బీబి నాంచారమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పునరుక్తులను తొలగించాను
→‎నాంచారమ్మ గురించి పలువురి వ్యాఖ్యలు: అన్నమయ్య పాటను తొలగించాను. ఇది బీబీ నాంచారమ్మను గురి
పంక్తి 24: పంక్తి 24:
:చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య…
:చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య…
:ఏడు కొండలవాడ వెంకటా రమణా --[[ పింగళి నాగేంద్రరావు]] [[పెళ్ళిచేసి చూడు]] లో [[పి.లీల]] పాడిన పాట.
:ఏడు కొండలవాడ వెంకటా రమణా --[[ పింగళి నాగేంద్రరావు]] [[పెళ్ళిచేసి చూడు]] లో [[పి.లీల]] పాడిన పాట.

*అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ

తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ

నీరిలోన తల్లడించే నీకే తలవంచీ

నీరికింద పులకించీ నీరమణుండు

గోరికొన చెమరించీ కోపమే పచరించీ

సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ

నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ

మేకొని నీవిరహాన మేను వెంచీని

ఈకడాకడి సతుల హౄదయమే పెరరేచీ

ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా

చక్కదనములె పెంచీ సకలము గాలదంచి

నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని

మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ

అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ---[[అన్నమయ్య]]


==మూలాలు==
==మూలాలు==

09:36, 27 ఆగస్టు 2010 నాటి కూర్పు

దక్షిణ భారతదేశంలో ప్రచారంలో ఉన్న జానపదాల ప్రకారం బీబి నాంచారమ్మ లేదా తుళుక్క నాచ్చియార్ (తురుష్క దేవత) అనే ముస్లిం స్త్రీ శ్రీవేంకటేశ్వరుని రెండవ భార్య. బీబీ నాంచారమ్మ కి కనకదుర్గ ఆడపడచు.[1] .భూదేవి బీబీ నాంచారిగా అవతారమెత్తి శ్రీహరికోసం వెతుకుతూ వచ్చింది.[2] నాంచారమ్మ గురించి పలు కథలు ప్రచారంలో అందులో ప్రముఖమైనది మాలిక్ కాఫూర్ వృత్తాంతము. నాంచారమ్మ వృత్తాంతము ఒక జానపద కథ అని, భారతదేశాన్ని మహమ్మదీయుల పాలించిన కాలంలో తిరుమల దేవస్థానాన్ని ముస్లిం దండయాత్రలనుండి రక్షించడానికి ఈ కథను సృష్టించారని భావిస్తున్నారు. బీబీ నాంచారమ్మ కథకు సరైన ఆధారం లేకపోయిన చాలామంది మహమ్మదీయులు నేటికీ ఈ కథను విశ్వసిస్తూ తిరుమలను దర్శించుకుంటున్నారు. ప్రతి మంగళవారం తిరుమలలో మూలవిరాట్టుకు సయ్యద్ మిర్జా అనే మహమ్మదీయుడు సమర్పించిన బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేస్తారు. ఈయన ఉత్సవదేవతలైన శ్రీదేవి, భూదేవిలకు సమర్పించిన మంగళసూత్రాలనే నేటికీ వేంకటేశ్వర కళ్యాణోత్సవంలో ఉపయోగిస్తున్నారు.[3]

తుళుక్క నాచ్చియార్ విగ్రహ రూపంలో తిరుమలలోను, శ్రీరంగంలో రంగనాథాలయంలోనూ, మేళ్కోటెలోని చెళువనారాయణస్వామి ఆలయంలోనూ పూజలందుకుంటున్నది.

