యూ థాంట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: arz:او ثانت
చి యంత్రము కలుపుతున్నది: uk:У Тан
పంక్తి 57: పంక్తి 57:
[[th:อู ถั่น]]
[[th:อู ถั่น]]
[[tr:Sithu U Thant]]
[[tr:Sithu U Thant]]
[[uk:У Тан]]
[[ur:اوتھاں]]
[[ur:اوتھاں]]
[[vi:U Thant]]
[[vi:U Thant]]

08:47, 27 ఆగస్టు 2010 నాటి కూర్పు

యూ థాంట్ (U Thant ) ఐక్యరాజ్య సమితి యొక్క మూడవ ప్రధాన కార్యదర్శ్. ఇతడు 1909, జనవరి 22న దిగువ బర్మా (ప్రస్తుత మయాన్మార్)లోని పాంటనావ్‌లో జన్మించాడు. డాగ్ హమ్మర్స్ జోల్డ్ సెప్తెంబర్ 1961లో విమాన ప్రమాదంలో మరణించిన పిదప యూ థాంట్ 1971 వరకు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆసియా ఖండం నుంచి ఈ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తిగా నిల్చినారు.

యూ థాంట్ రంగూన్ విశ్వవిద్యాలయం (ప్రస్తుత యాంగాంగ్ విశ్వవిద్యాలయం)లో ఉన్నత విద్య అభ్యసించాడు. 1928-31 కాలంలో ఉపాధ్యాయుడిగా, 1931-47 కాలంలో పాంటనావ్ జాతీయ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసినాడు. 1948లో బర్మా గ్రేట్ బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత ప్రధానమంత్రి యు ను (U Nu) అభ్యర్థనపై 1949లో యూ థాంట్ సమాచార శాఖ సంచాలకులుగా పనిచేసినాడు. 1949-53 కాలంలో సమాచార శాఖ కార్యదర్శిగా పనిచేశాడు. 1953-57 వరకు ప్రధానమంత్రి కార్యదర్శిగా వ్యవహరించి యు ను ఉపన్యాసాలను, విదేశీ పర్యటనలను సిద్ధం చేయడం, వీదేశీ ప్రముఖుల సమావేశాలను సిద్ధం చేయుటలో సహకరించినాడు. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్ లో జరిగిన ఆఫ్రో-ఏషియన్ సదస్సుకు కార్యదర్శిగా వ్యవహరించినాడు. ఈ సదస్సే అలీన రాజ్యాల ఉద్యమంకు ఊపిరిపోసింది. 1957లో ఐక్యరాజ్య సమితిలో బర్మా శాశ్వత ప్రతినిధిగా నియమించబడ్డాడు. 1961లో డాగ్ హమ్మర్స్ జోల్డ్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత తదుపరి కాలానికి యూ థాంట్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 1966లో మళ్ళీ రెండవ పర్యాయము ఆ పదవికి ఎన్నికైనాడు. 1971లో ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా సమర్పించినాడు. 1974 నవంబర్ 25న న్యూయార్క్ లో మరణించాడు.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=యూ_థాంట్&oldid=538235" నుండి వెలికితీశారు