పిండి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: bar:Mehj
చి యంత్రము మార్పులు చేస్తున్నది: bar:Mej
పంక్తి 33: పంక్తి 33:
[[ast:Fariña]]
[[ast:Fariña]]
[[ay:Aku]]
[[ay:Aku]]
[[bar:Mehj]]
[[bar:Mej]]
[[bg:Брашно]]
[[bg:Брашно]]
[[bn:ময়দা]]
[[bn:ময়দা]]

20:03, 12 జూన్ 2010 నాటి కూర్పు

దస్త్రం:Wheatflour rw.jpg
Wheat flour

పిండి, పొడి లేదా చూర్ణం (ఆంగ్లం: Flour) ఆహారధాన్యాల నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన రొట్టికి మూలం. అమెరికా మరియు ఐరోపా ఖండాలలో గోధుమ పిండి ముఖ్యమైనది. జొన్న పిండి ప్రాచీనమైన మెసపుటోమియా మరియు లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను మిల్లు లేదా పిండి మర లో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది.

పిండి చేసిన గింజలలో ముఖ్యంగా పిండి పదార్ధాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి.


పిండిలో రకాలు

  • గోధుమ పిండి :
  • మైదా పిండి
  • వరి పిండి :
  • శెనగ పిండి :
  • నువ్వు పిండి :
  • కంది పొడి
  • నువ్వుల పొడి
  • కారం పొడి

పిండి ఉపయోగాలు

  • ప్రతి రోజూ మనం తినే రొట్టెలు, చపాతీ, పూరీ, పరాఠా మొదలైనవి చేసుకోవాలంటే గోధుమ పిండి అవసరం.
  • రకరకాల అట్లు లేదా దోసెలు కొన్నింటికి మూలమైనది పిండి. కొన్ని అట్లు ఒకటి కంటే ఎక్కువ పిండి రకాలు కలిపి చేస్తారు.
  • పిండి వంటలు అన్నింటికి పిండి ఒక మూల పదార్ధం.
  • కొన్ని రకాల పొడుల్ని మసాలా దినుసులతో ఉప్పు, కారం కలిపి ఉపాహారంగా నంచుకోవడానికి వాడుతాము. నువ్వుల పొడి, కంది పొడి, మొదలైనవి.

తయారుచేయు విధానం

  • ముందుగా పిండి చేయాల్సిన ఆహార ధాన్యాల్ని కావలసినన్నింటిని తడి లేకుండా ఎండబెట్టాలి. రాళ్ళు లేకుండా ఏరుకోవాలి. కొన్నింటిని ముందుగా కడగవలసి వుంటుంది.
  • రోలు మరియు రోకలి ఉపయోగించి దంచుకొని, మధ్య మధ్యలో పిండి జల్లెడతో జల్లించి పిండిని, నూకల్ని వేరుచేసుకోవచ్చును. ఇలా మళ్ళీ మళ్ళీ దంచుకొంటుంటే మొత్తం గింజలన్నీ పిండిగా మారిపోతాయి. కొద్దిగా మిగిలిపోవచ్చును.
  • ఈ ఆధునిక కాలంలో పిండి మర లో కావలసిన వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత క్షణాల్లో పిండిగా మార్చవచ్చును.
  • కొన్ని సందర్భాలలో పిండి నుండి పొట్టును వేరుచేయడానికి సన్నని జల్లెడ పట్టించాల్సి వస్తుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=పిండి&oldid=517494" నుండి వెలికితీశారు