గుడ్డు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: bar:Oa
చి యంత్రము కలుపుతున్నది: be:Яйка
పంక్తి 83: పంక్తి 83:
[[ay:K'awna]]
[[ay:K'awna]]
[[bar:Oa]]
[[bar:Oa]]
[[be:Яйка]]
[[bg:Яйце (зоология)]]
[[bg:Яйце (зоология)]]
[[bn:ডিম (জীববিজ্ঞান)]]
[[bn:ডিম (জীববিজ্ঞান)]]

18:32, 14 జూన్ 2010 నాటి కూర్పు

వివిధ రకాల పక్షి గుడ్లు

చాల పక్షులు మరియు సరీసృపాలు గుడ్లు (ఆంగ్లం: Eggs) పెడతాయి. గుడ్డు (లాటిన్ ovum) నిజంగా అండాలు ఫలదీకరణం తర్వాత ఏర్పడే జైగోటు. గుడ్లు ఒక నిర్ధిష్టమైన ఉష్ణోగ్రత దగ్గర పొదగబడి కొంతకాలం తర్వాత పిండం తయారౌతుంది. ఈ పిండం కొంత పరిణతి సాధించిన తర్వాత గుడ్డును పగులగొట్టుకొని బయటికి వస్తుంది.

గుడ్లు పెట్టే జంతువులను ఓవిపారస్ జంతువులు అంటారు. ఈ జంతువులలో పిండాభివృద్ధి జీవి శరీరం లోపల కాకుండా బయటే జరుగుతుంది. The study or collecting of eggs, particularly bird eggs, is called oology.

సరీసృపాలు మరియు పక్షులు గుడ్లు నీటి బయట పెట్టి నప్పుడు వానికి రక్షణ కోసం కవచం వంటి పెంకు ఉంటుంది. ఇది మెత్తగా కాని లేదా గట్టిగా కాని ఉంటుంది. ఇలా ప్రత్యేకమైన పొరను కలిగి ఉండడం క్షీరదాలలో ఉల్బదారుల లక్షణము.

నిప్పుకోడి గుడ్డు అన్నింటి కన్నా పెద్దవి; ఇవి సుమారు 1.5 కి.గ్రా. బరువుంటాయి. అతి చిన్న పక్షి గుడ్లు అరగ్రాము బరువు కూడా ఉంటాయి. వీటి కన్నా సరీసృపాలు మరియు చేపలు పెట్టే సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. అయితే కీటకాలు మరియు ఇతర అకశేరుకాల గుడ్లు ఇంకా చిన్నవిగా ఉంటాయి.

Nudibranch Orange-peel doris Acanthodoris lutea in California tide pools laying eggs

పక్షి గుడ్లు

పక్షులు తమ గుడ్లను పొదుగుతాయి. ఈ పొదిగే కాలం జాతిని బట్టి మారుతుంది. సాధారణంగా ఒక గుడ్డు ఉండి ఒక పిల్ల వస్తుంది. కొన్ని పక్షులు ఫలదీకరణం చెందకుండా గుడ్లు పెడతాయి. ఇలాంటి గుడ్లు నుండి పిల్లలు ఉత్పత్తి కావు.

రంగులు

సకశేరుకాల గుడ్లు వానిలోని కాల్షియం కార్బొనేట్ మూలంగా సామాన్యంగా తెలుపు రంగులో ఉంటాయి. కానీ కొన్ని రకాల పాటలు పాడే పక్షులు రంగుల గుడ్లను పెడతాయి. వాటిలోని వర్ణ పదార్ధాల మూలంగా రంగులు కలుగుతాయి. బిలివర్డిన్ మూలంగా ఆకుపచ్చ, జింక్ సమ్మేళనాల మూలంగా నీలం రంగు మరియు ప్రోటోపార్ఫిరిన్ మూలంగా ఎరుపు లేదా గోధుమ రంగులు కలుగుతాయి. పక్షులలో కాల్షియం లోపించినప్పుడు గుడ్లలోని పెంకు పలుచగా గాని లేదా ఒక వైపు మెత్తగా ఉంటాయి. ఈ రంగు పదార్ధాలు చివరలో కాకుండా మొత్తం పెంకు తయారౌతున్న కాలం అంతా చేర్చబడతాయి.


గుడ్డు యొక్క రంగు జన్యుపరంగా నిర్దేశించబడుతుంది. ఇది తల్లి నుండి మరియు W క్రోమోజోము (ఆడ పక్షులు- WZ, మగ పక్షులు- ZZ) ద్వారా సంక్రమిస్తుంది.

పెంకు

పక్షుల గుడ్లలో కంటికి కనిపించని సన్నని రంధ్రాలుంటాయి. ఇవి పిండం శ్వాసక్రియకు తోడ్పడతాయి. సాధారణ కోడిగుడ్డులో సుమారు 7.500 రంధ్రాలుంటాయి.

పక్షి గుడ్లు వివిధ రకాలుగా ఉంటాయి.

