ప్రాధమిక సూత్రాలు ఆమోదింపబడినవి, ఈ సూత్రాలను ఉద్యమం మొత్తంలో అమలుపరచాలని తీర్మానించడమైనది, మరియు 1986 లో జరిగిన సదస్సులోనూ మార్పులు చేర్పులు జరిగాయి.

ఏడు సూత్రాలు
  • మానవత
  • నిష్పాక్షికత
  • సమతౌల్యత
  • స్వతంత్రం
  • వాలంటరీ సేవ
  • ఐక్యత
  • విశ్వజనీయత

ఉద్యమాలు - చిహ్నాలు


రెడ్ క్రాస్

రెడ్ క్రాస్ చిహ్నం.

రెడ్ క్రాస్ చిహ్నం 1864 జెనీవా సదస్సు నుండి ఉపయోగించసాగారు. ఇది స్విట్జర్లాండ్ దేశపు జెండాను పోలివుంటుంది, కాని వ్యతిరేక వర్ణంలో వుంటుంది. [1] ఈ సంస్థ స్థాపకుడైన హెన్రీ డ్యురాంట్ గౌరవార్థం, అతడు స్విస్ దేశానికి చెందినవాడు గావడం మూలంగా రెడ్‌క్రాస్ చిహ్నం స్విస్ దేశపు జెండాను నమూనాగా తీసుకున్నారు. స్విట్జర్లాండ్ లో అధికారిక మతము క్రైస్తవం కావున, ఆదేశపు జెండాలో మతపరమైన గుర్తు "క్రాస్" వుంటుంది.

రెడ్ క్రెసెంట్

రెడ్ క్రెసెంట్ చిహ్నం.

1876 నుండి 1878 వరకూ జరిగిన రష్యా-టర్కీ యుద్ధం లో ఉస్మానియా సామ్రాజ్యం రెడ్‌క్రాస్ కు బదులుగా రెడ్‌క్రెసెంట్ ఉపయోగించింది, క్రాస్ గుర్తు క్రైస్తవమతానికి చెందినదని, దీని ఉపయోగం వలన, తమ సైనికుల నైతికబలం దెబ్బతింటుందని టర్కీ ప్రతిపాదించింది. రష్యా ఈ విషయాన్ని సంపూర్ణ గౌరవాన్ని ప్రకటిస్తూ తన అంగీకారాన్ని ప్రకటించింది. రెడ్‌క్రాస్ ఈ డీ-ఫాక్టో ఆమోదంతో 1929 జెనీవాలో జరిగిన సదస్సులో 19వ అధికరణ ప్రకారం రెడ్‌క్రెసెంట్ ను అధికారికంగా ప్రకటించింది.[2] ప్రాధమికంగా రెడ్‌క్రెసెంట్ ను టర్కీ మరియు ఈజిప్టులు ఉపయోగించేవి. కాని ముస్లింలు గల అనేక దేశాలలో రానురాను దీని ఉపయోగం సాధారణమయినది. మరియు అధికారికంగా ఈ రెడ్‌క్రాస్ స్థానంలో రెడ్‌క్రెసెంట్ వాడుక వాడుకలోకి వచ్చింది.

ఇవీ చూడండి


గ్రంధాలు

  • David P. Forsythe: Humanitarian Politics: The International Committee of the Red Cross. Johns Hopkins University Press, Baltimore 1978, ISBN 0-8018-1983-0
  • Henry Dunant: A Memory of Solferino. ICRC, Geneva 1986, ISBN 2-88145-006-7
  • Hans Haug: Humanity for all: the International Red Cross and Red Crescent Movement. Henry Dunant Institute, Geneva in association with Paul Haupt Publishers, Bern 1993, ISBN 3-258-04719-7

బయటి లింకులు

మూలాలు

46°13′40″N 6°8′14″E / 46.22778°N 6.13722°E / 46.22778; 6.13722

మూస:Link FA మూస:Link FA మూస:Link FA