నాంచారమ్మ గురించి రకరకాల వాదనలు

బీబీ నాంచారమ్మ గురించి ప్రచారంలో ఉన్న పలు వృత్తాంతాలలో లోని ప్రధాన ఇతివృత్తం ఇలా సాగుతుంది. మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని ఒక మహమ్మదీయ సుల్తాను దండెత్తి, వైష్ణవాలయంలోని వైష్ణవ విగ్రహాన్ని ఢిల్లీ తీసుకొని వెళతాడు. ఆ విగ్రహాన్ని చూసిన సుల్తాను కూతురు సమ్మోహితురాలై ప్రేమలో పడుతుంది. విగ్రహాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించక, తీసుకువెళ్ళటానికి వచ్చిన వ్యక్తులతో పాటు తనూ వెళుతుంది. ఆ తరువాత దైవసన్నిధిలో ఐక్యమై విష్ణు భార్యగా నిలచిపోతుంది. వివిధ వృత్తాంతాల్లో దండెత్తిన చక్రవర్తి ఔరంగజేబు గానూ[4], మాలిక్ కాఫూర్ గానూ చెప్పబడింది. తీసుకెళ్ళిన వైష్ణవ విగ్రహం శ్రీరంగంలోని శ్రీరంగనాథ విగ్రహమనీ, మేళ్కోటలోని కృష్ణ విగ్రహమని,[5] విగ్రహన్ని సుల్తాను కూతురే తిరిగితీసుకు వచ్చిందని[6], రామనుజస్వామి వెళ్ళి తెచ్చారని, పురబ్రాహ్మణులు తీసుకువచ్చారని వివిధ రకాలుగా చెప్పబడుచున్నది.

  • ఆమె ముస్లిం కాదు.బహు మతావలంబీకురాలయిన దూదేకుల స్త్రీ.[7]
  • బీబీ నాంచారి వేంకటేశ్వరుని భార్య.ఆమె ముస్లిం.అప్పట్లో ముస్లిముల్ని మహామ్మదీయులు అని పిలిచేవారు.ముస్లిములు కేవలం కలియుగంలో మాత్రమే ఉన్నారు.సత్య,త్రేతా,ద్వాపర యుగాలలో లేరు.ముస్లిములు 2000 ఏళ్ళక్రితం ఇండియాలో లేరు.2300 ఏళ్ళక్రితమే బుద్ధుడు పుట్టాడు.బుద్ధుడు పుట్టాకే బీబీ నాంచారి వెంకటేశ్వరుని భార్య అయ్యిందా?క్రీస్తు శకం 500 అంటే 1500 ఏళ్ళ క్రితం ముహమ్మదు గారు పుట్టారు.బీబీ నాంచారి ఈ 1500 ఏళ్ళలోనే పుట్టిందా?అలాగైతే మనం వెంకటేశ్వరుని జీవితకాలాన్ని సరిచేసుకోవాలి. బీబీ నాంచారి ఎప్పుడు పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలియాలి[8]

సాహిత్యంలో నాంచారమ్మ

  • ౩.ప్రొద్దుటూరుకు చెందిన డా.సి.వి.సుబ్బన్న శతావధాని రచించిన "బీబీ నాంచారి ప్రబంధము" తిరుపతిలో తెలుగు భాషోధ్యమ సమితి ఆధ్వర్యంలో 25.4.2010 న ఆవిష్కరణ జరిగింది.కర్నాటకలోని మేల్కోటే లోని చెళ్ళపిళ్ళరాయుని విగ్రహాన్ని డిల్లీ సుల్తాన్ డిల్లీ కి తెప్పిస్తాడు.ఆ విగ్రహాన్ని ఆయన కుమార్తె ఆరాధిస్తుంది.ప్రేమలో పడుతుంది.వెంకటేశ్వరుడు సుల్తాన్ కు కలలో కనపడి ఆయన కుమార్తెను వివాహమాడతానని చెపుతాడు.సుల్తాన్ అంగీకరిస్తాడు.గోదాదేవి లాగానే నాంచారి కూడా విష్ణుపత్నిగా ఆరాధించ బడుతుంది.వెంకటేశ్వరుడు లౌకికవాదానికి ప్రతీకగా మారి మతాంతర వివాహాలు కు మార్గం సుగమం చేసి మార్గదర్శకుడయ్యాడని శతావధాని చెప్పారు.[9]

నాంచారమ్మ గురించి పలువురి వ్యాఖ్యలు

  • :వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ
బెండ్లియాడి మతమభేదమనియె
హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల?
పాపసాబు మాట పైడిమూట ---తక్కెళ్ళపల్లి పాపాసాహెబ్‌ 1949
  • నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య…
ఏడు కొండలవాడ వెంకటా రమణా --పింగళి నాగేంద్రరావు పెళ్ళిచేసి చూడు లో పి.లీల పాడిన పాట.

మూలాలు