ఆకారాలు

చాల పక్షుల గుడ్లు అండాకారంలో ఉంటాయి. వీనికి ఒక వైపు గుండ్రంగా రెండవ వైపు కొద్దిగా మొనదేలి ఉంటాయి. ఈ ఆకారం అండనాళం ద్వారా బహిర్గతమైనందువలన కలుగుతుంది. ఈ నాళం చివరనుండే కండరాలు సంకోచించడం వలన గుడ్లు బయటకు పంపబడతాయి. గుడ్డు ఇంకా మెత్తగా ఉండటం వల్ల ఈ ఆకారం వస్తుంది. మొనదేలిన భాగం చివరలో వస్తుంది. కొండ చరియల్లో గూడు కట్టుకొనే పక్షుల గుండ్లు పొడవుగా శంకు ఆకారంలో ఉంటాయి. చాలా వరకు రంధ్రాలలో గూడు కట్టుకొనే పక్షుల గుడ్లు ఇంచుమించు గుండ్రంగా ఉంటాయి.

Predation

చాలా జంతువులు గుడ్లను తింటాయి. వీనిలో ముఖ్యమైనవి నీటి కుక్కలు, నక్కలు, కాకులు ముఖ్యమైనవి. చాలా వరకు పాములు పక్షి గుడ్లను దొంగిలించి తినడంలో జాగ్రత్త వహిస్తాయి.

కొన్ని పక్షులు ఇతర జాతి పక్షులు కట్టిక గూడులలో గుడ్లు పెడతాయి. కొన్ని సందర్భాలలో వీటిని తల్లి పక్షి గుర్తించి తినేస్తాయి. కాకులు ముఖ్యంగా కోకిలలు పెట్టిన గూడులో గుడ్లు పెడతాయి.

వివిధ రకాల పక్షి గుడ్లు

చేప గుడ్లు

Salmon fry hatching - the larva has grown around the remains of the yolk and the remains of the soft, transparent egg are discarded.
Salmon eggs in different stages of development. In some only a few cells grow on top of the yolk, in the lower right the blood vessels surround the yolk and in the upper left the black eyes are visible.

చేపల విశిష్టమైన పద్ధతి ఓవిపారిటీ. దీనిలో ఆడ చేప పరిపక్వం చెందని గుడ్లను నీటిలో ఉంచుతుంది. సామాన్యంగా ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో అంటే కొన్ని మిలియన్లలో ఉంటాయి. ఇవి నీటిలో స్వేచ్ఛగా విడిచిపెట్టబడతాయి. మగ చేపలు వీటి మీద వీర్య కణాల్ని విడుస్తాయి. ఫలదీకరణం జరిగిన తర్వాత జన్మించే పిల్ల చేపలు వెంటనే ఈదు కుంటూ పోతాయి. వీనిలో చాలా వరకు పెద్ద చేపలకు ఆహారంగా చనిపోతాయి. చేపలకు తల్లి చేప గాని, తండ్రి చేప గాని సంరక్షణ బాధ్యత స్వీకరించవు.

కొన్ని చేపలు, ముఖ్యంగా రే చేపలు మరియు సొర చేపలు ఓవీవివిపారిటీ పద్ధతి పాటిస్తాయి. దీనిలో గుడ్లు ఫలదీకరణం శరీరం లోపలే జరుగుతుంది. ఢింబకాలు గుడ్డులోని సొనను తింటాయి; తల్లి నుండి ఆహారాన్ని గ్రహించవు. తల్లి చేప పిల్ల చేపలకు జన్మనిస్తుంది. కొన్ని సార్లు అభివృద్ధి చెందిన పిల్ల చేప చిన్నవైన ఇతర చేపలను తినేస్తాయి. దీనిని అంతర గర్భశయ కానబాలిజం అంటారు.

మరికొన్ని అరుదైన వివిపారస్ సొర చేపలలో తల్లి చేప పూర్తిగా కడుపులో అభివృద్ధి చెందిన తరువాత చేప పిల్లలను కంటుంది. ఫలదీకరణం తర్వాత పిండాన్ని కడుపులో పోషిస్తుంది.

సరీసృపాల గుడ్లు సాధారణంగా మెత్తగా రబ్బరులాగా ఉండి తెల్లని రంగులో ఉంటాయి. ఇవి భూమిలో తవ్వి అక్కడ గుడ్లు పెడతాయి. పిండం యొక్క లింగం బాహ్య ఉష్ణోగ్రతపై ఆధారపడు వుంటుంది. చల్లగా ఉంటే మగ పిల్లలు తయారౌతాయి. కొన్ని సరీసృపాలు వివిపారస్ గా పిల్లల్ని కంటాయి.

Turtle eggs in a nest dug by a female common snapping turtle (Chelydra serpentina)
A frog amongst frogspawn

అకశేరుకాల గుడ్లు

కీటకాలు, మొలస్కా జీవులు మరియు క్రస్టేషియన్లు కూడా గుడ్లు పెడతాయి.


మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=గుడ్డు&oldid=517892" నుండి వెలికితీశారు